స్పీడ్ న్యూస్- 1
posted on Jul 3, 2023 @ 11:33AM
1.పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ త్వరలో ఇన్ స్టాలో అభిమానులను పలకరించనున్నారు. ఇన్ స్టాగ్రాంలోకి పవన్ ఎంట్రీ ఇవ్వనున్నారని ఆయన సోదరుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు పేర్కొన్నారు.
2.50 లక్షల విలువైన వజ్రపుటుంగరాన్ని దొంగిలించిన ఓ యువతి ఆ తర్వాత పోలీసుల భయంతో దానిని టాయిలెట్ కమోడ్‌లో పడేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిందీ ఘటన
3.ఎన్సీపీలో పెను కలకలానికి కారణమైన ఆ పార్టీ నేత అజిత్ పవార్ సహా 9 మంది రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలకు ఎన్సీపీ సిద్ధమైంది. వారిపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినట్టు పార్టీ అధినేత జయంత్ పాటిల్ తెలిపారు.
4. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచలంలో నిన్న సాయంత్రం ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఈ ఉదయం సింహాద్రి గిరులు కిక్కిరిసిపోయాయి.అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే ఆయన ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
5.చైనా బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా అకస్మాత్తుగా పాకిస్థాన్‌లో పర్యటించడం తీవ్ర చర్చకు కారణమైంది. జూన్ 29న లాహోర్‌లో వాలిపోయిన జాక్ మా 23 గంటలపాటు అక్కడే ఉన్నట్టు బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ మాజీ చైర్మన్ ముహమ్మద్ అజ్ఫర్ ఎహసాన్ తెలిపారు.
6.అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే ఆయన ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
7. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా, ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు స్పందిస్తూ ఖమ్మం సభ ముగించుకుని గత రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌ను కలిసేందుకు వచ్చిన ఆయన మాట్లాడారు.
8.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో త్వరలోనే ప్రియాంకగాంధీ పర్యటించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ విషయాన్ని వెల్లడించారు.
9.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. కొద్దిరోజులుగా కేంద్ర కేబినెట్ లో మార్పులు చోటుచేసుకోనున్నాయని ప్రచారం జరుగుతుండడం, ఆదివారం మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
10.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 144వ రోజు నెల్లూరు రూరల్ కాకుపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా యువనేతకు మహిళలు హారతులతో నీరాజనాలు పడుతూ, దిష్టి తీస్తూ ఘనస్వాగతం పలికారు.