Read more!

శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు

 

 

 

 

మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. గుంటూరు జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కోటప్పకొండ త్రికుటేశ్వరస్వామ్మి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామిని దర్శించుకోనేందుకు తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అమరావతి అమరలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

 

కీసరకు పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి సందర్భంగా కీసర రామలింగేశ్వర స్వామి లయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము 4గంటల నుంచి దర్శనం కోసం ఆలయం వద్ద కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.

 

 వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు


ప్రముఖ పుణ్యక్షేత్రం హన్మకొండ వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామిని దర్శించుకోనేందుకు భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.  శివరాత్రి సంధర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.