జమ్ము ఎయిర్‌పోర్ట్‌పై పాక్ దాడులు..సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత ఆర్మీ
posted on May 8, 2025 @ 9:47PM
జమ్మూ లక్ష్యంగా పాకిస్థాన్ మరోసారి రెచ్చిపోయింది. ఓ వైపు సరిహద్దు గ్రామాలపై దాడులకు పాల్పడుతునే జమ్ము ఎయిర్‌పోర్టు సమీపంలో ఆత్మాహుతి డ్రోన్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఆత్మాహుతి డ్రోన్లతో పాక్ దాడులకు దిగింది. ఎయిర్‌పోర్టుకు సమీపంలో రెండు శక్తివంతమైన పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్ దాడులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. పాక్‌కు చెందిన డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. ఈ క్రమంలో సరిహద్దు గ్రామాల ప్రజలను సైరన్లతో భారత సైన్యం అప్రమత్తం చేసింది. ప్రజలంతా తమ నివాసాల్లోనే ఉండాలని భారత సైన్యం హెచ్చరించింది. జమ్ములోని కిష్టావర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బ్లాక్ అవుట్ పాటిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. రంగంలో దిగిన భారత ఆర్మీ ఆ డ్రోన్లను నేలకూల్చినట్లు తెలుస్తోంది. పలుచోట్ల భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి.
అఖ్నూర్ సెక్టార్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీచేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, కుప్వారా సహా పలుచోట్ల కరెంటు నిలిపివేశారు. అఖ్నూర్, కిష్త్‌వార్‌లో విద్యుత్ సరఫరా పూర్తిగా బంద్ చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.పాకిస్థాన్ లోని దాదాపు 15 నగరాలపై భారత్ డ్రోన్లతో దాడి చేసింది. మరోవైపు, భారత్ పై సరిహద్దుల నుంచి పాక్ మిస్సైళ్లు, రాకెట్లతో దాడి చేస్తోంది. వాటిని మన బలగాలు నిర్వీర్యం చేశాయి. కొన్ని అమృత్ సర్ సమీపంలో పడినట్టు సమాచారం. మరోవైపు, చీకటి పడటంతో పాక్ దాడిని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్ ను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో మన భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్ముకశ్మీర్ లోని జమ్ము, అక్నూర్ లలో సైరన్ మోగించింది. ఆర్మీ సైరన్ మోగించిందంటే... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. పాక్ దాడుల నేపథ్యంలో ఈ రాత్రి భారత్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది.