బరి తెగించిన పాక్.. జమ్ములో డ్రోన్ దాడులు.. భారత గగనతలంలోకి చొరబాటు యత్నం
posted on May 8, 2025 @ 9:45PM
పాకిస్థాన్ బరితెగించింది. జమ్ముపై డ్రోన్ దాడులకు తెగబడింది. భారత్ గగన తలంలోకి చొరబాటు యత్నం చేసింది. అయితే భారత సాయుధ దళాలు వెంటనే స్పందించి యూఏవీఎస్ లు వినియోగించి గగనతల చొరబాటు యత్నాలను అడ్డుకుంది. అలాగే పలు డ్రోన్లను గాలిలోనే నాశనం చేశాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
కాగా పాక్ డ్రోన్ దాడుల నేపథ్యంలో జమ్మూడివిజన్ లోని పలు ప్రాంతాలలో బ్లాక్ అవుట్ అంటే విద్యుత్ ను పూర్తిగా నిలిపివేశారు. కుప్వారాలోని పఠాన్ కోట్ వైమానిక స్థావరం లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు చెబుతున్నారు. అలాగే జమ్ములో ఆర్మీసైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే జమ్ములో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలంటూ కేందరం హెచ్చరించింది. ఇలా ఉండగా జమ్మూ విమానాశ్రం లక్ష్యంగా పాకిస్థాన్ రాకెట్ దాడికి పాల్పడింది. అలాగే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై కూడా పాక్ దాడికి పాల్పడింది. మొత్తం జమ్మూలో ఏడు చోట్ల భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది.