కొత్త మాఫియా..భక్తి మాఫియా పార్ట్-1
posted on May 11, 2016 @ 12:10PM
భారతదేశం..మూఢాచారాలు విస్తతంగా వ్యాపించిన దేశం. భౌగోళికంగా, సాంస్కృతికంగా ఎంత వైవిధ్య దేశమో విశ్వాసాల పరంగా అంతకన్నా విభిన్నమైంది. అనాదిగా మనదేశంలో స్వామిజీలను దైవాంశ సంభూతులుగా కొలవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రజలు, తమ సమస్యలు, కష్ఠాలు తీరేందుకు ఒక విశ్వాసం వెంట, ఒక అతీంద్రియ శక్తుల కోసం అన్వేషణకు పురిగొల్పుతుంది. నేడు ప్రజలలో అక్షరాస్యత పెరిగినా, వృత్తిపరంగా శక్తిసామర్ధ్యాలు , వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఎంతో జ్ఞానం ఉన్నప్పటికి అంధవిశ్వాసాలను అనుసరిస్తూనే ఉన్నారు. దేవుడు..బాబాలు ఇండియాలో వేరు వేరు కాదు అనేంతగా జనం దృష్టిలో పడిపోయింది. సర్వపాపాలు, కష్టాలను దూరం చేసి మనశ్శాంతినిచ్చే ఆనవాళ్లు అని దైవాన్ని నమ్ముకుని జీవించే ప్రతీ మనిషి విశ్వాసం. ఈ విశ్వాసమే భక్తులను ఆలయాలు..బాబాల వద్దకు పరుగులు తీయిస్తుంది. భక్తులకున్న ఈ బలహీనతే కాషాయ వస్త్రాలు ధరించిన బాబాలకు కార్పోరేట్ స్థాయిలో కాసులు కురిపిస్తోంది. అనతికాలంలోనే అత్యంత ధనవంతులను చేస్తోంది.
దేవుడనే వజ్రాయుధాన్ని ప్రయోగించి వీరు ఒక్కో స్టైల్లో మోసాలకు దిగుతున్నారు. భక్తులను మభ్యపెట్టి సకల రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఆధ్యాత్మికత, జాతకాలు, తాయత్తులు, రంగురాళ్లు, విభూతులు, కాశీదారాలు, అల్లా గొలుసులు, క్రీస్తు బిళ్లలు ఇలా పలురకాలుగా జనం వీరిని నమ్మడానికి అస్త్రాల్లాంటివి. ప్రజలు పేదరికంలో, అజ్ఞానంలో, అవిద్యలో ఉండాలని రాజకీయ నాయకులు కోరుకుంటున్నట్లే ఈ బాబాలు, స్వాములు కూడా జనం మూఢత్వంలో కూరుకుపోవాలని కోరుకుంటున్నారు. ఇలా దేశంలో ఇప్పటి వరకు ఎందరో స్వాముల లీలలు బయటకు వచ్చాయి. తమిళనాడుకు చెందిన మరో స్వామీజీ ప్రేమానంద. బీమానంద్ జీ మహరాజ్ చిత్రకూట్ వాలే, సంతోష్ మహదేవన్. పత్రీజీ స్వామి, ఆశారాం బాపూజీ, బాలసాయి, కాళేశ్వర్, కల్కీ వంటి స్వామిజీల గురించి తెలిసిందే. ఆశ్రమాల ముసుగులో సాగించిన అరాచకాలు లోక విదితమే. వీరందరూ భూకబ్జాల నుంచి మోయని కేసులేదు. భక్తి చాటున అనేక మత్తు చేష్టలు చేయించిన ఘనత ఈ స్వాములది.
బాబాల సంపాదన గురించి తరువాయి భాగం రేపు చూద్దాం