Read more!

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల లిస్ట్ రెడీ

 

 

 

 

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక ఎట్టకేలకు రెడీ అయింది. ఈ రోజు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, సోనియా గాంధీ తో సమావేశమై అభ్యర్ధులను ఖరారు చేశారు. అభ్యర్థుల పేర్లను ఇంకా బయటపెట్టలేదు.శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం ప్రకటించే అవకాశాలున్నాయి.

 

ఎమ్మెల్సీ అభ్యర్థులకు రేపు బీఫామ్స్ ఇవ్వనున్నట్లు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. నామినేషన్ల దాఖలుకు అమావాస్య అడ్డంకి కాదని ఆయన అన్నారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి, ధీరావత్ భారతి, వాణి, రఘురామిరెడ్డి, కంతేటి సత్యనారాయణ రాజు, దయాసాగర్, షబ్బీర్ అలీ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే షబ్బీర్ ఆలీకు టిక్కెట్‌కోసం అజాద్ గట్టిగా పట్టుపట్టినట్లు తెలియవచ్చింది.

 

ఎమ్మెల్సీ జాబితాను ఖరారు చేయించుకోవడానికి ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి శనివారం సాయంత్రం హైదరాబాదు తిరిగి వస్తున్నారు. బొత్స సత్యనారాయణ మాత్రం ఈ రాత్రి అక్కడే మకాం వేస్తున్నారు. కాంగ్రెసు ఐదుగురు అభ్యర్ధులను మాత్రమే పోటీకి దింపుతున్నట్లు తెలుస్తోంది.