"ఒకే...ఒకే...బై...అల్ ద బెస్ట్."
ఒకే అల్ ద బెస్ట్.
"ఫోన్ డిస్కనెక్ట్ చేసి, అరచేతిలో అలాగే ఆ మొబైల్ పట్టుకుని చూస్తూ కూర్చున్నాడు ఆదిత్య. అతని మనసు డోలాయమానంగా ఉంది. ప్రఖ్య దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లాలని ఉంది. ఆరోజు ఇద్దరూ పొందిన మధురానుభూతులు మళ్ళీ మళ్ళీ కావాలని ఉంది. కానీ, అవి తల్చుకోగానే వివేక్, శిరీష ల రొమాన్స్ గుర్తొచ్చింది. తన జ్ఞాపకాలు మధురంగా ఉంటె, వాళ్ళ జ్ఞాపకాలు చేదుగా మింగుడు పడకుండా గొంతుకు అడ్డం పడుతున్నాయి.
"అదీ...! అయిందా మాట్లాడడం....?" హాల్లోంచి శిరీష స్వరం వినిపించింది.
ఆదిత్య తను కూర్చున్న చోటు నుంచి కదిలాడు.
సడన్ గా ఫోన్ రింగైంది.
"వివూ కాలింగ్" అని స్క్రీన్ మీద కనిపించింది. "వివూ.... అంటే వివేక్ ... అమ్మ పెట్టుకున్న ముద్దు పేరు కాబోలు. డిస్కనెక్ట్ చేయబోయాడు. పట్టరాని కోపం వచ్చింది. ఇంతలో శిరీష వచ్చింది. ఫోన్ మోగుతోంది కదరా. ఏం చేస్తున్నావు?" అంటూ.
మౌనంగా ఫోన్ అందించాడు. "హాయ్ వివేక్!" హుషారుగా అంటూ మాట్లాడుతూ హాల్లోకి వెళ్ళిపోయింది.
ఆదిత్యకి వాళ్ళెం మాట్లాడు కుంటున్నారో వినాలని పించింది. హాల్లోకి వెళ్ళాడు. కాని, శిరీష హాల్లోంచి కిచెన్ లోకి, అక్కడి నుంచి బాల్కనీ లోకి తిరుగుతూ మాట్లాడుతోంది. అలా సుమారు పావుగంట మాట్లాడిన శిరీష మొహం విచ్చుకున్న పువూలా ఉంది.
ఆదిత్య అసహనంగా తన గదిలోకి వెళ్ళిపోయి రీడింగ్ టేబిల్ ముందు కూర్చున్నాడు.
పరీక్షలు మొదలవుతూ ఉండడంతో సరిగా చదవకపోతే భవిష్యత్తు పాడవుతుందేమో అనే భయం పట్టుకుంది ఆదిత్య కి. చదువుకోవాలి. ఆలోచనలన్నీ మానేసి చదువుకోవాలి. ర్యాంక్ రాకపోతే అవమానం అనిపించింది. బలవంతంగా ఆలోచనలు వదిలించుకోడానికి ప్రయత్నిస్తూ చదువు మీద ఏకాగ్రత పెట్టసాగాడు. కానీ ఆలోచనలు కందిరీగల్లా ముసురు కుంటూ మెదడు ని కుట్టేస్తున్నట్లుగా అనిపిస్తోంది. వివేక్ రాకూడదు ఇంటికి అనుకున్నాడు
"అదీ! ఏం చేస్తున్నావు?" శిరీష స్వరం వినిపించింది.
ఆదిత్య ఏం మాట్లాడలేదు.
శిరీష గుమ్మం దగ్గరకు వచ్చి అంది. "చాడువుకున్తున్నావా?"
ఆదిత్య తలెత్తి చూశాడు. శిరీష గుమ్మంలో నిలబడి చూస్తోంది.
"అమ్మా....!' పిలిచాడు ఆదిత్య.
"ఎంటిరా?" అడిగింది లోపలికి వచ్చి.
"నా పరీక్షలయిందాకా మీ ఫ్రెండ్ మనింటికి రావద్దు." గబగబా అనేశాడు.
"శిరీష మ్రాన్పడి పోయింది. గొంతు పెగాల్చుకుని ఎ...ఎందుకు?" అంది.
"నా చదువు డిస్టర్బ్ అవుతుందమ్మా....! అతను రావడం నాకిష్టం లేదు" విసురుగా అన్నాడు.
అతను....ఏమైంది ఆదిత్యకి.... ఆరోజు అంత ఆరాటంగా ఎదురు చూశాడు. వివేక్ కోసం.... ఇప్పుడిలా.... ఏమైంది వీడికి? ఆమెకేం అర్ధంకాలేదు. సర్లే ఎగ్జామ్ అయిపోనీ అనుకుని "సరే" అంటూ బైటికి వచ్చేసింది.
ఆదిత్యకి హమ్మయ్య సాధించాను. అనిపించింది. అ సంతోషంతో సీరియస్ గా చదువుకొడం మొదలుపెట్టాడు.
ఆరోజే ఐఐటి ఎగ్జాం. అడిత్యని తీసుకుని సెంటర్ కి వెళ్ళి దింపేసింది శిరీష. "జాగ్రత్తగా అలోచించి రాయి.... ర్యాంకు రావాలి. అర్ధమైందా?"
అయిందన్నట్టు తలూపాడు.
"గుడ్....బెస్టాప్ లక్."
"థాంక్స్ మమ్మీ."
ఆదిత్య క్లాసు కి. శిరీష ఆఫీస్ కి వెళ్ళిపోయారు.
సాయంత్రం ప్రఖ్య, అదిత్యా కలుసుకున్నారు ముందు అనుకున్నట్టు.
ఆదిత్య లో ఆమెని చూడగానే బోలెడంత హుషారోచ్చింది. "అబ్బ ఎన్ని రోజులైంది ప్రఖ్యా నిన్ను చూసి. ఎలా రాశావు ఎగ్జామ్స్ ?" అడిగాడు.
"చాలా బాగా రాశాను. రాయకపోతే మమ్మీ చంపెయదూ?"
"అయితే ఈరోజు ఇంటికి వస్తున్నావా?" అడిగాడు ఆమె చేయి పట్టుకుని.
"రేపు మమ్మీ వచ్చి తీసుకొస్తుంది. అప్పుడోస్తాను."
"అయితే నేను మా అమ్మకి చెప్తాను. రేపు మా ఇంట్లోనే డిన్నర్."
"ఒకే. నీకో నూస్ చెప్పనా?"
"ఏంటి?"
"నేను మా మమ్మీ ఫ్రెండ్ వాళ్ళతో కలిసి కోడై కెనాల్ వెళ్తున్నాను."
"అవునా....!" నీరసంగా అడిగాడు.
"ఊ.... బహుశా ఫిప్టీన్త్ వెళ్తాం. పదిహేనురోజులు."
"మా అమ్మకి మీ అమ్మకున్నట్టు మంచి ఫ్రెండ్స్ కూడా లేరు. నన్ను ఒక్కడినీ ఎక్కడికీ పంపించదు. తను రాదు. ఎలా? పదిహేను రోజులు నేనేం చేయను?" దిగులుగా అన్నాడు.
జాలిగా చూసింది ప్రఖ్య అతని వైపు.
"నాక్కూడా ఏం చేయాలో తెలీడం లేదు అదీ! నేను వెళ్ళననే అన్నాను. మమ్మీనే ఏం చేస్తావు? రిజల్ట్ వచ్చిందాకా ఎంజాయ్ చేసిరా" అంటోంది.
ఎంజాయ్ అనగానే ఆదిత్య తుళ్ళిపడ్డాడు. ఆమె దగ్గరగా జరిగి అన్నాడు "ఇప్పుడు మన ఎగ్జామ్స్ అయిపోయాయి. మన ప్రోగ్రాం ఎప్పుడు?"
ప్రఖ్య మొహం ఎర్రబడింది. సిగ్గుతో తల వంచుకుంది.
"ఏయ్...! నాకు ముద్దు కావాలి. గుఅగుసగా అన్నాడు."
"సిగ్గులేదు నీకు. తల వంచుకునే అంది.
"ఎందుకు....? నాక్కావాలి అంతే....? నువ్వు చాలా బాడ్. మనమేం అనుకున్నాం. మనమే ఎక్కడి కన్నా వెళ్ళాలను కున్నాంగా?"
"ఇంపాజిబుల్ మన అమ్మలు పంపరులే."
"మరెలా?" చిరాగ్గా అన్నాడు.
"ఇంట్లోనే మా ఇంట్లో రేపు ఈవెనింగ్ . మమ్మీ లేట్ గా వస్తుంది."
"అవునా....! నిజంగా....! రేపిస్తావా?"
"ఏంటి? చిరుకోపంగా చూసింది.
"అన్నీ...."
"ఏయ్ నాకు సిగ్గేస్తోంది.... అలా మాట్లాడకు."
"మాట్లాడద్దు. ఇంక మాటలు చాలు చేతలే." సడన్ గా చుట్టూ చూసి ఎవరూ తమని చూడ్డం లేదని గమనించి కొద్దిగా ఒంగి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకుని, కుడి చేయి భుజాల మీదుగా ఆమె ఎడం రొమ్ము మీదికి పోనిచ్చి నొక్కి వదిలేసాడు.
"అయ్యయ్యో...! ఏం పని? ఎవరన్నా చూస్తె...." బెదిరిపోతూ అంది ప్రఖ్య.
"ఎవరూ చూడలేదులే...."
"నువ్వు చాలా బాడ్ అదీ....! నేను కనిపిస్తే అగలేనట్టు ప్రవర్తిస్తావు. కనిపించకపోతే కేర్ చేయవు.
"ఆదిత్య మొహం వాడిపోయింది. సారీ....!" అన్నాడు.
"ఆసలు నువ్వెందుకు ఇన్ని రోజులు దూరంగా వున్నావో చెప్పు నిలదీస్తూ అంది."
"ఏం లేదు, ఎగ్జామ్స్ కదా. టెంప్ట్ అయితే కెరియర్ పాడవుతుంది . అందుకే."
'అంతేనా....? నిజమే చెప్తున్నావా? అంటీ రేస్త్రిక్ట్ చేసిందా?"
"లేదు. అమ్మ కసలు ఏం తెలియదు. తనే అడిగింది నువ్వు రావడం లేదేంటని."
"ఏం చెప్పావు?"
"నేనేం చెప్పలేదు. తనే చెప్పింది మళ్ళీ నువ్వు మీ మమ్మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావని."
"అదీ....!' అదోరకంగా పిల్చింది ప్రఖ్య.
'చెప్పు...." రహస్యంగా అడిగాడు.
"మమ్మీ ఫ్రెండ్ కి హజ్బెండ్ కాక ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా...."
"వాట్ ? ఎలా?"
"తెలియదు . నేనోకరోజు చూశాను. అతను క్యాజువల్ గా వచ్చాడు. అందరూ కూర్చుని మాట్లాడు కుంటున్నారు. సడన్ గా అతను స్మోక్ చేయడానికి బాల్కనీ కి వెళ్ళాడు. ఆ బాల్కనీ మేము చదువుకుంటున్న రూమ్ పక్కనే ఉంటుంది. కొంచెం సేపటికి అంటీ వాటర్ తీసుకుని వచ్చింది. నేను సడన్ గా అన్ ఎక్స్ పెక్టేడ్ గా చూశాను. అతను అంటీ ని కిస్ చేశాడు.
"అవునా! అంకుల్ కి తెలుసా?"
"ఏమో....?"
"తప్పు కదా....!"
"ఏమో....! అయినా తప్పేం ఉంది?" అమాయకంగా అంది ప్రఖ్య.
"ఒకే వదిలేయ్ రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను. మనం చూసిన డివిడి తీసిపెట్టు."
"ఒకే! పద వెడదాం.
"డ్రాప్ చేస్తావా?"
"కమ్ ..."
ఇద్దరూ ప్రఖ్య స్కూటీ మీద వెళ్ళిపోయారు.
అయితే, వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు ఆరోజే కాదు, ప్రఖ్య కోడైకెనాల్ వెళ్ళి వచ్చాక కూడా వాళ్ళు కోరుకున్న శృంగారం అనుభవించ లేకపోయారు. అందుకు అనేక కారణాలు. కొన్ని రోజులు భానుప్రియ సిక్ అయి ఇంట్లోనే ఉండిపోవడం, కొన్ని రోజులు అవకాశం వచ్చినట్టే వచ్చి జారిపోవడం మధ్య మధ్య అవకాశం దొరికినా ముద్దులు, కౌగిలింతలతోటే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈలోగా వివేక్ మీద ఆదిత్య పెంచుకున్న అకారణ ద్వేషం గురించి శిరీషకి తెలిసి పోయింది. ఆమెకి తెలియడం కోసమే ఆదిత్య వివేక్ వచ్చినప్పుడల్లా దుమధుమ లాడ్డం మొదలు పెట్టాడు. అతని ముందు శిరీష ని చీటికి మాటికీ పిలవడం, తను అడిగింది ఇవ్వడం లేట్ అయితే విసుక్కోడం చేయడం చూసి శిరీష ఆదిత్య ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్ధం చేసుకోలేకపోయింది.
"ఏమైందిరా నీకు? ఎందుకలా అంకుల్ వచ్చినప్పుడు ఇంసల్టింగ్ బిహేవ్ చేస్తున్నావు?" ఒకరోజు ఉదయాన్నే నిలదీసింది.
ఆదిత్య కచ్చితంగా అన్నాడు. "అతను మనింటికి రావడం నాకిష్టం లేదమ్మా...!"