Previous Page Next Page 
తెల్ల గులాబి  పేజి 8

    "ఏంటి? మమ్మీ ఇంట్లోనే ఉంది. ఫోన్ లో మాట్లాడితే తిడుతుంది. ఎగ్జామ్స్ దగ్గర కొస్తున్నాయి కదా! చదువుకోవాలి."
    "నేనూ చదువుకోవాలి. కానీ, నాకసలు చదువుకోవాలని పించడం లేదు."
    "అమ్మో....! చదువుకోకపోతే కెరీర్ పాడై పోతుంది. అమ్మ చంపేస్తుంది.
    "నేనిప్పుడు వేరే కొత్త పాఠం నేర్చుకుంటున్నా దాని కున్నా కెరియర్ ముఖ్యమా ?" 
    "ఏంటది?"
    ఆదిత్య స్వరం బాగా తగ్గించి, "అంకుల్ వచ్చాను. నేను పడుకుంటానని నా రూమ్ లోకి వచ్చి తలుపేసుకున్నా, కాస్సేపట్లో నేనాశీను చూస్తా!" ఎంత నెమ్మదిగా అన్నా అతని స్వరంలో వణుకు వినిపించింది.
    గాభరాగా అడిగింది. "చూస్తున్నావా?"
    "నో ....అప్పుడేనా ? వాళ్ళింకా డిన్నర్ చేయాలి. గదిలోకి వెళ్ళాలి. అందాకా నీతో మాట్లాడాలని, నీకేవో డౌట్స్ ఉన్నాయని చెప్పి అమ్మ ఫోన్ తీసుకున్నాను."
    "అదీ! అలాంటి పనులు చేయకు. ఆంటీకి తెలిసిందంటే డేంజర్ . ఫోన్ పెట్టేయ్  మమ్మీ పిలుస్తోంది."
    "ఏయ్! నీకు అది ఒద్దా?"
    "అదీ... ప్లీజ్ ...." కంపిస్తున్న స్వరంతో అంది ప్రఖ్య. నాకు అదే కాదు. ఇంకా ఏదో కావాలి. కానీ, మమ్మీకి తెలిసిందంటే నన్ను చంపేస్తుంది."
    "సరే, రేపు మీ అమ్మని, మా అమ్మని సినిమాకి పంపించేద్దాం. మనిద్దరం ఓ తల్చుకుంటేనే నా ఒళ్ళు జివ్వుమంటోంది. అబ్బా! ఎప్పుడు వస్తుందో ఆ మూమెంట్."
    "మమ్మీ వస్తోంది. పెట్టేయ్...."
    అకస్మాత్తుగా ఫోన్ డిస్కనెక్ట్ అవడంతో ఆదిత్య షిట్ అంటూ సెల్ మంచం మీద పడేశాడు.
    ఏం చేయాలో తోచలేదు. శబ్దం చేయకుండా తలుపు దగ్గరగా నడిచి కీ హోల్ లోంచి ఒక కన్నుతో తొంగి చూశాడు.
    శిరీష, వివేక్ డైనింగ్ టేబిల్ దగ్గర పక్క పక్కనే కూర్చుని భోం చేస్తున్నారు. శిరీష నోట్లో చపాతీ ముక్క పెట్టి అది తన నోటితో అందుకుంటున్నాడు వివేక్.
    ఆదిత్య నరాలన్నీ కరెంటు తీగలుగా మారి విద్యుత్తు ప్రవహిస్తున్నట్టు అయింది. ఇంకా ఏం చేస్తాడో అన్నట్టు అలాగే చూడసాగాడు. శిరీష కూడా చిన్న ముక్క తుంచి వివేక్ నోటికి అందించింది. ఇద్దరూ నవ్వుకున్నారు. వివేక్ శిరీష ని ఎడం చేత్తో కొంచెం దగ్గరికి తీసుకున్నాడు. శిరీష అతని భుజం మీద తల పెట్టుకుని ఆతను నోటికి అందిస్తున్న చపాతీ తింటోంది.
    ఆదిత్య నిలబడ లేనట్టు మంచం మీద వెల్లకిలా వాలిపోయాడు. అతనికి అమాంతం ప్రఖ్య దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ఆమెని నిలువెల్లా నలిపెయాలని ఉంది. ఇంకా ఇంకా ఏదో వాళ్ళిద్దరూ బెడ్ రూమ్ లోకి వెళ్ళే సమయం కోసం అసహనంగా ఎదురు చూడసాగాడు.
    అతనికి పిచ్చెక్కినట్టుగా ఉంది. ఏదో చేయాలి ఏం చేయాలి? మంచం మీద వెర్రిగా దొర్లసాగాడు. కాసేపట్లో హల్లో లైట్లు ఆరిపోయాయి. శిరీష స్వరం తన గది దగ్గరగా వినిపించింది. "అదీ....అదీ!"
    ఆదిత్య పలకలేదు.
    "పడుకున్నట్టున్నాడు" అంటోంది శిరీష.
    వివేక్ స్వరం వినిపించలేదు. ఆదిత్య నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
    కొన్ని క్షణాల్లో శిరీష గది తలుపు వేసిన శబ్దం వినిపించింది.
    ఆదిత్య ఆగలేదు. గబగబా రీడింగ్ టేబిల్ శిరీష గది వెంటి ;లెటర్ వైపు నెమ్మదిగా జరిపాడు. దాని మీద కుర్చీ వేశాడు. హైటు చూసుకున్నాడు. యస్. తప్పకుండా కనిపిస్తుంది. ఒక్కసారి కుర్చీ కదిలించాడు. హమ్మయ్య పడదులే అనుకుంటూ నెమ్మదిగా కుర్చీ ఎక్కాడు.
    ఇప్పుడు శిరీష గదిలో బెడ్ లైటు వెలుగులో అస్పష్టంగా కనిపిస్తున్నారు ఇద్దరూ. బెడ్ మీద వివేక్ పడుకుని ఉన్నాడు. అతని మీద శిరీష వాలిపోయి ఉంది. వివేక్ చేతులు రెండూ ఆమె నడుం మీద వేసి దగ్గరగా హత్తుకుంటున్నాడు. వాళ్ళేదో గుసగుసగా మాట్లాడు కుంటున్నారు. శిరీష పకపకా నవ్వింది. వివేక్ ఆమెని ముద్దు పెట్టుకున్నాడు. శిరీష పక్కకి వాలింది. వివేక్ ఆమె మీదకి వాలాడు.  
    ఆదిత్య చటుక్కున కళ్ళు మూసుకున్నాడు. అతని కాళ్ళ లో వణుకు మొదలైంది. ఏ క్షణాన్నైనా కింద పడిపోవచ్చుననిపించింది.
    అచేతనంగా కుర్చీలో కూలబడిపో యాడు.
    నిలువెల్లా శరీరం కంపిస్తోంది. ఇప్పుడతని  శరీరంలో కామం లేదు. కోరిక లేదు. అక్కడేం జరుగుతుందో చూడాలన్న కాంక్ష కూడా లేదు.
    రెండు చేతుల్లో తల పట్టుకున్నాడు. మెదడు మీద సుత్తితో కొడుతున్నట్టు తన తల మీద పెద్ద బండ ధడాల్న పడినట్టు బరువుగా , నెప్పిగా.
    అతని కళ్ళలో అప్రయత్నంగా నీళ్ళు తిరిగాయి. కొన్ని నిముషాల్లో నే ప్రవాహం లా కన్నీరు కారసాగింది. చూడ కూడని దేదో చూస్తున్నట్టు తనేదో చేయరాని పాపం చేస్తున్నట్టు అనిపించసాగింది.
    అమ్మ....నిండుగా చీరతో కనిపించే అమ్మ చిరునవ్వుతో తనని గుండెలకి హత్తుకునే అమ్మ... ఇప్పుడా గుండెలు ...ఛీ , ఛీ....
    వివేక్! బ్లడీ.... అమ్మని అలా తాకేస్తున్నాడు. అమ్మని నలిపెస్తున్నాడు. అమ్మని ఇష్టం వచ్చినట్టు ముట్టుకుంటున్నాడు. అమ్మ పక్కన పడుకున్నాడు. నో ...! అది నాన్న ప్లేసు.... వివేక్ ...ఎవడీ వివేక్.... అమ్మ వాడికెందు కంత చనువిచ్చింది....?
    ఇంతకాలం అమ్మ తనది. తనకు మాత్రామే సొంతం అనుకున్నాడు. కానీ,
    తనకి మాత్రమే సొంతం అయిన అమ్మని పరాయి వాడైన వివేక్ అంత సన్నిహితంగా ముట్టుకోడం తట్టుకోలేక పోతున్నాడు.
    ఆపాదమస్తకం వణికి పోతుంటే నెమ్మదిగా కుర్చీ దిగాడు. కుర్చీ జరిగి శబ్దం అయింది.
    ఆదిత్య కి భయం వేసింది. నెమ్మదిగా కుర్చీ యధా స్థానం లో కుర్చీ జరిగి శబ్దం అయింది...
    ఆదిత్య కి భయం వేసింది. నేమ్మాడిగా కుర్చీ యధా స్థానం లో పెట్టేసి, గగప్ చిప్ గా మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకున్నాడు.
    కొన్ని సెకన్ల తరవాత గది బైట నుంచి "అదీ!" అని శిరీష స్వరం వినిపించింది.
    ఆదిత్య పలకలేదు.
    "ఏమైంది?" వివేక్ స్వరం.
    "ఏమో....? నిద్రలో కుర్చీ గానీ తన్ని ఉంటాడు. చదువుకుంటూ కుర్చీ మంచం దగ్గరకు జరుపుకుంటాడు. అది మళ్ళీ పక్కన పెట్టడు కదా! బద్ధకం."
    "ఇట్స్ ఓ.కే. అయినా అంత భయపడతావెంటి ?" వాడూ పెద్ద వాడవుతున్నాడు. చెప్పచ్చు కదా!"
    "ఇంకా నయం. ఎలా చెప్పను? వదిలేయ్ . కుర్చీ చప్పుడైతే భయపడ్డాను లేచాదేమో అని. పద.... మంచినీళ్ళీవ్వనా?"
    'అప్పుడేనా ? ఇంకా అలసి పోలేదు. " వివేక్ స్వరంలో సన్నటి నవ్వు.
    "యూ నాటీ " గోముగా శిరీష స్వరం.
    "దా ..." వివేక్ స్వరం.
    "ఊ...."
    మళ్ళీ నిశ్శబ్దం.
    ఆదిత్య కి నిద్ర పట్టలేదు. లేచి కూర్చున్నాడు. భయంగా ఉంది. ఒళ్ళంతా నూట నాలుగు డిగ్రీల జ్వారం వచ్చినట్టు సెగలు, పోగలుగా ఉంది. చెవుల్లోంచి వెచ్చటి ఆవిరి కళ్ళల్లో నీళ్ళు ధారాపాతంగా కారుతున్నాయి.
    గొంతు ఎండి పోతున్నట్టుగా ఉంది. దాహంగా ఉంది. తను పడుకునేటప్పుడు వాటర్ బాటిల్ గదిలో పెట్టుకుంటాడు. కానీ, ఇవాళ పెట్టుకోలేదు. బైటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఆదిత్య అలాగే కూర్చున్నాడు. దాదాపు పదిహేను నిమిషాలు గడిచాయి. దాహంతో గొంతు అర్చుకు పోతోంది.
    ఈపాటికి వాళ్ళిద్దరూ నిద్రపోయి ఉండచ్చేమో?
    ఆదిత్య నెమ్మదిగా మంచం దిగాడు. అంతకన్నా నెమ్మదిగా తలుపు తీసుకుని బైటకి వచ్చాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఫ్రిజ్ దగ్గరగా నడిచి బాటిల్ తీసుకున్నాడు. తిరిగి నెమ్మదిగా ఫ్రిజ్ డోర్ వేసేసి, అడుగులో అడుగు వేసుకుంటూ గదివైపు నడిచిన వాడు ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగాడు. రెండు మూడు సెకన్లు సందేహంతో ఆగి నెమ్మదిగా నడుస్తూ శిరీష గది వైపు నడిచాడు . అక్కడే కొన్ని క్షణాలు తచ్చాడి తిరిగి తన గదివైపు గబగబా నడిచి లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకుని మంచం మీద వాలిపోయాడు. కానీ తెల్లవారుజామున నాలుగు ఆయిందాకా ఆదిత్య కంటి మీద కునుకులేదు.

 Previous Page Next Page