Previous Page Next Page 
కదానాయికి పేజి 28

    సుభద్రమ్మకి లోకంమీద కశి, దేముడిమీద కశి, తన బ్రతకుమీదే కశి, ఈ నిమిషాన కూతురుమీద కశి,అంతా తీర్చుకుంటున్నది, చేతులకు నోటికి పనికల్పించి.

    "ఇదేనే సమయంరావటం. అంటే ఇదే. ఆనాడు జరిగిన పాపంపనికి సమయం వచ్చిందే,తెలియలేదా? ఇంకా తెలియలేదా? వాడిని కలుసుకోవద్దే అని నెత్తీ, నోరూ కొట్టుకుచెప్పాను. వినిచచ్చావా? పరుగెత్తుకుంటూ వాడికోసం వెళ్ళావు. వాడో,ఎవడో దారినపోయే దానయ్య. నిన్ను నన్ను ఉద్దరించి పుణ్యం మూటకట్టుకున్నాడు."

    "ఆగవే, ఏమిటాకొట్టటం.అది మనిషనుకున్నావా? పసువను కున్నావా?" రామభద్రయ్యవచ్చి సుభద్రమ్మను ఇవతలికి లాగటంతో సుభద్రమ్మ ఆవేశం చల్లారి దానిస్తానాన్ని దుఃఖంవచ్చింది.చేతులతో ముఖం దాచుకుని భోరుమంది.

    చాలా తప్పుపని జరిగితేగాని తల్లికి ఇంతగా కోపంరాదని మాత్రం గ్రహించగలిగింది అనుపమ.పైకి శబ్దం రాకుండా మూగగా రోదించుతూ కూర్చుంది.

    "ఏమిటే! ఏమిజరిగింది?పెద్దతల్లిని పట్టుకుని అలా కొట్టావెందుకే?" రామభద్రయ్య అయెమయంగా అడిగాడు.తనలా బైటికివెళ్ళొచ్చిన  పదినిమిషాలలో ఏం జరిగిందో అణుమాత్రం ఊహకుఅందలేదు. భార్య ఇంతబేలగా హృదయవిదరకంగా ఏడ్వటం ఇదే మొదటిసారి చూడటం.

    రామభద్రయ్య వడిలో తలపెట్టుకుని హృదయభారం కన్నీళ్ళరూపంగా వెళ్ళిపోగా కాసేపటికి జరిగింది చెప్పింది సుభద్రమ్మ.

    "ఆడదానివి,  పిల్లలతల్లివి  పెద్దతల్లి సంగతి గ్రహించటానికి ఇన్నాళ్ళుపట్టిందా సుభద్రా?" జరిగింది తెలుసుకొని స్వరం అవగాహన  అయి అప్పటికి నోరుతెరిచి ఒక్కమాట అన్నాడు రామభద్రయ్య.

    రామభద్రయ్య తలతిరిగిపోతున్నది. సూన్యం అంతా సూన్యం ఖాళీ మెదడంతా ఖాళీ.అదో అయోమయస్థితి వాస్తవంలో ఉన్నాడో, భ్రమలో మునిగాడో తెలియనిస్థితి కాళ్లు చేతులు చచ్చుబడ్డట్లయింది. నోరు పడిపోయినట్లు కళ్ళప్పగించిచూస్తు కూర్చున్నాడు భార్యని, కూతురిని.

    సుభద్రమ్మ కూతురవైపు చూడటానికి భయపడుతున్నది. పిచ్చిగా ముందుకర్తవ్యం గురించి తర్జనభర్జన పడుతున్నది.   

     "పెద్దమ్మాయిని  ఈ స్థితికితీసుకొచ్చింది రాజు కావచ్చు. అదే అయితే రఘుపతిగారికి ఆయనకు ఇసుమంతకూడా పడదు."మా  వాడిమీద నేరం మోపుతున్నావా?  అని ఊరు ఊరు యాగిచేసి రఘుపతిగారు  రచ్చకెక్కిస్తారు. పట్నంలో చదువతున్న రాజు నిజంగా ఆరోజు రాలేదేమో?బుచ్చి రాజు అన్నయ్య వెంకట్ కిలేని అలవాటులేదు. సాంబయ్య కూతురుతో గడ్డివాముచాటున తెరవనుకభాగోతం ఆడుతుంటే చూచి సాంబయ్య గోల చేశాడు. ఫలితం....?"ఆడపిల్లకిలేని జాగ్రత్త మావాడికెందుకుంటుంది. మీ అమ్మయే పిలిచిందట. తెలియనివిషయంకూడా  నేర్పింది మీ అమ్మాయిని పిలిపించి పాడుచేసివుంటాడు. వెంకట్ గాడి తండ్రి మూడు ఊళ్లు కొనగల ఆసామి. కులమా వేరు. మీ అబ్బాయి చేశాడని ఎలా అడగగలం? అడిగిదామా అంటే ప్రాణానికే ముప్పు. సుబ్బమ్మగారి మూడో కోడలు పిల్లను కనలేక మందుమింగితే పెద్దప్రాణమే హరీఅంది. అదీ నాలుగురోజులు నరకం అనుభవించిగాని ఈలోకం నుంచి విముక్తి పొందలేదు.పట్నంతీసుకెళితే పెద్దడాక్టర్లవల్ల ఏదయినా ప్రయోజనం ఉంటుందేమో?
   
    " ఇదిగో నిన్నే!" రామభద్రయ్య పిలుపుతో తలఎత్తింది సుభద్రమ్మ. చెపుదామా  వద్దా? అని తటపటచెందుతున్న భర్తమొహం చూచి 'చెప్పండి' అంది.
   
    "నువ్వేం అనుకోకపోతే ఒక్కమాట. రాఘవయ్య నాలుగురోజుల క్రితం మళ్ళీ కబురుచేశాడు. "మీ అమ్మాయికి పెళ్ళిచేసేవుద్దేశ్యం లేకపోతే చెప్పండి.  వేరేసంబంధం చూచుకుంటానని" ఇంతవరకూ మా ఆడవాళ్ళని  హెచ్చరించలేదు. త్వరలో ఏసంగతీ కబురుచేస్తానని చెప్పిపంపాను. పెద్ద  తల్లికి ఇలాఅవుతుందని కలలోకూడా అనుకోలేదు, పోనీ నీవు చూచిన సంబంధాలేమన్నా కుదురుతుందిలే అనుకున్నాను.  ఆ ఆశ అడుగంటింది. గప్ చిప్ రాఘవయ్యకిచ్చి పెద్దతల్లిసమస్య తీర్చుకందాము." భార్య ఏమంటుందో  అని పరీక్షగాచూస్తూ అన్నాడు రామభద్రయ్య.   
   
    సుభద్రమ్మ ముఖం చిట్లిచ్చింది." పోనీ బుచ్చిరాజుని అడిగి చూస్తే. వాడు ఎవడైనదీ తెలుస్తుందేమో?" అంది.

    "బుచ్చిరాజు దాకా ఎందుకు. తలారి రాముడికి రూపాయి చేతిలో పడేస్తే. తెల్లారేటప్పటికి టముకు వాయించి అందిరికీ తెలియజేస్తాడు."

    సుభద్రమ్మ తలకాయ వాలిపోయింది. "పట్నం తీసుకెళ్లిడాక్టరుకి చూపిస్తే....." ఆ పైమాట మింగి వూరుకుంది.
   
    "ఇప్పటికయింది చాలు. మొదట్లో అయితే డాక్టర్లు ఏదైనా చేసేవారేమో ఇన్ని నెలలుయి...? సరేలే అదయ్యేదికాదు పోయేది కాదు. పట్నం తీసుకెళ్ళటం డబ్బు ఖర్చుపెట్టటం నా తలకు మించినపని. అదే చేస్తే పెద్దతల్లి పెళ్ళివాయిదా వెయ్యాల్సిందే.ఎక్కడ తెస్తాం  డబ్బులు? నలుగురికీ తెలియకముందే రాఘవయ్యకు కబురు పంపుతాను. కాదంటేనన్నేం అడగకు. నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో." విసురుగా కండువాదులిపి భుజం మీద వేసుకుని బయట కెళ్ళిపోయాడు రామభద్రయ్య.
   

 Previous Page Next Page