సుభద్రమ్మ పిచ్చిగా అనుపమవైపు చూసింది. బంగారు బొమ్మలావుండే అనుపమ- భగవంతుడు, మానవుడు చేసిన అన్యాయానికి బలయిపోయి ఏడుస్తూవుంటే తల్లి హృదయం చూడలేక అమాంతం లేచివెళ్ళి కూతురుని అక్కసుకు చేర్చుకుంది."పెద్దమ్మాయీ! నా చేతులు పడిపోను. చంపానమ్మా!" అంది.
అందవరకూ కుళ్ళికుళ్ళి ఏడుస్తున్న అనుపమ "అమ్మా....." అంటూ సుభద్రమ్మను పెనవేసుకునిపెద్ద పెట్టున ఏడ్చింది.
సుభద్రమ్మ కూతురువైపు చుడటానికి భయపడతున్నది . పిచ్చిగా""
12
రాజేశ్వరమ్మకు ప్రమాదంగా వుందని కబురు రావటంతో రాజు బయలుదేరి వచ్చాడు ఊరినుంచి . తల్లి దగ్గర కన్నా రాజేశ్వరమ్మ దగ్గర చనువెక్కువ. "అత్తయ్యకు ఏం జరిగిందో! ఎలాంటి స్థితిలో చూస్తానో" అనిభయపడ్డాడు. పరీక్షలు పదిహేను రోజుల్లో వున్నాయి. పరిక్షలకన్నా రాజేశ్వరమ్మ ముఖ్యం. రాజు ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు.
రాజు గడపలో కాలుపెట్టాడు . పార్వతమ్మ ఎదురొచ్చింది.
"అమ్మా! అత్తయ్యకు ఎలావుంది.మొన్న కాస్త గాభరాచేసింది. అంతే. కాళ్లు కడుక్కుని ఇంట్లోకి పద." అంది పార్వతమ్మ.
పరవాలేదు. నెమ్మదిగానే వుంది. మొన్న కాస్త గాభరాచేసింది అంతే. కాళ్ళు క్కడుక్కుని ఇంట్లోకి పద." అంది పార్వతమ్మ.
ఎత్తుగా , లావుగా పుష్టితో భర్త పోలికలు పుణికి పుచ్చుకుని వున్న రాజుని చూస్తుంటే మధుసూధనం మాటలు,చేతలు గుర్తుకువచ్చి ఎక్కువ మాట్లాడలేకపోతుంది పార్వతమ్మ.
రాజు సరాసరి రాజేశ్వరమ్మ గదిలోకి వెళ్ళాడు. మూడేళ్ళబట్టి ఓణీలేసుకుంటున్నా. ఈ మధ్య బావను చూసి సిగ్గుపడటం ఎక్కువైంది చుక్కమ్మకు. రాజు గదిలోకి అడుగుపెట్టెటప్పటికి చూస్తూనే చటుక్కున లేచి వెళ్లిపోయింది చుక్క.
రాజు సరాసరి వెళ్ళి రాజేశ్వరమ్మ మంచం మీద కూర్చున్నాడు. "ఎలా వుంది అత్తయ్యా?" అన్నాడు మొహంలోకి పరిక్షగాచూస్తు.
"కాస్త వస్తే కొండంత చేస్తారు మీ మామయ్య. నీకు తెలియందేముంది?నాలుగు రోజులు జ్వరం తగిలింది. జ్వరం ఎక్కువయింది. జ్వర తీవ్రతలోనిన్ను కలవరించానట. నాకెతై తెలియదు. మీ మామయ్య చెప్పారు. నాకు కబురు చేసిన సంగతి కూడూచెపితే "పరిక్షలు దగ్గర కొచ్చాయి. రాజునెందుకు రమ్మన్నారు?" అంటే, మీ మామయ్య నన్నే కోప్పడ్డారు. "నీకు తెలీదు ఊరుకో. నీకు జ్వరమొచ్చి తెలియబరచలేదంటే రాజుకి కోపం రాదూ?"అన్నారు." అని చెపుతూ ఆ యాసంతో ఒక నిమిషం ఆగి "బాగా చదువుకుంటున్నావా రాజూ?దేనికీ ఇబ్బంది పడటం లేదుకదా?"అంది.
ఇబ్బందేమీ లేదన్నట్లు తల అడ్డంగా ఊపి "ఊహూ!" అన్నాడు రాజు.
రాజేశ్వరమ్మ పుల్లల్లాంటి చేతులు తన చేతిలోకి తీసుకుని "చాలా చిక్కిపోయావు అత్తయ్యా!" అన్నాడు రాజు.
నవ్వి వూరుకుంది రాజేశ్వరమ్మ.
పార్వతమ్మ కాఫీ తెచ్చివ్వటంతో వేడి కాఫీని ఊదుకుంటూ, తాగుతూ రాజేశ్వరమ్మని పరిక్షగా చూచాడు రాజు.
" అత్తయ్య బాగా చిక్కిపోయింది. అయినా ముఖంలో రోగ లక్షణాలు కనపడవు. కళకళలాడుతూ చిన్నపిల్ల మొహంలా వుంటుంది. పచ్చని పసిమి తెల్లబడిపోయింది.చుక్కకి అత్తయ్య పోలిక రాలేదు. డిటో మామయ్యే." అనుకుంటూ రాజు కాఫీ తాగటం పూర్తిచేశాడు.
"ఏమిటి రాజూ? పరిశీలనగా చూస్తున్నావు. ఈ అత్తయ్య ఎన్నాళ్లుబ్రతుకుతుందా,అనా? నీ పెళ్ళి,చదువు అన్నీ పూర్తయ్యేదాకా వుండాలనివుంది రాజూ!మరి..... దైవ నిర్ణయం ఎలావుందో?" అంది రాజేశ్వరమ్మ.
"ఇలా మాట్లాడితే యిప్పుడే ఊరికెళ్ళిపోతాను. చావు గురించి మాట్లాడనంటే తప్ప మరి మాట్లాడను." రాజు బెదిరింపుగా అన్నాడు.
రాజేశ్వరమ్మకు రాజుని బాధపెట్టటం ఇష్టంలేదు. అనుకోకుండా మాటలు జారిపోతాయి నాటినుంచి. "రాజూ!మరోసారి చావుసంగతి ఎత్తను!సరేనా?నీమీద ఒట్టు. మంచం దిగి నడవలేననే దిగులు నాచేత పిచ్చిగా మాట్లాడిస్తుంది." అంది రాజేశ్వరమ్మ.
"చిన్న పిల్లలన్నట్టు ఒట్టు ఏమిట త్తయ్యా ? నీ ఒట్టు తీసి గుట్టున పెట్టు."
"మరిప్పుడు నేను పసిపిల్ల కన్నా కనాకష్టం కదా?"
రాజేశ్వరమ్మ మాటలు నిజమే అనిపంచాయి రాజుకి. అత్తయ్యకు దిగులెక్కువైపోయింది. ఇప్పుడు అత్తయ్యను చూస్తే ఎవరికైనా మంచికన్నా ఏదో అనేక ఆలోచనేవస్తుంది.
"ఏం రోయ్? ఎంత సేపయింది వచ్చి?" రఘుపతి గుమ్మంలో కాలుపెడుతూ అడిగాడు.
రాజు లేచి నుంచున్నాడు. "ఇంతకుముందే వచ్చాను మామయ్యా ! అత్తయ్య ఆరోగ్యం విషయం డాక్టరు ఏమన్నాడు?" అన్నాడు.