Previous Page Next Page 
కదానాయికి పేజి 23


     మాట్లాడితే తనని గుర్తు పడుతుందని వెంకట్ పెదవి విప్పలేదు. ఇలాంటి విషయాలలో అప్పటికే పదిసార్లు అనుభవమున్న వెంకట్ సున్నితమనస్తత్వం కలవాడు. కాదు, " వద్దు.... వద్దు" అని ప్రాధేయపడ్డ   ఆడదాన్ని బలవంతంగా ఆక్రమించుకొని  రెట్టింపు ఉత్సాహం పొంది వేడిచల్లా ర్చుకునే రాక్షస జాతికి చెందినవాడు.

     వెంకట్  తన శరీరం మీద ఎక్కడయితే చేయివేస్తున్నాడో  ఆచేతిని బలవంతానా అవతలికి తోసెయ్యాటానికి అనుపమ వ్యర్థ ప్రయత్నం చేస్తున్నది . స్త్ర్రీ పరుష  సంగమం, చూడలేని దటుంచి  వినలేదు. ఊహించలేదు.  అందకే జరుగుతున్నది, జరగబోయేది అయోమయంగా వుంది.  అయినా బలవంతానా లేచి  ఇంటికి పారిపోదాం.  ఈకబంధ హస్తాలనుంచి తప్పించుకుందాం అని పెనుగులాడుతూనే వుంది.

     అనుపమని బలంగా కిందకు తోసి మీదపడ్డాడు. వెంకట్ . వెర్రిగా కేకలు  వేస్తున్న అనుపమ దొండపండలాంటి పెదవులను తన మోటుపెదవులతో మూసేశాడు.

     బలరామయ్యగారి పెరట్లో  పిచ్చి మొక్కకు  అందమైన చిన్న పువ్వుపూచింది. ఊళ్ళో ఎన్నో పూలచెట్లు వుంటే అక్కడిదాకా వెళ్ళటానికి బద్దంకించిన తుమ్మెదొకటి ఆ చిన్న పువ్వులోని మకరందమునుగ్రోలి తృప్తిగా ఎగిరిపోయింది.

    తను వచ్చిన పనిపూర్తికాగానే లేచి వడివడిగా వెళ్ళిపోయాడు వెంకట్.

     దూరమవుతున్న ఆడుగుల చప్పుడు విని  ఇంతవరకూ తనని బాధించిన వ్యక్తి వెళ్ళిపోతున్నట్లు గ్రహించింది అనుపమ.

     మోకాళ్ళలో తలదూర్చి ఏడుస్తు "నాకేముంది రాజూ? నువ్వెందుకు రాలేదు రాజు?" అనుకుంది అనుపమ.

                                                                              10

    " సీతాపతీ నీకు సినిమాయే గతీ...." అద్దం ముందు  తల దువ్వుకుంటూ రాగయుక్తంగా పాడాడు. సీతాపతి.

     "అరేయ్ పతీ! సీతాపతికి సినిమా గతికాదు. చాపే గతి.  నువ్వు చాప మీద పడుకో. నేను పట్టె మంచం మీద పవ్విళిస్తాను." టెక్ట్స్ బుక్ తెరిచి మంచం  మీద పడుకుంటూ అన్నాడు రాజు.

     "ఈ సీతాపతికి చాప మీద పవ్వళ్ళిచటం శేషతల్పం మీద  శయనిచటం లాంటిది. నా గురించి,యీ పాడు దేహం గురించి నువ్వేం చింతించన్కకలేదు. లేచి సినిమాకి బయలుదేరు రాజూ భయ్య!"

    " పరిక్షలు దగ్గరపెట్టుకుని  సినిమాకి ఎవడన్నా వెళతాడురా? మన్నిపెద్దువాళ్ళు కష్టపడి డబ్బు పంపుతూ ఇక్కడుంచి చదివించటం,  సినిమా లకి, షికార్లకి  పొమ్మనా?" రాజు విసుగ్గా అన్నాడు.

     "కాదు- రాత్రింబవళ్లు చదివి-చదివి బుర్ర వేడెక్కిచ్చుకుని తొందరగా మెంటల్ ఆస్ పత్రిలో  సీటు సంపాదించుకోమని."

    రాజు ఫక్కున నవ్వాడు. తనన్నాదానికి రాజు నవ్వటం చూచి సీతాపతి అద్దం ముందునుంచి లేచివచ్చి రాజు పక్కలో కూర్చున్నాడు.

    రాజూ భయ్యా!నాతో అబద్దమాడకుండా  నిజం చెపుతావా?"  రాజు చేతిలో బుక్ తీసి పక్కనే పడేసి అడిగాడు సీతాపతి.

    "నీతో ఎప్పుడన్నా అబద్ధాలు చెప్పానా పతీ?"  రాజు సీరియస్ గా సీతాపతి మొహంలోకి చూస్తు అడిగాడు.

     సీతపతి కాస్తంత కంగారుపడ్డాడు.  అంతలోనే సర్దుకున్నాడు. "నాయనమ్మ మన దగ్గర వున్నన్నాళ్లూ చీకూ చింతా లేకుండా వుండేది.ప్చ..... దేముడికి అర్జంటుగా నాయనమ్మతో  పనిబడి పిలుచుకెళ్ళాడు. మనకు హోటల్ మెతుకులు గతి అయ్యాయి. అదలా  వుంచు. నాయనమ్మ మన దగ్గర వుంటే యిరువురి యోగక్షేమాలు కనుక్కుంటూ వుండేది...."

     సీతాపతి మాటలకు అడ్డొచ్చాడు రాజు.

    "  ఇప్పుడు నీకూ నాకూ వచ్చిన  కష్టమేమిటో?" అన్నాడు రాజు.

    సీతాపతి నవ్వటం తప్ప సీరియస్ విషయాలలో కూడా సీరియస్ గా వుండడు. నవ్వటం , నవ్వించటం కొందరి సొత్తు. సీతాపతి  ఆ జాబితాలో చేరినవాడు. "సినిమాలు, షికార్లు, నవలలు మించినదాచదువు?" అంటుంటాడు. అంతకుమించి మరో దురభ్యాసం లేదు.

     సీతాపతి మాట్లాడకపోవటం చూసి "చెప్పరా  పతీ! నీకూ నాకూ వచ్చిన కష్టమేమిటో ?" అన్నాడు రాజు.

    "నీకష్టం నాకష్టం కాదా? నీ ఆనందం నా ఆనందం కాదా?"

    " అసలు సంగతి చెప్పరా నాయనా, నీ చచ్చుప్రశ్నలు  చాలించి!"

    "అడగనా?"

    " అడుగు."

    " చెపుతావా?"

    "చెపుతాను. మళ్ళీ నోరెత్తావంటే గదిలోంచి బయటకు గెంటి ఇంచక్కా రాత్రంతా మేలుకుని చదువుకుంటాను. ఆరుబైట చలిలో రాత్రంతా అఘోరిద్దువు గాని. " మంచం  మీంచి లేచి కూర్చుని అన్నాడు రాజు.

    "అమ్మబాబోయ్! అంతపని చేయకు. వీడిది రక్తమాంసాలున్న శరీరం కాదు. బొమికలు. తోళ్లు తప్ప. చలికి నీలుక్కుపోతాడు.  ఎంత పెద్ద డాక్టరయినా సీతాపతికొచ్చిన నీల్గుడు వ్యాధి కనిపెట్టలేక గుండాగి హరీ అంటాడు... ఆ...ఆ లేచిపోకు! అసలు విషయానికొస్తున్నాను. మొన్న అర్జంటుగా మీ అత్తయ్యని చూడాలని వూరికి వెళ్ళావా? రెండు రాజులుండి వస్తానన్న వాడిని మర్నాడు ఉదయమే ఊరినుంచి దిగావా? అప్పటినుంచీ చూస్తున్నాను. మనిషివి మనిషివిగా  లేవు. నీ మనసు మనసులో వున్నట్లులేదు. పరాకు చిరాకు ఎక్కువయ్యాయి."   

 Previous Page Next Page