"ఈ పూట మరీ నీరసంగా వుందే అమ్మాయీ! మరో మాత్ర తగిలిస్తే గాని ప్రాణం తెరిపిన పడేటట్లు లేదు." అంటూ రొంటిన దోపుకున్న చిన్నడబ్బా తీసి గింజంత నల్లమందు దానిలోంచి తీసుకుని గటుక్కున మింగి గ్లాసు నీళ్లు తాగింది ముసలమ్మ.
ఐదు గంటలకే రాత్రి వంట పూర్తి చేసిన భద్రయ్య ఇల్లంతా సర్డాడు. కరణంగారు పాలికాపు తో కబురంపితే "వచ్చి ముసలమ్మగారికి నీకూ అన్నం పెడతాను. జాగ్రత్తగా వుండండి. కరణం గారింటిదాకా వెళ్లివస్తాను." అని చెప్పి రామభద్రయ్య, పాలికాపుతో కరణం గారింటికి వెళ్లాడు.
ఇల్లంతా నిశ్సబ్దంగా వుంది. ముసలమ్మ మటుకు సన్నగా గురుపెడుతున్నది.
రామభద్రయ్య వెళ్ళిన అయిదు నిమిషాలకి "అక్కా! అక్కా!" అంటూ బుచ్చిరాజు వచ్చాడు అనుపమ వద్దకు.
బుచ్చిరాజు వెంకట్ ఆఖరి తమ్ముడు. మధ్య మధ్య పిల్లలతో ఆడుకోటానికి వచ్చిపోతుంటాడు.
వచ్చింది. బుచ్చిరాజుని కంఠస్వరం బట్టి గుర్తించింది అనుపమ.
" అమ్మ ఊరికెళుతుంటే పిల్లలు కూడా పెళ్లారు బుచ్చీ! ఇంట్లో ఎవరూలేరు నీతో ఆడుకోటానికి. " అంది అనుపమ.
"మరీ..మరి...."బుచ్చిరాజు అటు ఇటు చూస్తు ఆగిపోయాడు.
"ఏంటి బుచ్చీ?"
"ఊహు.... నాన్న కరణం గారిటింకెళ్ళారు. ఎందుకో?" తప్పకుండా నిన్నిప్పుడే రమ్మన్నాడు. మళ్ళీ రాత్రికే ఊరికి వెళ్ళిపోతా రాజు వ్చాచడా? నన్ను రమ్మన్నాడా?" అనుపమ ఆదుర్దాగా అడిగింది.
" మధ్యాహ్నం వచ్చాడు. రాత్రికే మళ్ళీ వెళతాడుట. పరిక్షలయిందాకా మళ్ళీ రాడుట."బుచ్చి రాజు చెప్పాడు.
"రాజు ఎప్పుడొచ్చినా అవధాన్లుతో కుబురుచేసేవాడుగా. ఇవాళ నీ వచ్చావేం?" సుభద్రమ్మ ఇంట్లో లేదనే ధార్యంతో మామూలుగా అడుగుతున్నది అనుపమ.
"అవధాన్లు ఊరికి వెళ్ళాడు. వస్తావా, రావా? రాజుతో చెప్పాలి."
"ఇప్పుడే వస్తాను. రాజుని వుండమని చెప్పు."
బుచ్చి రాజు పురుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడినుంచి.
"అమ్మవుంటే రాజుని కలుసుకనివ్వదు. ఈ ఒక్కసారి రాజు దగ్గరకెళ్ళి,అమ్మ కోప్పడుతున్నది నీతో మాట్లాడటం నాకిష్టమే రాజూ ఎవరూ లేనప్పుడయితే వస్తాను. అని చెప్పిరావాలి. నాన్న అడిగితే అలివేణి ఇంటికెళ్లి వచ్చానని చెప్పొచ్చు. తొందరగావస్తే, నాన్న కన్నా ముందే ఇంటికి రావచ్చు. నే వెళ్లి వచ్చినట్లు నాన్నకి కూడా తెలియదు." అనుకుంది అనుపమ.
"నాన్నొస్తే అలివేణి వాళ్లిటికెళ్లననిచెప్పు. ఇప్పుడే వస్తాను. ఎందుకో అలివేణి రమ్మన్నదట." అని ముసలమ్మకి చెప్పింది అనుపమ. ఆవిడ నిద్రమత్తులోవుండి "ఊ" కొట్టింది.
అనుపమ తలుపులు దగ్గరగా లాగి ఇంట్లోంచి బయలుదేరింది.
అనుపమ సరాసరి బలరామయ్యగారి పెరటిలో ఆటలాడేటప్పుడు కూర్చునే బండవద్దకు అలవాటు ప్రకారం తడుముకోకుండా వచ్చింది.
"రాజూ!" అంది రాజు అక్కడే కూర్చున్నట్టు భ్రమించి.
రాజు మాట పిలపు వినపడలేదు.
" రాజూ! ఓ రాజూ!" అంది గొంతెత్తి అనుపమ. రాజు అవతలికి వెళ్ళుండవచ్చని పెద్దగా పిలిచింది.
ఆడుగులు చప్పుడు దగ్గరగా విని" అమ్మదొంగా! ముందుగా వచ్చి పిలుస్తున్నా పలకవా?" అంది అనుపమ.
రాజు చెయ్యిపట్టుకుని దగ్గరగకు లాకున్నాడు అనుకుంది. అనుపమ. వచ్చింది వెంకట్ అని తెలియలేదు. బుజాలమీద తడుముతున్న చేతులు రాజువి అనుకుని" మాట్లాడవేం రాజూ? కోపం వచ్చిందా?" అంటూ బుజంమీద వెంకట్ చేతులను తన చేతిలోకి తీసుకంది. ఆ చేతులు గట్టిగా నున్నగా, ఇనప కడ్డీలా వున్నాయి. "రాజు చేతులు లావుగా వున్నామెత్తగా వుంటాయి. చేతిమీద వెంట్రుకలుంటాయి. ఇవి రాజు చేతులు కావు" చేతులపై నిమురుతు అనుకుంది.
వెంకట్ చేతులను విసురుగా తోసేసింది. అనుపమ.
వచ్చింది. రాజు కాదని తెలుసుకుంది. అనుపమ అనుకున్నాడు వెంకట్, వెంటనే నడుంచుట్టూ చేతులేసి దగ్గరకు లాక్కున్నాడు. అనుపమని.
"అబ్బా!" అంది అనుపమ.
అనుపమ "అబ్బా" అనటం తియ్యని పిలుపులా వినిపించింది వెంకట్ కి,అనుపమ శరీరమంతా తపనగా తడుముతు ఇంకా దగ్గరకు ఇంకా బలంగా అదుముకుంటున్నాడు.
ఏమిటోగా వుంది. అనుపమకు, ఎంత ప్రయత్నించినా వెంకట్ చేతిలోంచి తప్పించుకోలేకపోతున్నది. వచ్చిందెవరో తెలియటం లేదు. ఇలా ఎవరూ తనని ముద్దు పెట్టుకోటం, కౌగిలిలో లిపేయటం చేయలేదు. ఆ అనుభవం అయిష్టతగా అయోమయంగా వుంది. ఒకటి రెండు సార్లు "రాజూ!రాజూ!" అని పెద్దగా కేక వేసింది.