తనుడిగింది నివబడ్డదో, లేదో అని మరోసారి అడిగింది. అనుపుమ.....
రమ ఏదో చెప్పబోయింది. సంజ్ఞచేసి వారించింది ఉమ నేనోతమాషాచేస్తా చూడండి అన్నట్లు చేతులుఆడిస్తూ తెలియజేసింది కళ్ళెగరేసి
పిల్లలందరూ ఉం ఎంతతమాషాచేస్తుందా అని నిశ్శబ్దంగా కూర్చున్నారు.
వీళ్ళెవరు మాట్లాడటంలేదేమిటి? నే అడగటం తప్పా? అడుగుకూడదా?అనుపమ అలోచనకు అంతరాయం కలిగిస్తూ ఉమ అంది.
" అనూ! ఇప్పుడు నీవు పెద్దమనిషివి అయ్యావు. మమ్మల్ని తాకకు పెద్దమనిషి కావటంఅంటే...అంటే...," పెద్దపెట్టుననవ్వింది ఉమ.
పిల్లలందరు చప్పట్లుకొడుతు " అను పెద్దమనిషయింది,అనుపెద్దమనిషి యింది" పెద్దగా అరుస్తు గోలచేశారు.
అనుపమ కంగారుపడింది,భయంతో బిగుసుకుపోయింది.
"ఉమా!" జాలిగా పిలిచింది.
అనుపమ పిలుపు ఎవరూ వినిపించుకేలేదు కేరింతలుకొడుతున్నారు
అనుపమ పేరు పేరునా అందరినీ పిలిచింది.
దూరంగావస్తున్న రాజుని ముందుగా శేఖర్ చూచాడు. రాజు వస్తున్న వైపు వేలుపెట్టి చూపించాడు.అందరికీ.
అనుపమని చిన్నమాటన్నా వూరుకోడు రాజు వాళ్ళరక్తం కళ్ళచూచినంత పనిచేస్తాడు. పదిహేనేళ్ళవయసుకే మాంచిధృడంగా ఎక్కుతు తగిన లావుతో కండలు తీరిన అవయావాలతో అందంగా హుందాగావుంటాడు రాజు. శేఖర్,వెంకట్ పీలగావుంటారు. రాజుయీడు వాళ్ళిద్దరికీవున్నా.
రామం ,అవధాని పొట్టిగా పొత్రంలా వుంటారు. పదకొండేళ్లు యింకా నిండలేదు. చూడటానికి అంత ఒక లాగానేవుంటారు మూడు ఏళ్ళ భేదంవున్నా.
రాజు అంటే ఆడ మగ అందరిపిల్లలకు భయమే.అనుపమను ఆటలుపట్టించినట్లు తెలిస్తే వూరుకోడు. అందుకే దూరంగా ఇటేవస్తున్న రాజునిచూచి అందరూ పరుగుతీశారు.
" రామం!శేఖర్!ఉమా!అలివేణీ!" కేకలుపెట్టి పిలుస్తున్న అనుపమ అడుగులచప్పుడు తనపక్కనే విని చటుక్కున ఆపింది.
"రాజూ!" అంది ఆనందంగ.
రాజు నొసలు ముడిపడ్డాయి. "వాళ్ళంతా ఎందుకు పారిపొయ్చారు? నిన్నేం అన్నారు?"కోపంగా అడిగాడు.
"మరి.....మరి..." మాటలు మింగేసింది అనుపమ.
రాజు అనుపచెయ్యి పుచ్చుకుని తనపక్కనే కూర్చోపెట్టుకున్నాడు. అనుపమ చెయ్యి నిమురుతు 'చెప్పు అనూ! వాళ్ళేమన్నారు?" అని అడిగాడు.
"నేచెప్పింది విని వాళ్ళని కోప్పడవుగా?"
"ఉహూ!కోప్పడనులే, తొందరగా చెప్పు."
"మరి...నేను..... ఇప్పుడు పెద్దమనిషి నయానట" ఆ మాట అనిఅందరూ నవ్వారు.
ఆ! రాజు నోరుతెరిచాడు. అనుపమచేతిమీదవున్న తన చేయి తీసేశాడు.
"పెద్ద మనిషి కావటం అంటే ఏంటిరాజూ?" భయపడుతూనే అడిగింది అనుపమ.
రాజు పిడికిలి బలంగా బిగుసుకుంది.
రాజు మాట్లాడకపోవటం చూచి "నీకూ తెలియదా రాజా! పెద్ద మనషి కావటం అంటే ఏమిటో?" అంది అనుపమ అమాయకంగ.
రాజుకి చూచాయగా తెలుసు. పదకొండేళ్ళ అనుపమను ఆటలు పట్టించటానికి అనివుంటారని గ్రహించాడు.
" నాకూ సరీగా తెలియదు అనూ! నిన్ను ఆటలుపట్టించి నవ్వుకోటానికి వాళ్ళలా అన్నారు. పోనీలే ఆ విషయం మరిచిపో" రాజు నచ్చచెబుతున్నట్లు అన్నాడు.
'అంతేనా?'
'అవును అనూ!' స్థిరంగా పలికాడు రాజు.
రాజుతో అనుపమ చాలా చాలా విషయాలు చెపుతున్నది. పరధ్యానంగా 'ఊ' కొడుతున్నాడు.
"అనుపమ వీళ్ళకేం అపకారంచేసింది? అమాయకురాలని ఆటలు పట్టిస్తున్నారు.అనూ ఎంతందంగా వుంటుంది? అనూముందు వీళ్ళంతా గుంటనక్కల్లా వుంటారు.అనూతప్ప ఎవరూ మంచివాళ్లు కాదు ఆనూకి..."
రాజు తను చెప్పేది వినటంలేదని గ్రహించింది అనుపమ.
"రాజూ! ఏమిటో ఆలోచిస్తున్నావు. అందరూ నన్ను ఆటలుపట్టిచారనా? పోనీలే. మళ్ళీ రేపు నాతో బాగానే ఆడుకుంటారు. దాగుడుమూతలాటలో తల్లిని నన్నేచేస్తారు." అంది అనుపమ.
గడ్డిపరకను మునిపంటితో కొరుకుతు ఆలోచిస్తున్న రాజు గడ్డిపరకను కిందపడేశాడు.తనచేయిపట్టుకుని కదిలిస్తున్న అనుపమచేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.మృదువుగా నిమిరాడు.
"అనూ!"
"ఊ!
"అను! నువు చాలా అందంగా ఉంటావు."