"నాన్న చెప్పమన్నది ఇక్కడకొచ్చి చెప్పాను. నువ్వు చెప్పమన్నది అక్కడి కెళ్ళి చెపుతాను .మళ్ళీ నాన్న రమ్మంటే మళ్ళీ నాన్న రమ్మంటే మళ్ళీ వచ్చి చెపుతాను." అంటూ చుక్క గడప దాటింది.
" మామయ్యంటే ఎందుకురా రాజూ భయం?" రాజుమొహాన్ని పరిశీలినగా చూస్తూ అంది రాజేశ్వరమ్మ.
"అబ్బే,నాకేం భయం? మామయ్యంటే భయంలేదే! నాకసలు భయమే లేదు"
రాజు కంగారు చూస్తుంటే ఫక్కున నవ్వు వచ్చింది రాజేశ్వరమ్మకి. నవ్వే ఓపికలేక నవ్వుతుంటే ఆయాసం వచ్చింది. అత్తయ గుండెమీద చేయి వేసి నిమురుదామని రాజు చెయ్యి ఎత్తి చటుక్కున వెనక్కు తీసుకున్నాడు. బిడియపడుతు తన చేతిని.
రాజు 'ఊ' కొడుతు కూర్చున్నాడు.
"ఏమిటి రాజేశ్వరీ! రమ్మన్నావుట.."? రఘుపతి లోపలికి అడుగుపెడుతూనే అడిగాడు .వంట్లొ బాగుండక రమ్మన్నదేమో అని భయం, రాజేశ్వరమ్మ మామూలుగా వుండటం చూచి అమ్మయ్య అనుకున్నాడు.
గదిలోకి మామయ్య రాంగానే చటుక్కున లేచి నుంచున్నాడు రాజు.
"నాన్న చెప్పమన్నది ఇక్కడ కొచ్చి చెప్పాను, నువ్వు చెప్పమన్నది అక్కడి కెళ్ళి చెపుతాను. మళ్ళీ నాన్న రమ్మంటే మళ్ళీ వచ్చి చెపుతాను." అంటూ చుక్క గడప దాటింది.
"మామయ్య రమ్మన్నారుగా వెళతానత్తయ్యా! వెళ్ళ
"ఏం రా! ఎన్నిసార్లు రమ్ముని చెప్పాలి?" గద్దిస్తూ అడిగాడు రఘుపతి.
రాజు మాట్లాడకుండా రాజేశ్వరమ్మ వైపు చూచాడు.
"రాజు వెళతానని లేస్తే నేనే వద్దన్నాను."
" సరె...సరె, ఎందుకు రమ్మాన్నావ్ రాజేశ్వరీ?" కుర్చీ మంచానికి దగ్గరగా జరిపాడు. "కూర్చో రాజూ!" అంటూ తను కూర్చీలో కూర్చున్నాడు రఘుపతి.
రాజు రేపుదయం ఊరికెళ్ళిపోతున్నాడు. యీ కాసేపు నా దగ్గర కూర్చోనివ్వండి. జాగ్రత్త లేం చెపుతారో వినొద్దా మరి?...."
"వాడి సామాను సర్దుకుంటాడని పిలిచాను," అని రాజువైపు "వరేయ్" అన్నాడు రఘుపతి. "ఆ"..... అంటూ ఠక్ మని లేచి నుంచున్నాడు రాజు "నిన్ను లేవమని ఎవరు చెప్పారురా? యీ వయసులో ఎలా వుండాలి? ఇంత పరధ్యాన్నము , ఇంత అయోమయమయితే పట్నంలో నువ్వు చదివినట్లే, నే...."
రాజేశ్వరమ్మ అడ్డు తగిలింది. లేకపోతే రఘుపతి వాక్ ప్రవాహానికి గట్టుపడదని తెలుసు.
"మీ మాటంటే గౌరవం ఉండబట్టి..... పిలవంగానే వినయంగా లేచాడు. పరధ్యాన్నములేదు, అయోమయము లేదు. అంతా మీ వూహ, అలా మాటకు ముందు గద్దిస్తూ అడిగితే మీరంటే భయం ఏర్పడుతుంది."
"ఏరా రాజూ! నా మాటంటే మాటంటే భయమా?"
"అబ్బే లేదు.... లేదు...."
" భయంలేదూ?"
"అహ.... వుంది వుంది"
"బాగుంది తానా అంటె తంధానా అన్నట్లు"..... చిన్నగా నవ్వుతూ అన్నాడు రఘుపతి. రాజేశ్వరమ్మ, మామా అల్లుళ్ళ ఫార్సు చూచి పెద్దపెట్టున నవ్వి మళ్ళీ ఆయాసం తెచ్చుకుంది. పదనిమిషాలకు గాని మామూలు మనిషి కాలేకపోయింది.
"ఎందుకంతగా నవ్వాలి? మొహం చూడ ఎలా కందిపోయిందో?"
"నాదా తప్పు?" అంది రాజేశ్వరమ్మ.
"ఆచార్ల గారి వైద్యం మానేసి, డాక్టరుగారి మందు తీసుకుంటుంటే ఎలా వుంది రాజేశ్వరీ?"
"నేను ఎలా వున్నానో మీరు చెప్పండి?"
"కాస్త బాగుంది. ఇదివరకటంత నిస్త్ర్రాణంలేదు అనిపిస్తుంది చూస్తుంటే."
"అత్తయ్యకు నవ్వటానికి కూడా ఓపికుండేది కాదు. ఇప్పుడు నవ్వుతున్నది .ఆయాసం లేకుండా కాసేపు మాట్లాడుతున్నది" రాజు వెంటనే అన్నాడు రఘుపతికి వంతపాడుతు.
"ఆవును మీరన్నది నిజమే, లేచి నడిచే ఓపిక లేకపోయినా, యీ మాత్రం ఫలితం చూపించింది మందు. ఇవాల్టిదా, నిన్నటిదాయీ జబ్బు? చుక్క భూమ్మీద పడుతూనే , కొన్నాళ్లు జ్వరం,అది తగ్గితే శిరోభాధ. అమ్మయ్య.... తగ్గింది అనేలోపల గ్రహిణి పట్టుకుంది. దానితో మూడు మాసాలు మంచం ఎక్కాను. జబ్బు శరీరం అయింది రక్తం క్షీణించిందని.... ఇలా ఇలా శాస్వితంగా మంచం ఎక్కటం అయింది. మరి కొన్నేళ్ళు బ్రతకటానికి యీ డాక్టరు దొరికాడనుకోవాలి.ఆయూఘ్ష తీరని వారికి ఎంత పెద్ద డాక్టరయినా ప్రాణం నిలబెట్టలేడు కదా?"
"ఏం మాటలవి రాజేశ్వరీ?"