జానికమ్మ గారు నవ్వింది.
"నవ్వుతా రేమిటి పిన్నిగారు! ఆ అమ్మాయెవరో చెప్పండి!" కుతూహలంగా అడిగిందో అమ్మాయి.
"నువ్వు పెంచుకుంటవా?" ఎదురు ఎదురు ప్రశ్న వేసింది జానికమ్మ.
"పిల్లా పాపా లేనివాళ్ళకి పెంపకం కానీ __ జయకేమిటి కండీ పెపంకం? మరోనేల్లోనో నెలలోనో పెళ్ళయిపోతుంది. ఏం చక్క ఏడాదితిరక్కుండానే మగబిడ్డ నెత్తుకుంటుంది!" నవ్వుతూ అంది సుశీలమ్మ.
"ఈ రోజుల్లో అడా మగా తేడా ఏమిటిలే! ఎపిల్లనయినా ఒక్కటే __ బుద్దిగా పెరిగితే __ చదువుకుంటే చాలు __
"ఇంతకీ ముడి విప్పరేమిటి?
కధలాగా అంతా హ్నవ్వుతూనే చెప్పింది జానకమ్మగారు
అందరూ నోళ్ళు నొక్కుకున్నారు.
"కలికాలం!" అంది సుశీలమ్మ.
కలికాలమో __ కలికికాలమో! ఏం చేస్తాం ! రోజులిల్లా మారిపోతున్నాయి" అందో యువతి... వయసులోనే మనసుకి ముదిమి వచ్చిందామేకి.
సుజాత యింటి పనితో బయటకి రాలేదు.
అంత తలోకా రీతిగా వాఖ్యానిస్తూ రకరకాలుగా ప్రశ్నిస్తూ వేధిస్తారని భయపడింది. కూడా! కానీ బొత్తిగా ముఖం కూడా చూపకుండా ఎన్నాళ్ళు! అయితే మనషి ఎక్కడి కక్కడే తృప్తిపడతాడు. ఈ గంట గడిస్తే చాలు __ ఈ పుట గడిచిపొతే చాలు __ ఈ రోజు నిండితే చాలు __ ఈవారం వెళ్ళిపొతే __ ఈ నేల ఆగితే __ ఈ ఏడాది గడిస్తేచాలు అని ఎక్కడికక్కడ అనుకుంటూ వుంటారు.
దాంతో పెద్దరిలీఫ్ గా ఫెలవుతారు.
కానీ అదేక్కడికి పోతుంది?
సమాధానం తెగని లెక్క అలానే వుంటుంది. సాల్వ్ అయ్యేదాకా! ఏదయినా అంతే!
ఆ రాత్రి బేబీ ఎనిమిదింటికి వచ్చింది సుజాత వద్దకి
"సుజాతా! ఏం పేరే పిల్ల పేరు?"
తెల్లబోయింది. సుజాత క్షణంపాటు.
"అవును ! ఏం పేరు? ఏం పేరో? ఏ పేరు పెట్టాలి!" అనుకుంది.
"పోనిలే! సిరిమల్లి పువ్వులాగా తెల్లగా బొద్దుగా వుంది మల్లేశ్వరి అని పేరుపెడదామా! పాపం! యిలాటి పిల్లలికి నామకరణంలా బండలా?" అంది.
సుజాత మళ్ళీ తెల్లబోయే పరిస్థితి అది.
పిల్లని ఆమె చేతికిచ్చి "పాలు పట్టాను. మళ్ళీ రాత్రి ఏడిస్తేనే పట్టులేకపోతె వద్దు " అని వెళ్ళిపోయింది జానికమ్మ.
టలుపెసుకుని పడుకున్నా సుజాత ఆలోచనలు తిరిగి పోలేదు. "ఈ పిల్లని గురించి ఎవరికయినా ఏం చెప్పాలి? అంతా జానికమ్మలాగా వుంటారా? ఆవిడ ఏదేదో వూహించుకుంటుంది. అయినా విశాల హృదయంతో అర్ధం చేసుకున్నట్టు ప్రవర్తిస్తోంది. అంతా అలా వుంటారా? తనెం చెప్పినా ఎవరు నమ్ముతారు. ఉహూ లాభంలేదు. రేపు అనాధ శరణాలయంలో విడిచేసి రావాలి. అంతే! తను ఈ బరువు మోయలేదు__"
ఆ ఆలోచన రాగానే అటు చూసింది సుజాత.
నోట్లో వేలేసుకుని బంగారు బొమ్మలా నిద్రపోతోంది బేబి ఉహూ మల్లేశ్వరీ.
అవును జానికమ్మగారు మంచి పేరే పెట్టారు.
"ఈపిల్ల తల్లి ఎవరో? అసలు అతను తమ్ద్రేనా?"
ఎందుకలా వదిలేసి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు?
నేనంటూ బుమ్తే ఎప్పటికయినా మిమ్మల్ని కలుసుకుంటానని ఎంత ధైర్యంగా చెప్పాడు __ ఎలా కలుసుకోగలడు?
అంతదాకా తను యీ పిల్లని __ యీ నిమ్దల్ని మోస్తూ బ్రతకాల్సిందేనా? తప్పదా?
సుధా యీ అమ్మాయి ఎవరిని అడుగుతాడు.
అతనికీ రేపో మాపో తెలుస్తుంది. అఫీసులోనో వీదిలోనో ఎవరో ఒకరు చెబుతారు.
అప్పుడు తనేం సమాధానం ఇవ్వగలదు?
నలుగురూ నాలుగు విధాల అంటూ వుంటే అతను' తను సహించి భరించుకోగాలరా?
ఇది ఒక నాటిబారువా? ఒక యేటి బారువా?
అందునా ఆడపిల్ల __ దీన్ని పెంచి పెద్దచేసి ఓ అయ్యచేతిలో పెట్టాలి. ఇంకా తనే ఓ అయ్య చేతికి అందలేదే __ ఇక__
ఆలోచించలేక పోయింది ఆపైన .
ఆలోచనతో తలపేలితున్నట్ట్లుగా వుంటే వేడి వేడి పాలు గ్లాసునిండా ఓంపుకుని తాగింది. ఆలోచనలని దూరంచేసింది. మరో అరగంటలో నిద్రలోకి జారిపోయింది.
మరురోజు ఉదయం తొమ్మిది గంటలకల్లా తయారైంది భోజనం చేసి మధ్యాహ్నానికి టిఫెన్ తయారు చేసుకుంది. దాన్ని బేగ్ లో పెట్టుకుని తలుపులు వేసి బేబీ మల్లేశ్వరిని తీసుకుని జనికమ్మ గారింటికి వెళ్ళింది.
లోపల ఆమె భర్త, పిల్లలు భోజనాలు చేస్తున్నారు.
"పిన్నీ __ పాపని యీ పూటకి జాగ్రత్తగా చూసుకో సాయకాలం ఆఫీసునుంచి అటే శరణాలయానికి వెళ్ళిమాట్లాడి వచ్చి విడిచిపెడతాను ఆఫీసుకి టైమయిపోతోంది!" అంది గబగబా.
జానకమ్మగారు తెల్లబోయినా క్షణంలో తేరుకుని వెర్రి పిల్లా ఎవరో ఏదో అనుకుంటారని అలా బెంబేలు పడిపోయి __ కన్నతల్లివి బంగారు బొమ్మలాంటి పిల్లని అనాదాశ్రమం పాలు చేస్తావా? చాల్లే వూరుకో __ అంతగా నీకు బరువయితే నేను పెంచుకుంటా __ చంద్రమణి తర్వాత మా యింట్లో పసిపిల్లలు లేరని తెగ ఉబలాట పడిపోతున్నారంతా __ సరే! సరే! నువ్వు ముందు ఆఫీసుకెళ్ళిరా __" అంది దాన్ని ముద్దులాడుతూ.
అమాటలకి నిర్ఘాంత పోయింది సుజాత.
"ఈ పిల్ల నా పిల్లకాదు. నేను యింకా కన్నెపిల్లనే కావాలంటే నన్ను డాక్టరుతో పరిక్షింప చేసుకోండి. రైలు స్టేషను లో ఎవరో దౌర్భాగ్యుడు నాకు అంటగట్టి పోయాడీ పిల్లని. కర్మ నేను అందరితో మాటలు పడుతున్నాను, అని అరవాలనిపించింది.
అయినా సభ్యత అడ్డొచ్చి మెల్లిగా తిరిగోచ్చింది. తనలో తనే ఆలోచించుకుంటు, తన దౌర్భాగ్యాన్ని నిందించుకుంటూ ఆఫీసుకి బయలు దేరింది సుజాత.
సరిగ్గా తొమ్మిదిన్నరకి ఆ సందు మలుపులో అగుటుంది సిటీబస్సు.
ఆ కౌంపౌండ్ లో అద్దెకుంటున్న వాళ్ళు. ఆ చుట్టు ప్రక్కల ఆఫీసుకి వెళ్ళే వాళ్ళూ అంతా అక్కడ హాజరవుతారు. ఒకటి రెండు నిమిషాలు అటూ యిటూగా.