Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 4

    "ఇదుగో సుజాతా! పాలసీసా. మా చంద్రుమణి తర్వాత దిని ఉపయోగం లేకపోయింది. వెతికి శుభ్రం చేసి తెచ్చేసరికి కాస్త ఆలస్యమయింది"

    జానకమ్మ పులుపుతో వాగ్దారతో ఊహల్లోంచి బయటపడి, సీసాకి కర్చీఫ్ చుట్టిపేట్టి పాప నోటికి అందించింది సుజాత.   
    పది నిమిషాలలో పాలు తాగుతూ మళ్ళీ నిదురపోయింది పాప. పడ నువ్వు బోంచేద్దువు గానీ, ఈ పూట యిక అఫీసుకేం వెళతావులే! కాస్సేపు పడుకుందువు గాని రాత్రంతా ప్రయాణమాయే! బాగా రద్దీగా వుండిందేమో కదా! పైగా యీ పసిపాప ఒకతి! ఎలా వచ్చవో! కళ్ళు చూసు ఎలా వున్నాయో!"
    జానికమ్మలో వుందే చిత్రమే అది. ప్రాణం పెడుతుంది. సుజాత అంటే! ఆమె మాటల్లో ప్రేమ, ఆత్మీయత అలా అలా వర్షింస్తాయి. అది ఆమెకి విసర్గరామణీయక మంత సహాజం.
    ఇంకేం అనకుండా బోజనానికి కూర్చుంది సుజాత. ఎదురుగా కూర్చుంది జానిఅకమ్మ. ఎప్పుడో మళ్ళీ పాప సంగతి అడుగుతుంది!" అనే భయంతో ఆమె వైపు చూడకుండా తలొంచుకుని భోజనం ముగించింది. కంచంలో చేయికడుక్కుని వెళ్ళి బాత్రూంలో పళ్ళెం శుభ్రంచేసి వచ్చింది. తిరిగి వచ్చి చేతులు నాఫ్ కిన్ కి తుడుచుకుంటూ మంచంపై కూర్చుంది. సుజాత.
    సూటిగా జానికమ్మ ముఖంలోకి చూడాలంటే ఏదో సంకోచం.
    "అం యిప్పుడు చెప్పు! మరీ పాప?"
    సూటిగా అలా నిలేసి కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించే సరికి సుజాత మాట తడబడింది. "పిన్నీ __ యీ __ పాప __" ఆమె తరవాత పూర్తీచేయలేక పోయింది. "ఏం చెప్పాలి? ఎలాచెప్పాలి? ఎవరని చెప్పాలి? ఎవరో స్టేషన్ లో ఎక్కేసితర్వాత గుడిబండవేసినట్టు తన కప్పగించి వెళ్లారని చెబితే ఎవరు నమ్ముతారు? అసలు జానికమ్మ పిన్నె నమ్ముతుందా? నిజమయినా చెప్పి నమ్మించి ఒప్పించాలంటే ఎంత కష్టం?"
    "సుజాతా!" ఆ పిలుపుకి ఉలికి పడింది.
    "మీ అక్క కూతురా!" మళ్ళీ అడిగింది జానికమ్మ.
    "|అం" అంది ఆప్రయత్నంగా.
    చప్పున నవ్వేసింది జానికమ్మ. "దొంగా పిల్ల! అబద్ధం ఆడిన అటుకినట్టుండాలి! ఇక చాలుగానీ నువ్వేం చెప్పనక్కర్లేదు! నాకంతా తెలిసిపోయింది. ఫరవాలేదులే! మరి నీ ఉద్యోగానికీ యీ పిల్ల పోషణకి లంకే కుడురదే ఎలా చేస్తావు! నువ్వు దీన్ని విడిచి వెళ్ళటం ఎలా?"
    జానికమ్మగారి  నవ్వు. ఆమె మాట తీరూ , ఆమె సమాధానం సుజతలో అందోళనని కలిగించాయి. గాబరా పడిపొయిందామె. "పిన్నిగారూ!" కంగారుగా పిలిచింది. "మీ రేమనుకుంటున్నారు? ఈపాప  _ ఈపాప__ నా పాప __" పూర్తీ చేయలేక తడబడిపోయింది.
    "పిచ్చిపిల్ల ! యిమ్కేం మాటడకు . నువ్వు ఆఫీసుకి వెళ్ళి వచ్చేదాకా మ ఇంట్లో వుంటుందీ రబ్బరు బొమ్మ. నాకూ కాలక్షేపం అయినట్టుగా వుంటుంది. నీకూ వసతిగా వుంటుంది!"
    ఒక సమస్య తీరిందని పించింది సుజాతకి . మళ్ళీ ఒకటేమిటి రెండుతీరాయనిపించింది. "కానీ తనను గురించి యీమే ఏమనుకుంటున్నది ఈ పాప తన పాపే అనుకుంటుందా? ఊహూ అ ఊహే భయంకరంగా వుంది. తను భరించలేదు. ఈమెతో వివరంగా చెప్పెయ్యాలి! తనని అర్ధంచేసుకుని విషయం గ్రహించుకుని తనకు అండగా నిలబడ గలిగేది ఈవిడ ఒక్కతే!"
    "ఇక పడుకోవమ్మా! సాయంకాలం మళ్ళీ వస్తాను. ఈపూతకి పాలులేవు. సాయంకాలం తీసి వుంచుతాలే! పాప కోసం మరో అరలీటరు ఎక్కువ వెయ్యవా? ఆ ఆవుపాలు విడిగా పంపుతానులే!" అంది జానికమ్మ.
    అద్దే యిళ్ళతో పాటే ఆమెకి పాడి పశువులూ వున్నాయి. ఆ కౌంపౌండ్ లొ అందరికీ చిక్కనిపలు తాగే అదృష్టం కలిగిస్తోంది ఆమె! అంటే అభిమానపడటానికి అదీ ఒక కారణం.
    జానికమ్మగారు వెళుతుంటే చూస్తూ వుండి పోయింది సుజాత. ఎంత మంచి మనిషి అనుకుంది. అందరూ యిలాగే వుంటే ప్రపంచ ఎంత బాగుండేది . కుట్రలూ , కు ఊహలు, కక్షలు , కావేషాలూ, మాత్సర్యాలూ.....
    పాపకేసి చూసింది ఆలోచనలు మళ్ళించుకుంటూ,
    హాయిగా పొత్తిళ్ళల్లో నిదరపోతోంది.
    భయం లేదు అందోళన లేదు. ఆలోచనలేదు. అరటంలేదు. బాల్యం ఎంత అదృష్టకరమైనది. మళ్ళీ ఆ సుఖం ఆ హాయి ఆ జీవితం రమ్మన్నారావు ఎవరికీ! ధనవంతులయినా పేదలయినా బాల్యానికి తేడాలేదు.  దాన్ని తిరిగి ఎవరూ పొందలేరు.
    ఆలోచనలతో నిద్రలోకి జారిపోయింది సుజాత!
                                                                                 3
    జానికమ్మగారి పుణ్యమా అంటూ ఆ పూట సాఫీగా గడచిపోయింది. బేబీ అట్టే ఏడుపు గుట్టు పిల్ల కాదు కాబోలు ప్రశాంతంగా నిదురపోయింది.
    ఆ సాయంకాలం జానికమ్మ నీళ్ళు పోస్తూ వుంటే కేరింతలు కొట్టింది. నిండా రెండు నేలలుంటాయ్ మో పౌడరు వేసి బుగ్గన చుక్క పేట్టి, కాటుక పెట్టగా రబ్బరు బొమ్మలా తయారు అయింది. ఆ పిల్లని చంకన మేసుకుని వెళ్ళిందామె.
    అంతా ఆఫీసుల నుంచి తిరిగొచ్చి అసురుసురైపోయినట్టుగా వున్నారు. అయిన జానికమ్మగారి చేతిలో నెలలు బిడ్డ కనిపించగానే అందరూ ఎక్కడలేని ఉత్సాహంతో కుతూహలంతో "ఎవరీ అమ్మాయి అంటూ ఆరాతీశారు.

 Previous Page Next Page