సుజాత అక్కడకు వెళ్ళి నుంచుంది.
ఆమెని చూసి ఎవరూ పలకరింపుగానయినా నవ్వలేదు. ఆ రోజు ఉదయం నించీ అంతా ముఖాలు చాటు చేసుకుంటున్నారు. ఎవరి యింట్లో వాళ్ళకి చచ్చేంత పని రన్నింగ్ రేస్ లో లాగా టైంతో పాటే దానికంటె ముందుగా పరిగెత్తితే తప్ప సమయానికి ఆఫీసుకి చేరుకోలేదు. సమయానికి అన్నీ తెముల్చుకుని బయటపడటం బ్రహ్మప్రళయం.
ఇక అప్పుడు కబుర్లకి టైం ఎక్కడలే అనుకుని తనని తాను సమాధాన పరచుకుంది సుజాత.
విశాల, సునంద, ఉత్తర, రేణుక ఎవరూ పలుకరీంచలేదు.
లత గబగబా వచ్చింది సుజాత దగ్గరికి ఆ పిల్లకి మాట తొందర ఎక్కువ. అన్నీ గబగబా కలిపేసినట్ట్లుగా మాటాడుతుంది.
"హాయ్ సుజీ! ఇన్నాళ్ళూ ఎక్కడి కెళ్ళావే! మీ పిన్నికి జబ్బుట కదా! నాన్న ఉత్తరం రాశాడన్నావ్ ! చూస్తె ఆ జబ్బు నీకే అన్నట్లుగా వున్నావ్. నువ్వే బాగా తీసిపోయి వచ్చావ్? అవునూ! లగేజ్ తో వచ్చావందే జానీ అత్తయ్య. ఏదీ? నీ లైవ్లీ లగేజ్ ఎక్కడే?"
తెల్లబోయింది సుజాత అధాటికి "ఏమిటి?" అంది పొడారి పోయే గొంతుకతో.
"అదేనే _ నీ మళ్ళి __ నీ తెలమల్లి __ సిరిమల్లి __మల్లేశ్వరి_
జానకమ్మ పిన్ని దగ్గరే వుంది!" క్లుప్తంగా అంది సుజాత.
లత పెదాలు విచ్చుకున్నాయ్ సుతారంగా. లేలేత ఎండ ఆమె పెదాలపై చిట్లినట్లయింది. "ఇంతకీ ఎవరే ఆ హీరో?"
ఒళ్ళు మందిపోయింది. సుజాతకి "షటప్!" అంది.
ఆ మాటకి లత ముఖం వాడి పోయింది. మళ్ళీ ఏదో అనబోయేలోగా బస్సు అల్లంత దూరంలో కనిపించింది.
"డోంటాక్ రాబ్భిస్!" అంది సుజాత కోపంగా.
లతకి వళ్ళు మండిపోయింది.
ఏదో సమాధనం చెప్పాలనుకుంది.
అంతలో బస్సు వచ్చేసింది.
సుజాత బస్సు ఆగీ ముందే కడ్డీ పట్టుకుని ఎక్కేసింది. తర్వాత అందరూ గబగబా ఎక్కేరు. బస్సు కండక్టర్ విజిల్ వెంట కదిలింది. ఎవరూ మాటాళ్ళేదు నన్ను ముత్తుకోకు అన్నట్టుగా వుండిపోయారు.
ఆఫీసుస్టాఫ్ రాగానే బస్సు ఆగింది. సుజాత లేచి నుంచుంది.
"బావున్నారా అమ్మాయిగారూ! చాలా నెలలుయింది మీరువూరెళ్ళి ఈ రోజే వచ్చారా?"
దిగుతొన్న సిజాతని పలుకరించాడు కండక్టర్.
మాములుగా హస్కు వేసుకునే సుజాత అతని ప్రశ్నలకి సమాధానంగా తల ఆడించి డిగి వెళ్ళింది. ఆమె దిగగానే బస్సు తిరిగి బయలుదేరింది.
4
ఆఫీసు మెట్లెక్కుతోంది. సుజాత.
ఆమె మనస్సు నిండా ఆలోచనలే భయంకూడా పట్టుకుంది కొద్దిగా... దానికి తోడు ఏదో తెలీని జంకు.
అన్ని నెలల మెడికల్ లీవ్ తర్వాత తొలిసారిగా ఆఫీసుకి వస్తోంది. ఆమె. ముందు వరంరోజులు కాజువల్ లీవ్ పేట్టి వెళ్ళింది. తర్వాత అక్కడి పరిస్థితి చూసి డాక్టర్ సర్టిఫికేట్ తో మెడికల్ లీవ్ పెట్టేసింది. ఎదిస్తూనే శాక్షన్ చేసి వుంటారు.
ఆఫీసరు ఫర్లేదు. మేనేజర్ ఏడ్చిపోయి వుంటాడు. అయినా అతనతో రాజీ ఎంత సేపు. ఒక నమస్కారం పడేస్తే పొంగిపోతాడు.
"గుడ్ మార్నింగ్!"
ఆప్రయట్నంగా మార్నింగ్!" అని తలెత్తి చూసింది.
సుధ!
తన సుధాకర్ ! తన కోక్లర్క్! వెన్నెలలాంటి చిరునవ్వుతో ఎదురుగా నుంచున్నాడు.
సుజాటికి గుండె గొంతులోకి వచ్చినట్లుయింది. ఏదో ఆత్మీయత దొరికినట్లు అనిపించింది. ఎడారిలో ఒయాసిస్సు కనిపించినట్టు అనిపించింది. మిస్సయిందేదో కనిపించినట్టు అనిపించింది.
"ఎప్పుడోచ్చారు?"
"నిన్న సాయంకాలం_"
"సరిగ్గా రెండోదల రోజులు __"
"ఏ పిక్చర్ కి?" నవ్వుతూ అడిగింది.
సుధాకర్ కి కాస్త సినిమాపిచ్చి ఎక్కువ. ఏ పిక్చర్ ఎన్ని సెంటర్స్ లో ఎన్ని రోజులు ఆడేది సిజతికి "రిపోర్టు" చేస్తుంటాడతను.
"ఏ సినిమాకీ కాదు__ మీరు వూరెళ్ళి రెండొందల రోజులు గడిచి పోయాయి __ మరచి పోయారా?"
"ఒహే!" నవ్వేసింది సుజాత.
మెల్లిగా మెట్లెక్కుతోంది సుధాకర్ అడుగున్నర దూరంలో ఒక మెట్టు కిందుగా వస్తోన్నాడు.
"బాగున్నారా?"
"చూస్తున్నారుగా! ఈ తెల్లబట్టలు మయలేదు. ఈ క్రాఫీంగ్ చెరగలేదు. వెయిట్ తగ్గలేదు. శుభ్రంగా వున్నాను__"
ఆ మాటలకి గలగలా నవ్వేసింది సుజాత "మీ రేంమారలేదు!" అంది.
"మారిపోయి వుంటారనుకున్నారా? ఊహూం మీలాగా నేనేం మారిపోలేదు__"
"నేనేం మారిపోయాను?" అతని కేసి గమత్ గా చూసింది.
అతనేం అనలేదు. ఇద్దరూ ఒకడుగు అటూ యిఇతుగా ఆఫీసులో అడుగు పెట్టారు. ఇంకా ఎవరూ సీట్లలోకి రాలేదు. మేనేజరు మహాశయుడు సరిగ్గా పదీపదికివస్తాడు. టైం యిప్పుడు యింకా పదికి పది తక్కువే!
'ఊరికేల్లగానే ఉత్తరం రాస్తానన్నారా ఊహూ ఉత్తరంలేదు. టెలిగ్రాంలేదు. పైగా మెడికల్ లీవుకి ఎప్లికేషన్ పెట్టావు. ఏమై౦దోనని హడలి చచ్చాను!"
సుధాకర్ మాటాడుతూ మాటాడుతూ ఎక్స్ ప్రెషన్ కి తగినట్లుగా కళ్ళు విశాలం చేస్తాడు. ఎవరికయినా ఆ కళ్ళల్లో అలాగే కట్టుకుని నిలిచిపోవాలనిపిస్తుంది.
ఆలోచనలకి కళ్ళెం వేసి "ఎందుకు!" అని అడిగింది.