"సారీ సుధాకర్!
"మరి అం అమ్మాయి __ అదే అం పాప __"
"సారీ అన్నానా! ఇంకేం అడుక్కు నేనే ఓ రోజున అంతా చెప్పేస్తాను" అంది.
ఆమె కంఠంలోదిగులు, భయం, ఆ రెంటికీ మించిన విసుగు .
"సారీం మళ్ళీ అడగను. చెప్పేదయితే నువ్వే చెబుటావు కదా!" నవ్వుతూ అన్నాడతను.
అతనలా అన్నా ఆ మగబుద్దిని గం,గమనించింది సుజాత. అయిన ఏమీ అనలేదు.
అంతలో బస్సు వచ్చింది.
"వేళ్ళేస్తాను సుధాకర్"!
"అరే ! అదేం మరో బస్సుకి వేళుదువుగానీలే __ వేడి వేడిగా కాఫీయో టీయో తీసుకుందువగానిరా _ ఓ టాబ్లెట్ అనాసిస్ వేసుకుంటే తలనొప్పిపోతుంది. ఆ టెన్షన్ తగ్గుతుంది"
"సారీ సుధా __ నేను అర్జంటుగా యింటికి వెళ్ళాలి" అని బస్సు ఎక్కేసింది.
అతను తెల్లబోయి నుంచున్నాడు.
"హాలో! ఏమిటి? రాణీగారు చెక్కశారు అప్పుడే __" సిగరెట కాలుస్తూ అడిగాడు నాగరాజు.
తలతిప్పి చూశాడు సుధాకర్,
నవ్వుకున్నాడు నాగరాజు.
అతనికి నాగారాజంటే గిట్టదు. అయినా సభ్యతకోసం పలుకరించాలి తప్పదు. అతను సుజాత గురించి అలా ఎద్దేవగా మాటాడటం యిష్టంలేదు అయినా ఏమనగలడు?
"తల నొప్పిగా వుందని యింటికి వెళ్ళిపోయారు" అన్నాడు క్లుప్తంగా.
పకపక నవ్వేడు నాగరాజు.
ఆ నవ్వు సుధాకర్ గుండెల్లో విషాన్ని చిలికింది.
"మీ రెంత అమాయకులండీ __ ఆడవాళ్ళే౦ చెప్పినా నమ్మేయ్యటమేనా? ప్చ్! ప్చ్! ఆవిడ అంతగా పరుగులు తీసింది పాపకోసమండీ బాబూ! ఆ అనుబంధం అలాంటిది.__"
"పాపా? పాపెవరు?" కనుబొమలు ముడి వేస్తూ అడిగాడు. మాటి మాటికీ వస్తోన్న ఆ పాప ప్రసక్తి ఏమో తెలుసుకోవాలనందతనికి సుజాత నడిగినా చెప్పలేదు. రెట్టించి అడగటానికి మాడేస్టిఅడ్డోచ్చింది. మరీ మరీ దట్టించి అడిగితే సుజాత ఎఫెండవుతుంది. అది తనకిష్టంలేదు. కష్టంకూడా అందుకే ఆమెని అడగలేదు.
"ఏమో! నాకూ సరిగ్గా తెలీదండీ! అంతా ఆ పాప ఆవిడ పాపే అంటున్నారు. నిజా నిజాలు మనకు తెలియవు కదా! ఆవిడ బేబీతోటి దిగింది. ఈ అరునేలలూ అందుకే సెలవు పట్టిందేమో మరి __ ఏం చెప్పగలంలెండి! రోజులు మంచివి కావు. నింపాదిగా అన్నాడు నాగరాజు ." అంటూ సుధాకర్ మూడ్స్ గమనించలేదు.
సుధాకర్ వెళ్ళుబిగుసుకున్నాయి. పళ్ళు కటకటా మన్నాయి. "ఇంత అభాండం వేస్తాడా రాస్కేల్ ?" అనుకున్నాడు అతని మాటలని లక్ష్యపెట్టదలచుకోలేదు . నాగరాజు సంస్కారం అంతే అనుకున్నాడు.
"అదిగో బస వచ్చేస్తోంది. వెళతాను!"
వెళ్ళి బస్సేక్కుతోన్న సుధాకర్ ని గమనిస్తోతనలో తనే నవ్వుకున్నాడు నాగరాజు. "పూర్ ఫెలో!" అనుకున్నాడు జాలిగా.
6
"అమ్మా! గడ్డ పెరుగుమావయ్యేచ్చాడు!"
నాగరాజుని చూడగానే కేకేసింది జానికమ్మగారి కూతురు సవిత. అతన్ని చూడగానే ఆ అమ్మాయికీ ఆవకాయా, గడ్డపెరుగు, చేరిన నెయ్యి గుర్తుకొస్తాయి. నవ్వు తన్నుకొస్తుంది.
"నోర్ముయ్ ! గడ్డ పెరుగురుచి నీకేం తెలుసు?" నవ్వుతూ అన్నాడు నాగరాజు.
"రావోయ్ బామ్మరదీ! రా! ఈ మధ్యయిటు రానే లేదే గడ్డపెరుగు మీద మనసుయిందా యివాళ? లేక ఆవకాయ కల్లో కొచ్చిందా?" రాఘవయ్యగారు నవ్వుతో వేళాకోళంగా అడిగారు ఆయనకి వయసొచ్చినా మనస్సుకి వయస్సురాలేదు. రాజుని చూస్తె బావా మరదుల హాస్యలన్నీ గుర్తుకొస్తాయి ఒక్కటొక్కటే__
"నువ్వు రారా రాజూ! వీళ్ళందరికీ నువ్వు అలుపైపోయావు ఏమండి! మీకూ మీ పిల్లలకీ అంత లోకువయ్యాడా వాడు?" కస్సుఅమంది జానికమ్మ.
ఆ మాటలకి నవ్వాడు నాగరాజు.
రాఘవయ్యగారూ నవ్వుతూనే వున్నారు.
అంతలో లోపల పడుకున్న మల్లెశావ్రి కెవ్వుమంది.
"ఎక్కడదీ సన్నాయి మేళం?" అడిగాడు రాజు.
"ఆ __ ఎవరో మన కౌంపౌండ్ లో వాళ్ళే అయ్యుంటారు మీ అక్కయ్య అలుసు చూసుకుని నెట్టికెక్కించారు. ఈవిడకి చిన్నపిల్లలంటే యింకా ప్రేమ పోలేదు" నవ్వుతూ అన్నారాయన.
"ఎవరక్కయ్యా!"
"ఒర్ నాగారాజూ __ ఎన్నాళ్ళయిందిరా యీ మధ్య నువ్విటు వచ్చి వేళ్ళీ ? సవితకి మీ ఆఫీసులో ఏదో సంబంధం వుందన్నావ్? ఆ కుర్రాడు బుద్ధిమంతుడన్నావ్ ? ఏడీ మాటాడిందెక్కడ? అతన్ని తీసుకోస్తానన్నావ్? అన్నీ మరచి పోయావ్?"
జానికమ్మగారు మాటలకి "పోమ్మా! నీ కెప్పుడూ నా పెళ్ళి దిగులే! నె నిప్పుడు పెళ్ళి చేసుకోరు నేను చదువుకుంటాను. బాగా చదువుకుని ఉద్యోగం చేస్తానంతే!" అని పరుగెత్తిపోయింది సవిత.
"నీకేం తెలుసుమ్మా నా బాధ? పదహారు పదిహేడు నిండీ నిండకమునుపే నీ పెళ్ళి చేసెయ్యాలి! అని తనలో అనుకుని "ఎరా పలకవేం?" అంది తమ్ముడితో __
"రేపు ఆదివారం పిలుచుకుని వస్తాలే__"
"అతనితో చెప్పావా?"
"ఇదిగో జానీ ఈ కాలపుపిల్లలు అలా చెబితేరారు. మనింటికి టీకి రాజూ ఇక్కడ పరిచయంచెయ్ అందర్నీ తర్వాత అతనితో విషయం కదిలించు ఆ అభిప్రాయం వుంటే మాట్లాడోచ్చు" అన్నారు రాఘవయ్యగారు.
"దట్స్ గుడ్ మంచి ఐడియా బావగారూ! ఎలాగైనా బ్రీటిషు కాలం నాటి బుర్ర__"
"ఏం ఎద్దేవా చేస్తావులేవోయ్ _-"
"అదికాదు బావగారూ__"