Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 8

    ఇద్దరూ ఓ మూల కూర్చున్నారు.
    తన టిఫిన్ ఉప్మా సగం ప్లేటుకి సర్దింది. సుధాకర్ వైపు జరిపింది. రెండు వడలు సర్దేడు సుధాకర్ .
    "ఇస్తే వాయినం పుచ్చుకుంట వాయినం బావుంది." నవ్వుతూ అంది సుజాత.
    "థాంక్యూ! వడలు బావున్నాయంటే మా అమ్మ మరీ సంతోషిస్తుంది. ఈ ఆరు నెలలూ ఒంటరిగా టిఫిన్ తినలేకపోయననుకోండి!" సుజాత ముఖంలోకి చూస్తూ నవ్వుతూ అన్నాడు సుధాకర్.
    "సుధా!" ప్రేమగా పలుకరించింది. "ఇక మాములుగా పిలుపు ఒకసారి అండీ అంటావు మరోసారి నువ్వు అంటావు అలవాటు తప్పిందా!" అంది నవ్వుతూనే.
    "సారీ!" అన్నాడు సుధాకర్.
    అంతలో అటుగా వచ్చాడు నాగరాజు.
    అతను జానికమ్మగారి తమ్ముడు. అవతలి సెక్షన్ లో సెక్షనాఫీసరు. వసపిట్ట. అతని అంతరాంతరాల్లో సుజాత కాపురం చేస్తోంది ఎలాగయినా ఆమెని పేళ్ళడాలనేది అతని ఆ కాంక్ష.
    "హల్లో! పలుకరిస్తూ దగ్గరిగా వచ్చాడు." సుజాత గారూ సమస్తే! ఎప్పుడోచ్చారు మీరు?
    "ఇద్దరి మాటాడుకుంటూ వుంటే మధ్యన వచ్చేవాడు మూర్ఖుడన్నారు. మనవాళ్ళు ఆఫ్ కోర్స్ __ నేను మూర్ఖశిఖామణిని కాను. అయినా ఈ రోజే మీరు ఆఫీసుకి వచ్చేరు గాబట్టి చూడగానే పలికరిస్తున్నాను. __"
    "థాంక్స్!" ముక్తసరిగా అంది . సుజాత తన ముందున్న టీ అతని వైపు జరిపింది. "కూర్చోండి. తీసుకొండి టీ" అంది.
    "నో థాంక్స్! నేను అన్నీ ముగించుకునే వచ్చాను__"
    సుజాత బలవతం చెయ్యలేదు
    "సుజాతగారూ! అ పాప ఎవరండీ?"
    ఉలికి పడ్డది సుజాత.
    అతనంత సూటిగా ప్రశ్నిస్తాని అనుకోలేదామే. అసలు విషయం అఫీసుదాకా వస్తుందని కూడా అనుకోలేదు.
    "అందుకే ఆ పాప ఆ పాప __ మాపాపే," అంది. చప్పున ఆమె గొంతులో కొద్దిగా అందోళన __ ముఖంలో ఏదో స్పష్టంగా చెప్పలేని జంకు కనిపించింది.
    "మీ పాపా?"  ఆశ్చర్యంగా అడిగాడు. మళ్ళీ.
    "అవును మా పాపే!" దృఢస్వరంతో అందామె.
    అతని ముఖంలో చిరుచేమటలు వేసవి మల్లెల పై నీరు చిలికినట్ట్లుగా కనిపిస్తున్నాయి.
    ఇద్దర్నీ గమనిస్తోన్న సుధాకర్ కి ఏమీ అర్ధంకాలేదు
    "ఎవరండీ ఆ ద్రురవంతుడు _? అదే పాపతండ్రి"
    సుజాత ముఖం ఎర్రబడింది.
    అతని ప్రశ్నలలో హేళనకి అసహ్యించుకుంది.
    "నాకూ తెలియదు!" అంటూ చప్పున లేచినుంచుంది. గబగబా ఆఫీసు వైపు నడించింది.
    బొత్తిగా అర్ధంకాని సుధాకర్ తనూ ఆఫీసు వైపు నడిచాడు.
    సుజాత వాడి వాడిగా తన సీటుకి వెళ్ళిపోయింది.
    తలబద్దలవుతోన్నట్లుగా వుంది. ఆమెకి కళ్ళు మూసుకుని కణతలు నొక్కుతుంది. అంతలో ఎటిండర్ శాస్రీ వచహాడు "ఆఫీసరుగారుపిలిస్తున్నారు. అమ్మాయిగారూ!" అనిచెప్పాడు. 
    చప్పున లేచి నంచు౦ది సుజాత.
    టాయ్ లేట్ రూములోకి వెళ్ళిముఖాన చారెడు నీళ్ళు కుమ్మరించుకుని తల విడుల్చుకుంది. టర్కిస్ టవల్ తో ముఖం తుడుచుకుని, పౌడరద్దుకుని, పెట్టకుని తల పైపైన దువ్వుకుంది.
    నెమ్మదిగా ఆఫీసరు గదిలో అడుగు పెట్టింది.
    ఆ సమయంలో అతనక్కడే వున్నాడు.
    అతన్ని చూసీ చూడనట్టుగా ఆఫీసరుగారికి  మాత్రమే నమస్కరించింది.
    "బావున్నావా సుజాతా?"
    తలూపింది నెమ్మదిగా .
    ఎందుకో మనస్సు చికాగ్గా వుంది. ముళ్ళమీద నంచునట్లుగా యిబ్బందికరంగా వుంది.
    "ఏవమ్మా అలా సెలవు పెట్టవు?"
    మృదువుగా నవ్వింది సుజాత. కొన్ని ప్రశ్నలంకంతే! నిర్దుష్టమైన జవాబులుండవు.
    "ఇక ముందు అర్ధంతరంగా సెలవు పెట్టదు. పని పెడింగ్ లో పడిపోతుంది మనదేం ప్రయివేట్ ఫర్మా! ఎలాగో అలాగా లాక్కెళ్ళటానికి. అక్కడికీ సుధాకర్, రామ లింగయ్యగారు నీ సీటు వర్కంతా చూశారు.!"
    చప్పున సుధాకర్ వైపు చూసింది. అతని ముఖంలో ఎ భవమీపలకటంలేదు. ఏదో ముభావం .
    "రామలింగయ్య గారు మాట కారుకు మనిషి. మనస్సు మాత్రం వెన్నపూసే! మేనేజరుగా ఆయనలా మాటాడక తప్పదు కదా!"
    తల ఆడించిందామె.
    "వెళ్ళిరా!" ఏదయినా పెండింగ్ వుంటే చూసుకో అన్నట్టు నీ లీవ్ శాలరీ బిల్ తయారు చేయమన్నాను. ఎలా గడిచిందో ఏమో__"
    "ఏం ఫర్వాలేడండీ!" అంది నెమ్మదిగా.
    అతనింకేం అనలేదు.
    చౌదరిగారికి యాభయ్ దగ్గరదగ్గరగా  వస్తున్నాయ్ ఆయనకి కావలసింది వర్క్ అండ్ డిసిప్లెన్ . ఆయనకి లంచాలు అవీ బొత్తిగా గిట్టవు. అది కొందరికి గిట్టకపోయినా, కొందరికి గిట్టుబాటు. కాకపోయినా, చాలా మందికి నచ్చుతుంది.
    తగ్గుతోన్న తలనొప్పి పెరుగుతోన్నాట్టుగా వుంది సుజాతికి
    చేసేదేమీ లేదు.
    అవారం వీక్లీ తిరగేస్తూ కంచుంది.
    నిజానికి ఏదో అర్జంటు పేపర్ కి సమాధానం రాయలికానీ రాయబోయే అక్షరం కూడా సాగలేదు. దాంతో పైలు మూలాన వేసి వూరకే గడిపెసింది.
    సరిగ్గా అయిదింటికే బయటపడింది.
    "వెళుతున్నావామ్మా? అడిగారు రామలింగయ్య
    అవునండి! తలనొప్పిగా వుంది" అంది.
    "ప్రయాణం బడలికేమో!"
    ఇంకేమీ అనలేదామే.
    గేటుదాటుతూ వుండగానే "సుజాత! ఎందుకలా ఆఫ్ సెట్ అయ్యావు?" అని అడిగాడు సుధాకర్, అతనూ ఆమెతోపాటే బయటకి వచ్చాడు.

 Previous Page Next Page