"ఏదీకాదు __ పద భోంచేద్దాం! గడ్డపెరుగు. ఆవకాయ, పప్పుపులుసు, అప్పళాలు __"
"నోరూరించేస్తున్నారు బావగారు__"
"మాటలతో కడుపు నిమ్పెస్తార్రా" అంది జానికమ్మ
"పిన్నీ!" అంటూ సరిగ్గా ఆ సమయంలో వచ్చింది. సుజాత ఆమె రాగానే ఏమ్మాటాడకుంట చేతి కందించింది పాపని. జానికమ్మ గారితో "వస్తా పిన్నీ!" అని చెప్పి వెళ్ళి పోయింది సుజాత నాగరాజు వైపైనా చూళ్ళేదు.
రాజు అలా? చూస్తూ వుండిపోయాడు.
అతని మనస్సులో ఏదో భావం కదిలింది. షో స్పీడ్ పెరగాలని పించింది.
భోజనాల వేళలో అకస్మాత్తుగా "అయితే ఆ పాపా సుజాతగారి పాపా?" అని అడిగాడు రాజు.
జానికమ్మగారు సమాధానం యివ్వలేదు. "ఇంకాస్త పులుసు వడ్డించనా" అంది.
"అడిగి వడ్డీస్తారంటే __ వేయ్" అన్నాడు రాఘవయ్యగారు
"చాలు చాలు?" కడుపు నిండిపోయింది.
అప్పుడేనా మావయ్యా ఇంకా గడ్డపెరుగుపోసుకొనే లేదు ఆ అ ఖాళీగా లేదా?" నవ్వుతో అంది సవిత
"సవితా! గడ్డపెరుగు రుచి నీకేం తెలుసు! కాటకం ప్రాతం నుంచి వచ్చిన మనషిపొంగుతూ పొరలె తుంగభద్ర చూస్తె ఎలా వుంటుంది. తెలుగులో నాచుకపోయిన పొలం వాడికి నిండుగా వెన్నులతో గాలికి తలలూపే పొలాన్ని చూస్తె ఎలావుంటుంది? తెలుసా__"
"మజ్జిగ నీళ్ళు పోసుకునే వారికి చాకుతో తెగనరకాల అన్నట్టుండే మీగడతోటి గడ్డపెరుగుని చూస్తె అలా వుంటుందా మావయ్య __ చిలిపిగా ప్రశ్నించింది. సవిత
నాగరాజు నిశితంగా చూశాడు.
అమ్మా! మావయ్యకి ఓ బర్రేని తొలివ్వరాదూ __ లేదా రోజూ పాలు పంపరాదు?"
"సవితా!
తల్లి గద్దింపుక "నోర్మూసుక తింటాలేమ్మా!" అంది సవిత, జనికమ్మతో సహా ఆ మాటలకి ఫక్కుననవ్వేరందరూ
భోజనాలయ్యాయి.
రాఘవయ్యగారు జానికమ్మగారిచ్చే "చిలకలు" వేసుకుంటున్నారు.
రాజు వక్కనములుతున్నాడు.
"సుజాత గారిక్కడే వుంటున్నారా అక్కయ్యా! అని తనకేమీ తెలియనట్లుగా అడిగాడు. తామిద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తున్నట్లుగా అతనింత వరకూ మాట వరసకి కూడా చెప్పలేదు.
"అం"
"ఆ పాపా ఆవిడ పాపేనా? చాలా బావుంది బొద్దుగా తెల్లగా పెద్ద పెద్ద కళ్ళతో __"
రాఘవయ్యగారు కుతహలమగా చూశారు.
"అం" అంది జానికమ్మగారు మళ్ళీ.
"అం" ఆశ్చర్యపోయారు రాఘవయ్యగారు "సుజాత?" పెళ్ళి కాలేదని చెప్పినట్లు గుర్తుకదే__"
"అం అయిందట __ పెళ్ళి __"
"ఎప్పుడు ?"
"ఎప్పుడో ఒకప్పుడు __ ఆ ఆరాలు మీకెందుకు బాబూ" చిరాగ్గా వెళ్ళిపోయింది జానికమ్మగారు ఆవిడకి యిలా "పత్తేదారు ప్రశ్నలే వేసే వారంటే చిరాకు.
నింపాదిగా నవ్వుకున్నాడు నాగరాజు.
రాఘవయ్యగారేం మాట్లాళ్ళేదు. ఏదో అలోచిస్తోవుండిపోయారు.
"వస్తాను బావగారూ!
"ఊం"
"వస్తానకయ్య! కేకేశాడు.
లోపలనుంచే "అలాగే" అంటూ జవబుచ్చింది జానికమ్మగారు.
అక్కడినుంచి కదిలాడు నాగరాజు.
సిగరెట్ కాల్చుకుంటూ మెల్లిగా సుజాత గదిముందు నిలుచున్నాడు. పున్నమి వెన్నెల చెట్లకొమ్మల చాటునుంచి మసక మసగ్గా పడుతోంది. ఓంకా ఎవరూ బయల్లోమంచాలు వేసుకోలేదు. వెన్నెల పరుచుకుంటోంది. తిళ్ళతో, కబుర్లతో గడిచి పోతోంది కాలం.
"సుజాతా!"
ఆ పిలుపుకి ఉలికిపడింది. సుజాత. అది నాగుబాముతోబుసకొట్టినట్టుగా వినిపించిందామెకి.
తలుపుతోసుకుని లోపలి వచ్చాడతను.
ఆ సమయానికి ఆమె మల్లేశ్వరీ పక్కలో పడుకోబెట్టి కూర్చునుంది, ఏదో అలోచిస్తున్నట్ట్లుగా పరధ్యానంగా వుంది.
"గుడ్! పక్కా పిల్లతల్లిలా వున్నారు,"
ఆమె పెదాలు కపిమ్చాయి. ఏదో చెప్పాబోయింది.
"నేను దుర్మార్గుడినికాను. ఏదో చెప్పబోయింది.
"నేను దుర్మార్గుడినికాను. మంచివాడిని. చాలా మంచివాడిని. నా మంచినేను చెప్పుకోకూడదు నిజానికి మీరు నా కయినా నిజం చెప్పండి. ఈ బిడ్డకి తండ్రెవరో చెప్పండి ఈ బిడ్డకి తండ్రెవరో చెప్పండి. వాడిని నిలదీసి లకోస్తాను. ఈ బిడ్డని తండ్రిలేనిబిడ్డగా కాకా ఓ తండ్రిపోషణలో పెరిగేలా చూస్తాను__"
"నాకు తెలియదు__"
నవ్వేడు నాగరాజు, పాక పాక నవ్వేడు.
"నేను నిజమే చెప్పాను నాగరాజుగారూ! మీరే నవ్వనక్కర్లేదు" అంది కోపంగా. ఆమెకి అతను రావటమే గిట్టలేదు.
మళ్ళీ నవ్వేడు నాగరాజు.
"అం చూడండి! మరీ అంత అమాయకత్వం మీఫేస్ లో పలకదు. నేను అనుకోవటం ఆ పాప మీ పాపకాదు. ఎవరి పాపమో మీ రెందుకు భరించాలి. సుజాతగారు కళంకం ఒకసారి వస్తే అంత సులభంగా వుంటుంది. చెప్పండి. మీరు అది పాపభారాన్ని మోయగలరా?"
ఒక్కక్షణం ఆమె కళ్ళు మిలమిల మెరిశాయి.
మళ్ళీ మామూలుగా అయిపోయింది అంతలో.
తనని తాను సంబాళించుకుని"మీరు వెళ్ళిపొంది అంది మృదువుగా.
"మీ పట్టుదల మిమ్మల్ని నాశనం చేస్తుంది"
"నేనంత సులువుగా నాశనం కానులెండి" ఫేలవంగా నవ్వుతో అంది. ఆమె అంతరాంతరాల్లో ఎక్కడో యితనోక్కడే నా స్థితి గ్రహించగలిగాడనే సంతోషం కదలాడుతోంది.