కళ్ళు మూసుకుని కుర్చీలో జాతగలబడి కాళ్ళను ఊపుటూ "అదేసరే ... ఆ తరువాత ఏమవుతుంది....? అసహమ్నంగా తన ప్రశ్నను తిరిగి వేశాడు. మైఖల్ రాజు .
""ఏమవుతుంది ....? మనవాడు రాజేనామా చేస్తాడు."
"ఆ తరువాత..."
"మంత్రివర్గం రద్దవుతుంది."
"తరువాత?"
"కొత్త శాసనసభ నాయుకుడ్ని ఎన్నుకుంటారు."
"ఎవర్ని?"
వారిద్దరి జరిగే సంబాషణని శ్రద్దగా వింటున్నాడు నందకిషోర్ . గది బయట రెడ్ లైట్ వెలుగుతుండటంతో కాన్ఫిడేన్శియల్ డిస్కషన్స్ అని సీనియర్ ఐ.ఏ.ఎస్. ఆఫీసర్స్ లోపలి రాకుండా బయటే ఆగిపోయారు.
"అధిష్టానవర్గం లోత్తుని"
"ఇంకా __?"
"అధిష్టాదవర్గం దూతల చెంచాలి"
"ఇంకా?"
"ర్స్ష్ట్రాన్ని లంచాల మాయం చేసి తనకు కొద్దిగా మిగుల్చుకుని ఎక్కువ అధిష్టావర్గానికి పంపే ఒకింత నిస్వార్ధపరుడైన లంచగొండిని .
కొద్ది క్షణాలు తిరిగి గదిలో నిశ్శబ్దం అలుముకుంది.
మైఖల్ రాజు ఆడమ్ స్మీత్ కి మనవడులాంటివాడు. ఆర్ధిక శాస్రాన్ని పసన పట్టిన జల్సాపురుషుడు. కౌటిల్యుడు అర్దస్త్రాసపు అంచుల్లో ఊపిరి పోసుకున్నవాడు.
రాజకీయాల్లోనైనా, వ్యాపారంలోనైనా, చివరకు మందు, మగువ విషయంలో కూడా రైట్ టైమ్ లో టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ డెసిషన్ తీసుకోవాలని భావించే కాలిక్యూలర్ డజిలింగ్ పర్సనాలటీ "
"చెంచా ఎవరు?" అ గదిలో పేరుకున్న నిశ్శబ్దాన్ని చేధిస్తూ అడిగాడు మైఖల్ రాజు.
"తిరుపతిరెడ్డి"
"లోత్తు ఎవరు __?
"కోదండ రామయ్య"
"నిస్వార్డపరుడైన లంచగొండి?"
"సర్వారాయుడు"
తడుముకోకుండా వెంట వెంటనే సమాదానాలిచ్చాడు. గోపీనాథ్ ల.
"సో...... రామదాసు అసలు కధనాయుకుడు కాదు ."
మైఖల్ రాజు ఊహకి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.
నూటికి తొంభైతొమ్మిది మంది సమస్యకి సూటిగా వుందే పరుష్కారాన్ని వెదికే ప్రయత్నం చేస్తే, మైఖల్ రాజు మాత్రం ఆ సమస్యకు రూట్ ఎక్కడుందనే చోట తన ఆలోచనలకు శ్రీకారం చుడతారు. అందుకే నందకిషోర్ మైఖల్ రాజు మీద అంత గురి.
"నువ్వు ఏ వేపు నుంచి వస్తున్నావు ?" ముఖ్యమంత్రి సాలోచనగా అడిగాడు.
"మీ వేపు నుంచి కాదు __ వేరు దగ్గరనుంచి రామదాసు దగ్గర్నుంచి కాదు __ రామదాసుని పూరికొల్పిన దేవరనే చోటనుంచి."
నందకిషోర్, గోపీనాథన్ ఒకరివేపు ఒకరు ఆశ్చర్యపోయి చూసుకున్నారు.
"రామదాసు ఈర్ష్యాపరుడు కాదు. శాడిస్టు అంతకంటే కాదు. కానుక మీరు పదవిలోంచి దిగాలనెంత స్థాయికి వెళ్ళడు. ఏదో సంవత్సరానికి నాలుగు కుంభకోణాల్ని వెతికి పట్టుకుని అటు శాసనసభలో, ఇటు వేవర్స్ లో ఆవేశపడతాడు. ప్రజల్లో తన పేరు నానుతూ వుండటానికి ఆ మాత్రం చాలనుకునే అల్పసంతోషి గ్రాముల మాంసం ముక్క విసిరితే తోకాడించే గ్రామసింహం లాంటివాడు.
నా ఊహా ప్రకారం ఇప్పుడు మీ మీద లేచే దూమారానికి కారణం మీరు కైవశం చేసుకున్న అతి ఖరీదైన స్థలాలే అయుండవచ్చు. ఆ దుమారమే లేస్తే పదవికే ఎవరు వస్తుంది ఆ స్థాయి కుంభకోణాన్ని వెతికి పట్టుకునే తెలివితేటలు, సమర్యం రామదాసుకి లేవు. అయినా ఆ స్థాయి కుంభకోణమే బయటపడబోతొందంటూ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అరచిగోల చేయబోయేది రామదాసు అయుండకపోవచ్చు. ఒకవేళ రామదాసు అయితే, అది రామదాసు తెలివి తేటలు మాత్రం కాదు " ఎంతో సూక్ష్మంగా తన విశ్లేషణని ముందుంచాడు మైఖల్ రాజు.
దాని కంత లింక్ ఉంటుందని __ అంత లోతుగా అలోచించవచ్చుని గోపినాథం భావిస్తూ దిగ్ర్భాంతికి లోనయ్యాడు.
"అలా అయితే తిరుపతిరెడ్డి అయుంటాడు." అన్నాడు అనుమానంగా నందకిషోర్ .
"అయుండకపోవచ్చు" తాఫీగా అన్నాడు మైఖల్ రాజు.
"అయితే కోదండరామయ్యే"
"అయన కాకపోవచ్చు."
"ఫైనల్ గా సర్వరాయుడే" కన్ ఫర్మ్ చేస్తూ అన్నాడు నందకిషోర్
"అతనూ కాకపోవచ్చు " మైఖల్ రాజు బేస్ వాయిస్ లో నెమ్మదిగా అన్నాడు.
ఇద్దరూ అర్ధంకానట్లు చూసారు.
"మరెవరూ?" పిచ్చెక్కిపోతూ అన్నాడు గోపెనాథం.
"కొద్దిసేపు ఆలోచించి చెబుతాను. బైదిబై రాగలతా బిజ్ లానీని చూశారా మీరు?" సడన్ గా టాపిక్ మారుస్తూ అన్నాడు మైఖల్ రాజు.
కొంపకి నిప్పంటింకోబోతుందనే ఆఖరి క్షణంలో సయితం మైఖల్ రాజుకి అందమైన అమ్మాయిల గురించి ఆలోచించటం వెన్నతో పెట్టిన వ్యసనం. అది ఆ ఇద్దరికీ తెలుసు. అందుకే అంతగా ఆశ్చర్యపోలేదు.
"ఎవరమ్మాయి?" నందకిషోర్ తెలీక అడిగాడు.
"అదే నాకూ తెలీలేదు. కానీ తెలుసుకు తీరాలి."
"ఏమిటి విశేషం?" నందకిషోర్ కంఠంలో మార్పు వచ్చింది.
"అందానికే ఆ అమ్మాయి ఒక విశేషం __ అర్ధంకాలేదా?"
"ఇంకా అర్ధం కాకపోవటానికేముంది __ శేషం లేకుండా ఆ విశేషం మే సొంతం కావాలి. మానసికంగానె కాదు. శారీరకంగా సేదతీరితేనే మంచి ఆలోచనలు పుట్టుకొస్తాయి. బ్రెయిన్ పుల్ కెపాసిటితో పనిచేస్తుంది. ఇలాంటి పనుల్ని క్షణాల్లో చేయగల లాల్ ని పిలిపించి పని పురమాయిస్తే అన్ని పనులు సవ్యంగా జరిగిపోతాయని మైఖల్ రాజుగారి అభిప్రాయామని నా అభిప్రాయం, పిలిపించమంటారా ?" గోపీనాతం వేదాంత ధోరణిలో అన్నాడు.
"ఆ లాల్ గట్టివాడేనా ?" మైఖల్ రాజు మదన తాపంతో అడిగాడు.
"అబ్బో చాలా ...... వాడికి రెండే తెలుసు.... ప్రాణ స్నేహితుల మధ్య పచ్చగడ్డి వేసి భగ్గుమనిపించడం __ అందమైన అమ్మాయి ఆరు ఆమడల అవతల్ వున్నా అర్జంట్ గా రప్పించడం అందుకేగా పాస్ పోర్ట్ ఫోటోలు కూడా తీయటం రాని ఆ అర్చకుడ్ని, అభినవ శకున్ని ఇన్ ఫర్మేషన్ డిపార్ట్ మెంట్ లో పోటోగ్రాఫర్ గా అపాయింట్ చేయించటం...... మీరేం మీ అభినవ మిట్టర్ బేడి శక్తి సామర్ధ్యాల గురించి అనుమాన పడకండి " సర్ కాస్టిగ్గా అన్నాడు గోపీనాథం.
"వీలుపడుతుందా?" మైఖల్ రాజు ప్రశ్న వేశాడు.
"ఆ అమ్మాయి ఈ నగరంలో బ్రతుకుతోంది కదా! ఇంకా బ్రతాలనుకుంటుంది. కదా? ఆ అమ్మాయికి అమ్మా, నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వుంటారు గదా....? వారిలో ఎవరికయినా సొంత ఇల్లుంటాయి గదా..... వ్యాపారాలో, ఉద్యోగాలలో ఉంటాయిగదా...... మన చేతుల్లో వున్న చట్టం ప్రక్కనే జీవనం సాగిస్తుంటారు గదా...... మున్సిపల్ పరిధిలు ..... ఫేల్స్ టాక్స్ , ఎలక్ట్రసిటీ , వాటర్, డ్రైనేజ్, గ్యాస్, లైసెన్స్ లు, రోడ్స్, టాక్స్ లు , ఆపైన పోలీస్ డిపార్ట్ మెంట్ ... ఒకటా రెండా? ఎన్ని మన చేతుల్లో వుండేలా చేశారు మనకు ముందు రాష్ట్రాల్ని , దేశాన్ని ఏలిన మన పెద్దలు.... వారికీ ఎంత ముందుచూపు లేకపోతె ఇన్ని డిపార్ట్ మెంట్స్ ని ప్రభుత్వం వుంచుతారు... నీటి ద్వారా మన శత్రువుల్ని మనకిష్టం లేనివార్ని, మనమంటే ఇష్టపడని వార్ని ఎంత తేలిగ్గా లొంగదీసుకోవచ్చేమో గాని __ నాయకుల ఇష్టాలు ఈడేరిపోవడం ఖాయం. మీరేం వర్రీ అవకండి. ఎక్కడో ఒకచోట ఏదో ఒక విధంగా నొక్కేసి , అధికారంతో రక్కేసి ఆ అమ్మాయే వచ్చేలా చేస్తాడు మన దేశ పోటోగ్రాఫర్ ..... కానుక అదికవదిలేసి అసలు విషయం మీద మనస్సు పెట్టండి " అన్నాడు గోపీనాధం తనలో రేగుతున్న అసహనాన్ని కప్పిపుచ్చుకుంటూ.
ముఖ్యమంత్రి కార్యలయం లోపల పరిస్థితి ఇలా వుంటే, బయట రాష్ట్రా ప్రజల సంక్షేమ కార్యక్రమాల్ని అమలుపరచటం కోసం ముఖ్యమంత్రి నందకిషోర్ గారు తెగ వర్రీ అవుతూ ఆలోచిస్తున్నారు. శ్రమిస్తున్నారు.... ఆ సందర్భంలో తన అరోగ్యాన్ని సయితం లెక్ఖ చేయటం లేదని బకాలు యధావిధిగానే వూదుతున్నాయి.
"అధికారం చేతిలో వుంటే అందలం ఎక్కటం, అందాల్ని చేజిక్కించుకోవటం ఎంత సులభం... " తనలోనే అనుకున్నంట్లుగా పైకే అనేసాడు గోపీనాథం . "అందుకే గదరా.... ఇంత టెన్షన్ ...." అప్పుడే ప్రిజ్ లోంచి తీసిన ఏపిల్ పండ్లల్లా వున్న బుగ్గల్ని నిమురుకుంటూ అన్నాడు నందకిషోర్.
* * * *
మధ్యాహాన్నం రెండున్నర గంటల సమయం.....
మద్రాసు నుంగంబాకంలో ఉన్న పెద్ద ప్రయివేట్ హాస్పిటల్ ఆవరణములో వున్న కేంటీన్ .... క్రిటికల్ ఆపరేషన్ ఒకటి చేయటానికి ఉదయం పదిగంటలకు ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళిన అవంతి రెండున్నరకు బయటకు వచ్చి కేంటిన్ కి వచ్చి అలసటగా ఒక టేబుల్ ముందు కూర్చుండిపోయింది. అవంతి తల్లిదండ్రులెవరో, ఆ హాస్పిటల్ లో ఎవరికీ తెలీదు. ఎనిమిది నెలల క్రితం బొంబాయి నుంచి ఉద్యోగం నిమిత్తం ఒంటరిగా మద్రాసు వచ్చి ఒక స్నేహితురాలి సహకారంతో ఉద్యోగ ప్రయత్నాలు నుంగంబాకంలోని మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అసిస్టెంట్ సర్జెన్ గా జయినాయింది. అప్పట్లోజీతంకేవలం పదిహేను వందలు.