Previous Page Next Page 
మయసభ పేజి 9

   
    భారతదేశ స్థాయి వైద్యస్థాయి పరిజ్ఞానానికి సవాల్ గా బయట పడేయటంతో, ఆ రోగుల్ని ఆరోగ్యవంతుల్ని చేయటంతో, హఠాత్తుగా ఆమెకి ఆ హాస్పిటల్ లో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.

    జీతం పెరిగింది.....

    హొదా కూడా పెరిగింది

    ఇప్పుడామె జీతం మూడువేలు.

    డిప్యూటీ చీఫ్ సర్జెన్ గా ప్రమోట్ అయింది. హాస్పిటల్ లోని స్టాఫ్ అంతా  ఆమెని అభిమానిస్తారు. ఆమెలో అంత సహనం, మంచితనం ఉన్నాయి.

    సీనియర్ డాక్టర్స్ , మేనేజ్ మెంట్ సభ్యులు ఆమెని గౌరవిస్తారు. వృత్తిపట్ల  ఆమెకంత గౌరవం, ఆరాధనా వున్నాయి. మరెంతో నేర్పు  _ సమయస్పూర్తి  _ అవగాహనా  వున్నాయి.

    "డాక్టర్  __ ఏమైనా తీసుకుంటారా!" తనతోపాటు పనిచేసే డాక్టర్  ప్రశ్నించటంతో ఉలికిపాటుగా ఆలోచనల్నించి తేరుకుంది అవంతి.

    "ఏసేస్ __ సమ్ థింగ్ " అంటూ అతన్ని స్నేహపూర్వకంగా విష్ చేసి సెల్ఫ్ సర్వీసు కౌంటర్ దగ్గరకు వెళ్ళింది. కంటి వెనుక భాగంలో వచ్చిన ప్రమాదకరమైన బ్రెయిన్ ట్యూమర్ ని ఆపరేట్ చేసి, సక్సెస్ పుల్ గా తొలగించిన వృత్తిపరమైన తృప్తిని ఆమె ఇప్పుడు అనుభవంలోకి తెచ్చుకోలేకపోతోంది.

    ఆమెకి ఓ ప్రక్క తనతల్లి.....

    మరోప్రక్క తండ్రి .....

    ఇంకోప్రక్క అన్నయ్య......

    వీటన్నిటికి దూరంగా రిషి.....

    ఆపైన తన వృత్తి .......

    తనని తీవ్రంగా ప్రభావితం చేసే వ్యక్తులు __ శక్తులు వీళ్ళు___ మనస్సుని అవిశ్రామ్తికి గురిచేస్తున్నా నుంచి, అలోచనలనుంచి ఆమె డిటాచ్ కాలేకపోతోంది. టోస్టేడ్, బట్టర్ తీసుకుని తిరిగి వెనక్కీ వచ్చి తన సీట్లోకూర్చుంది.

    "సన్నగా, తెల్లగా, మెరుపుతీగలా కనిపించే ఆమె ఒత్తయిన కురులు ఆ క్యాంటిన్ హల్లో మూలగా  వున్న పేడేస్టేల్ ప్యాన్ గాలికి అలల్లా కడలిపోతున్నాయి.

    ఆమె బ్రెడ్ కి వెన్న రాసుకుని పరధ్యానంగా కొద్ది కొద్దిగా కొరుకుతోంది.

    అదే హల్లో అక్కడక్కడా కూర్చున్న డాక్టర్స్ పేషెంట్స్ ని పరామర్శించటానికొచ్చిన బంధువులు ఆమె అందాన్ని, గ్రేస్ ని , ఆమె కళ్ళలో తొంగిచూసే మేధాసంపత్తిని, పరిపూర్ణతని, ఆమె రంగుని. చార్మింగ్ ని, సేక్స్స్ఫిగర్ ని, స్మార్ట్ డ్రెస్ సెన్స్ ని చూసి తన్మయంగా ఫీలవుతున్నారు.

    కనామేమీ ఆమె దృష్టిలోకి రావటం లేదు. వారెవరూ ఆమె ఆలోచనల్ని  చెదరగొట్టలేక పోతున్నారు.

    బొంబాయిలోని బిగ్ బిజినెస్ మెన్ __ ప్రముఖ రాజకీయ నాయకులు __ ఫిలంస్టార్స్ ..... మ్యూజీషయన్ __ స్టార్ హొటల్ అధినేతలు __ జర్నలిస్టులు , ప్రెస్ బెరన్స్ , పెయింటర్స్, బ్యూరోక్రాట్స్ , రాయబారులు , ఫిల్మ్ మేకర్స్ లాయర్స్ , జడ్జిస్, ఎందరో _ ఎందరి మధ్య తను తిరిగింది __? ఎన్ని అనుభావాల్ని మిగుల్చుకో గలిగింది? అందం, ఐశ్వర్యం ఆస్థులు , అంతస్థులు, ఆత్మవంచనలు, తాపత్రయాలు __ తాగిన మైకం .... తిరిగే సౌఖ్యాలమధ్య తన తండ్రితో తిరిగింది __ చూసింది __ బాధపడింది __ ఏవగించుకుంది __ బంగారపు ఎడార్లుల్లో తిరిగే బాటసారుల జీవితాల్ని చూసింది. ఆ చివర వాళ్ళేం ఆశిస్తున్నారో అర్ధంకాక అందోళన చెందింది.

    లేని నవ్వును , ప్రేమాభిమానాల్ని, గౌరవాన్ని, భయాన్ని, ఆప్యాయతని, తన తండ్రి దగ్గర, ప్రదర్శించి మెప్పుపొందాలని తాపత్రయపడేవారు.

    అందమైన అభినయంతో , అబద్దాలతో అందలం ఎక్కాలనే వార్ని చూసి అసహనానికి గురయింది.

    జీవితానికి, నిజాలకి, నిత్య సత్యాలకి, నిజమైన విలువలను దగ్గరగా వెళ్ళి బ్రతకాలనుకునే వార్ని ఎప్పుడో గాని చూడలేకపోతున్నందుకు __ ఆశల పరిదుల్లో ఆశయాల్ని, విలువల్ని సమాధి చేసుకుని అదే అందమైన జీవితమనుకొని బ్రతికే శవాల మధ్య పంచరంగుల  జీవితాన్ని అనుభవిస్తున్నామని భ్రమించే వార్నే ఎక్కువగా చూసి మూగగా ఏడ్చింది.                        
    "స్క్రీన్ థిక్ గా బ్రతకాలని కర్డిజాలిజిస్ట్ గుండెపోటు పేషెంట్స్ కి సలహా ఇవ్వటం తెలసి కూడా తను అలాగే సెన్సిటివ్ గా ఉండేది.

    ఏ మనిషికైనా నిజంగా జీవించటానికి తీయని జ్ఞాపకాలు కావాలి. కనమేమి లేని ప్రపంచంలో తను ఇన్నాళ్ళు గడిపింది.

    తను ఆరాధించే వ్యక్తి మధ్య తృప్తిగా ఉండగలుగుతోంది __ కాని తన మనస్తత్వాన్నే తన కూతురికి వారసత్వంగా , బహుమతిగా ఇచ్చిన తన తల్లి గ్రీన్ ఫేల్డ్స్ పంజరంలోనే ఇరుక్కుపోయి ఉందే?

    వాటీజ్ ది డేస్టినీ?

    వేరీజ్ ది డెస్టినీ?

    హు నోస్ దట్?

    వద్దనుకుంటున్నా వదిలి పెట్టని ఆలోచలనుంచి రిషి పిలుపుతో తేరుకుంది .

                                                                     *    *    *    *   

    రాష్ట్రా రాజకీయాల్ని , రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, మంచి చెడుల్ని, జీవన ప్రమాణాల్ని ప్రభావితం చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి ఛాంబర్ వేడిగా వుంది.

    "ఆ ముగ్గురూ కాదూ __ చాపకింద నీరులాంటి మాణిక్యం దీనికి హేతువు కావోచ్చేమో?" మైఖల్ రాజు షాక్ తిన్నారు నందకిషోర్ , గోపీనాథ్.

       
    ఏ దాతవు ఏ దాతవుతో సంయోగం చెందితే ఏ కొత్త పదార్దం. తయారవుతోందనే విషయాన్ని ఒక శాస్రజ్ఞడు చెప్పినంత దీమగా, నోలబద్దతో చెబుతాడు మైఖల్ రాజు. రాజకీయాలు __ వ్యాపారం స్త్రీ జాతికి చెందినవే, స్త్రీ మంచితనం , ఔన్నత్వం పై రెంటికి లేకపోయినా . లక్షణాలు ఒకటే. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతయో చెప్పటం చాలా కష్టం. అయినా సరే సరీగ్గా అంచనా వేసే రాజు _ ఎప్పుడూ తన ఆలోచనలు సరైన దారిలోనే ప్రయాణించేలా చూసుకునే మైఖల్ రాజు తమ పార్టీ రాష్ట్రాశాఖ ప్రెసిడెంట్ మాణిక్యం పేరు చెప్పాడంటే ఎంతో ర్రేజనిమ్గ్ . బేస్ లేందేచెప్పేడు.....!
                                 
    "అసలా వేపే నేను ఆలోచించలేదు సుమా __ మాణిక్యం ఈసామెత్తుగా కూడా నా దృష్టిలో ఇప్పటివరకు లేడు. కాని నువ్వా పేరు చెప్పాట " తో ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి" అన్నాడు నందకిషోర్ అనుమానంగా.

    మైఖేల్ రాజు నవ్వాడు.

    "గొయ్యి తీయలనుకోనేవాడు నమ్మక ద్రోహినేరస్థుడు ప్రత్యర్ధుల తనమీదే ముందుగా పదాలనుకోడు. గోతులు తీసే వ్యక్తి బేసిక్ ప్రిన్స్ ఫల్ అది ముందుగా మీ ఆలోచనలు ఎవరిమీదకు మరలాయి? అదికార పక్షంలో ఉంటూ కూడా ప్రతిపక్ష అభ్యర్దినలా శాసనసభలో అరిచి, అవేశపడే తిరుపతి రెడ్డి, కోదండరామయ్య, సర్వారాయుడి మీదకేగా? అక్కడే మాణిక్యం విజయం సాధించాడు. నేనేతన్ని ప్రస్తావించకపోకపొతే అనవసరంగా ఈ ముగ్గురి మీద మీ దృష్టిని కేంద్రీకరించేవారు. అవునా __ ? తను మీ దృష్టిలోకి రాకుండా తన పనిచేసుకుపోయేవాడు __ తొంభైమంది ఎమ్ . ఎల్. ఏ .లు తనకు అండగా ఉన్నా, యాభైమంది ఎమ్. ఎల్. ఏ. ల అండ మాత్రమే ఉన్న మీరు సి.ఎమ్ అయిపోయారు. ఇప్పుడు ఆలోచించి చెప్పండి __ మీ ద్వారా గట్టి దెబ్బతిన్న దెవరు ? మాణిక్యం ఆశించిన అదికారం దక్కకుండా పొయిందేవరి మూలంగా ....? మీ మూలంగానే కదా......?

    సో..... మాణిక్యమే అసలు కథానాయుకుడు , ఈ విషయాన్నీ దృష్టిలోపెట్టుకుని మీ పరిశోధన సాగించండి. అందరిలాగే గూఢచారి విభాగానికి చెందిన పోలీసు అధికారుల్ని కూపీలాగటానికి ఉపయోగించుకోండి. మబ్బు దానంతట అదే పోతుంది" అన్నాడు మైఖల్ రిలాక్స్డ్ గా.

                                *    *    *    *   

    మరి గంటకి గూఢచారి విభాగానికి చెందిన పోలీసు ఆఫీసర్ ఒకరు రామదాసు ఉండే కాలనీలో ఆటో దిగాడు.

    సరిగ్గా అదే సమయానికి మరో అధికారి మాణిక్యం ఉండే వీధిలో టాక్సీ దిగాడు.

    రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది?

    సర్వదికారుల్ని గుప్పెట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి, ఆ అధికారాల్ని దాచుకున్న గుప్పెటిని ఎవరూ తెరిచే ప్రయత్నం చేయకుండా అన్ని చర్యలూ తీసుకున్నాడు.

                            *    *    *    *   

    మైఖల్ రాజు నాలుగైదు వందలకోట్లు వ్యాపారమే చేస్తున్నప్పటికీ ఐదారు వేలకోట్ల వ్యాపారాలు చేసే బడా పారిశ్రామిక వేత్తలతో పాటుసమాన స్థాయి ఇమేజ్ ని, పావులారిటీని పొందగలుగుతున్నాడంటే అతనికి అండగా నిలుస్తున్న జాతీయస్థాయి అంగ్ల దినపత్రిక ఇండియన్ టైమ్స్ కారణం.

    ప్రపంచంలో అతిశ క్తివంతమైనది అధికారమైతే, రేండోస్థానం లోకి ప్రెస్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో ఉండే టీవీ, రేడియో, కన్నా రాష్ట్రా ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఇన్ ఫర్మేషన్ డిపార్ట్ మెంట్ కన్న న్యూస్ పేపర్స్ చాలా శక్తివంతమైనవి.

    ఎవరైనా, ఎప్పుడైనా ఎదుటి అంచనా వేయవలసి వస్తే ఆ వ్యక్తికీ ఏమున్నాయని యాభైశాతమే ఆలోచిస్తారు. అతనికి అండగా ఏముంది. ఎవరున్నారు అనే విషయం గురించి మిగతా యాభైశాతం  ఆలోచిస్తారు. ఒక్కోసారి అది 25:75 అయినా ఆశ్చర్యపోనక్ఖర్లేదు.

    అలా ఎవరు మైఖల్ రాజు విషయంలో ఆలోచించినా నిష్పత్తి పదితొంభైగా కనిపిస్తుంది. పది మైఖల్ రాజు తెలవి తేటలు, వ్యాపారం, నిజాయితీ సిన్సియారిటీ అయితే తొంభైశాతం అతన్ని కపుకాస్తూ, భుజానికి ఎత్తుకొనే ఇండియన్ టైమ్స్ అవుతుంది.

 Previous Page Next Page