నేటి దేశ రాజకీయాల్ని శాశించేది డబ్బు.....
రాజకీయనాయుకుల్ని ఆడించేది బడా పారిశ్రామిక వేత్తలు __
ప్రజలు ఓట్లేసి నాయుకలకు అధికారాన్ని అందజేస్తే __
నోట్లు విసిరి వారి ధన దాహాన్ని తీర్చేది వ్యాపారవేత్తలు __
ఈ చట్రంలో రెండు శక్తివంతమైన అకులున్నాయి __
ఒకరు శంభుప్రసాద్ __
ఒకరు మైఖల్ రాజు __
ఈ ఇద్దరూ యిటు రాష్ట్రాన్నే కాక అటు కేంద్రాన్ని కూడా తమ పట్టులో ఇరికిమ్చుకున్న బడా పారిశ్రామికవేత్తలు. యాభయ్ ఆరు సంతత్సరాల శంభుప్రసాద్ విశాఖ జిల్లాలోని ఒక గ్రామంలో బీద బడిపంతులు ఇంట్లో పుట్టి పదిహేడవ ఏట గుమస్తా ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ఏడెన్ వెళ్ళి 1960 లో ఇండియాకి తిరిగి వచ్చి పదిహేనువేల రూపాయలతో మలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్స్ నేలకోల్పి ఇప్పుడు వేలకోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ కార్పోరేట్ చరిత్రనే తిరగ రాసిన వ్యక్తి __ వ్యాపార శక్తి. ఈయనకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ తండ్రికి కుడి, ఎడమ భుజాలుగా ఉంటూ వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతుంటారు.
పెద్దకొడుకు మురారీ ప్రసాదు __
చిన్నకొడుకు అనూప్రసాద్ __
పెద్దకొడుకు తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ సంప్రదాయ బడ్డమైనా జీవన విధానాన్ని క్రమశిక్షణ గా లీడ్ చేస్తే, చిన్నకొడుకు ప్లేబాయ్ తరహా జీవన విధానాన్ని ఎన్నుకున్నాడు.
మరొక శక్తి మైఖల్ రాజు.......
నలబై సంవత్సరాల మైఖల్ రాజు ఇండియన్ డైయింగ్ కార్పోరేషన్ కి చైర్మెన్ . మైఖల్ రాజు తండ్రి బ్రీటిషర్. తల్లి ఇండియన్. ఇండియా బ్రీటిష్ పరిపాలనలో ఉండగా రాజు తండ్రి వ్యాపారరీత్యా ఇండియా వచ్చి ఇక్కడే సెటిల్ అయి భారత వనితను వివాహం చేసుకున్నాడు. దాని మూలంగా మైఖల్ రాజుకి బ్రీటిష్ పాస్ పోర్ట్, ఇండియన్ వీసా వచ్చాయి. తల్లి చనిపోగా తండ్రి తమ అభివృద్ధిపరచిన ఇండియన్ డైయింగ్ వ్యపరాల్ని, ఆస్తుల్ని కొడుక్కి హేండోవర చేసి శేష జీవితాన్ని ప్రసహ్మ్టంగా గడిపేందుకు స్వీట్జర్లాండ్ వెళ్ళిపోయాడు.
మైఖల్ రాజు మీద యూరోపియన్ కల్చర్ ఇన్ ప్లూయన్స్ బాగా వుంది. ఇండియాలో ఉంటున్న పాశ్చాత్య జీవిన విధానాన్నే ఇష్టపడతాడు. అందుకే బ్రీటిష్ పాస్ పోర్ట్ ని, ఇండియా వీసాని ఎక్స్ టే౦డ్ చేసుకుంటూ వస్తున్నాడు.
మైఖల్ రాజు ముఖ్యమంత్రి నందకిషోర్ కి అప్తుడయితే __ శంభుప్రసాద్ ప్రధానికి ఆప్తుడు.
కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అయినప్పటికీ , ఈ ఇద్దరూ ఒక పార్టీకి చెందిన వ్యాపారవేత్తలయినా ఎవరి వె ఆఫ్ అప్రోచింగ్ వారిదే.
ఇద్దరూ ఒకరు ప్రధాని ద్వారా మరొకరు ముఖ్యమంత్రి ద్వారా రతమ వ్యాపారప్రయోజనాల్ని కాపాడుకుంటూ వస్తున్నారు.
శంభుప్రసాద్ ఆస్తులు సుమారు ఐదువేల కొట్లుంటే , మైఖల్ రాజు ఆస్తులు ఐదో౦దల కోట్లదాకా ఉంటాయి.
పోటీ పరంగా చూస్తె శంభుప్రసాద్ కి మైఖల్ రాజు పెద్ద లేఖ్హలోనివాడు కాదు.
ఇన్ సిగ్ని ఫికేంట్ బిజినెస్ రైవల్.... అయితే మైఖల్ రాజుకి మరో బలమైన శక్తి అండగా వుంది.
అది " ఇండియన్స్ టైమ్స్ " అనే అత్యధిక సర్క్యులేషన్ గల దినపత్రిక .
శంభుప్రసాద్ పేదరికం నుంచి కసితో, పట్టుదలతో అంచలంచెలుగా ఎదిగితే మైఖల్ రాజు ఆగర్భ శ్రీమంతుడు.
ఒకప్పుడు పేదరికానికి శంభుప్రసాద్ వారసుడైతే __ తరతరాల భోగాభాగ్యాలకు మైఖల్ రాజు వారసుడు. అందుకేనేమో ఇద్దరి ఆలోచనలో పద్దతుల్లో, వ్యాపార విధానాల్లో జీవన సరళిలో చాలా తేడా వుంటుంది.
ఆస్తులకు, అంతస్తులకు వారిద్దరి మధ్య హస్తిమసికాంతారమే అయినా వారిద్దరి మధ్యా వ్యక్తిగతంగా పెద్ద శత్రుత్వమే నెలకొని వుంది.
రాజకీయాలకు __ వ్యాపారాలకి
అధికారానికి __ అంతులేని సంపాదకు గొప్ప అవినాభావ సంబంధము వుంది.
చీఫ్ మినిష్టర్ నందకిషోర్ సెక్రటేరియేట్ కి వెళ్ళగానే ముందుగా అసమ్మతి వర్గపు కర్యాకలపాన్ని సమీక్షించుకుని దానికో పథకం సిద్దం చేసుకున్నాడు.
ఆ తరువాత తన ఆదాయపు వివరాల్ని చూసుకున్నాడు.
ఇందుకుగాను పొలిటికల్ ఎడ్వైజర్ , పోలీసు గూడచారీ విభాగపు అధికారి, రాజీ ధోరణీని అలవర్చుకుని దిగజారిన ఒక ఐ.ఏ.ఎస్. అధికారి సహకరించారు. ఆ తరువాత చేసిన పని __ మైఖల్ రాజుకి ఫోన్ చేయటం __
వారిద్దరి మధ్య హాట్ లైన్ లో సంబాషణ ,మొదలయింది. ప్రైమ్ మినిష్టర్ కి, చీఫ్ మినిష్టర్ కి మధ్య సంబంధాలు అంత సరళంగా లేవు. ఇద్దరి మధ్యా ఎడమొహం అన్నది రెండు సంవంత్సరాలుగా కొనసాగుతున్నది. అప్పటినుంచే నందకిషోర్ ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడుతున్నాడు.
ఫోన్ ద్వారా మైఖల్ రాజుని కాంటాక్ట్ చేస్తే __ ఫోన్ లో మాట్లాడుకునే విషయాలు తామిద్దరి మధ్యే ఉంటాయన్న నమ్మకం లేదు. టెలిపోన్ డిపార్ట్ మెంట్ సెంట్రల్ అధీనంలో వుంటుంది. గనుక అందుకు అవకాశం లేకపోలేదనే అనుమనంతోనే మరొకరు వినే అవకాశం లేని హట్ లైన్ ద్వారా మాట్లాడుతుంటాడు ఎమర్జెన్సీ సమయాల్లో.
"హలో ... సి.ఎమ్. దిస్ సైడ్ ."
"హలో.... కిషోర్ జీ.... గుడ్ మార్నింగ్ ..."
"వెరీ గుడ్ మార్నింగ్..."
"ఎనీ ఇంపార్టెంట్ మేటర్ ...?" మైఖల్ రాజు బ్రేక్ ఫాస్టు తీసుకుంటూనే సంబాషస్తున్నాడు.
"ఏసేస్ ..." నందకిషోర్ కంఠంలో తొంగిచూసిన రవ్వంత అందోళన మైఖల్ రాజు పసిగట్టాడు.
"అయితే ఇలావద్దు. నేనే మీ ఆఫీసుకి వస్తున్నాను" అంటూ హాట్ లైన్ ని డిస్కనేక్ట్ చేసాడు మైఖల్ రాజు.
క్లిష్ట పరిస్థితుల్లో మైఖల్ రాజు మాట్లాడక ఒకింత రిలాక్స్ గా ఫీలయ్యాడు నందకిషోర్ .
"ఇండో యూరోపియన్ గుఫీ పితాల్ తో మాట్లాడానానీ మేఖంలో ఎంత కళ వచ్చింది....?" గోపీనాధం ఏదో ఫిల్ తిరగేస్తూ అన్నాడు.
"ఏ కష్టాలు, సమస్యలూ రానివాడు జీవితాన్ని ఏం అనుభవిస్తాడు? కష్టాలు రావాలి _ నష్టాలు రావాలి __,సమస్యలూ రావాలి __ వాటినుంచి లఘావంగా బయటపడాలి . అప్పుడే గదా థ్రిల్ ... ఇట్స్ అల్ గేమ్..... పొలిటీ కల్ గేమ్.... ఆ రామదాసుని ఎలా ఎదుర్కొంటానో చూడు.... ఇలాంటి చప్పళ్లకు భయపడితే ప్రైమ్ మినిష్టర్ తో ఎడమొహంగా వుంటూ కూడా నా పదవిని రెండేళ్ళు ఎలా నిలబెట్టుకోగలిగానంటావ్ ....?" చిరునవ్వుతో అన్నాడు నందకిషోర్ చెయిర్ లో రిలాక్స్ డ్ గా వెనక్కీ వాలుతూ.
గోపీనాథం కొద్ది నిమిషాల మౌనం తర్వాత అన్నాడు బాధగా.... "నీ కెన్ని గట్స్ వున్న, నీ మిత్రులకెన్ని తెలివితేటలున్నా అవంతి తెలవితేటలున్నా, మరిన్ని ఎత్తుకు పై ఎత్తులు వేసినా, ఏ స్ట్రాటజీ ప్రయోగించినా గెలవలేని విషయాలు కొన్నుంటాయి నీ విషయంలో అది అవంతి రూపంలో ఎదురయింది ఆత్మవంచన వద్దు, వాస్తవాన్ని అంగీకరించు....." అన్నాడు గోపీనాథం సర్ క్కస్టిగ్గా.
ఆవేశంగా ఏదో అనబోయి ఆగిపోయాడు నందకిషోర్ .
మరికొద్ది నిముషాలకు మైఖల్ రాజు మెర్సిడస్ సెక్రటేరియేట్ కేసి బయలుదేరింది.
సరిగ్గా ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు రామదాసు ఫారమ్ లాండ్ కి పనికొచ్చే పొలాన్ని ఆబగా చూసుకుంటూ ఆ రాత్రికి తను పేల్చవలసిన విషయాన్ని మననం చేసుకుంటున్నాడు.
* * * *
"ఫస్ట్ థాట్స్ ఆర్ బెస్ట్ ఇన్ ఆర్ట్
సెకండ్ థాట్స్ ఆర్ బెస్ట్ ఇన్ బిజినెస్
థర్డ్ అండ్ వరేస్ట్ థాట్స్ ఆర్ బెస్ట్ ఇన్ పాలిటిక్స్ "
నందకిషోర్ తన సమస్య చెప్పగానే మైఖల్ రాజు అన్న మొదటి మాటలవి.
గోపినాథ్ నవ్వాడు.
"మా బాగా సెలవిచ్చారండి. నైతికంగా దిగజారి థర్డ్ రేట్ కి చేరుకున్న వాళ్ళే ఎక్కువగా ఇండియాలో రాజకీయ నాయకులవుతారు. ముందు కాకపోయినా రాజకీయాల్లోకి చేరాక అన్నా అవుతారు. ఏది ఏమైనా ఇప్పుడీ సమస్యను ఎలా దాటటం ....? రాత్రినుంచే మావాడు తెగ వర్రీ అయిపోతున్నాడు..... " గోపినాథ్ బేస్ వాయిస్ లో అన్నాడు.
అతడి కంఠంలో వ్యంగ్య ధోరణీ లేకపోవటంతో నందకిషోర్ గోపీనాథన్ని వదిలేసి మైఖల్ రాజు మీద తన దృష్టిని కేంద్రీకరించాడు.
కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నాడు మైఖల్ రాజు.
"నా మీద అధిష్టాన వర్గానికి చాలా కాలంగా, చాలా కోపంగా ఉంది. సరిపడే కారణం దొరికితే కర్ణాటక వీరేంద్రపాటిల్ కి ఉద్వాసన చెప్పినట్లు చెప్పేస్తారు "
"ఆ తరువాత ....?" మైఖల్ రాజు సదన్ గా ముఖ్యమంత్రి మాటలకు అడ్దోస్తూ అడిగాడు.
మధ్యలో సడన్ గా అలా ప్రశ్న వేసేసరికి మైఖల్ రాజు ఏదో పధకాన్ని తనకోసం సిద్దం చేస్తున్నాడని చాల ఆనందించాడు. నందకిషోర్ .
"ఆ తరువాతేముంది ...? నువ్వు తప్పులు చేసావు. దాని మూలంగా ప్రజల్లో పార్టీ ప్రతిష్ట తింటోంది. దాని మూలంగా వచ్చే ఎలక్షన్స్ లో పార్టీ గెలిచే అవకాశాలు సంనగిల్లుతున్నాయి. అందుకుని తప్పని పరిస్థితుల్లో నిన్ను రప్పిస్తున్నాం ' అని అధిష్టానం దూతలు శేలవిస్తారు. అధిష్టాన వర్గం తను కిష్టంలేని ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో గద్దె మీదున్నా ఇలాగే కేసు ఎలక్ట్ చేస్తుంది. తప్పుల పట్టికతో ఫైల్ ని సిద్దం చేస్తుంది....." గోపీనాథం అందుకుని అన్నాడు.