"ఏమండీ ! మెడికల్ లీవు అంతే ఎవరికయినా భయం కదా! అందరిలాగా మీరు ఊరికే సెలవు పెట్టారు కదా! మీకేమయి దోనని భయంతో ఒకటికి రెండుత్తరాలు రాశాను. ఏదీ! మీ నుంచి సమాధానం వస్తేనా ?" అతని కంఠంలో నిష్టూరం ద్వనించింది.
"సారీ సుధా! నేను ఉత్తరం రాసేందుకు వీల్లేకపోయింది. ముందుగా నీకు క్షమాపణ చెప్పుకోవాలని అనుకున్నాను. అనుకున్నట్లుగా నీవే ముందోచ్చావు ఆఫీసుకి సారీ! రియల్లీ సారీ సుధా!"
"ఫర్లేదులే _ మనమధ్య సారీలేమిటి? ఈ రోజు యింటముందుగా నీకోసమే వచ్చాను రోజులు లెక్క పెడుతున్నాను. నీసేలవు నిన్నటికి ఆఖరు. మళ్ళీ లీవ్ ఏక స్టండ్ చేయలేదు. కదా! అంచేత ఈ రోజు తప్పక వస్తావని నమ్మేను. అలాగే వచ్చాను బ్రతికించారు._"
"ఏం?"
"మళ్ళీ ఎక్కడ సెలవు పెట్టెస్తవోనని ! ఈ సారి సెలవు పేట్టివుంటే నేనే బయలుదేరి వచ్చేవాడిని పైగా సెలవు గ్రాంట్ చేయించడానికి ఎంత కష్టమైందని ? ఆఫీసరుగారికి ఎలాగో చెప్పి అప్పుడు శాంక్షన్ చేయించాను. రెండోసారి కాస్త యిబ్బంది అయింది. మేనేనజరు శత విధాల అడ్డుప్రశ్నలు వేశాడనుకో __ అయినా అయన నామాటే విన్నారు. శా౦క్షన్ చేశారు__"
"థాంక్స్ !"
"ఏమిటండీ సుజాతా! అలా పొడి పొడిగా మాటాడుతున్నారు. మాటలూ మనుషులూ మరచి పోయారా?"
"లేదు సుధా. ఏదో పరధ్యానం __"
"ఎవరి గురించి ?"
"ఛీ ! ఫో!" అంది నవ్వుతో
అదిగో మేనేజరాధముండు విచ్చేయుచున్నాడు. ముండస్తుగా దండప్రణామములు లచం సమర్పించుకుని ప్రసన్నుడిని చేసుకో __ లేదా అగ్గిరావుడై పోతాడు. సెలవు జీతం శాంక్షన్ చెయ్యడు. ఏదో అడ్డుపుల్ల వేస్తాడు. అసలు జాయినింగ్ రిపోర్టే తీసుకోడేమో!"
సుధాకర్ మాటలు పూర్తీకాకముందే మేనేజరాధముడు అని అతను పిలవబడే రామలింగయ్యగారు వచ్చారు.
అయన శ్రీ వైష్ణువుడు. చక్రాంకితలు వేయించుకున్న పరమ భాగవతోత్తముడు. పరమనైస్థికుడు పట్టి వర్ధనలతో కోతుతావు, పిలకతో, నశ్యం కాయతో ఆఫీసుకి విచ్చేస్తాడు తిరివారాధన లాగా ఆఫీసుని కాచి రక్షిస్తూ వుంటారు.
"నమస్కారమండీ!"
"నమస్కారం!"
ఆప్రయత్నంగా ప్రతి నమస్కారం చేసిన ఆశ్చర్యంగా తలెత్తి చూశారాయన. ఇన్నాళ్లుగా యీ ఆఫీసులో వినబడని తెలుగువందనం ఎక్కడిదా అనుకుంటూ ఆ ఆఫీసులో అంతా గుడ్ మాణింగ్ గాళ్ళే! ఒక్క సుజాటే నిండుగా చేతులెత్తి నమస్కరిస్తుంది.
అయన ముఖం వికసించింది. ఆ సంభిధనకి ఆనందంతో ఒక్క పట్టు పొడుం పీల్చి ఆ ఎప్పుడొచ్చావమ్మాయ్" అని పలుకరించాడు. ఆప్యాయంగా.
అంతలో అతనకి పూర్వాపరాలు అన్నీ గుర్తుకోచ్చాయి. "ఇదుగో సుజాతా! అలాచెప్పా పెట్టకుండాసెలవులు పెట్టేస్తే ఎలా?" ఇదేమ ఆఫీసా? ధర్మ సత్రమా? మనపై అధికార్లున్నారు ఆపై పై అధికార్లున్నారు. అపై ప్రభుత్వం వుంది. పనులు కుంటుబడితే ఎలా? మేం పనిసాగక ఎంతగా కొట్టుకుచచ్చామనుకున్నావ్ అదిగో __ సుధాకర్ నీ సీటు వర్కులో సగం పూర్తీచేశాడు. మిగతా యీ పిలకమిఇడుగా వెళ్ళింది. ఒక్కరూ ఇతర్ల పేపర్లు చూడరే!
"సరే! సరే! అయిందేదో అయిపోయింది! ఇక ముందు యిలా సెలవలు పెట్టకూడదు. ఆ అవసరం రాకుండా చూడు తల్లీ! పోనీ ఒకేసారి పెట్టేస్తే లీవ్ వెక్సీనీలో ఎవరినో ఒకరిని వేసుకోవచ్చు. ఇది అదీ కాదే! నెలనెలా పొడిగింపులు ఆయె!"
పోనీలే!
రాగానే శిభామా అని పలకరించకుండా యీ అక్షింతలేమిటి? ఇక ముందు సెలవు అవసరం రాకుండా చూసుకో"
"అలాగేనండీ!"
"ఇంతకీ ఆరోగ్యం ఎలావుంది? కాస్తచిక్కినట్టున్నావ్ తానిక్కులూ అవీ తీసుకోమ్మా!"
"అబ్బే! నాకేం జబ్బు రాలేదండీ! జబ్బు నాకు కాదండీ! మా పిన్ని జబ్బు పడింది. ఇదిగో బాగవుతుంది. అదోగో నెమ్మదిస్తుంది. అనుకుంటూ వుండగానే నెలలు గడిచిపోయాయి. ఆమెకి జబ్బంటే సెలవ్విరని మెడికల్ సర్టిఫికేట్ జత పరిచాను __" అంది నెమ్మదిగా.
"హర్నీ! బావుమ్డంమా బావుంది! చంపేవు ఈ నిజం చెప్పి ఆఫీసులో దుమారం లేపద్దు. అంత ఎమ్మేల్ అంటారు నాపని గోవిందా!" అన్నాడు నవ్వుతో.
"అలాగేనండీ! ఇదిగోనండీ ఫిట్ నేస్ సర్టిఫికేట్ __ జాయినింగ్ రిపోర్టునూ __"
"రిజిష్టర్లూ సంతకం చెయ్యమ్మా!" అన్నారు రామలింగయ్యగారు, ఓ కంట వాటిని సరిచూస్తూనే!
సంతకం పెట్టేసింది సుజాత!
సరిగ్గా పదిన్నర!
అక్కడి నుంచి వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ఒక అడ్డు తొలగినట్టుగా ఫీలై ఆఫీసు పనిలో మునిగిపోయింది.
5
లంచ్ బ్రేక్ దాకా వంచిన తల ఎత్తకుండా పని చేసింది. సుజాత. మనస్సుకి విరామం యివ్వకుండా పనిచేస్తేనే కానీ ఆలోచనలు దూరం అయ్యేత్తట్లుగా లేవు. అందుకే చకచకా పనిచేస్తూ పెండింగ్ లో వున్న ఒకటి రెండు ఫైళ్ళు డిస్పోజ్ చేసింది వాటిని రామలింగాయ్యగారికి అందించింది.
"అందుకేనమ్మా నువ్వంటే నాకు అభిమానం ఎన్నాళ్ళు సెలవు పెదితేనేం వచ్చాక హస్కువేసుకోకుండా పని చూసుకుంటున్నావు ఎలాగైనా యీ ఆఫీసులో డిసిప్లేన్ ఎక్కువ!"
"మీ ట్రెయినింగ్ సర్!"
అభిమాన పడిపోయారు. అయన "నాదేవుందమ్మ మీరంతా మంచి వాళ్ళు. అందుకే నా ఆటలు సాగుతున్నాయ్ మీలో ఎవరైనా హెడ్ స్ట్రాంగ్ గా ఆపనిచేస్తే యీ మేనజర్ పని ఖాళీ!"
నవ్వేసింది సుజాత.
కేంటివ్ వైపు నడించింది.
ఆమెతో పాటే కదిలాడు సుధాకర్.