Previous Page Next Page 
మయసభ పేజి 4

 

   ఆ సౌలభ్యం రిశికి కల్పించి అతన్ని మూడ లోకి తీసుకురావాలనే అల అన్నట్లు ఆమెకి మాత్రమే తెలుసు.

    అవంతి కూడా భోంచేసి పాడుకొనేసరికి తెల్లవారు ఝాము మూడున్నరపోయింది.

    కార్పెట్ మీదే ఇద్దరూ పడుకోవటం అన్నది గత నాలుగు నెలలుగా వారికి బాగా ఇష్టమైన చర్య.

    మిగతా సమయాల్లో ఎలా ఉన్నా, రాత్రిళ్ళు నిద్రించేటప్పుడు మాత్రం అసంకల్పితంగానె ఇద్దరూ తమ మధ్య ఒకడుగు దూరాన్ని మెయిన్ టైన్ చేయటం కూడా బాగా అలవాటయిపోయింది వాళ్ళకు.

    తెల్లవారితే మేజర్ ఆపరేషన్ ఒకటి చేయవలసి వుంది..... నిద్రపోగగిలితే ఉదయానికి ప్రెష్ గా ఉంటుందని తెలుసు __ అయినా ఆమె నిద్రపోలేకపోయింది.

    రిషి అప్పటికే ముడుచుకుని నిద్రిస్త్రున్నరిషి మీద బ్లాకేంట్ ఒకటి కప్పింది.

    ఆ పైన అటని జుత్తును పైకి ఎగదోస్తూ, మృదువుగా నిమురుతూ అతని తలను తన ఒడిలోకి తీసుకుంది.

    తను ఒంటరి నిశ్శబ్దాన్ని తను ఓడించింది... తననీ స్థితి తరిమి కొట్టిన దుఃఖ భాజకమైనా జ్ఞాపకాలు రుచి చూపించిన చెడు నిజాలు ఆమె క్షణకాలం వివశురాల్ని చేసాయి.

                              *    *    *    *   

    "పురాతన పార్సీ బంగ్లా....

    నిశి నిశ్శబ్దంలో నిద్రబోతున్నట్ట్లుగా దాటి అరగంటయింది.

    పాడు బడినట్లు కనిపిస్తున్న ఆ బంగ్లాలో నేషనల్ డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉంది.

    బంగ్లా బయట ప్రశాంతంగా ఉన్న లోపల సెంట్రల్ హాల్లోని వాతావరణం మాత్రం వాడి వాడి చర్చలతో వేడి వేడిగా వుంది.

    సెంట్రల్ హల్లో ఆరుగురు వ్యక్తులు ఎదురెదురుగా కుఉర్చుని తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

    "పథకం పకడ్భందీగా సిద్దమయినట్లేనా....?" ఎన్ .డి.సి. రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ మాణిక్యం అడిగాడు.

    అతని మాటలు ముద్దగా వస్తున్నాయి.

    అప్పటికే మూడు రౌండ్స్ పూర్తీకావటంతో అతని కళ్ళు ఎర్రగా బ్లాస్ట్ ఫర్నేస్ లా మండుతున్నాయి.

    "సిద్దం చేసాం సార్..... ఇక ఈసారి మన మాయాజాలం నుంచి చీఫ్ మినిస్టర్ తప్పించుకోవటం అసాధ్యం...." అన్నాడు మురహరి.

    "మురహరి రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రి పదవి ఆశించి దెబ్బతిన్న సీనియర్ ఎమ్ . ఎల్ .ఏ."

    "నందకిషోర్ ని తక్కువ అంచనా వేయవద్దు. రాజకీయ చదరంగపు బల్లపై గ్రాండ్ మాస్టర్ లాంటివాడు. పావుల్ని చాలా గొప్పగా కదలించగల అపర చాణుక్యుడు. యాభై ఏండ్లకే రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడయ్యాడు. ఎక్కడ మీట నొక్కితే ఎక్కడి పాము చస్తుందో బాగా తెలిసిన మేధావి. అన్నిటిని మించి గొప్ప అదృష్టవంతుడు ఆఖరిక్షణంలో అదృష్టం అతన్ని ఎప్పుడూ కాపాడుతుంది. అతనింట కాలం ముఖ్యమంత్రిగా కొనసాగటం వెనుక అతని తెలివితేటలతోపాటు అదృష్టం కూడా కొంతపాలు పంచుకుంటోంది. " ఎన్.డి.పి. రాష్ట్రశాఖ సేక్త్రటరీ మారప్పగ్లాసులోని నిద్రవాన్ని పూర్తిగా గొంతులోకి వంపుకుని అన్నాడు.

    మురహరికి ఆ మాటలు రుచించలేదు. అందుకే మొఖం చిట్లించాడు.

    "నువ్వు మన శత్రువుని పోగుడుతున్నావా....? లేక మన అసమర్దతని ఎత్తి చూపుతున్నావా.....?" మురహరి కోపంగా చూస్తూ అన్నాడు.

    "కోపగించుకోకు మురహరి .... మారప్ప చెప్పింది అక్షరాల నిజం. ఎన్నిసార్లు .... ఎంతమంది ... ఎన్ని పతకాలు సిద్దం చేసినా నందకిషోర్ పదవి గండం నుంచి పాదరసంలా తప్పించుకుపోలేదు.....?" మురహరిని అనునయిస్తూ అన్నాడు మాణిక్యం.

    "నిజమే ... కాని అదేపనిగా శత్రువుని పొగుడుతూ పొతే మన ఆత్మస్థయిర్యం సడలిపోతుంది. అతని నక్కజిత్తుల్ని ఎక్స్ పోజ్ చేయటం గ్లమరైజ్ చేయటం లాంటివి మంచింది కాదు. పక్క సాక్ష్యాలు ఇప్పుడు మన దగ్గరున్నాయి. రేపు ఉదయమే ప్రెస్ రిపోర్ట్స్ ని పిలిచి ఆ సాక్ష్యాల్ని చూపిస్తే చాలు _ ఎల్లుండికల్లా రాష్ట్రా ప్రజల్లో సంచలనం __"భూ బకాసురుడయిన రాష్ట్ర ముఖ్యమంత్రి __"గుడిసెలకిషోర్ __" రాష్ట్రాభివృద్దిని గాలికి వదిలేసి ఖాళీ స్థలాన్ని కబ్జా చేస్తున్నా ముఖ్యమంత్రి" అని పేపర్స్ ఫ్రంట్ పేజీల్లో బ్యానర్ హెడ్డింగ్స్ __ దాంతో డిల్లీ లోని అధిష్టానవర్గం కదిలిపోతుంది చిందులు తొక్కుతుంది. ఈలోపు ప్రతిపక్షాలకు __ ముఖ్యంగా ప్రతిపక్షంలో కాకుల్లామ్తి వాళ్ళకు సాక్ష్యాల ఫోటోస్టాట్ కాపీలు వెళ్ళిపోతాయి. ...." ధీమాగా తను సిద్దం చేసిన పథకాన్ని వివరించాడు మురహరి.

    "గంధర్వులేవరింతకు ....? మన చేతికి మట్టి  అంటకూడదు సుమా! మనం దీని వెనుక ఉన్నట్లు నందకిషోర్  రుజువుచేసి మనల్ని అధిష్టానవర్గం ముందుకు లాగితే అతనికంటే ముందు మనం దొరికిపోతాం. అతనికి మాత్రమే మనం దీని వెనుక ఉన్నట్లు తెలియాలి. కాని రుజువు చేయలేకుండా ఉండాలి. దాంతో అతనికి మనమంటే భయం పుట్టుకొస్తుంది. ఆదిష్టాన వర్గం ఆగ్రహించిందో, ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది. అప్పుడు నాకు మార్గం సుగమం అవుతుంది. లేదా __ మన మంటే భయపడతాడు గనుక మనవాళ్ళకు మంత్రి పదవులు , కార్పొరేషన్స్  చైర్మెన్ పదవులోస్తాయి. __" మాణిక్యం ఊహల్లో తేలిపోతూ అన్నాడు.

    "ఆ భయం  అక్కర్లేదు . రేపు ఉదయం ప్రెస్ మీట్ పెడుతున్నది పెద్ద నోరున్న ప్రతిపక్ష నాయకుడు రామదాసు. అతని నోరు ప్రసాదు భారతి కన్న పెద్దది....." మురహరి సిగార్ వెలిగించుకుంటూ అన్నాడు.

    "రామదాసు పొరపాటున నోరు జారితే ....?" మారప్ప సందేహంచాడు.

    "నీకన్నీ అనుమానాలే __ రామదాసుకి ఈ రోజు సాయంత్రమే రెండు లక్షల సూట్ కేస్ అందింది. కూతురి పెళ్ళి అవసరాల్లో వుండగా ఆ కేష్ పంపించాడు. ఒక దెబ్బకు రెండు పిట్టల్ని చాలా ఆనందించాడు. అటు డబ్బు.... ఇటు తనెంతో కష్టపడి ఆ కుభకోణాన్ని బయటకు లాగినట్లు ప్రజల ముందు పోజులు ...." నవ్వుతూ అన్నాడు మురహరి.

    "చూసావా... తిరిగి పొరపాటు చేస్తున్నావు....?" మాణిక్యం చిరుకోపాన్ని ప్రదర్శించాడు.

    "పొరపాటే...... సాక్ష్యుల్ని రేపు ఉదయం చూపిస్తే చాలన్నావు. ఎవరు చూపిస్తారు...? నువ్వా? నేనా? ఎవరికీ చూపిస్తావు....? ప్రెస్ వాళ్ళకా....? అప్పుడు మనమే మనల్ని బయట పెట్టుకున్నట్లు కాదా....? ప్రతిపక్షాలకు, ప్రతిపక్షంలో కాకుల్లంతి వాళ్ళకు ఫోటోస్టాట్ కాఫీలు అందిస్తానన్నావు.... అప్పుడు రాందాసుకు కోపం రాదా! అది అతని ఘనతగానే గదా చెప్పుకోవాలనుకుంటున్నాడు. అందరికీ అది తెలిసిపొతే తన క్రెడిబిలటీ పోతూందని కోపగించుకోదా....? నాకు చెప్పి మరికొంత మందికి ఎలా చెప్పావని నీమీద రివర్సయిపోతే....?' మాణిక్యం అసహనాన్ని ప్రదర్శించాడు.

    మురహరి నలిక్కారుచుకున్నాడు.

    మారప్ప కళ్ళు మెరిశాయి.

    "పథకమెప్పుడూ లూజ్ గా ఉండకూడదు, గురిచూసి కొడితే లక్ష్యం చేధింపబడాలి. అవతల వ్యక్తి సామాన్యుడు కాదు. పైగా అధికారంలో వున్నాడు. ఆవలించాకుమ్డానే ప్రేగులు లెక్కించెంత ప్రమాదకరమైన  వ్యక్తి నవ్వుతూ, నవుతూనే నిప్పంటించేయగలడు. తొంభైమంది ఎమ్ . ఎల్. ఏ.లు నాకున్నా నేను సిఎమ్ కాలేకపోయాను. కేవలం యాభై మంది ఎమ్. ఎల్. ఏ. ల సపోర్టుతో తను సి.ఎమ్ అయిపోయాడు. బెదిరిస్తాడు. భయపెడతాడు __ ప్రలోభ పెడతాడు __ బ్లాక్ మెయిల్ చేస్తాడు __ కిడ్నాఫ్ చేయిస్తాడు. హత్యల్ని పురికొల్పుతాడు __ ఏదైనా చేస్తాడు __ అధికారంలోకి రావటం కోసం, వచ్చిన అధికారాన్ని దక్కించుకోవటం కొం అధికారంలోనే కోంసగతం కోసం. అధికారం కోసం కన్నకూతుర్నే వదులుకున్న దుర్మార్గుడు అదే అతని అధికార దాహానికి పరాకాష్ట.... కానుక సాక్ష్యుల్ని కేవలం రామదాసుకే పంపించు. ప్రెస్ మీట్ రేపు ఉదయమే అయితే సాయంత్రానికే నందకిషోర్ కి తెలిసిపోతుంది అలా తెల్సుకోగలడు. దాంతో అతని రియాక్షన్ మొదలవుతుంది. ప్రతికాదిపతుల్ని బెదిరిస్తాడు __ అవకాశ వుంటే కోనేస్తాడు __ రామదాసుకి పదిలక్షలు ఆఫర్ చేస్తాడు __ వాత నాట అన్నీ.... అన్నీ చేత్సాడు. చేసి రామదాసు నోరుని __ పత్రికల నొక్కేస్తాడు అవసరమైతే తన అధీనంలో నోరుని ఉంచుకునే కిరాయి హంతకుల్ని వినియోగిస్తాడు.

    న్యూస్ పూర్తిగా ఆగిపోయినా డైల్యూట్ అవుతుంది. కుంభకోణం సాంద్రత తగ్గుతుంది. దాని మూలంగా మనం ఆశించిన ప్రయోజనం మనకు సిద్దించదు.... వ్రతం చెడ్డా ఫలితం దక్కనప్పుడు వ్రతం చెడకుండా వుంటే మంచివల్లగా నన్న మిగిలిపోతాం బైదిబై.... ఈ సమయంలో మనం ఇక్కడ సమావేశమయినట్లు నందకిషోర్  తెలిసే అవకాశ ఉందా?"

    "లేదు. పార్టీ కార్యాలయం ముందు ఒక్క వెహికల్ కూడా లేకుండా చేసాను. ఆవరణంలోకి పోంస్ మోగినా లిప్ట్ చేయకుండా ఏర్పాట్లు చేసాను. ఈ కార్యాలయంలో స్టాప్ మనవాళ్ళు . చచ్చినా నోరు జారారు...." అన్నాడు మరప్ప కాన్ఫిడెంట్ గా .

    "వెరీగుడ్ .... ఏం మురహరి ... నేను చెప్పిన ప్లాన్ బావుందా పొరపాటుఆలోచనల్ని ఒప్పుకుంటూ.

    "మీరేమంటారు?" అప్పటివరకు మౌనంగా వున్న మిగతా ముగ్గురు వ్యక్తుల్ని ఉద్దేశించి ప్రశ్నించాడు మాణిక్యం.

 Previous Page Next Page