ఆమె అతనికి దగ్గరగా జరిగింది.
అతని ఎడం చేతిని తన చేతుల్లోకి తీసుకుంది.
ఒక్కక్షణం సముద్రంలో సుదూరంగా లంగరు వేసి వున్న ఓడపై వెలుగుతున్న కమతిని చూసింది.
అతని చేతిని నిమురుతూ తన పెదవుల చెంతకు చేర్చుకుంది.
మరో క్షణంలో ఆమె అతని చేతిని అత్రిగా ముడ్డిడబోతుండగా అతను విసురుగా తన చేతిని లాక్కున్నాడు.
ఆమె అతని మొండితనానికి బాధపడింది.
అతను విసురుగా లేచాడు.
ఆమె లేచి అతని చేతిని అందుకునే ప్రయత్నం చేస్తుండగా అతను బీచ్ రోడ్ కేసి అడుగులు వేయసాగాడు.
అతనిలోని ఉక్రోషానికి ఆమె నవ్వుకుంది.
అతనిపై ప్రభావం చూపే పసిపిల్లవాడి మకుటణానికి ముచ్చటపడింది.
అతను మారి మనిషిగా నిలబడినా అతనిలోని మంకుతనం, ఉక్రోషం, ఉడుకుమోతుతనం, చిరుకోపం అతని నుండి దూరం కాకూడని ఆమె ఎప్పుడూ కోరుకుంటుంది.
తాను అలా ఎందుకు కోరుకుంటు౦దనేది ఆమెకీ అర్ధంగాక అప్పుడప్పుడూ ఆశ్చర్యంగా అనిపిస్తు౦టు౦ది.
తనకేప్పుడూ తన ప్రియుడ్ని లాలించాలని వుంటుంది. సేదతీర్చాలని వుంటుంది. బుజ్జిగించాలని వుంటుంది చిరుముద్దలు తినిపిస్తూ చిరుముద్దలు రుచి చూపించాలని వుంటుంది.
తన రిషి బయట మనిషనిపించుకోవాలని __
ఇంటిపట్ల బాధ్యతగల ఇంటి పెద్దననిపించుకోవాలని __
పడక గదిలో మన్మధుడనిపించుకోవాలని __ వంట గదిలో నలభీముడనిపించుకోవాలని __ డైనింగ్ టేబుల్ ముందు భీముడనిపించుకోవాలని __ సమస్య లేదురయినప్పుడు చాణుక్యుడనిపించుకోవాలని __ తనకి కోపం వచ్చినప్పుడు కన్నతల్లిలా తనని బుజ్జిగించాలని __ తనకి బాధా కలిగినప్పుడు పంచుకునే పరమోన్నతుడు కావాలని __ చవరగా ఇంటి గుమ్మం ఎక్కగానే __ నాకవి కావాలని, ఇవి కావాలని __ ముద్దులు తినిపిమ్చుకుని గారాం చేయాలని __ ముద్దులు యివ్వమని ముసిముసి నవ్వులతో తనను బ్రతిమాలడాలని __ అర్దరాత్రి నిశ్శబ్ద క్షణాల్ని ఆర్తిగా అధిగమిస్తూ తనని సొంతం చేసుకోవాలని ఆమె కోరుకుంటుంది.
ఆ కోరుకునే కోర్కెల్ని తన కళల ప్రపంచంలోకి తీసుకెళ్ళి వాటికి రెక్కల్ని జోడిస్తోంది.
అతను వడివడిగా రోడ్డెక్కి క్షణాల్లో అదృశ్యమైపోయాడు.
ఆమె విహారాన్ని సయితం ఆస్వాదిస్తూ వచ్చి తన కారేక్కింది. అది రివ్వున అడయార్ కేసి దూసుకుపోయింది
* * * *
అవంతి కారుని తను వుంటున్న ఇంటి గెట్ ముందాపి, కారు దిగివెళ్ళి గెట్ తాళం తీసి గెట్ ని తెరచి, కారుని లోపలకు తీసుకువెళ్ళి పార్క్ చేసి మెయిన్ గెట్ వద్దకు వచ్చి దాన్ని యధావిదగా మూసి. తాళం వేయకుండా తిరిగి యింట్లోకి వెళ్ళిపోయింది.
ఆమెకి స్నానం చేయాలని వుంది.
ఆపైన భోంచేయాలని వుంది.
కానేమి చేయలేక నిస్రాణగా హాల్లోనే సోఫా ముందు పరిచి వున్న కార్పెట్ పై కూర్చుందిపోయింది. మరికొద్ది నిమిషాలకు ఆలోచనల్లో౦చి నిద్రలోకి జారుకుంది.
* * * * *
రిషి మద్రాసు మహానగరపు రోడ్లన్నీ చుట్టి వేశాడు పిచ్చిగా. అతడి మలుపు వచ్చింది.
ఆకలిగా వుంది.
దేవి పెరడైజ్ మెయిన్ గెట్ ప్రక్కనున్న ఇరానీ హొటల్ లో వెళ్ళాడు.... అవంతి మీద కోపంతో , తనని నిర్లక్ష్యం చేస్తున్న తన తల్లిదండ్రుల మీద కోపంతో రెండు మూడు ఐటెమ్స్ కి ఆర్డర్ ఇవ్వాలనుకున్నాడు.
మరికొద్ది క్షణాల మౌనంగా వుందిపోయాడు. తనెందుకు ఎవరూ అర్ధం చేసుకోరు....? అర్ధం చేసుకునే ప్రయత్నమయిన చేయరు?
తిరిగి అతడిలో కోపం రెట్టింపయింది.
మూడు ఐటెమ్స్ కి ఆర్డర్ ప్లేస్ చేసాడు.
అతనలా పావుగంటసేపు తన మనస్సును చిన్నాభిన్నం చేసుకునాక ఐటేమ్స్ వచ్చాయి......
* * * *
తెల్లవారుజామున మూడు గంటల సమయం... ఆ నిశిరాత్రి నిశ్శబ్దంలో గేటు కదిలిన శబ్దం వినిపించి అవంతి ఉలిక్కిపడింది.
ఆ వెంటనే గేటు తెరచుకుని, మరల మూసుకున్న శబ్దం కూడా వినిపించింది.
మరికొద్దిసేపటికి ఇంటి తలుపులు మెల్లగా తెరచుకుని మూడుకున్నాయి.
అవంతి అలాగే సోఫాకి జరగలబడి, నిస్రాణగా వుండిపోయింది,
క్షణాలు.....
నిముషాలు..... గడచిపోయాయి.
అప్పుడు.... సరీగ్గా అప్పుడు జరిగిందా సంఘటన__
బెడ్ లైట్ వెలుతురులో ఒక అకారం కర్మాగా అవంతి ఉన్న వేపుకి వచ్చింది నిశ్శబ్దంగా.
అడమెకు తెలుసో తేలేదు గాని __ ఆమె మాత్రం నిశ్సబ్దంగా, వున్న స్థితిలోనే వుండిపోయింది.
ఆ ఆకారం ఆమెకి మరింత దగ్గరగా వచ్చింది.
ఒకింతసేపు శిలలాగా బిగుసుకుపోయిందా ఆకారం.
ఆపైన ఆ కారం మెల్లగా కార్పెట్ మీదకు జారిపోయి, ఆమెకు దగ్గరగా జరిగి మరికొద్ది క్షణాలు చలనం లేకుండా వుండిపోయింది.
ఆ తరువాత ఆ ఆకారం తలమాత్రం అవంతి ఒడిలోకి చేరుకుంది.
ఆమె ఒక్కసారి వులుక్కిపడి మేలుకుంది.
మసక వెలుతురులో ఆమె కళ్ళుతెరచి తన ఒడిని ఆక్రమించుకున్న ఆకారాన్ని చూసింది.
అప్పుడు రాలాయి రెండు కన్నీటి బోట్లు నిశ్సబ్దంగా ఆమె కనుచివరల నుంచి
"ఆకలి వేయలేదా రిషీ?" అందామె ప్రేమగా అతని తనల్కు తనకేసి అదుముకుంటూ.
రిషి సమాధాన మివ్వలేదు.
"అలసిపోలేదా రిషీ?" అందామె తిరిగి.
"నీ ఒడిలో వాలింది నేనే అని ఎలా తెలుసు?"
"చిన్నపిల్లాడు పెద్దవాళ్ళతో దాగుడుమూతల అట ఆడుతూ వెనకనుంచి వచ్చి కళ్ళు మూసి ఎవరో కనుక్కో చూద్దాం అంటాడు.... నువ్వు అనలెందంతే..... అయినా నా ఒడిని పంచుకునే హక్కు ఈ ప్రపంచంలో నా రిశికి తప్ప మేరేవరికీ లేదు. అ ధైర్యం మరెవరూ చేయరు. చేయలేరు..... చెప్పు ఆకలిగా లేదా?" అందామె తిరిగి కన్న బిడ్డ కడుపు తడిమే తల్లిలా
"ఏం లేదు .... నేను హొటల్ లో చాలా ఐటేమ్స్ తినే వచ్చాను నేకె ఆకలిగా ఉంది కదూ __?" తన తల్లి కడుపు చాటున మరింతగా ఒదిగిపోయి తలదాచుకునే కోడిపిల్లా ఆమెలోకి ఒదిగిపోతూ, అమెక్కడ దూరమవుతోందన్న భయాన్ని తన చర్య ద్వారా పరోక్షంగా తెలియజేబుతూ అన్నాడు రిషి.
ఆమె నవ్వింది __
అతన్ని మొఖాన్ని తన రెండు అరచేతులతో దగ్గరకి తీసుకొని నుదుటిపై సున్నుటంగా తన పెదవులతో సృజించి __
"చాలా ఐటేమ్స్ తిన్నావా....? నిజం ....!"
"తిన్నాను నిజంగా నిజం ... నువ్వూ?"
"నేనూ తిన్నాను..." అందామె అతన్ని ఉడికించాలనే.
అతను ఒకింత సేపు మౌనంగా వున్నాడు.
"ఆకలిగా ఉంది __ అన్నం పెట్టావా.....?" అన్నాడు తల మాత్రం పైకైత్తి అవంతికేసి చూస్తూ.
ఆమె ఒక్కసారి ఉప్పెనేలా అతన్ని తనలో కలుపుకొని కొద్ది క్షణాలు అలాగే వుండిపోయింది.
అప్పటివరకు అనుభవించిన బాధని, డిప్రెషన్ ని క్షణాల్లో మర్చిపోయి త్వరత్వరగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళిపోయింది.
క్షణాల్లో రిషిష్టునుని చేసిన కూరని కలుపుకుని తిరిగి వచ్చి అతని ప్రక్కనే కూర్చుంది.
ఆమె ఒక్కో ముద్దా అతని నోటికి అందిస్తుంటే అతను అప్పటివరకు అనుభవించిన నరకం వేలితో తీసి వేసినట్లు అదృశ్యమైపోయింది.
"నేను లేకుండా, నేను తినకుండా నువ్వు తినలేవు. ఒంటరిగా తిరగలేవు కూడా రిషి......" అంది ఎడంచేత్తో అతని తలను నిమురుతూ.
నేనే కాదు... నువ్వూ నేను తినకుండా తినలేవు....." అన్నాడు రిషి తింటూ.
"అందుకేనా పెద్ద... ఇంత లేట్ గా వచహవు....? నా కాకలేస్తుందని గుర్తులేదా.....?" అంది అతని చెవిని మెలిపెడుతూ.
దానికి వెంటనే సమాధానం చెప్పకపోయేసరికి రిషి సిగ్గుపడ్డట్లుగా భావించింది అవంతి.
"ఇలా అడ్ టైమింగ్స్ లో భోంచేస్తే ఏమవుతుందో తెలుసా....? అంటూ టాపిక్ మార్చివేసింది.
"ఏమవుతుంది ....?"
"మన అరిగ్యం పాడయి ఆనందానికి దూరమవుతాం. అప్పుడే మవుతుందో తెలుసా....? మనకు పుట్టే పిల్లలు ఇథోపియా కరువుకి వారసుల్లా వుంటారు."
అతను నవ్వాడు.
"ఏం చేస్తాను....? తెలుగు భాష నీకిచ్చే సౌలంభ్యమది. అందుకే అలా అనుకుని ఇలా నవ్వేసావు సిగ్గులేకుండా ....?" అందామె ఖాళీ అయిన ప్లేట్ ని తీసుకుని లేస్తూ.