Previous Page Next Page 
మయసభ పేజి 5

    బావుందన్నట్లు ఆ ముగ్గురూ తలలూపారు.

    ఆ ముగ్గురూ మాణిక్యం లాబీలోని నమ్మకస్తులు. మరికొద్దీ నిముషాల్లో పథక రచన పకడ్బందీగా పూర్తయిపోయింది.

    వెంటనే ఒక్కొక్కరే కార్యాలయం లోంచి బయటకు నడచి దొరికిన ఆటో పట్టుకుని వెళ్ళిపోయారు.

    పార్టీ కార్యాలయం తిరిగి పూర్తీ నిశ్శబ్దంలో మునిగిపోయింది.

    అక్కడేమీ జరగనట్ట్లే .... అక్కడకెవరూ రానట్లే కార్యాలయం బద్రతా సిబ్బంది నిద్రలోకి జారుకుంది.

                                               *    **    **    **

    గ్రీన్ ఫీల్డ్స్ ......

    పవర్ ఎవెన్యూ

    ముఖ్యమంత్రి అధికారిక నివాసం......

    రేండో౦దల సంవత్సరాలనాడు పూర్తిగా గ్రేనేట్ తో నిర్మించిన చిన్నసైజ్ కోటలాంటి భవనం ... చుట్టూ నాలుగు ఎకరాల వైశాల్యంలో రకరకాల వృక్ష్యాలు ..... లాన్స్ ప్లవర్ బోర్డర్స్ .... పౌ౦టెన్స్ ... వీటన్నింటిని కవర్ చేస్తూ పెద్ద ప్రహరీగోడ .... చైనా వాల్ గా పటిష్టంగా పహారాకాస్తున్నట్ట్లుగా వుంటుంది ఆ గోడపై ఎలక్రానిక్ వైర ఫిన్నింగ్స్...... ఆ వైర్స్ లో ఎప్పుడూ కరెంట్ ప్రవహిస్తుంటుంది.

    ఇరవై అడుగుల ఎత్తులో బలిష్టంగా నిర్మించిన స్టీల్ గేట్.... దానికి ముందు భాగాన రెండువైపులా సేక్యూరుటీ గార్డ్స్ కేబిన్స్ . ఆ కేబిన్స్ లో ఎప్పుడూ ఇద్దరు గార్డ్స్ పుల్ లోడెడ్ గన్స్ తో పహార కాస్తుంటారు.

    సడన్ గా ఆ బంగ్లాలోకి ఎవరు ప్రవేశించినా దారి తెలీక, భవనంలోంచి బయట పడలేక తికమక పడిపోతారు. పన్నెండు హాల్స్, ఇరవై బెడ్ రూమ్స్, ఒక థియేటర్ , లైబ్రరీ, విలియర్డ్స్ రూమ్, బార్ హాల్, కమ్యూని కేషన్ చాంబర్ ... ఒక్క టేమిటి సమస్త హంగులతో అదొక మయసభలా వుంటుంది.

    ఎటునుంచి ఎటు వెళితే ఏ రూమ్ వస్తుందో అంత తేలిగ్గా ఎవరికీ తెలీదు.

    అప్పుడు సమయం తెల్లవారుఝాము రెండు గంటలు.

    భవనం నిశ్శబ్దంగా వుంది.

    పల్చని వెన్నెల్లో ఎత్తయిన వృక్ష్యాలతో , పెద్ద పెద్ద పొదలతో భయాన్ని కలిగించేలా వున్నాయి పరిసరాలు.

    నిశ్సబ్దంగా వున్న వాతావరణంలో సేక్యూరీటి గార్డ్స్ పహరాలైట్స్ వెలుగుతున్నాయి.

    ఆ హల్లో ముఖ్యమంత్రి నందకిషోర్ తన చైర్ లో కూర్చుని ఏ ఫైల్స్ ని ఆదరాబాదరగా చూస్తున్నాడు.

    సి.ఎమ్. పర్సనల్ సెక్రటరీ గోపినాధం ఒక షెల్స్ ముందునుంచున్నఏదో ముఖ్యమైన ఫైల్ కోసం హడావుడిగా వెతుకుతున్నాడు.

    అధికారం కోసం, అధికారాన్ని దక్కించుకోవడం కోసం, అధికారంలో వుండటం కోసం ఆ గదిలో ముఖ్యమంత్రి నందకిషోర్ ఎన్నో నిద్రలేని రాత్రిళ్ళు గడుపుతుంటాడు.

    అదే భవంతిలో ఫస్ట్ ప్లోర్ లో ఓ మూలంగా వున్న మాస్టర్ బెడ్ రూమ్ లో నలభై ఐదెండ్ల స్త్రీ కిటికీ దగ్గర నుంచుని శూన్యంలో చూస్తోంది.

    దుఃఖాజకమైన జ్ఞాపకాలు వరద ప్రవాహంలా ఆమెను ముంచెత్తువేస్తున్నాయి.

    ఆమె ఇందుమతి .....

    ముఖ్యమంత్రి నందకిషోర్ ధర్మపత్ని.......

    అధికార మేలిమితో మెరిసే బంగారు పంజరంలోని చిలుక లాంటిదామె......

    ఆమె ఇల్లు విడిచి వెళ్ళిన గారాల కూతురు గురించి తలపోస్తోంది

    ఎంత అల్లారుముద్దుగా పెరిగింది....?

    చదువులో సరస్వతి.

    ముఖ్యమంత్రి కూతురుగా కాక తన తెలివితేటలతో మెడిసన్ సీట్ తెచ్చుకుని గోల్డ్ మెడల్  సంపాదించుకుంది. ఆ తరువాత ఎమ్. ఎస్. కూడా చేసి అందులోనూ గోల్డ్ మెడల్ తెచ్చుకున్న ప్రతిభావంతురాలు......

    ఉదయమే కూతురు మోము చూడందే కళ్ళు తెరవని భర్త.... పాతికేండ్లు వచ్చినా తండ్రి వడిలో కూర్చుని మారాం చేసే కూతురు __ ఆ తండ్రి కుఉతుర్ల అనుబంధాన్ని , ఆప్యాయతని చూసి ఆనందించే తల్లిగా ఇందుమతి.....

    ఏవి ఆ మధురమైన దృశ్యాలు ....?

    స్మ్రుతులుగా మారిపోయి వెక్కిరిస్తున్నాయ్.....!

    వెక్కిళ్ళు తెప్పిస్తున్నాయ్ ....!

    కేవలం అధికారం కోసం కన్న కూతుర్ని వదులుకోవటానికి సిద్దపడిన భర్త....తన మనస్సుకు నచ్చని పని తన వాళ్ళు  చేసినా సహించలేక ఇల్లు వదిలి వెళ్ళి కూతురు.....

    తండ్రిని గుడ్డిగా అనుసరించే కొడుకు......

    కొడుకు ఎదురుగా వుంటున్నా తల్లి __ బిడ్డగా కాక తండ్రి __ బిడ్డగా వుంటున్నాడు.

    తల్లి _ బిడ్డగా వున్న కూతురు తన జీవితాన్ని వెతుక్కుంటూ ఎటో వేల్లిపోయిమ్ది.

    ఎన్నో వున్నా..... అన్నీ ఉన్నా ... అనందం మాత్రం కరువయింది.

    బంగారపు ఎడారి.....

    గోల్డెన్ డిస్టర్.....

    విసురుగా తల తిప్పుకుని వాల్ క్లాక్ కేసి చూసింది ఇందుమతి.

    భర్త జాడలేదు........

    శబ్దం రాకుండా మెట్లుడిగి వచ్చి భర్త ఆఫీసు రూమ్ వేపు చూసింది.

    లైట్స్ వెలుగుతున్నాయి.

    ఏ.సి మెషిన్ వినిపిస్తోంది.

    ఒక్కక్షణం నిట్టూర్చి తిరిగి మెట్లెక్కి బెడ్ రూమ్ చేరుకొని దిండులో తలదూర్చి పొరలుకోస్తున్న దుఖాన్ని బలవంతాన దిగమ్రింగుకునే ప్రయత్నం చేయసాగింది.

    సి.ఎమ్ ఆఫీసు గదిలో ఏమీ బోధపడటంలేదు కాని అధిష్టాన వర్గంలోని మన మనిషి డిల్లీ నుంచి ఫోన్ చేసి నీ సీటు క్రిందకు ఎసరు రాబోతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఎటువేపు నుంచి ....? ఎవరి మూలంగా ...? " నందకిషోర్ నుడురుని రుద్దుకుంటూ స్వగతంగా అన్నాడు.

    ఆ మాటలు విన్న పి.ఎస్. గోపీనాథం గొంతు సవరించుకున్నాడు.

    "ఇంకెవరూ....? ప్రతిపక్ష నాయకుడు రామదాసు.... కాకిలామ్తి రాందాసు ... ఏదైనా కేలక బోతుండవచ్చు." గోపీనాథం మెల్లగా అన్నాడు

    గోపీనాథం. నందకిషోర్ బాల్య స్నేహితులు.

    ఒకే బడిలో, ఒకే కాలేజీలో చదువుకున్నారు.

    గోపీనాథం గొప్ప తెలివి తేటలు కలవాడే కాదు, గొప్ప నమ్మకస్తుడు కూడా.

    అందుకే నందకిషోర్ సి.ఎమ్. అయ్యాక ఎక్కడో డిల్లీలో జాబ్ చేసుకుంటున్న గోపీనాథాన్ని పిలిపించుకుని తన పర్సనల్ సెక్రటరీగా నియమించుకున్నాడు.

    బయట వున్నంత వరకు గోపీనాథం, నందకిషోర్ కి సార్ అంటాడు.

    గ్రెన్ ఫీల్స్ భవనంలోకి ప్రవేశించాక ఒరేయ్..... ఏంటిలా అనే పలకస్తాడు.

    నందకిషోర్ శత్రువులు గోపీనాథాన్ని గుంటనక్క గోపీనాథం  అని కసిగా పిలుస్తుంటారు.

    "ఏ విషయంలో కేలకవచ్చు.....?" నందకిషోర్ సాలోచనగా ప్రశ్నించాడు.

    "మనం ఒక విషయానికే పరిమితమా....? ఎన్ని కుంభకోణాలు మన వెనకున్నాయి....? వాటిల్లో ఒకదాన్ని పసిగట్టి ఉంటాడు" గోపీనాధం తన చిరు బొజ్జను నిమురుకుంటూ అన్నాడు.

    తిరిగి ఆ గదిలో కొద్ది క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది.

    "ఒక సూట్ కేస్ తీసి బేరం పెట్టు.... ముందు మన అదేనంలోకి తీసుకునే ఏర్పాట్లు చూడు" అంటూ చటుక్కున లేచి ఫస్ట్ ప్లోర్ కేసి సాగిపోయాడు నందకిషోర్ .

    చిన్నగా నవ్వుకుంటూ పోన దగ్గరకు నడిచాడు గోపీనాథ్

    పోన్ దగ్గరకు తీసుకుని రామదాసు నెంబర్ ట్రై చేయటం ప్రారంభించాడు గోపీనాథ౦.

    క్షణాలు క్రమంగా కరిగిపోతున్నాయి......

    ఎంగేజ్ ... ఎంగేజ్ సౌండ్ వస్తోంది ఫోన్ కి అ వేపు నుంచి.

    చిన్న పామును చంపటానికి పెద్ద కర్రనెందుకు ఉపయోగించాలనే మనస్తత్వం గోపీనాథ్ ని దైతే __ చిన్న పమైనా అది పుట్టుక ముందే దాన్ని చిదిమేయాలనే మనస్తత్వం నందకిషోర్ ది.

    అరగంట ప్రయత్నించినా ప్రతిపక్ష నాయుకుడు రామదాసు నెంబర్ దొరక్కపోవటంతో గోపీనాథ౦ విసుగుచెంది..... అ .... ఆ రామదాసే౦ చేయగలడులే అనే అహంతో, దీమాతో నిద్రకు ఉపక్రమించాడు.

                                                          *    *    *    *

    రాజకీయాలకు __ నేరాలకు రాజకీయ నాయకులకు __ నేరస్తులకు దగ్గర సంబంధాలే గాదు, పోలికలు కూడా చాలా ఉంటాయి. ఈ రెండు రంగాల్లోనూ చిన్న విషయమే కదా అని దేన్ని ఉపేక్షించి వదిలేసినా.... అదెక్కడో, ఏదో మలుపు తిరిగి ఊహించమని మలుపులో ఉరితాడై మెడకు చుట్టుకుంటుంది.

     ఆ రాత్రి నందకిషోర్ తన సమస్యల్ని, వచ్చిన ప్రమాదాన్ని, రానున్న కష్టనష్టాల్ని తాతకలికంగా మరచిపోయి గాఢ నిద్రపోయాడు.  అతనికా కంపార్ట్ మెంటలిజం ఉంది. మా ముందు రామదాసు ఎంత? ఎన్నిసార్లు ఎన్నిటి గురించి అరవలేదనే ధైర్యంతో గోపీనాథ్ నిద్రపోయాడు.

 Previous Page Next Page