Previous Page Next Page 
అసిధార పేజి 30

                                                                    22

    "విన్నావా ఆ ద్వని?" కృతిని అడిగాడు విజయ్. జాగ్రత్తగా ఆలకించసాగాడతను.

    "వింటున్నాను? అది నీటి ద్వని" కృతి మాటల్లో అనందం కొట్టిచ్చినట్లు కనబడుతున్నది.

    కృతి మాత్రమెకాదు. విజయ్ ఆ మాట అనంగానే అందరిముఖాలలో జీవకళ వచ్చింది.

    ఒక రోజు రెండురోజులా సరిగా రెండువారాలు. వాళ్ళు ఓదారీ తెన్నూ లేకుండా తిరగడం మొదలుపేట్టి. తెచ్చుకున్న నీళ్ళు అయిపోయి ఒకటిన్నర రోజు అయింది. వారిదాపులలో నీళ్ళు కనబడలేదు. అకాలంలో వర్షం అన్నట్లు కుండపోతుగా వర్షం కురిసింది వాటర్ బాటిల్స్ తప్ప నీళ్ళు నిలవజేసుకోవటానికి వల్ల దగ్గర ఏమీ లేవు. వాన నీళ్ళు తాగారు, తడిశారు. బాటిల్స్ నిండా పట్టుకున్నారు. ఆ అనందం కేవలం ఒక్కరోజుకే పరిమితం.

    మళ్ళీ నీళ్ళు అయిపోయాయి. చీమలుదూరని చిట్టడవిగా కాకులు దూరనికారడవి గా వుంది వాళ్ళు నడుస్తున్న ప్రదేశంగగనం కూడా వాళ్ళ పాలిట ఎండమావిలాతయారయింది! ఒక్కోసారి కనిపించేది. అంతలో పైనం తాపెద్దచెట్టు అనుకుని వుండడంవల్ల ఆకాశం అనేదిచూశామా! ఇదంతా భ్రాంతా, అనిపించేది.

    దట్టంగా చెట్లతో పెరిగిన అడవి అది. అందుకే దానికో దారీ తెన్నూ కానరాలేదు. చాలా ఎత్తుగావున్న చెట్టుఎక్కి చూశారు! నిక్షేపంలా ఆకాశం వుంది. ఆకులూ పేద్దపెద్ద చెట్టు కిందమాసులు దూరంగా వుండి పైన కొమ్మలు ఆకులూ పెనవేసుకుపోయి ఆపై రాగం (అదే ఆకాశం అదే శూన్యం) కానరాకుండా వుండిపోవటంతో విచిత్రంగానే వుంది.

    వాళ్ళకిఒక్కటే ఆశ.

    చెట్లు పచ్చగా వున్నాయి. ఇది ఎడారి ఎక్కడో అక్కడ నీళ్ళు దొరక్కపోవు.

    వెనుదిరిగి వెళ్ళే పనిలేదు. వచ్చినదారి గుర్తు తెలియటంలేదు. వెనుకా ముందు ఒకేలాగుంది. అక్కడక్కడ గుంటల్లో నీళ్ళునిలిచి వున్నాయి. అవి వాన నీళ్ళు , అవి తాగితే ఈ పాడుదేహానికి సర్వరోగాలు రావచ్చు. ఆకూ అలము వాటి తారూకు సూక్ష్మజీవులు ఎన్నో వుండవచ్చు. చేసేదేమీలేక ఆ నీళ్ళే తాగారు.

    పదిరోజులు గడిచిపోయాయి.

    గుంటలలో నిలవవున్న నీళ్ళు ఇగిరిపోయి బురద మిగిలింది. మళ్ళీ ఒకటిన్నర రోజు నానాబాద పడ్డార్తర్వత అడవిని అనుకున్న కొండలు కానరావచ్చాయి. ఆ అడవికి రక్షణ కవచంలా కొండలు నిల్చివున్నాయని పించింది. గోడలా వరసగా వున్నాయని. సన్నటి సెలయేరు ఓ కొండనుంచి జాలువారుతున్నది. వీళ్ళపాలిత అమృతంలా అక్కడ నీళ్ళు వుండబట్టి రెండురోజులు గడిపి మళ్ళీ ప్రయాణం సాగించారు.

    నీళ్ళనేవి మళ్ళీ కనబడలేదు ఇటు చూస్తె అడవి. అది ఎంత పెద్దదో ఎంతదూరం వ్యాపించి వుందో తెలియటం లేదు. పులులు సింహాలు లాంటి ప్రమాదకరమైన జంతువులు వున్నాయో లేదో తెలియదు. ఇటు వైపుకు ఏవీరాలేదు.

    అడవి మధ్యనుండి నడవటంలేదు కొండలు ఎక్కటంలేదు. అటుఇటు కాకుండా ప్రయాణం సాగిస్తున్నారు. మాటలతో వర్ణించలేనంత అందంగా వుంది అక్కడ ప్రకృతి . కాని దానిని ఆస్వాదించే స్థితిలో లేరు. వీళ్ళయిదుగురిలో ఏ ఒక్కరుకూడ, వాళ్ళకి కావాల్సింది. ముందు నీరు తర్వాత సరిఅయిన దారి.

    మళ్ళీ అడవిలోంచి నడవడం మొదలు పట్టింతర్వాత కష్టాలు మొదలయ్యాయి. చుక్క నీళ్ళు దొరకలేదు. నడుస్తున్నారు. ఎంత నడిచినా పళ్ళచెట్లు కనీసం ఒక్కటన్నా కనబడలేదు. కొంతలో కొంత మెరుగేమిటంటే పాములు తప్ప పులులు సింహాలులేవు.

    మొదట్లో నోరు పిడచగట్టుకు పోతుంటే ఆ బాధను ఒకరి కొకరు చెప్పుకున్నారు తర్వాత అదీలేదు . తదీపాడీలేని నాలుకతో పెదవులు రాచుకోవడం తప్ప.

    దారితప్పాం. అందరిదీ ఏకాభిప్రాయమే.

    వీళ్ళందరికీ తెలియంది కనీసం వూహకికూడా తెలియంది తామెక్కడ నడుస్తున్న వాళ్ళంతా గట్టిగా నిర్దారణ చేసుకున్నారు. మంచోచెడో తెలియదు పచ్చి ఆకులూ నమిలారు. తర్వాత అదీ కష్టమయింది.

    ఎవరైనా ఎప్పుడైనా నా ఇటువస్తే తమ అస్థిపంజరాలు చూస్తారు. వాళ్ళకేమి అర్ధంకాదు . అందుకే విజయ్ డైరీలో వివరంగా అనీరాసి భద్రపరిచాడు.

    "ఇది డేంజర్ ప్లేస్ ఎటు దారితీసినా చివరికి చేరేది మృత్యుదేవత వోడిలోకే.

    చివరి అక్షరాలు కాస్త పెద్దవిగా రాసి డైరీ మూశాడు.

    కళ్ళల్లోకి ప్రాణంరావటం అంటే ఏమిటో తెలిసివస్తున్న క్షణాలలో

    .....లీలగా నీటిద్వని.

    పోతున్న ప్రాణాలు లేచివచ్చాయి అందరికి.

    "నీళ్ళు నీళ్ళు" అందరూ వోకే రకంగా అరిచారు.

    "ఒన్ మినిట్ మనలో ఇప్పుడు అణుమాత్రం వోపికలేదు. నీటి ద్వనివిని నీటికోసం పరుగులు తీసి మరోదారిన పడ్డామంటే పక్షి ఎగిరిపోతుంది.  మనం జాగ్రత్తగా అడుగులు వేయాలి ఇదిమనకు ప్రాణాలతో పోరాడే చివరి కఠిన పరీక్ష" విజయ్ నెమ్మదిగా నీరసంగా అన్నాడు.

    "అవును" అందరూ ముక్తకంఠంతో పలికారు.

    "బయల్దేరుదా౦" విజయ్ లేచి అనంగానే కమల్ అందుకున్నాడు "విజయ్! నాదోమాట వోపికలేక మనమంతా కూలబడిపోయాం. మాన వీపున ఈ బరువుతో అడుగు వెయ్యలేము. మనిద్దరం వెళ్ళి చూసి వద్దాం"

    "మీరు  దారితప్పిపొతే?" కృతి అంది వెంటనే.

    పేలవంగా నవ్వాడు విజయ్.

    "దారితప్పటమా? అదెప్పుడో జరిగింది. మేమెళ్ళెదారిలో చెట్టు కొమ్మలువిరిచి గుర్తుకి కిందపడేసి వెళతాం. ఆ గుర్తుచాలు మీకు, పదకముల్!" మారుమాటకాస్కారం యివ్వకుండా విజయ్ ముందుకు కదిలాడు.

    నిశ్చలనొకసారిచూసి విజయ్ వెనుకనే నడిచాడు కమల్.

    వాళ్ళిద్దరూ వెళ్ళిపది నిముషాలయింది.

    "నాకో అనుమానంవస్తున్నది" సుబ్బారావు అన్నాడు.

    అదేదో కక్కమని కృతి అడగలేదు నిశ్చల అడగలేదు సుబ్బారావే కక్కేశాడు.

    "ఆ రోజు కొండగుహలో ఒ ద్వని మనకి భయంకరంగా వినిపించింది. భయపడుతూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. చివరికాద్వని ధారాపాతంగా దముకుతున్న నీళ్ళది. మన అంచనా తారుమారుఅయి పగలబడి నవ్వుకున్నాం అవునా?"

    సుబ్బారావు మాటలకి ఎవరూ అవునని గాని కాదనిగాని అనలేదు.

    సుబ్బారావు మళ్ళీ అన్నాడు.

    "ఇప్పుడు నీళ్ళ ద్వని వినిపిస్తున్నది.ఇది నీళ్ళుగాదేమో? మన భ్రమ కావచ్చు లేక నీళ్ళు గానరాక నిజంగా ఈ తఫా ప్రామాదం ఎదురవుతుందేమో!"

    "అవును సుబ్బూ!" నిశ్చల కోపంగా అరిచింది.

    కృతి పెదవి విరిచి నిర్లిప్తంగా వుండిపోయింది. సుబ్బారావు మళ్ళీ నోరెత్తలేదు.

    ప్రస్తుతం వాళ్ళయిదుగురికి కావాల్సింది గోల్డెన్ సిటీకాదు. ఆ గోల్డెన్ సిటీ ఏదో కళ్ళముందు ప్రత్యక్షమై దానికి చక్రవర్తిని చేస్తానన్నా ఎవరూ వూం! అనే స్థితిలో లేరు వాళ్ళకా ఆశ అసలే లేదు. ప్రస్తుతం వాళ్ళకి కావలసింది గుక్కెడు నీళ్ళు.

    పోనీ కొన్ని చుక్కలనీళ్ళు .

    వెళ్ళిన వాళ్ళు రాలేదు.

    వాళ్ళు ఏమయ్యారు లేక వల్లకేమయింది?

    "ఎం చేద్దాం ?" నెమ్మదిగా అడిగింది నిశ్చల.

    "పావుగంట చూసి బయల్దేరుదాం" కృతి అంది.

    "ఎక్కడికి ?" సుబ్బారావు అడిగాడు.

    "మనవాళ్ళు వెళ్ళిన దగ్గరికి" కృతి చెప్పింది.

    "అదెక్కడ! ఎందుకు?" అన్న పిచ్చిప్రశ్న వేయలేదు సుబ్బారావు కళ్ళు మూసుకు పడుకున్నాడు.

    "ఇంకొక్క అయిదునిముషాలు తాము వాళ్ళకోసం ఎదురు చూడటానికి" కృతి టైము చూసుకుంటూ అనుకుంది.

    "కృతీ!"

    "నిశ్చలా!"

    ఒకేసారి పిలిచారువాళ్ళు దగ్గరగా వస్తూ విజయ్, కమల్ ముగ్గురూ వాక్కసారిగా లేచి కూర్చున్నారు "ఏమయింది?" వాళ్ళనో ట్లొంచి మాటరాకముందే కళ్ళముందు అమృతభాండిలా నీళ్ళు నిండా వున్న వాటర్ బాటిల్స్ వుంచారు.

    "నీళ్ళు" సుబ్బారావు అరిచినంత పనిచేశాడు. అంతేకాదు కమల్ చేతులోంచి గబుక్కున లాక్కుని గబగబా నీళ్ళుతాగటం మొదలు పెట్టారు.

    నెమ్మదిరా సుబ్బూ!" కమల్ హెచ్చరించాడు.

 Previous Page Next Page