Previous Page Next Page 
అసిధార పేజి 31

  

    విజయ్ చేతిలోవున్న వాటర్ బాటిల్ కృతి అందుకుంది. కప్పులోకి వంచుకుని బాతి నిశ్చల కిచ్చింది.

    "అబ్బ ప్రాణం లేచి వచ్చిందిరా విజయ్!"

    "మనం అక్కడికి వెళుతున్నాం, మీరు చూడబోతున్నారు" విజయ్ సామానుసర్దుతూ అన్నాడు.

    "ఏంటోగా .....!" సుబ్బారావు వాక్యం పూర్తీచేయకుండానే పెద్ద వాంతి చేసుకున్నాడు.

    తాగిన అరబాటిల్ నీళ్ళు బైటికి వచ్చాయి.

    "ఇడియట్ , అంత ఆతృత ఏమిటిరా ! ఖాళీ కడుపు మీద అన్ని నీళ్ళు తాగటమా? కడుపులో యిమడవద్డా?" అన్నాడు విజయ్.

    కొద్దిసమయంగడిచిపోయింది.

    అందరూ కలసి బయల్దేరారు.

    గుక్కెడు నీళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడాయి. అదీ సరైన సమయానికికనబడ్డాయి. లగేజీ మోస్తూ నడవడానికి శక్తిలేదు. కాని నీళ్ళు కంటబడ్డాయి, శక్తి పుట్టుకువచ్చేసింది.  

    లగేజితో కాళ్ళి డ్చుకుంటూ నడవటంవల్ల సరీగ ఇరవైనిమిషాలు పట్టింది ఆ ప్రదేశానికి చేరటానికి .

    మిట్టపల్లాలతో కప్పుబడ్డ ఓ ఎత్తైన ప్రదేశం వుందాక్కడ. చెట్ల మధ్య రాళ్ళూరప్పలూ వున్నాయ్ ఎత్తుపాటి ప్రదేశంలేక అతిచిన్న కొండ మొత్తానికి అలాంటిదే ఏదో వుంది. పైపైకి నడుచుకుంటూ పోతెగాని తెలియదు . దాని ఎత్తు దాని తీరు.

    ఎన్ని మెలికలు తిరిగిపైనించి వస్తున్నదో తెలియదు. ఎత్తునించి జలధార కిందికి అత్యంత వేగంగా దుముకుతున్నది. కిందినుంచి మలుపు తిరిగి వెళుతున్నది అది ఎన్ని మలుపులుతిరిగి ఎక్కడికేళుతున్నదో చూస్తేగాని తెలియదు. ఆ నీరు.    

    సామాను కిందపెట్టి నీళ్ళవైపు పరుగుతీశాడు సుబ్బారావు.

    "మన ప్రాణంనిలిపిన నీళ్ళు. ఈప్రదేశాన్ని మనం మరువరాదు" కృతి అంది.

    "దీనికో పేరు పెట్టాను.మనకి జీవంపోసింది. పేరు జీవధార" విజయ్ అనంగానే ముగ్గురూ "గుడ్ గుడ్" అంటూ ఆనందంతో చప్పట్లు కొట్టారు.

    నీళ్ళల్లో డిగి ముఖంకడుక్కు౦టున్న సుబ్బారావు వెనుదిరిగి అడిగాడు "ఎందుకురా చప్పట్లు కొడుతున్నారు?"

    "నువ్వు నీళ్ళలో ముందుగా దిగినందుకు" కమల్ నవ్వుతూ అన్నాడు.

    ఇప్పుడు వీళ్ళ ముగ్గురూ నవ్వారు.

    వీళ్ళలోంచి తిరిగివస్తూ "వీళ్ళకేం పనిలేదు. వూరికే నవ్వేలా వస్తుందో, యిన్ని నీళ్ళు చూసేసరికి వేపకాయంత వెర్రి పుట్టివుంటుంది" అనుకున్నాడు సుబ్బారావు.

    ఇప్పుడు వీళ్ళ నలుగురూ చెత్తాపట్టాలేసుకుని వీళ్ళవైపు బయల్దేరారు.

                                                                    23

    ఒకసారి బుద్ధితక్కువ పనిచేసి అల పనిచేశానని తెలుసుకున్నవాడు జీవితంలో మరోసారి అలాంటి పాడుపని చెయ్యడు . ఓవల చేస్తేవాడు పిచ్చివాడై వుంటాడు. లేక వారము మూర్క్ఘుడై వుంటాడు. ఈ విషయ మీదనే......

    "ఒకసారి భుద్ధితక్కువ పనిచేశాం. మళ్ళీ అపనిమాత్రం చేయకండి......." అన్నాడు సుబ్బారావు.

    "ఏ విషయంలోరా సుబ్బబ్బాయ్!" కమల్ అడిగాడు.

    దారిలో మనకోసారి నీళ్ళు కనబడ్డాయి. అక్కడ అగాలన్న  ఇంగితజ్ఞానం ఎవరికీ లేకపోయింది. అ చోటు వదిలి వచ్చేశాం. మృత్యువురా రమ్మని చేతులు చాచిన క్షణంలో ఈ జలధార కనిపించింది ఇక్కడనుంచి ఇంకా ముందుకిసాగి మరోసారి బుద్ధితక్కువ పని చేయకంటున్నాను"

    "నీ ఆలోచన బాగుందిరా సుబ్బిగా" విజయ్ అనంగానే సుబ్బారావు మురిసిపోయాడు ఆ మురిపెంసొంతం తీరకముందే విజయ్ అందుకున్నాడు "ఒరేపూల్ మనం తిండికూడా మూడువారాలుకూడా రాడు. ఆపైన నీళ్ళుతాగి బతుకుతావా?

    "సరే ఇక్కడే వుండిపోదాం. ఎందుకంటే అందుబాటలో ఉన్న నీళ్ళు వదిలి దూరంగా పోయే బుద్ధితక్కువ పని చేయకుండా నీళ్ళు తాగి జీవితా౦తం బతకలేముకదా" కమల్ అందుకుని అన్నాడు.

    "మనం గోల్డెన్ సిటీ కెళ్ళాలంటే ముందుకు సాగాలికధా?"

    "పోనీ మరలి వెళ్ళాలన్నా మన వూరు ఎటు ఎలా వెళ్ళాలి?"

    "నీళ్ళు తాగి బతకటానికా మనం వచ్చింది?"

    "లేక నీళ్ళు తాగకుండా చావటానికా?"

    "ఓసారి బుద్ధితక్కువపని చేసాంకదా అని ....."

    "మరోసారి చేయకూడదని ఎక్కడ ఉంది?"

    విజయ్, కమల్, వొకరితర్వాత ఒకరు అంటుంటే సుబ్బారావు బిక్కముఖం పెట్టాడు.

    "వాయించింది చాల్లే" అంది కృతి.

    "సుబ్బు అమాయకుడు. వీళ్ళు ఆడించటానికి దొరికాడు. మీ ఇద్దరినీ కలిపి వాయించేవాళ్ళు లేక " అంది నిశ్చల.

    "మహిళామండలి సుబ్రావ్ వేపు తిరిగిందిరోయ్. మనం నోరుమూసుకోవటం ఉత్తమం" కమల్ అన్నాడు.

    "ఉత్తుత్తమం కాదురా కమలనాథా! ఉత్తమోత్తమం" విజయ్ అన్నాడు.

    అందరూ హాయిగా నవ్వుకున్నారు.

    ఈ నవ్వులు  వాళ్ళమధ్య సాగింది. మూడువారాల క్రితం నీళ్ళు కనిపించింది తరువాత . నీళ్ళు తాగి రవంత తిని తాపీగా పడుకుని తీరుబడిగా ముందు కార్యాక్రమం చర్చించుకున్నప్పుడు

    అలసి పోయి వున్నారేమో ఆ పూటకి కొత్త ఆలోచన రాలేదు నిద్రతప్ప .

    శరీరానికి పూర్తీ రెస్ట్ చిక్కింతరువాత నూతనశక్తి నూతన ఆలోచనలు వచ్చాయి.

    ఈ నీళ్ళు వున్నచోట ప్రామాద భరితమైనవి ఏవీ లేవు. కనుక క్యాంఫ్ యిబ్బంది వుండడు. కొత్తమార్గము తెలియవచ్చు.

    మర్నాడు యీ నిర్ణయానికొచ్చారు.

    అందరికీ ఇది నచ్చింది.

    అనుకున్న విధంగానే మూడు వారాలయింది మళ్ళీ.

    తెచ్చుకున్న ఆహారం తరిగిపోతున్నది.

    వెళ్ళేటప్పుడు వున్న హుషారు తిరిగి వచ్చేటప్పుడు వుండటం లేదు.

    అ ఉదయం .......

    "మనం వెళ్ళగలిగినంత దూరం అన్నిపక్కలకి వెళ్ళి చూశాం. ఆకాశానికికంటే చెట్లు పిచ్చిమొక్కలు , దుబ్బులు తప్ప కాయలు కాసే చెట్లు తగలలేదు ఓ నాలుగైదు చెట్లకి కాయలువున్నా అవి తినటానికి పనికొచ్చేవి కావు. ఇంకపై ఆకూ అలము తిని బతకాల్సిందే "

    విజయ్ అన్నదినిని ఎవరూ మాట్లాడలేదు అందరివేపూ చూసి "ఓ పని చేద్దాం" అన్నాడు.

    "అందరం కలసికట్టుగా చావటం కాదుకదా?" సుబ్బారావు అనుకున్నాడు.

    "అదేమిటో చెప్పరా!" కమల్ అడిగాడు.

    "మనం చెట్లలోకి లోపలివేపుకి వెళ్ళిచూశాం. అన్నీ చెట్లసముదాయమే పైకేళ్ళిచూశాం. అది నాగజెముడు మొక్కలు, ఇంక మనం చేయాల్సింది వక్కటే, అది మనం వెళ్ళనిచోటు.......

    "ఎటు ? ఎటు?" అందరూ ఆతృత ప్రకటించారు.

    "ఇటు" చేయిచాచి చూపిస్తూ అన్నాడు విజయ్.

    "ఇటా, ఇటేముంది?"

    "ఏముందో నాకుమటుకు ఏం తెలుసు? ఈ నీటిపాయ ఎన్ని వంకర్లు తిరిగి ఎటేటు వెళుతుందో మనేకేవరికీ తెలియదు చాతనయినంతవరకూ అంతా గాలించాం మనము ఓసారి అనుభవించాం గాబట్టి నీటికి దూరంగా వెళ్ళము. కనుక చేయవలసింది ఈ నీళ్ళపక్కనుంఛీ సాగి ముందుకీ పోదాం నీళ్ళప్రాబ్లమ్ వుండడు. ఎంతదూరం వెళతామో ఏదోస్తుందో చూద్దాం' విజయ్ అన్నాడు.

    "ఈ ఐడియా ముందే మనలో ఎవరికీ ఎందుకు రాలేదురా?" విజయ్ ని మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు కమల్.

    "బహుశా ఇది చావు తేలివేమో? అందుబాటులో ఆహారంలేదు. మన దగ్గర ఆహారం కేవలం నాలుగురోజులకే వుంది. ఎలా అని బుర్ర పగలగొట్టుకోగా వచ్చిన కొత్త ఆలోచనయిది."

    "నీ ఆలోచన నాకూ వచ్చిందిరా" సుబ్బారావు అన్నాడు.

 Previous Page Next Page