Previous Page Next Page 
అసిధార పేజి 29

 

    "నువ్వు చెట్టు ఎక్కనూలేదు. అక్కడినుంచి పడికాళ్ళు విరాగొట్టుకునూవద్దు గుహల్లో ఒంటరిగా బయల్దేరి అటు నీ ప్రాణం కష్టపడింది. ఇటు నిన్ను వెతకలేక మా బాధ మా ఆరాటం వర్ణనాతీరం" అంది కృతి.

    "మనం ఇదివరకు లాగానే కావాలా కాయాలి . నిశ్చలా తప్పోవప్పో ఒకసారి వంటరిగా వెళ్ళావ్ ఈరాత్రికి ఇహపై ఎప్పుడూ కూడా వంటరిగా వెళ్ళకు" కమల అన్నాడు.

    "అయ్యో వేళదామనుకుంటున్నానే!" అంది నిశ్చల అమాయకంగా ఓ పోజుకొట్టి.

    "ఇప్పుడే వెల్లవే నిన్నేవరం అడ్డగించం" అంది కృతి.

                                    21

    తెల్లారింది అలా అని వాచీలో ఆరుగంటల సమయం తెలుపుతున్నది. అలిసిన శరీరాలు చల్లని చెట్లగాలికి సుఖంగా నిద్రపట్టింది.

    అందరూ లేచి కూర్చున్నారు.

    వాటర్ బాటిల్స్ లో నీళ్ళు బోటాబోటిగ సరిపొయ్యాయి.

    "ముందు సాగిపోవటమే" విజయ్ అన్నాడు.

    "చుక్కనీళ్ళు దొరకకపోతే ఏంచేయాలి?" సుబ్బారావు పెద్ద అనుమానం వెలిబుచ్చాడు.

    సరీగ అప్పుడే చేతులూరుకోక చెట్టుమీదకి టార్చిలైటు వేసిన నిశ్చల కొయ్యబారిపోయి అలాగే వుండిపోయింది.

    సుబ్బారావు తల పైకెత్తి చూశాడు.

    "పా .....పా .....పాములు రోయ్!"

    గట్టిగా అరిచి రెండంగంల్లో ఆ చెట్టుకి పరుగుతీశాడు సుబ్బారావు.

    ముగ్గురూ తలఎత్తి చూశారు. నిజమే ఒకటికాదు రెండుకాదు. చాలానే పాములున్నాయ్. చూడటానికి పసిరిక పాముల్లాగానే వున్నాయి. తోక కొమ్మకి మెలిపెట్టి తల కిందికివుండి పోట్లకాయల్లా వేలాడుతున్నాయి.

    ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చేతికందని తీసుకుని దూరంగా వెళ్ళారు.

    "తాము రాత్రి నిద్రపోయింది అన్ని పాములు వినిపిస్తున్నచెట్టు కిందినా? రాత్రి వక్కసారి మాత్రమె పైకి లైటువేసి చూడటం జరిగింది. అప్పుడేమీ కనబడలేదే?"        

    ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేవారు ఏరి?

    "మనం రాత్రి అ చెట్టుకిందికి కదూనిద్రపోయింది?"

    "తోక కొమ్మకి చుట్టి కిందికి వేలాడే పాముల్ని చూడటం ఇదే మొదటిసారి . ఇవేం పాములు?"

    "మన జోలికి అవి రాలేదేం?"

    "అవి పాములా పాముల్లా వుండే వూడలా?"

    "రాత్రి లేంది తెల్లారేటప్పటికి మేలుచుకు వస్తాయా?"

    తలొక ప్రశ్నవేశారు. జవాబు చెప్పే నాదుడేడి? ఇంక వాళ్ళే సర్దుకు చెప్పుకోవాలి.

    "అసలు ఇక్కడ మనుషులుండి చస్తేగా వాటికి జీవుళ్ళా కనబడి వుంటాము మన్ని ఏం చేయాలో తెలియక అవి తలకిందులుగా వేలాడి తపస్సు చేస్తున్నాయి" విజయ్ అన్నాడు.

    "మనవేపు పసిరిక పాములు చెట్లమీదనే నివసిస్తాయి. ఎగిరి దూకి మనిషి నుదుటిమీద కాటేస్తుందంటారు. కాని చాలమంది అచెట్లకిందనుంచి వెళుతూనే వుంటారు. కనికట్టుకువచ్చి కాటేసిన సందర్భం నేనేరుగును. ఇదోరకం జాతి పాములు , వీటి నివాసం ..... చెట్లు అనుకోవాలి" కృతి అంది.

    "ఏదో వకటి తర్వాత అనుకుందాం . ముందిక్కడినుంచి దూరంగా వెళదాం పదండి" సుబ్బారావు అన్నాడు.

    "కొంత సామాను ఆ చెట్టుకిందనే వదిలేశాము వెళ్ళి తేనాలి" కమల్ అన్నాడు.

    "బాబోయ్ పాములచెట్టు కిందకా _ నేరాను సామాను పోయినా ఫరవాలేదు" సుబ్బారావు అన్నాడు.

    "నేవేళ్ళి తెస్తాను" కమల్ అనంగానే "నేనూ వస్తాను పదరాత్రంతా ఏమీ చేయనని ఇప్పుడు చేస్తాయా?" విజయ్ అన్నాడు బయల్దేరుతూ.

    కృతి , నిశ్చల చూస్తూ మౌనం వహించారు .

    శాపం పొందిన మునికన్యల్లా ఏకాగ్రతలో దీర్ఘతపస్సు చేసే మునుల్లా సాములు అలాగే వుండిపోయాయి.

    సామానులు ఇవతలకి క్షేమంగా తెచ్చేశారు. ఏ చెట్టుమీద మరేప్రమాదము కనిపించలేదు.

    అక్కడనుంచి దూరంగా వెళ్ళటానికి నడక మొదలు పెట్టారు.

    సమయం కూడా వీళ్ళతోపాటు సాగుతున్నది ముందుకీ.

    మధ్యాహ్నం అయింది.

    గుట్టలు తిరిగి చెట్లు ఎక్కువ అయ్యాయి.

    ఇప్పుడు వెలుతురు వుంది.

    కొన్ని పక్షులు వుడతలు లాంటివి మధ్య మధ్య దర్శనం ఇస్తూన్నాయి.

    "వోహో హూ హ్యూ య్య"

    సుబ్బారావు కొత్తరకంగా అరిచాడు.

    అందరూ వులిక్కిపడ్డారు.

    "నీకేం వచ్చిందిరా సుబ్బాయ్ కొత్తగా ఆ పెరుపేమిటి విజయ్ అడిగాడు.

    "అదో అటు చూడండి" సుబ్బారావు తలెత్తి దూరంగా చూపాడు.

    చెట్లమధ్యనుంచి దూరంగా ఆకాశం కనిపిస్తున్నది. అది ముందుగా సుబ్బారావు చూశాడు అదన్నమాట అతగాడి హుయ్యు కర్ధం.

    మనం పైకిచూస్తే పైనేమీ కనబడలేదు. ఇంకా కోటప్రదేశం గుహల్లోంచి వస్తున్నట్లే వుంది. కొన్నిచోట్ల ఎత్తుపల్లాలు గుట్టలు ఎక్కిదిగినట్లు వుంది ఆకాశాన్ని అంటే ఎత్తులో కొమ్దదూరం చెట్లు వున్నాయి. అవేమో పైన కలసిపోయి మధ్యహ్నం వెలుతురు పడటం కొద్దిసేపు చీకటి అంతా కలగా పులగంగా వుంది. మనం ఎక్కడ నడుస్తున్నామన్నది ఆపై దిగివచ్చి చెపితే తప్ప తెలియదు" కమల్ అన్నాడు.

    "మనవద్ద మ్యాఫ్ వుంది కదా అది తీసి చూస్తే" కృతి అనంగానే నిశ్చల అందుకుంది, "పాతాళలోకం మ్యాఫ్ ఇంకా మనం సంపాదించలేదుకదే కృతీ"

    "ఛత్ నోరుమూసుకో" కృతి మందలించింది.

    "మనం అలువేపే వెళదాం" ముందుకు నడుస్తూ అన్నాడు. విజయ్. అతని ఆలోచనలు పరిపరివిధాల పోతున్నాయి. ప్రశ్నతెలుస్తుంటే  దానికసలు ప్రశ్నలేదు. అయోమయ స్థితిగా వుంది ఒక్క మాటలో చెప్పాలంటే.

    "నాదో అనుమానంరా" సుబ్బారావు అనగానే "అదేదో తొందరగా కక్కరాతండ్రీ" అన్నాడు కమల్.

    "మనం పైనుంచి కిందకు అనగా పాతాళ లోకంలో పడ్డాం. అవునా! కమత మనం ఇప్పుడు వుండాల్సింది పాతాళ లోకంలో కనుక ఆకాశం కనపడకూడదు. కాని కనబడింది కనుక యిదేలాసాధ్యం?"

    "తిరుపతి ఎప్పుడన్నా వెళ్ళావా సుబ్బిగా?"

    "అదేం ప్రశ్నరా? నాలుగుసార్లు వెళ్ళాను నాలుగు గుళ్ళు యిచ్చాను"

    "నీవే!"

    "ఆ నావే"

    "వరేయ్ నాలుగు తలకాయల సుబ్రహ్మణ్యం తిరుపతిలో 'ఆకాశగంగ' చూశావా?"

    "నెంబర్ వన్. నా పేరు సుబ్రహ్మణ్యం కాదు. నెం. టూ ఆకాశగంగెంటి, పాపనాశనం , చంద్రగిరికోన బాలాజీ పాచికలు .......

    "..... లిప్టు చదవకు. ఆకాశగంగలో కధవుంది. గంగ ఆకాశం నుండి దిగివచ్చి ఆచోట స్నానం చేసిందని , సరాసరి గంగ ఆకాశం మీంచి కిందకు దూకిందని, పిలవకున్న ప్రతివాడూ ఓ కధ చెప్పటమే ఆ కధల ప్రకారం చూస్తే గంగమ్మతల్లే నీళ్ళు ఆమె దిగివచ్చి అక్కడ 'సహనా' ఆడటం ఏమిటి? పోనీ ఇంకో కధ చూద్దాం. ఆకాశం అనగా సూన్యం ఆ శూన్యంలో౦చి ధారగా గంగ అక్కడ పడటం ఏమిటి? నాకు పిలకలేదు
గాని నేనో కథ చూద్దాం. పడటం ఏమిటి? నాకు పిలకలేదు గాని కథ చెబుతావినుసుబ్బుగా పాటలలోకం అనగా అదివక లోకం అని నీవు వప్పుకున్నవాడి వయ్యావు! కనుక చచ్చినట్లు నామాటపప్పుకో. పాతళలోక ఆకాశం అది. అండర్ స్టాండ్" కమల్ అన్నాడు నవ్వాపుకుంటూ.

    "హొరినీ నీ కథ కాకరకాయతో కలిపి వండా? ఆకాశం ఎలా కనబడుతున్నది అన్న చిన్న ప్రశ్నకి ఆకాశం అంత కథ చెప్పావు కదరా?" అంటూ సుబ్బారావు నవ్వాడు.

    కృతి, నిశ్చల గలగలానవ్వారు.

    గంభీరంగా ఆలోచిస్తున్న విజయ్ చిరు మందహాసం చేశాడు.

    నెమ్మదిగా వెలుతురు తగ్గిపోతున్నది.

    గుబురుగా వున్న చెట్ల సముదాయ ఎక్కువ అయింది.                            

 Previous Page Next Page