Previous Page Next Page 
అసిధార పేజి 28

  

    గుహనంతటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ జీవి కానరాలేదు.

    "నీది భ్రమ ఏమో!" విజయ్ అన్నాడు.

    "కాలికి బూటింధికదా పాకినట్లు ఎలా తెలిసింది?" అన్నాడు కమల్.
   
    "కాలంటే పాదంమీద కాదు మోకాలు కొండగా మెత్తగా రాచుకుంటూ వెళ్ళింది."

    "వెళ్ళిందిసరే. దానికో వూరు పేరు లేదు. నలువైపులా లైటు వేసి చూస్తున్నాము కనబడాలికదా!" కమల్ అన్నాడు.

    "ఓ.కే ఓ.కే. దీన్ని గురించి తర్జనభర్జనలేల లైటు ఆర్పకుండా వెళదాం" అంటూ విజయ్ ముందుకు దారితీశాడు.

    మరో నాలుగు గుహలు దాటారు.

    ఓ గుహలో చీమల్లా౦టివే కాస్త పొడుగు ఎక్కువతో చీమలా రెండు సున్నాలుగా కలిపిగాక మూడు సున్నాల కీటకాలు భూమిలోంచి గుట్టగా వస్తూ కనిపించాయి.

    "నిశ్చలకి కుట్టిన చీమల్లాంటి కీటకాలు అవే అయి వుంటాయి. ఆ చీకటిలో ఇక్కడదాకా నిశ్చల వుంటుంది" అని అనుకున్నారు.

    పోనుపోను రెక్కల పురుగులు తోండలాంటివి కనిపించాయి.

    ఇంకా ముందుకు వెళ్ళారు.

    "అరె అది చూడండి"

    విజయ్ అరవలేదు గాని కాస్త గట్టిగానే అన్నాడు
   
    అప్పుడే కమల్ కృతికూడా చూసి ఆగిపోయారు.

    పొదలా వున్న నాగజెముడు మొక్కలాంటి మొక్క అక్కడ వుంది. అంతేకాదు. దానికి కాస్త అవతలిగా నేల పచ్చగను మరికొన్ని మొక్కలు ఉన్నాయి. ఓ పక్కనుంచి సన్నవి నీటిపాయపై నుంచి కిందికి జారుతున్నది.

    "ప్రకృతిలో జీవులని చెట్లని చూడగలుగుతున్నాం" కృతి     అంది ఇంకా అటే చూస్తూ .

    "ఈ ప్రదేశాని కొచ్చింతరువాత మొదటిసారిగా" అన్నాడు కమల్.

    "మాయా గుహలు అంతమయ్యాయి " విజయ్ ఆలోచిస్తూ అన్నాడు.

    "ఎలా చెప్పగలవురా?"

    "వేరిసింపుల్ . మనం ఎన్నో గుహలు చూశాం. రెండుచోట్ల నీళ్ళు వున్నాయి. అయినా చిన్న గడ్డిమొక్క కూడా లేదు. ఇక్కడ కీటకాలు కనిపించాయి. పచ్చగా చెట్లు కనిపించాయి. నీతిపాయ ఉంది. జాగ్రత్తగా చెవియొగ్గి వింది. జీవరాసిచేసే చిరుద్వనులు లీలగా వినిపిస్తున్నాయ్.......

    "...... అవును" కృతీ వెంటనే అంది.

    "దీనినిబట్టి ఇటునుంచి మార్గం వుండవచ్చని తోస్తున్నది. ఇటు మంచి దారి చేసుకుని వెళితే అటు వెళతాము"

    "ఇప్పుడే వెళ్ళి చూద్దాం" కమల్ ఆకృత చూపాడు.

    "ఉహూ, లేడికి లేచిందే ప్రయణమట అలా మనం తొందర పడి వెళ్ళకూడదు అటు ఏముందో తెలియదు మనం తిరిగి వెళ్ళేటైం అయింది ఆలశ్య౦చేస్తే అక్కడ నిశ్చలవాళ్ళు కంగారుపడతారు . రేపువచ్చి చూద్దాం." విజయ్ అన్నాడు.

    "నీ ఇష్టం" అయిష్టంగానే తలవూపాడు కమల్.

    "విజయ్ చెప్పినట్లే చేద్దాం కమల్!" అంది కృతి .

    మరోసారి తనజీవితం చూసి ముగ్గురు వెనక్కీ మళ్ళారు.

    ఎవరెస్ట్ శిఖరం ఎక్కి దిగినంత ఆనందంగా వుంది వాళ్ళకిప్పుడు.

                                        20

    "ఇదసలు మార్గామేవంటావా, ఎటుచూసినా చెట్లు చేమలు . కనీసం పళ్ళచెట్లన్నాకాదు. పిచ్చి మొక్కలు "సుబ్బారావు విసుక్కున్నాడు.

    "చూడమ్మా సుబ్బులూ! నివ్విప్పుడు విసుకున్నా లాభం లేదు కసురుతున్నా లాభంలేదు. మనం మరో మార్గంలో నడుస్తున్నాం అంతే" విజయ్ చల్లగా సమాధానం చెప్పాడు.

    "కనీసం అంతూ పొంతూ అయినా వుందా అని ....?"

    "దీనికి నాదగ్గర సమాధానం లేదురా అబ్బాయ్!"

    విజయ్ అనంగానే వాళ్ళముగ్గురూ నవ్వారు, సుబ్బారావు మూతి ముడుచుకున్నాడు.

    కొండగుహల్లోంచి బైటపడాలంటే కొత్తగా నిన్ననే కనిపెట్టిన మార్గం తప్పించి మరొకటి అనబడలేదు. మధ్యాన్నంవేళ బైలుదేరారు. ఎవరి లగేజీ వాళ్ళ భుజాల మీదుంది , ముందు గుహలోంచి చెట్లు కనబడ్డవేపు వచ్చారు. మధ్యమధ్య పిచ్చి మొక్కలు , పొదలు, రాళ్ళూ మట్టితో వున్న ఎత్తుపల్లాలు, సన్నటిసెలయేళ్ళు వాతావరణం కనుపించేప్రకృతి మొదట ఇంపుగానే వుంది. తుప్పట్లో౦చి దారి చేసుకుంటూ వేళుతున్నారు. ఎగిరే పక్షులు లేవుగాని చిన్న చిన్న కీటకాలు అతి నెమ్మదిగా రాగం తీస్తున్నాయి. ఈ దారిలో గుర్తులు పెట్టటానికి కూడా ఏమీ లేవు. వీలైనచోట మాత్రం ఓ బాణంగుర్తు వేస్తున్నారు.

    "మరోసారి మనం తయారుచేసిన మ్యాఫ్ తియ్యరా చూద్దాం. మార్గానికి కూడా కొన్ని గుర్తులు రాసుకున్నాం. అవి మరోసారి చూస్తె" అన్నాడు సుబ్బారావు.

    "అక్కర్లేదురాబాబూ! నాకు అన్ని గుర్తున్నాయి. తాతగారు రాసిందాట్లో అయితే ఎర్ర మట్టి కొండలని నాలుగు చోట్ల వచ్చింది. గుహలు అన్నమాట లేదు. కాని ఇంద్రజాలం అని వుంటారు.

    "సరే నీమాట కాదనటందేనికి గుహలనే ఇంద్రజాలం అనుకుందా౦. అక్కడ మీ తాతగారు ఏవీ వదిలిన దాఖాలాలు లేవు. అసలాగుహల్లోకి ఎలా చేరారు. చేరితే ఎలా తేలారు?"

    సుబ్బారావు అనంగానే కమల్ అందుకున్నాడు.

    "మరో మార్గంగుండా అయన పయనించి వుండవచ్చు." అంటూ మనమో వాక్యం పూరించాము పొదలు మధ్య మధ్య పురుగు పుత్రా అన్నమాట కరెక్ట్ అయితే. ఇదిగో యివే అపోదలు. ఈ బుల్లి కీటకాలే పురుగుపుట్ర?

    "ఇటుకుల తర్వాత పొదలోచ్చాయి. ఇటుకులు ఏవి?"

    "మనం ఇటుకలు అనుకుంటున్నవి ఇటుకులు కావేమో? పూర్వం దూరదేశాలు ప్రమాణం చేసేవారు దారిలోతినటానికి అటుకులు మూట తినొచ్చు మజ్జిగలో నానవేసుకుని తినవచ్చు. పాలల్లో ననేసుకుని తినవచ్చు........

    "..... వేయించుకుని కూడా తినవచ్చు అది మనం పూరించిన మాట ఇటుకలో అటుకులో కిటుకులో ఎవరికి తెలుసు?  " విజయ్ మూటల మధ్యలో అన్నాడు.

    "ఈ లెక్క న మనందారి తప్పాం అనుకోవచ్చు కదా? సుబ్బారావు అన్నాడు ఏదో చెట్టుఆకుని తుంచుతూ.

    "నిక్షేపంగా అనుకొవచ్చు నేనేం అడ్డుపెట్టాను." విజయ్ అన్నాడు.

    సుబ్బారావు తుంచిన ఆకుని నలిపాడు. "దారితప్పితే ఎలారా మనం ఆ గోల్డ్ వెళ్ళటం ? పోనీ తిరిగి వెళ్ళేవారికూడాకనుచూపు మేరలో లేదే?"

    "అవన్నీ ఆలోచిస్తే అడుగు ముందుకు పడదు మనం దారి తప్పినా తప్పకపోయినా చేసేదేం లేదు. కొండగుహలోంచి ముందుకు వెళితే ఏమొస్తుందో చూద్దాం. అక్కడినుంచి దారివుందో లేదో అసలే ముందోపని బయలేరేటప్పుడు అనుకున్నాం. వూహించని విధంగా ధబెల్ మంటూ లోపలి కెక్కడికోవచ్చి పడ్డాం._ ఎంతలోతు కొచ్చి పడ్డామో తెలియదు. లోపల ఎంత నడిచామో తెలియదు దాన్ని గురించి మాట్లాడుకోటం అనవసరం పైగా మనం తీరుబడిగా ఆలోచించే టైము లేకుండా బయల్దేరటంజరిగింది.

    "ఇంక ఆ విషయం పదిలేయ్యి విజయ్! ఈ మాట ఎత్తంగానే నీవు బాధపడుతున్నావ్ . నీ బాధ" కృతి అంది.

    "నాతోపాటు నిన్ను కష్టపెట్టటం సారీ, మిమ్మల్ని కష్ట......

    "ఛత్ నోరుముయ్యరా, అందరమూ యిష్టపడేబయల్దేరాం. కష్టమో సుఖమో, ఇమిక ఆ విషయం వదిలెయ్యండి." కమల్ అన్నాడు.

    "నీ మాట బలపరుస్తూ నేను చేయి ఎత్తుతున్నాను ." నిశ్చల అంది.

    "అనుమానం తీర్చుకోడానికి అడ్డ దిడ్డ౦ ప్రశ్న వేస్తున్నాగాని నేను మీపార్టీయేరా మనపార్టీకి జై" అంటూ చెయ్యిపైకేత్తిన సుబ్బారావు "అమ్మోదురద " అంటూ చేయ్యిదించి గోక్కుంటూ అరిచాడు.

    "దురదేమిట్రా. ఏ మొచ్చింది ఇంతలో!"

    "అదేదో చెట్టు ఆకులూ కోసి నలిపానురా" చెయ్యి బరుకుతూ చెప్పాడు సుబ్బారావు.

    "ఏదీ చూద్దాం పద" అంటూ రెండడుగులు వెనక్కివచ్చి ఆ చెట్టుని చూశారు"వరేయ్ , నీ నోటితోపాటు చేతులూ పూరాకోవురాఇది దురదగోండి ఆకు" అన్నాడు కమల్.

    "అమ్మ కాబోయ్ చెయ్యి" సుబ్బారవు చేత్తోకుస్తీపడుతూ అన్నాడు.

    "చేయ్యంతా పాముకోలేదు. కాబట్టి ఎలాగోలా ఆ కొంచంబాధ భరించు చేసుకున్నమ్మకి చేసుకున్నంత"

    "వాడిని ఏడిపించకురా కమల్ ఇది దురదగోండి ఆకు అని వాడికి మాత్రం తెలుసా? మాన సుబ్బారావ్ ఏంచేసినా మన మంచికే అనుకో అంటూనే చేతికి గ్లౌజ్ తొడుక్కున్నాడు. కొంత ఆకు కోసిభద్రపరిచాడు.

    అలాగే ముందుకు సాగారు యింకా ముందు ముందు చెట్లు ఒత్తుగా వున్నాయి.

    సాయంత్రం అయిపోయింది.

    నలుదిశలా చీకట్లు అలుముకున్నాయి.

    "మానం ఆగిపోవటం మంచిదేమో?" కమల్ అన్నాడు.

    "నాకూ అలాగే అనిపిస్తున్నది" విజయ్ అదే అన్నాడు.

    "ఇక్కడ ఏమీలేదుకదరా!" సుబ్బారావు అడిగాడు.

    "ఏం కావాలిరా హంసతూలికాతల్సమా?? పంచ భక్ష్యపరవాణ్నాలా?" సామాను కిందపడుతూ విజయ్ అన్నాడు.

    "ఇక్కడ  బాగుంది పెద్ద చెట్టువుంది దీనికింద ఈ రాత్రికి వుందాం. ప్రమాదం అని తోస్తే చెట్టు ఎక్కవోచ్చు. ఎక్కటానికి తేలిగ్గా వుంది. వొత్తుగాను వుంది" కమల్ అన్నాడు.

    "చెట్లెక్కి చూస్తాను ఏమన్నా కనబడుతుందేమో?" నిశ్చల వుషారుగా అంది.

    ఈసమయంలో ఆ చెట్టుఎక్కటం ప్రమాదం అని నిశ్చలకి తెలియదు.

 Previous Page Next Page