Previous Page Next Page 
అసిధార పేజి 27

 

     "ఉహూ, వూ ..... కాస్త గుర్తు తెచ్చుకొనివ్వు  ఆ ..... ఆ గుర్తుకొచ్చింది వెనక్కీ అడుగేశాను ఏదో మీదకి వరిగినట్లయింది"

    "నీవు అ గుహలో కాలుపెట్టే ముందు ఏం అలొచిస్తున్నావో బాగా గుర్తు చేసుకుని చప్పవే"

    "ఒంటరిగా వెళుతున్నాను. ఇలా చేయటం మంచిదికాదేమో అనుకున్నాను. ప్రమాదం ఎదురైతే అనుకున్నాను. నరమాంస భక్షుకులులాంటివారు ఈ గుహల్లో నివసిస్తున్నారా, లేక అడవుల్లో ఉంటారా? అనుకుంటూ గుహలో అడుగుపెట్టాను"

    "బస్ , యింక నే చెపుతాను మొండి ధైర్యంతో బయల్దేరావు  కానీ నీ మనసులో భయంలేకపోలేదు నీ ఆలోచనలు ప్రమాదం గురించి నరమాంస భక్షుకుల గురించి సాగుతుండగా ఆ గుహలో కాలుపెట్టావు. నీకు నరమాంస భక్షుకులు కనిపించలేదు. అస్థిపంజిరం కనిపించింది. నరమాంస భక్షుకులు తిని వదిలేసిన అస్థిపంజిరం అది అనుకున్నావు. భయంతో ఓ అడుగు వెనక్కివేశావ్ . గోడకి వున్న అస్థిపంజరానికి నీ కాలో చెయ్యో తగిలి వుంటుంది. అదికదిలి నీమీద కోరిగింది. అంతే నీ చేతిలో వస్తువులు జారిపోయాయి. నీ వేమో భయంతో పరుగు తీశావు"

    "అంతేనంటావా?"

    "అంతే మేమాగుహని చూశాము, ఓ అస్థిపంజిరం బోర్లాపడివుంది. దాని పక్కగానే నీతార్చిలైటు కర్ర వున్నాయి ఇప్పటికి మేము మూడుదారులు చూశాము ఓవేళ ఈ గుహల్లో నరమాంస భాక్షుకులుంటే వాళ్ళవల్ల నీకొమాకో ప్రమాదం వచ్చిపడేదో నీ కాళ్ళకి కుట్టినాజీవులేవో నాకు తెలియదుగాని మావూహా ప్రకారం అయితే నీవు విన్న శబ్దం కేవలం నీటి శబ్దం , విచిత్రంగా వినవచ్చిన ఓ గుహలోని నీటిధ్వనికి ముందుమేమూ భయపడ్డాము"

    "అయితే ఈ గుహల్లో ఏప్రమాదమూ లేదన్నమాట!"

    "చూసినదాన్నిబట్టి లేదనే అనిపిస్తున్నది. కాకపోతే మనపాలిట ఈగుహాలు మృత్యుగుహలు కాకతప్పదు ఆ అస్థిపంజిరాలను చూసి మేము వూహించింది ఏమిటంటే దారితప్పిన ఎవరో యిద్దరు ఇక్కడ చిక్కుకుపోయి దిక్కుమాలిన చావు చచ్చారని కనీసం వాళ్ళు నీళ్ళు వున్న గుహకూడా చూసి వుండరు.  కాని మనకో ఆధారం లభించింది. వాళ్ళంటూ లోపలి రాగాగాలిగారు కాబట్టి ఎక్కడికోచెప్పలేను. బయటకు దారంటూ వుండి వుంటుంది"

    విజయ్ చప్పట్లుకొట్టాడు.

    "నీ ఆర్గుమెంట్లు నీ వూహాశక్తి అమోఘం కృతీ! నీవు, లా, చదివితే తిరుగులేని లాయర్ వి అయ్యేదానివి"

    "కత్తిపీటలు బాగు చేయటం సత్తేప్పాలకిమాట్లేయటం మొదలుఅన్ని రిపేర్లుచేసేమీరు ఇంజనీర్ అయినా బాగుండేది. ఏంచేస్తాం మసయోగ్యతలేదు. ప్చ్ ......ప్చ్......"  అంది కృతీ.

    "ఏయ్ , మాన్నాన్నలాగా సాధించాలంటే నిన్ను ..... నిన్ను ...."

    "ఒరేయ్ , మీ భారం జోకులు ఆపేయండిరా, ముందు విషయం ఆలోచించరేం" సుబ్బారావు కోప్పపడ్డాడు.

    "ఓ.కే సీరియస్ గా  విషయాని కొద్దాం. జరిగింది. ఏమిటో మీ కర్డమయ్యే వుంటుంది. నిశ్చల విజిల్ వూదినప్పుడు మనం దూరంగా అంతే ఇక్కడ వున్నాము. అలాగే మనం విజిల్ వూదినప్పుడు నిశ్చల మరో మార్గంలో దూరంగా వుండివుంటుంది. ఈ గుహల్లో ఏదైనా ఆపదఎదురవుతుందేమో అని  మనం విజిల్ వూడటం మానేశాము మరో పొరపాటు చేశాము. నలుగురం ఒకేదారిన నిస్చాలకోసం వెతుకుతూ వెళ్ళటం మరొక పొరపాటు, ప్రతి గుహలో మనం విజిల్ వేయక పోవటం, మనం ముందుకు వెళుతున్నప్పుడు నిశ్చల వెనక్కీ వచ్చినప్పుడు మనం ముందుకు ప్రయాణించి వుంటాం. వూహిస్తే సర్వంఅర్ధమైపోతున్నది. దేముడు మనముందువున్నడన్న నిదర్శనంగా అర్దమైపోతున్నది. దేముడు మనముందు వున్నాడన్న నిదర్శనంగా నిశ్చల మనకి కనబడింది. ఇంక గతాన్ని వదిలేద్దాం . నిన్న అనుకున్నది చేద్దాం" అంది కృతి
          
    నిశ్చల ఓపిక రావాలి మళ్ళీ జ్వరం తిరగబెట్టకుండా వుండాలి" కమల్ అన్నాడు.

    "నిన్న ఏమనుకున్నారు. ముందది చెప్పండి" నిశ్చల అంది.

    "ఇక్కడనుంచి చూసుకుంటూ బయల్దేరాం. గుర్తులు వేశాం. నీ గుర్తు వంపు తిరిగిన బాణం మేమేసింది త్రిశూలం O, X ఈ మూడు గుర్తులు మేమేళ్ళిన వరకూ ఈ గుర్తులు వేసుకున్న దారి తప్ప ఇంక పక్కకి దారులూ లేవు గుహలులేవు వుంటే గింటే ముందుకే వుండాలి. మధ్యలో ఓ గుహలో నీళ్ళువున్నాయి అక్కడ మనం వుండి యింకా వెతకాలి. వెళ్ళటం మళ్ళీ ఇంతదూరం వెనక్కీ రావటం అనవసరం అదీ మాప్లాను " అంది కృతి.

    "నేను చేసింది తొందరపాటుతో కూడిన పొరపాటు పని ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించను" నిశ్చల అంది.

    నిశ్చల చేసింది తప్పిదమే అని అందరికీ తెలుసు. బాధపడుతుందని ఎవరూ మాట్లాడలేదు.

    "నాదో చిన్న అనుమానం" వున్నట్లుండి సుబ్బారావు అన్నాడు.

    "కుక్క"

    "మనంవుంది కొండకింద , పక్కకి వెళితే ఎంతదూరమైన ఇలా కిందనే వెళ్ళాల్సి వస్తుందేమో , పైకి వెళ్ళే మార్గం ఎలా? కిందికి పడ్డాం కాబట్టి నాకీ అనుమానం వచ్చింది . పైకి వెళ్ళటం కష్టం, పక్క మార్గాలు అన్నీ మోసుకు పోయాయేమో! ఇంకాకింద.....

    "ఇంక అపరాసుబ్బు!  పైన కింద పక్క. వెధవ అనుమానాలు నీకెంత తెలుసో మాకు అంతే తెలుసు. ఇంక కాగల కార్యం ఆలోచిద్దాం. నిశ్చలకోసం మధ్యాహానందాకా ఆగుదాం, మధ్యాహ్నం మన మకాం మార్చేసి క్యాంపుటలో బసలేద్దాం " విజయ్ అన్నాడు.

    "మీరంతా నా చుట్టూ వున్నారు. ఇప్పుడు నాకు వేయి ఏనుగుల బలంవుంది ఇప్పుడే వెళదాం పదండి" నిశ్చల అంది.

    " ఆ తొందరే పనికిరాదు . మధ్యాహ్నానికి అయితే కాస్త ఓపిక వస్తుంది. నడవగాలుగుతావ్ , మేమూ అలసిపోయాం ఆగుదాం" కృతి అంది.

    "మధ్యాహానికి నడిచే ఓపిక వస్తుందని గ్యారంటీ ఏముంది? ఓవేళ మళ్ళీ జ్వరం తిరబెట్టి నేను నడవలేకపొతే?" నిశ్చల అడిగింది.

    "నేను ఎత్తుకుని మోసుకువెళతాను సరేనా?"

    కమల్ అనంగానే అందరూ నవ్వారు?"

    "బొత్తిగా సిగ్గులేదు" నెమ్మదిగా గొణిగింది సిగ్గుతో నిశ్చల __

                                       19

    ఉదయం అనుకున్న ప్రకారం అనుకున్న పని ఆచరణలో పెట్టారు. ఆ మధాహ్నం బయల్దేరి అందరూ ముందుకు సాగి గోరువెచ్చని నీళ్ళు వచ్చే గుహకి దగ్గరగా వెలుతురుపడే గుహలోకొచ్చి అక్కడ నివాసం ఏర్పరుచుకున్నారు.

    నిశ్చల సామానులు తలాకాసేపు మోస్తుంటే నిస్చాలకి చేయి ఆసరాయిచ్చి నెమ్మదిగా నడిపించుకుంటూ కమల్ వచ్చాడు.

    నిస్చాలకి నార్మల్ మీద ఒక్క పాయింట్ జ్వరంవుంది జ్వరం బాధలేదు. కీటకాలు కుట్టినచోట ఎర్రగా కంది కాళ్ళు నొప్పులు, _ బరువు చేశాయి.

    "ఇప్పుడు సమయం రెండుగంటలయింది. నిశ్చలకి తోడుగా సుబ్బుగాని కమల్ గాని వుంటారు ముగ్గురం బయల్దేరి వెళదాం. సాయంత్రందాకా వెళ్ళి గాలించి తిరిగివద్దాం" విజయ్ అన్నాడు.

    కమల్ కి వుండాలని వుంది. వెళ్ళాలని వుంది.

    అవసరానికి పర్తుగేత్తాలంటే నాకన్నా మీరే నయంరా , నిశ్చల దగ్గర నె వుంటాను మీరెళ్ళండిరా!" సుబ్బారావు అన్నాడు.

    "గుడ్, ఇదే మంచిపని " విజయ్ అన్నాడు.

    "సుబ్బూ! నరమాంస భక్షుకులోస్తారేమో!" కృతి అంది.

    వాళ్ళెలాగు రారన్న దైర్యం సుబ్బారావుకి ఏర్పడింది. "రానివ్వు మా ఇద్దరికీ నరమాంస భక్షులంటే భయంలేదు. వాళ్ళోస్తే నరసింహవతారం ఎత్తి వలచకు తింటాం" అన్నాడు.

    అందరూ నవ్వుతుంటే తనూ నవ్వింది నిశ్చల.

    నిస్చాలని సుబ్బారావుని వదిలి వాళ్ళ ముగ్గురూ బయల్దేరారు.

    చాక్ పీస్ తో వేసే గుర్తులు ఈ తఫా మరో రకంగా మార్చాడు విజయ్. అంతేకాదు గోడలమీద వాళ్ళపేర్లు రాశారు. తేదీ వేశారు. ముందుతరం వాళ్ళకా అన్నట్లు.

    ముగ్గురూ కల్సి చాలాదూరం వెళ్ళారు.

    ఇంకొక్క యిరవై నిముషాలై టైముంది . ఇంక మనం తిరుగుముఖం పట్టాలి" కృతి టైము చూసుకుంటూ అంది.

    "ఎస్. నాకో ఆలోచన వస్తున్నదిరా విజయ్! ఇరవై నిముషాలు కాంగానే మీరు మరలిపొండి. నేను మరో అరగంట ముందుకు వెళ్ళి వస్తాను" కమల్ అన్నాడు.

    "బాగుంది నీ ఆలోచన నిశ్చలని వెతకటం అయింది. ఇంకా నువ్వు మిగిలావు" విజయ్ అటుండగానే కృతి ఎగిరి అవతలకి దూకి అరిచింది.

    "ఏమైంది?" విజయ్ అడిగాడు కృతి ముఖాన లైటువేస్తూ.

    ఏదో నా కళ్ళమీంచి పాకి వెళ్ళింది కింద చూడండి.

    మరోసారి అరిచి చెప్పింది కృతి.

    విజయ్ లైటు ఫోకస్ కిందికి ప్రసరించింది. వెంటనే కమల్ లైటు వెలిగింది. తన లైటు స్విచ్ నొక్కింది కృతి.

 Previous Page Next Page