Previous Page Next Page 
అసిధార పేజి 26

 

 

     వెతికేపని లేకుండా వెతకబోయిన తీగ కాలిగితగిలినట్టు నిశ్చల! కనబడింది. మేరో విషయం రాత్రంతా నిస్చాలకి జ్వరం వుంది.

    ఉదయం ఎనిమిది గంటలయింది.

    ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో వున టాబ్లెట్లు తీసి నిశ్చలకు వాడారు.

    గంట గంటలకీ టెంపరేచరు చూస్తూనే వున్నారు ధర్మామీటరుతో . ఎనిమిది గంటలు దాటింతరువాత మాత్రం తొంభైతొమ్మిదికి వచ్చింది.

    "కృతీ! నీవాక్కు అమోఘం అద్భుతం . నిశ్చల మళ్ళీ మనకి కనబడ్డదీ అంటే నీనోటంట వచ్చిన అమృతపు పలుకు ....." నిముషాలకి కోసారి అన్నట్టు మధ్య మధ్య కృతితో అంటున్నాడు కమల్.

    "మరీ అందలం ఎక్కించకు కమల్.! నానెత్తిన ఎక్కి కూర్చుంటుంది. కృతి సంగతి నీకు తెలియదు" విజయ్ అన్నాడు.

    "నిశ్చల కనబడుతుందని మేమూ అన్నాంకదా?" సుబ్బారావు అన్నాడు.

    "కృతి చెప్పబట్టే నేను వెనక్కీ మరలి వచ్చాను"

    "అదేం కాదు "

    "ఎందుకురా వున్నమాటంటే అంతలా కుతకుతలాడిపోతావ్?"

    "కృతి! కార్తేని భరించువాడుకదా. కూత కూత .... తకు..... తకు ...... సుబ్బారావు రాగంతీశాడు.

    "నీరాగం అపరా తండ్రీ! నిశ్చలకి తలనొప్పి వస్తుందేమో "  కమల్ అన్నాడు.

    "నిశ్చల కేమోగాని ముందు నీకోచ్చేటట్లుంది తలనొప్పి"

    సుబ్బారావు మాటలకి అంతా నవ్వారు.

    నిశ్చల లేచి కూర్చుని నెమ్మదిగా నవ్వింది.

    "పడుకోవే. ఎందుకు లేచావ్ ఏమన్న కావాలా?" కృతి అడిగింది.

    "ఏమి అక్కరలేదే. పడుకుని నడుం నొప్పి పుడుతున్నది. కాసేపు ఇలా అనుకుని కూర్చుంటాను" నిశ్చల వెనుకరాతికి చేరగిలబడుతూ అంది.

    "జరిగిందేమిటో చెప్పగల ఓపిక వుందా నిశ్చలా!" అందరూ అడగాలనుకున్న మాటే అది. నిశ్చలవంట్లో బాగుండక పోవటంతో ఎవరూ అడగలేదు. అదేదో సుబ్బారావే అడిగాడు ముందుగా.

    "చెబుతాను ఆ రాత్రి తెల్లవార్లూ మనకేమీ కనిపించలేదు. తెల్లవారుజ్హామున డ్యూటీ నాకు పడిందికదా. ఇంక భయపడవలసింది. ఏమీ కనిపించేలా మిమ్మల్ని లేపటానికి గంట టైముంది అప్పుడు నాకో ఆలోచన వచ్చింది ఓ ఇరవైనిముషాలు ముందుకీ వెళ్ళి తిరిగివద్దాం. ఏదైనా వింతలు కనబడ్డా దారి కనబడ్డా ముందుగా చెప్పినదాన్ని నేనవుతాగదా" అని ఆశించాను.

    కృతి కలగజేసుకుని అంది "నె ముందే చెప్పనా! ఇది దారికనిపెత్తతానికే వెళ్ళిందని.....!"

    "ఊ తర్వాత ?" సుబ్బారావు అడిగాడు.

    "ఇరవై నిముషాలు పోను ఇరవై నిముషాలు రాను టైము చూసుకుంటూ నా జాగ్రత్తకోసం గుర్తులు వేసుకుంటూ బయల్దేరాను. అక్కడ ఓ గుహలో నరమాంస భక్షుకులు కనిపించారు. ఒకడు నన్ను తోశాడుకూడా ....."

    "బాబోయ్ , నరమాంస భక్షుకులా?" సుబ్బారావు అరిచినంత పనిచేశాడు.

    నిశ్చలకి మతి పోలేదుకదా! లేక నిజంగా వాళ్ళని చూసిందా? చూస్తె వాళ్ళు నిశ్చలని ఎలా వదిలారు ? తమకెందుకు కనిపించలేదు?

    అనేనే అనుమానం ప్రశ్నలు

    "ఊ .... తర్వాత ?"

    "ధబ్ మంటూ పడ్డాను. న మతి మతిలోలేదు పక్క గుహల్లోకి పరుగుతీశాను చీకటి భయం. వాళ్ళు నన్ను తరుముకువస్తున్నారేమో అన్న కంగారు . ఆ పరుగున వెళ్ళి గోడకి గుడ్డుకున్నను అంటే ఎంతసేపు తెలివిలేకుమ్డా పడి వునానో నాకే తెలియదు........

    "అదికాదు నిశ్చలా!" విజయ్ ఏదో అడగబోయాడు.

    "ఉష్ , నిశ్చలని సాంతం చెప్పనియ్యి. తర్వాత మన అనుమానాలు తీర్చుకుందా౦" కృతి అడ్డు తగిలింది.

    "ఎప్పటికో లేచాను. ముఖాన బొప్పి కట్టింది. తలనొప్పి వళ్ళు నొప్పులు. ఎటు చూసినా చీకటి. వద్దామంటే దారి కనబడలేదు. అరుద్దామంటే నరమాంస భక్షుకులోచ్చి పడతారని. భయం. అయినా అలాగే తుడుచుకుంటూ ఓ గుహలోకి అలా ఎంతదూరం వెళ్ళానో నాకే తెలియదు. జేబులోవున్న విజిల్ గుర్తుకువచ్చింది. మీకు వినపడుతుందికదా అని విజిల్ వుదాను. విజిల్ ద్వని నరమాంస భక్షులకి వినపడితే! అంటే అ వూహా రావటంతో మరలా విజిల్ తీస్సి వూదలేదు.

    కాస్త విశ్రాంతి కాస్త నడక ఓపక్క దాహం మరోపక్క ఆకలి. నాకోసం మీరు వెతుక్కుంటూ వస్తారు. అనే ఆశ ఓపక్క మిమ్మల్ని ఆ నరమాంస భక్షుకులు చూస్తె వదలరని భయం. ఎటు చూసినా చీకటి చీకటి. . కాని అలాగే నడుస్తూ తడుముకుంటూ గుహలు దాటుతున్నాను ఓ గుహలో అడుగుపెట్టాను  భయంకర శబ్దం అంటే అది నరమాంస భక్షుకుల నివాసం అయివుంటుందని మళ్ళీ దూరంగా వెళ్ళిపోయాను. శబ్దానికి దూరంగా వెళ్ళగలుగనుగాని. దేనిమీదనో  కాలువేశాను కాళ్ళ బూట్లు వుండటంతో తెలియలేదు. అవి కొండచీమలు కావచ్చు లేక ఇంకేమయినా కీటకాలు కావచ్చు. కందిరీగలంత లావు వున్నాయి. కళ్ళమీద కేక్కాయి కుట్టిపెట్టాయి.

    ఓహ్ ఆ బాధ భయంకరం అవి కుట్టిన చోట చురచుర మంటలు. నా శక్తినంతా వుపయోగించి అరవకుండా ఆపుకున్నాను కాళ్ళ మీదకెన్ని ఎక్కాయో తెలియదు. ఓపక్క నేను దులుపుతుంటే మరో పక్క కుట్టేస్తున్నాయి. చేతికందినవాటిని నలిపిపారేశాను. అవి చీమలు కాదు ఏదో చీమల్లాంటి కీటకాలు వుంటాయి. నలిపిపారేశాను కదా భరించరాని దుర్భంధం వచ్చింది. చివరికి చ్గీకట్లోనె వాటిని కాళ్ళమీంచి భరించరాని దుర్భధం వచ్చింది. చివరికి చీకట్లోనె వాటిని కళ్ళమీంచి వదిలించుకుని అవతిలికి వెళ్ళాను. కటికచీకటిలో ఇంకెన్ని భాధలకు గురికావాలో తెలియలేదు.

    కొంతసేపు తర్వాత నిద్ర ముంచుకొచ్చింది . పడి నిద్రపోయాను మళ్ళీ నేను నిద్ర లేచేసరికి గుహలో వెలుగు పడుతున్నది. నావాళ్ళు నా స్వాధీనంలోలేదు, విపరీతంగా జలిజ్వరం వచ్చినట్లు గ్రహిమ్చుకున్నాను. లేచే ఓపికలేదు. అయినా లేచాను. ఈ వెలుతురులో అయినా నడుస్తున్నాను ఆ నేదిచేదిముందుకో వెనక్కో నాకు తెలియదు ఓ పక్కకి వెళుతుంటే చీకటి వస్తున్నది మరోపక్కకి వెళుతుంటే వెలుతురూ అటూ ఇటూ తితగాతమే గంటలు పట్టింది సరీగా అప్పుడే ఓ ఆశాకిరణం నాకు కానవచ్చింది.

    ఏమిటది?" వెంటనే అడిగాడు సుబ్బారావు.

    "ఎక్స్ గుర్తు చాక్ పీసులో గీసింది కనబడింది. అది చూసి నాకు కొండతబలం వచ్చింది . ఆ X గుర్తులు చూసుకుంటూ బయల్దేరాను. ప్చ్ దురదృష్టం తురుముకువస్తుంటే ఎవరేం చేయగలరు?" అంటూ ఆగింది నిశ్చల.

    ఇక్కడ విజయ్ తో అనుమానం వచ్చింది. X గుర్తులు తనూ కమల్ పెడుతూ వెళ్ళింది రాత్రిపూట . మరి నిశ్చలకి ఆ పగలే  ఎలా కనబడ్డాయి? నిశ్చలా ! నాదో చిన్న అనుమానం X గుర్తులు పెట్టింది మేము రాత్రిపూట కనుక వెలుతురులో ఆ గుర్తులు నీకు కనబడాలంటే నిన్న మధ్యాహ్నం జరిగివుండాలి. కాని నీవు?"

    ఇది నిన్న జరిగిన సంగతే. నేను చీకటిలో తుడుముకుంటూ తిరగటం, తెలిలేకుండా నిద్రపోవటం . ఈ కీటకాలు కుట్టటం అన్నీ  చీకటిలోనే జరిగాయి. మొదట టైము చూసుకునే దానిని చివరికి ఆపనికూడా మానేశాను. టైము చూసుకునే దానిని చివరికి ఆపని కూడా మానేశాను. టైము ముందుకు పరుగెత్తుతుంటే భయం భయం.

    నిన్న మధ్యాహ్నం వెలుతురులోనే X గుర్తులు చూశాను. నా అనందం మాటలతో చెప్పేపనిలేదు. కాళ్ళు తేలిపోతున్నాయి. వళ్ళు తూలిపోతున్నది. వంట్లో వీసమెత్తు ఓపికలేదు. అయినా ఈ వెలుతురులో తగ్గితే ఈ చిన్ని ఆధారంకూడా వుండదు. గబగబ గుర్తులు చూసుకుంటూ సాగాను.

    ఈ గుర్తులు చూసుకుంటూ వెళితే మన సావరానికి చేరుతానో లేక మీరు గుర్తులేసుకుంటూ వెళుతుంటే మీ వెనుకనే సాగుతున్నానో తెలియదు. బాణం _ గుర్తు అయితే ముందుకు వేసుకుంటూ వెళతారు. X గుర్తు చెప్పేదేముంది. ఎట నుంచి చూసినా అది ఎక్స్. అంతే సరే అలాగే పడుతూలేస్తూ వస్తున్నా కదా జ్వరం ఎక్కువయిందేమో శరీరాన్ని మంచులో కడ్డలేసినట్లు చలి భరించలేక పోతున్నాను, క్రమేణ గుహలో చీకటి ఆక్రమించుకోటం మొదలుపెట్టింది.

    తర్వాత చీకటి గుర్తులు కనబడలేదు. మొండి ధైర్యం తెచ్చుకుని విజిల్ వూదుదా  మనుకున్నాను. కానీ విజిల్ వూదటానికి కూడా శక్తిలేక మానేశాను. తర్వాత మెల్లగా నాకు స్పృహా తప్పింది. ఆపైన ఏమయిందో తెలియదు. తెలిసే సరికి ముందుగా చూసింది నా మీదుకి ముఖంవంచి నన్ను ఆతృతతో అందోళన, అనందం , ఎన్నో రాకాలుగా చూస్తున్న కమల్.

    విజయ్ ఏదో అడగబోతుంటే కృతి వారించి తాను మొదలుపెట్టింది.

    "నిశ్చలా ఆలోచిస్తూ అంది. "చూశావా అంటే మనిషిగా చూడలేదు.  లైటు వేయంగానే అస్థిపంజిరం కనబడింది. నామీద వెంటనే ఎవరో పడ్డారు. అంతే చేతిలో వస్తువులు కిందపడ్డాయి. అరుస్తూ పారిపోయాయి"

    "నీమీద పడటం అంటే నిన్ను గట్టిగా పట్టుకోవడం జరిగిందా!" 

 Previous Page Next Page