Previous Page Next Page 
అసిధార పేజి 25

    "అవును ఈ నీళ్ళు గోరువేచ్చాగానే వున్నాయి. మరి మనం వున్నచోట నీళ్ళు అయిస్ లాగా వున్నాయికదరా ఇదెలా సాధ్యం?" ముందుగా నీళ్ళలో చెయ్యిపెట్టిన సుబ్బారావు అడిగాడు.
   
    " చూడు సుబ్బబ్బాయ్! నేను పురుషుడిని ప్రకృతి వింతలు నాకు తెలియదు. ప్రకృతి అంటే స్రీ స్రీ బుద్ధి ఏనిముషాన అలా వుమ్తుమ్దావు తెలియదు స్వీట్ గా వుండవచ్చు హాట్ హాట్ గా వుండవచ్చు నిమిషానికో రూపం దాలుస్తుంది. ఈ ప్రశ్న కృతినడుగు చక్కగా చెబుతుంది" విజయ్ గడుసుగా అన్నాడు.

    కృతి ప్రకృతి బాగుంది. కానుక కృతినే అడగాలి. చూడు కృతీ!"

    "అగు సుబ్బూ! ప్రకృతి స్రీగానిపర్వతం మాత్రం స్రీగాదు. పర్వతరాజు అన్నారు. విజయ్ చెప్పటం నీవడగడం ఉహూ ఇదేంబాగాలేదు. అదేదో మీరూ మీరూ చూసుకోండి " కృతి తిప్పికొట్టింది."

    స్నానం చేస్తే బాగుంటుందన్న ఆలోచన రావటంతో కొద్దిటైము వేస్ట్ చేద్దామనుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కృతి ఒకసారి. మగాళ్ళు ముగ్గురూ ఆ తర్వాత స్నానం చేసారు.

    మళ్ళీ అందరూ బయల్దేరారు.

    నాలుగు గంటల  సమయం అప్పుడు కొన్ని గుహల్లో వెలుతురూ వుంది.

    మరే గుహల్లోనూ ఏ వింతలూ కానరాలేదు. ఆస్తిపంజరాలులేవు. వీళ్ళ బొట్టుకూడా లేదు.

    అలా నడుస్తుండగానే రాత్రి ఎనిమిది అయింది.

    "నిశ్చల ఇంక నాకు కనబడదురా" కమల స్వరంలో ఆవేదన చోటు చేసుకుంది.

    "నిశ్చల కనబడి తీరుతుంది" స్థిరంగా అంది కృతి.

    "నిన్నటినుంచి ఇవాల్టిదాకా భోజనం వీళ్ళూలేకుండా వుండటం కష్టం కదరా పాపం నిశ్చల ఎలా ఉందో" సుబ్బారావు అన్నాడు బాధగా.

    "ఉత్తపూల్ వీడికి మాట్లాడటం రాడు. కమల్ అసలే బాధపడుతుంటే" అనుకుమ్త్రూ సుబ్బారావుని గిల్లాడు విజయ్.

    "ఎందుకురా గిల్లుతావు " సుబ్బారావు అడిగాడు.

    అర్ధమైన కమల్ పేలవంగా నవ్వుకున్నాడు.

    "కర్మకర్మవీడిని గిల్లటంకాదు ముట్టుకోవటంకూడా పొరపాటు" విజయ్ నెట్టి కొట్టుకున్నాడు.

    ఆ తర్వాత కమల్ మామూలు మనిషిని చేయటం మాటలతో వీళ్ళకి స్సధ్యంకాలేదు. కొంతసేపు మౌనంగాను మరికొంతసేపు మాట్లాడుకోడం తప్పదన్నట్లు ఏదో మాట్లాడుకుంటూ అలా వెళుతూనే వున్నారు.

    అలానే రాత్రి పది అయింది.

    వాళ్ళవద్దనున్న వాటర్ బాటిల్స్ లో నీళ్ళు అయిపోయాయి.

    రాత్రి పన్నెండు గంటలదాకా తిరిగి వెనక్కీ మరలిరావాలని వాళ్ళు ముందుగా అనుకున్నమాట. కానీ నిశ్చల కనబడకపోవటం దగ్గర నీళ్ళు లేకపోవడం అణువణునా నీరసం అన్నీ కలిపి ఇప్పుడే వెనక్కీ తిరిగిపోవటం మంచిదనుకున్నారు. ఎవరికీవారే. కాని ఈ విషయం ఎవరూ పైకి వెల్లడించలేదు.

    అప్పుడే ఒక విచిత్రం వారికి కనిపించింది.

    వీళ్ళు మరో గుహలోకి ప్రవేశించేసరికి ఆ గుహలో క్రితం రాత్రి విజయ్ వేసిన X గుర్తువుంది.

    పదింబావు అయింది అప్పుడు. అక్కడే అందరూ ఆగిపోయారు.

    "మనం కాస్త ఆలోచించాలి" విజయ్ అన్నాడు.

    "ఊ" అన్నాడు కమల్

    కాళ్ళు పీక్కు పోవటంతో సుబ్బారావు చతికిలపడ్డాడు.

    "నా ఐడియా ఏమిటంటే రాత్రి మనం సరాసరి వచ్చాము. X గుర్తుల ప్రకారం అయితే. ఈ ఉదయం మనం బయలుదేరింది మొదలు ఇప్పటిదాకా తిరిగి ఇక్కడికి వచ్చామంటే అర్ధం చుట్టూ తిరిగి వచ్చామన్నమాట. ఒక విధంగా చూస్తె మన టైమ్, వేస్ట్  అయింది. మరో విధంగా చూస్తే ఈరోజు మనం వచ్చిన దారికి అటు పక్క ఏమీలేదు అంటే ఒకదారి క్షుణ్ణంగా చూడటం అయింది" విజయ్ అన్నాడు.

    నామాటలమీద నీకున నమ్మకానికి థాంక్స్ . ప్రస్తుతం వేగంగా మన స్థావరానికి మరలిపోదాం. ఎలా చూసుకున్నా ఎంత వేగంగా నడిచినా మరో మూడుగంటలపైన నడవాల్సి వస్తుంది. వెళ్ళి రెస్ట్ తీసుకుందాం . మూటామల్లె సర్దుకుని నాలుగు దాతుతూనే లేచి బయల్దేరుదాం........"                               
      "అలాగే చేద్దాం కృతీ !"  కమల్ వెంటనే అన్నాడు.

    వెంటనే కమల్ తన అంగీకారం తెలియజేయటంతో అందరిమనుషులు కుదుటపడ్డాయి.

    తిరుగుముఖం పట్టారు. ఎవరికీ ఉత్సాహంలేదు ఓపిక లేదు. అయినా వేగంగా నడుస్తున్నారు.

    మౌనంగా ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగివున్నారు.

    మరో పావుగంట గడిస్తే చాలు వాళ్ళ సావరం వస్తుంది.

    టార్చిలైటు వేయటం ఆర్పటం దారిలో ముందు నడవటం ఈ తఫా కమల్ వంతు.

    కమల్ గుహలో ప్రవేశిస్తూ లైటు వేశాడు. ఇంక అతనులిటు అర్పలేదు.

    లైటు వెలుగులో కనబడిన దృశ్యం చూసి అందరూ అలా నిలబడిపోయారు.

    ముందుగా తేరుకున్నాడు కమల్ .

    ఎవరూ ఊహించని వింత అది.

    "నిశ్చలా!" గుహలన్నీ ప్రతిద్వనించేలా అరుస్తూ కమల్ ముందుకు పరుగుతీశాడు.
   
    నిశ్చల చాపచుట్టలా అక్కడ కింద పడివుంది. ఇది ఎవరూ వూహించని విషయం. నిస్చాల్ కోసం ముందుకు వెతుక్కుంటూ వెళ్ళారు. వీళ్ళు. నిశ్చల చూడబోతే ఇక్కడేవుంది. ఇదెలా సాధ్యం అదేమిటో నిస్చాలే చెప్పాలి.

    కమల్ అరుపుతో అందరిలో చలనం వచ్చింది. పరుగుతో దగ్గర కొచ్చారు.

    కమల్ నిస్చాలని వడిలోకి లాక్కుని "ఐ లవ్ యూ నిచ్చూ! ఐ లైక్ యూ నాకు దూరంగా వెళ్ళి నన్ను నన్ను ఏడిపించావ్ కదూ?" ఏమిటేమిటో వాగుతూ నిశ్చల ముఖమీద ముద్దుల వర్షం కురిపించాడు.

    టార్చిలైట్ స్విచ్ వేసి పట్టుకు నుమ్చు౮న్న విజయ్ "ఏయ్ పిచ్చి" అంటూ కమల్ భుజం తట్టాడు.

    నిశ్చల బలవంతాన కనురెప్పలు యెత్తి చూసింది. ఆ చూపులో లిప్తపాటు మెరుపు తళుక్కుమంది . వెంటనే కళ్ళు మూసుకుంది నాలుకతో పెదవులు రాచుకుంది.

    ఎవరి దగ్గర చుక్క నీళ్ళు లేవు.

    "అయిదు నిముషాలలో నేల్లదగ్గరకు చేరాలి మనం లేకమల్!" కళ్ళు తుడుచుకుంటూ అంది కృతి.

    "ఇద్దరం నిస్చాలని పట్టుకుందాం" విజయ్ అన్నాడు.

    "అవసరం లేదురా విజయ్. వెయ్యి ఏనుగుల బలం ఇప్పుడు నాలో ప్రవేశించింది పదండి" అంటూనే నిస్చాలని చేతులమీద ఎత్తు కుని వెంటనే భుజమీద వేసుకున్నాడు.

    తాముండే గుహలోకి వెళ్ళాలంటే పావుగంట పడుతుంది. కాని వాళ్ళు అలా నడవలేదు. పరుగెత్తారంటే సరిపోతుంది సరీగ ఎనిమిదినిముషాలకి చేరారు.

    కృతి పక్క గుహలోకి పరుగుతీసి నీళ్ళు పట్టుకు వచ్చింది.

    కొద్దికొద్దిగా నిశ్చల నోట్లో నీళ్ళు పోశాడు కమల్.

    రెండు గటకలేసింది. నిశ్చల .

    కాని నిశ్చల మాట్లాడే స్థితిలో లేదు. మాట నాలుగు జ్వరంతో వణికిపోతూ  మూసినకన్ను తెరవకుండా పడివుంది.

    ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసింది.

                                                                          18
   
    తెల్లారి నాలుగు గంటలకే లేచి బయలుదేరాలన్న విషయం ప్రస్తుతం విరమించుకున్నారు.

    కారణం చిన్నదే.

 Previous Page Next Page