Previous Page Next Page 
అసిధార పేజి 24

 

     "నే ఒక్కడినీ వెళ్ళి చూసి వస్తాను " కమల్ అన్నాడు.

    "వద్దు అవేళ్ళేదెదో అందరం కలిసే వెళదాం. ముంచైనా చెడైనా కలిసే అనుభవిద్దాం" అన్నాడు విజయ్.

    "మనం నిశ్సబ్దంగా వెళ్ళటం మంచింది" కృతి సూచన ఇచ్చింది.

    "అవును మనం మాట్లాడుకోవద్దు" సుబ్బారావు ఓ సూచన తానూ యిచ్చాడు.

    "రైట్ , ఇంక బ్యాల్దేరుదాం" కమల్ అన్నాడు.

    నలుగురూ నెమ్మదిగా మరో గుహలోకి ప్రవేశించారు.

    అందరికీ ఒక్కసారిగా అమిత ఆశ్చర్యం కలిగింది.

    ఆ గుహలో ఏ శబ్దమూ వినిపించడం లేదు.

    చేవి యొగ్గి జాగ్రత్తగా విన్నారు అయినా వినిపించలేదు.

    "మాయగా వుందే!" సుబ్బారావు అన్నాడు చాలా నెమ్మదిగా

    మళ్ళీ ఆ గుహలోకి వెళ్ళి చూద్దాం" విజయ్ కి ఈ మిస్టరీ ఏమిటో అర్ధంకాలేదుగాని వెళ్ళి చూస్తె ఏమనా అర్డంమవుతుందేమో అన్న ఆలోచన వచ్చింది.

    నలుగురూ వెనక్కీ మరలి ఇందాకటి గుహలో కాలు పెట్టారు.

     ఆ గుహలో అయితే లీలగా శబ్దం వినవస్తున్నది.

    " విన్నావా ఆ శబ్దం ? ఇక్కడెక్కడో మహామా౦త్రీకుడు వుండి వుంటాడు. మనరక దివ్యదృష్టితో చూసి మన్ని తికమక చేసి తిప్పలు పెడుతున్నాడు"

    "సుబ్బూ! మాత్రీకులు మాయజాలలు దెయ్యాలు భూతగణం అంటూ ముందా వెధవ కబుర్లు మానేయి. బాగా ఆలకించు శబ్దం ఇటుగా వస్తున్నది. మనమేమో అటు గుహలోకి వెళ్ళాం పదండి ఇటు వెళ్ళి చోద్దాం." విజయ్ నెమ్మదిగా అన్నాడు.

    సుబ్బారావుకో అనుమానం వచ్చింది గాని కక్కకుండా దిగమింగేశాడు.

    నలుగురూ అటుకేసి నడిచారు.

    ఇప్పుడు శబ్దం క్రుగా విన వస్తున్నది.

    ఆ వింతేమీటో చూడాలంటే గుహలో కాలు పెట్టాలి కళ్ళారా చూస్తె తప్ప ఎప్పుడూ వినని ఆ వింత తెలిసిపోతుంది.

    "ప్రమాదమో ప్రమాదామో చూస్తె తప్ప తెలియదు. ఆ గుహలో బాగా చీకటిగా వుంది. గుహలో అడుగుపెట్టడం మంచిది కాదు. మార్గం వద్ద ఆగిపోయి గుహలోకి లైటు వేసి చూద్దాం ప్రామాణభరిత మైనా దృశ్యం కనిపిస్తే లైటు అర్పుతాను. ఆ వెనుక గుహలోకి జమ్ఫ్ చేద్దాం. అంతకన్నా మార్గంలేదు.

    "అంతేఅలాగే చేద్దాం విజయ్" అంది కృతి
    "పదినిముషాలు ఆగుదాంశబ్దంలో మార్పు వస్తుందేమో కనిపెట్టి ము౦దడుగు వేయడం మంచిది" కమల్ సలహా ఇచ్చాడు.

    "మీ అంత క్విక్ ధైర్యం తెచ్చుకుని వాళ్ళతో పాటు రెడీ అయ్యాడు.

    ఈ యాత్రకు బయల్దేరేముందు అన్నీ సమకూర్చుకోవడానికి టైమ్ క్కువ లేకపోయింది. అయినా విజయ్ డబ్బుకు ఆశపడే ఓ బ్రోకర్ ని పట్టుకుని అతని వ్దారా ఓ రివల్వర్ట్ సపాదించాడు. నాలుగు డజన్ల గుళ్ళు మాత్రం చాలా ఖరీదికి దొరుకాయి. ప్రాణం మీదకొస్తే తప్ప రివాల్వర్ వుపయోగించరాదని ముందు నిర్ణయించుకున్నారు. అప్పుడే తెలివిగా కమల్ ఓపని చేశాడు నాటకాలలో వుపయోగించే రకం టాయ్ పిస్టల్స్ నాలుగు కోనుక్కున్నాడు.

    వాటిని చూసి "ఇవేందుకురా కమల్! దారిలో ఆడుకోవటానికా" విజయ్ అడిగాడు.

    "ఇవి టాయ్ పిస్టల్స్ కావచ్చు కాని పేలిస్తే నిప్పురవ్వలు వేలుపడతాయి పరిసరాలు దద్దరిల్లేలా ద్వని వస్తుంది. ఏ కూరజంతువుతో ఎదురైతే ఇది పెలుద్దాం. భయంతో అది పారిపోతుంది ఓ విధమైనరక్షణాయుధం మనకి!" పిస్టల్ గురించి యింకా కొంత వివరించాడు కమల్.    

    కమల్ ఐడియా అందరికీ నచ్చింది. తలో పిష్టలు దగ్గర వుంచుకున్నారు. వాళ్ళకి నిత్యం దగ్గరవుండే ఆయుధం రూళ్ళకర్ర కన్నా జానేడు పొడుగున్న మంచిరకం చేతికర్ర. పోలీసువాడి చేతిలో లాఠీకర్రలాంటిదే ఇదికూడా.

    చేతిలో కర్రలు బిగించి పట్టుకున్నారు సుబ్బారావు కృతి.

    విజయ్ రివాల్వర్ తీసి చేతిలో వుంచుకున్నాడు.

    "ఎంతోఅవసరం అయితే తప్ప గుండు వేస్ట్ చేయకు విజయ్! బెదిరింపుకోసం ముందుగా నా టాయ్ పిష్టల్ ని వుపయోగిస్తాను" తనూ రెడీ అవుతూ అన్నాడు కమల్.

    "ఓ.కే" అన్నాడు విజయ్.

    వీళ్ళ సంబాషణ అతినేమ్మదిగా జరిగింది.

    ఆ గుహలోకి వెళ్ళేమార్గం దగ్గరగా అడుగువేస్తూ అక్కడికి చేరాడు విజయ్. అతని పక్కన వేనుకగా చేరారు మిగతావాళ్ళు.

    కుడిచేతిలో రివాల్వర్ రెడీగా పట్టుకుని ఎడంచేతిలోని టార్చిలైటు వెలిగించి ఫోకస్ గుహలోకి వేశాడు అలాగేవుంచి అటూ ఇటూ తిప్పాడు.

    ముందు నుంచున్న విజయ్ కి కమల్ కి కనిపించిన ఆ దృశ్యం వీళ్ళ వెనుకనే నుంచున్న కృతికి సుబ్బారావుకి కనిపించలేదు.

    విజయ్ లైటు అర్పూతూనే నవ్వాడు.

    కమల్ అంతకన్నా గట్టిగా నవ్వాడు.

    వాళ్ళిద్దరి నవ్వులూ తెరలు తెరలుగా ఆగకుండా వస్తున్నది.

    "ఏం జరిగిందిరా?" బిక్క ముఖంవేసి అడిగాడు సుబ్బారావు.

    "ఆగండి ఏమిటా పిచ్చి నవ్వు ఆగటంలేదు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు కుదరటంలేదు.

    నవ్వు నవ్వు నవ్వు   

                              17

    విపరీతమైన వాళ్ళ నవ్వుచూసి కృతికి రవంత భయం వేసింది.

    కమల్ భుజంగిల్లాడు విజయ్.

    కృతి ముందుకు జరిగి టార్చ్ లైట్ వెలిగించి ఆ గుహలోకి వేసి చూసింది.

    ఇప్పుడు వాళ్ళిద్దరితో పాటు కృతి కూడా నవ్వడం మొదలు పెట్టింది.

    "వీళ్ళు చూసిన దృశ్యం ఏమిటోగాని వీళ్ళ మతులు పూర్తిగా పోయాయి. ముగ్గురూ పిచ్చినవ్వులు నవ్వుకున్నారు. వీళ్ళకి మతిపోయింది. భగవంతుడా! నాకింకేం దారి. అదేమిటో నేను చూద్దామంటే నా మతిపోయి వెర్రిఅవ్వులోకి దిగుతానేమో"

    సుబ్బారావుకి ఏం చేయాలో తెలియటంలేదు. నెమ్మదిగా వణుకుతున్నాడు.

    "సుబ్బూ! మైడియర్ సుబ్బూ!" విజయ్ అన్నాడు.

    "ఎ..... ఎ...... ఏంటిరా ?" సుబ్బారావు స్వరంలో కంపన చక్కగా తెలుస్తున్నది

    "భయపడుతున్నా వెంటిరా సుబ్బూ?"

    "పిచ్చిపట్టినట్టు మీరెందుకురా నవ్వుకున్నారు?"

    "ఓ అదా " అంటూ నవ్వి కొండనుతవ్వి ఎలుకను పట్టుకున్నందుకు పద చూద్దువుగాని" అని లైటు వేసి ముందుకు నడిచాడు విజయ్!

    సుబ్బారావుకంతా అయోమయంగా వుంది అడుగులు తడబడుతుండగా వాళ్ళ వెనుకనే నడిచాడు.

    ఆ గుహా తతిమ్మా గుహలకన్నా చిన్నదే ఎత్తుమటుకు చాలా వుంది. గుహలో ఎపక్క కంట్లా వుంది. దానిలోంచి ఫావుర్సుగా నీరు వచ్చి ఎదుటి గోడకు కొట్టుకుని కింద కంతలోకి వెళ్ళిపోతున్నది. ఈ నీటిశబ్దమే వాళ్ళు విన్న విచిత్రద్వని.

    "ఇదేంటిరా!" సుబ్బారావు తెల్లబోతూ అడిగాడు.

    "ఇదా నాయినా నీళ్ళు."

    "కనబడుతూనే వుంది. మీరెందుకు నవ్వారురా!"

    "నీలాగా తెల్లబోటం చేతగాకరా నాయనా! భయంకర దృశ్యం చూడబోతున్నామని భ్రమపడి ప్రమాదం మీదపడుతుందేమో అని జాగ్రత్తపడి పధకం వేసుకుని ఎంతో జాగ్రత్త వహించి అడుగుముందుకువేస్తె ఇక్కడ మనకు నీళ్ళు దర్శనమించాయి. నా జాగ్రత్తకి నాకే నవ్వు వచ్చింది."

    "మీ నవ్వు చూసి మీకు పిచ్చి పట్టిందేమో అని హడలి చచ్చాను కదరా!"

    "ఇలా మధ్య మధ్య నిన్ను హడలు కొడితే నీలో భయం దూరమయి ధైర్యసహాసాలు  దండిగా ఏర్పడతాయని.....!"

    అరేయ్! నన్ను చూస్తె నవ్వులాటగా వుందిరా! సమయం రాకపోదు నేనోక్కడినే మిమ్మలంతాఏడిపించి నేనొక్కడిని నవ్వకపోను."

    "హరినీ. భీష్మ ప్రతిజ్ఞ పడుతున్నావే ఫరవాలేదురా సుబ్రావ్ పైకి వస్తావ్?"

    తధస్తూ , అవునుగానిరా ఏ గుహలో కానరాని నీళ్ళు ఈ గుహలో ఎలా వచ్చాయిరా ?" తనే తధస్తూ అనుకుని అడిగాడు సుబ్బారావు.

    "మనంవుంది కొండగుహలో ఇక్కడ నీళ్ళు వుండటంలో విచిత్రం ఏముంది? కొన్ని కొండలమీద అక్కడక్కడ నీళ్ళు వుంటాయి" అన్నాడు విజయ్.

    "విజయ్ ! ఈ నీళ్ళుచూడు గోరువెచ్చగా వున్నాయ్!" దోసిటతో నీళ్ళుపట్టి తాగుతూ అంది కృతి.

 Previous Page Next Page