అదికాదురా కమల్!" సుబ్బారావు ఏదో అనబోయాడు చెప్పొద్దు అన్నట్లు చేయిచాచి వారించాడు కమల్.
"అరె కమల్! బాధనేది నీకే కాదురా మాకూ వుంది. నిశ్చల ఓ విధంగా నీకు ప్రాణం అయితే మరోవిధంగా మాకూ ప్రాణమేరా! అక్కడికేదో మేము నిరాశతో వెనక్కి మరలిపోతున్నట్లు నీ ఒక్కడివే అనీ త్యాగంచేసి ముందుకు సాగిపోతున్నట్లు మాట్లాడకు మనం ఎంతదూరం పోయినా వున్న చోటునే వున్నట్లు ఉంది ఈ పరిస్థితిలలో మనం చేయాల్సింది ఈ మాత్రం వెలుతురోవేగంగా వెనక్కి మరలిపోవడం.......
"ఆ తర్వాత తిని పడుకుందాం అంతేనా!"
"ఆ కొందరే కూడడురా కమల్! ఓ ప్లాను పాడు లేకుండా ఇలా పోతూనే వుంటే నీరసంతో అందరి ప్రాణాలూ హరీ అంటాయి. అది బాగుంటుందా అప్పుడు మనం ఏమీ సాధించినట్లు!"
"ఏం చేయాలో నాకేం తోచటంలేదు"
"నీ బుర్ర పనిచెయ్యదు . వెనక్కి వేగంగా వెళ్లటం చాలా తేలిక బాణం గుర్తువల్ల మన స్థావరం చేరటం త్వరితంగా జరుగుతుంది. వెళ్ళి కాస్త ఆహారం తీసుకుందాం పావుగంట రెస్టు తీసుకుందాం. బయల్దేరితే నలుగురం లేకపోతె నీవూ నేనూ మరో దోవగుండా ఇంకోరకం గుర్తులేసుకుంటూ అర్దరాత్రిదాకా వెళ్ళి గాలించి వద్దాం. తరువాత తిరిగిరాంగానే మూడుగంటల నిద్ర అది మనవిరామ సమయం. తెల్లవారు ఝామునె లేచి అందరం బయల్దేరుదాం. తెల్లవారు ఝామునుంఛీ రాత్రి పన్నెండుదాకా గాలిద్దాం ఇలాంటి వందలు వుండే నేమోగాని వేలకువేలు కలసి వుండవని నా గాఢభిప్రాయం. తిరిగిన చోటే మల్లె మళ్ళీ తిరగకుండా గుర్తులు వేస్తున్నామాయే అస్థిపంజరాలను చూశాము కదా! వాళ్ళు ఏదో ఓ దారిన యిక్కడికొచ్చి మరణించారన్నది ఖాయం. కాబట్టి దారివుంది. దాన్ని మనం పట్టాలి.
విజయ్ ఆగకుండా మాట్లాడుకుంటే సుబ్బారావుకో అనుమానం వచ్చింది వెంటనే అన్నాడు.
" వాళ్ళొచ్చిన దారి మూసుకుపోయిందేమో?"
"నీ వన్నదీ ఓ పాయింటే అలా జరిగివుంటే బాగా ఆలోచించి కొత్త మార్గం ఎతుక్కుందాము. ఇంక వెళదాం కమల్!"
కమల్ మాట్లాడలేదు విజయ్ చెప్పిందాంట్లో అర్ధంవుంది. తాను రానంటే నీళ్ళూ తనవెంటనే వుంటానంటారు. ప్లాన్ ప్రకారం చేయటమే ఉత్తమమైన నిర్ణయం.
"ఏంటి కమల్ ఆలోచిస్తున్నావ్ ?" కృతి అడిగింది.
"ఏంలేదు వెళదాం పదండి" కమల్ అన్నాడు.
అందరూ వేగంగా వెనక్కీ మరలి వచ్చినదారే పట్టారు.
వెలుతురు క్రమేపీ తగ్గి చీకటి అక్రమించుకోవడం మొదలు పెట్టింది.
16
తెల్లవారు ఝామున చప్పున మెలుకువ వచ్చింది.
నైటుసూటు విప్పి మడతపెట్టాడు . వెంటనే ముగ్గురుని లేపాడు.
విజయ్ ఆవులిస్తూ లేచి కూర్చున్నాడు టైము చూసుకున్నాడు. "కమల్! కరెక్ట్ టైముకి లేపావు అసలు రాత్రి నిద్రపోయావా?" అన్నాడు.
"నేను చెప్పగలను . కమల్ నిద్రపోలేదు నిశ్చల గురించి ఆలోచిస్తూ వూరికే దొర్లుతూ వుండివుంటాడు" కృతి అంది.
"నైట్ సూటులోవున్న మనకే సూటు విడవంగానే చలిచంపేస్తున్నది. నిశ్చల ఎలా వుందోరా ఈ చలికి!"
"కమల్ ! నీకు మతిపోయిందిరా ! నిశ్చల నైట్సూట్ లోనే వెళ్ళింది. కాని ..... కాని .... టార్చిలైటు కూడా చేసుకోడం తప్ప ప్రయోజనం ఏముంది బయల్దేరాబోతున్నాము కదా. మన ప్రయత్నం సక్సెస్ కావాలని భాగావంతుడుని ప్రార్ధించి బయల్దేరుదాం" విజయ్ ఊరడింపుగా అన్నాడు.
రాత్రి కృతిని సుబ్బారావుని ఆగిపోమ్మని చెప్పి విజయ్ కమల్ అర్దరాత్రి వంటిగంటదాకా మరో మార్గంగూండా వేరే గుర్తులు X లాగా ట్టుకుంటూ వెళ్ళిరావటం జరిగింది. ప్రయోజనం కనిపించలేదు.
నాలుగు గంటలకి లేచి బయల్దేదేరుదామనుకున్నారు . నిశ్చలఅలోచానలతావు అన్యమనస్కుడైన కమల్ నిద్రపోలేదనే చెప్పాలి. ఆ మూడు గంటలకాలంలో మహా అయితే ఓ అరగంట నిద్రపోయేవాడేమో, వూరికే అటూ ఇటూ కదులుతూనే వున్నాడు.
ప్రయాణం ముందే ఎవరు ఏ సమయంలో ఏ ఏ పనులు చేయాలి. సామాను ఎలా వాడుకోవాలి. ప్రమాదం ఎలా ఎదుర్కోవాలి ఇంకా ఎన్నో విషయాలు చర్చించుకుని అందరూ వాకేమాట మీద బయల్దేరారు. ఆడమగ అన్నిపనులు సమానంగా చేయాలనుకున్నారు.
ఈ రోజు టీ తయారు చేయటం సుబ్బారావు వంతు.
సుబ్బారావు బ్లాక్ టీ తయారు చేసి బిస్ కేట్స్ తోపాటు అందించాడు అందరికి.
అరగంటలో అందరూ రెడీ అయ్యారు.
దోవలోకి కావాల్సింది సర్దింది కృతి.
ఒక్కొక్కరి భుజాన ఒక్కొక్కటి ఎక్కిం. అసలు లగేజి ఇక్కడే వుంచారు. ఆ రోజు ఆ రాత్రి లోపల కావాల్సినవి మాత్రమే తీసుకున్నారు అవేవీ బరువైనవి కావు.
కటిక కాని రాని భగవంతుడినే అందరూ మౌనంగా ఓ సారి ప్రార్ధించి బయల్దేరారు..
ఈతఫా బాణం గుర్తులు పెట్టిన మార్గం వదిలేశారు X గుర్తులు పెటిఇన మార్గం వదిలేశారు. భూమి గుండ్రంగా వుండనన్నట్లు జీరో మార్కులు పెట్టుకుంటూ మరో మార్గంగుండా బయల్దేరారు.
X, గుర్తులు పెట్టినవైపు వెళ్ళకుండా , o గుర్తులు పెట్టుకుంటూ వాళ్ళు మరో మార్గాన బయల్దేరేటప్పుడు వాళ్ళకి తెలియదు వెళ్ళిన మార్గాన వెళ్ళవాడదనుకున్నారుగాని ఏటు దారి తీస్తుందో ఈదారి అని.
వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు అదే.
o గుర్తులు పెట్టుకుంటూ గుహలు దాటుతున్నారు. తమాషాఏమిటంటే ఓ గుహలోంచి మరో గుహలోకి కాలుపెట్టేటప్పుడు వాళ్ళు పెట్టిన గుర్తులు మరోసారి X గుర్తులు కానరావడంతో అది కాదనుకుమ్తూ మరో గుహలో జొరబడి O గుర్తులు పెడుతూ ముందుకు సాగిపోతున్నారు.
ఎటు చూసినా అంధకార బంధకరమే కాబట్టి బ్యాటరీ వేస్టుగాక తప్పటంలేదు.
"ఛస్ లో నాకు కొద్దిగా ప్రావీణ్యంమేవుంది. మనం పెట్టిన ఈ గుర్తులు మనకే ఎదురవుతుంటే బ్రిలియంట్ ఛస్ ఆటగాడితో చప్పొడి నట్లుగా వుందినాకు" కృతి అంది వాతావరణంలోని నిశ్శబ్దాన్ని పారద్రోలుతూ.
"నీ ప్రాణానికలా వుందేమోగాని కృతీ! నామటుకు నాకు మా బామ్మతో వైకుంఠపాలికాడు మహా యమాబిలమార్గాలు అనే కొత్త పేరు తగిలించవలసి వస్తుంది" అన్నాడు విజయ్ .
అలా మాట్లాడకుండా మధ్యాహానికి చాలాదూరం నడిచారు.
ఓ గుహలో ఆగి ఏదో తిన్నాం అనిపించారు. పావుగంట రెస్టు తీసుకుని మళ్ళీ నడక సాగించారు.
"మధ్యాహ్నమయినా ఈ దారివెంట వెళ్ళే గుహల్లో వెలుతురు చాలా తక్కువ వుంది.
"వెలుతురు తక్కువగా వుంది గమనించావా విజయ్? ఈ లెక్కన మనం మరీ మూలకి పోతున్నామేమో అనిపిస్తున్నది కదూ?" కృతి అడిగింది.
"వెలుతురు ఇక్కడ ఎక్కువ పడదేమో అంతమాత్రాన మూలకి వెళుతున్నామని ఎందుకు అనుకోవాలి తూర్పూ పడమరభేదం వల్ల వెలుగు నీడలు తారుమారు కావచ్చుకదా?"
"యూ ఆర్ కరెక్ట్ విజయ్?" కమల్ అన్నాడు.
"తూర్పు ఎటో?" సుబ్బారావు అడిగాడు.
"సూర్యుడు వుదయించేవైపు " టకీమని సమాధానం చెప్పాడు కమల్.
సరీగా అప్పుడే "ఇష్! ఆగండి. ఏదో శబ్దం వినపిస్తున్నది జాగ్రత్తగా ఆలకించండి" తానగిపోతూ అంది కృతి.
సడన్ బ్రేక్ వేసినట్లు ఆగారు. అదో రకమైన ద్వనితో లీలగా శబ్దం వినవస్తున్నది.
"వినపడిందా! మీకేమని పిస్తున్నది?' కృతి చాలా నెమ్మదిగా అడిగింది.
"మరింత ముందుకూ పొతే గాని అర్ధంకాదు" విజయ్ అన్నాడు.
"ప్రమాదమేమోరా! ఇంతవరకూ ఇన్ని గుహల్లో ఏ శబ్దలూ వినపించని మనకు ఈ శబ్దమేదో .... " ఆపై సుబ్బారావు నోట్లోంచి మాటరాలేదు.