"విజిల్ ఊదితే" అన్నాడు సుబ్బారావు.
కమల్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విజిల్ తీసి గట్టిగా వూదాడు మళ్ళీ మళ్ళీ వూదాడు.
ఈల శబ్దంతో గుహా మారు మోగిపోయింది.
అవతలనుంచి రెస్పాన్స్ మటుకు రాలేదు.
కమల్ ముఖం పాలిపోయింది.
ఎవరైనా విజిల్ వూత్తే అదివిని సిగ్నల్ గా అవతలి వాళ్ళు విజిల్ వేయాలి అవతలి నుంచి గ్రీన్ సిగ్నల్ లేదు రెడ్ సిగ్నల్ లేదు. చీకటికాగానే నిశ్శబ్దం కూడా ఆవరించి వుంది.
"విజిల్ ఊదే స్థితిలో నిశ్చలలేదన్నమాట " కృతి అనుకుంది. ఇదేమాట పైకి అంటే కమల్ నిరాశపడిపోతాడని అనలేదు
"మనం వెళుతున్నాము కదా కమల్! విజిల్ ఊదకు నిశ్శబ్దం గానే వెళ్ళి చూద్దాం" విజయ్ అనదాంట్లో మరో అర్ధం కనబడటంతో కమల్ "ఓ.కే." అని మిన్నకుండిపోయాడు.
బాణం గుర్తులెగాక పరిశీలనగా చూస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు బాణం గుర్తులు వేయటం మానేశారు గుర్తులు వున్నాయికదా మారుపడే ప్రమాదం లేదు.
గంట తర్వాత.
అందరూ ఓ గుహలో ప్రవేశించారు.
ఎదురైన కొన్ని వస్తువుల్ని చూసి అందరూ శిలాప్రతిమలే అయ్యారు.
కమల్ అలాగే చూస్తూ ఏదో అనబోయాడు "ఇష్" అంటూ వారించాడు విజయ్. లైటు ఫోకస్ గుహా నలువైపులా తిప్పి చూశాడు. పైకి కిందికి వేసి చూశాడు.
వాళ్ళకా గుహలో కనబడింది.
ఒక టార్చిలైటు , చాక్ పీసు మూరెడు పైనున్నకర్ర, ఆమూడు వస్తువులూ నిశ్చలవే అందులో సందేహం లేదు.
వారింటికి మరో భీకర దృశ్యం కనబడింది. అక్కడ మానవ ఆస్తి పంజిరాలు చూసేసరికి ఆ ప్రయత్నంగా ఓ రెండడుగులు వెనక్కీ వేశారంతా.
ఆ గుహలో ఏ ప్రమాదమూ లేదని. ఏడీవచ్చి మీద పడదని ఓవేళ పడ్డా ఎదుర్కోనాదానికి సిద్దమయ్యే విజయ్ పెదవి కదిపాడు.
ఆ గుహలోంచి నాలుగువైపులకీ వెళ్ళడానికి నాలుగు మార్గాలున్నాయి. వీటినే బిలమార్గలంటారు. వీటికో తీరూ తెన్నూ ఉండదు. తిన్ననైనా దారీ వుండదు.
కిందపడ్డ టార్చ్ లైటు ని చేతిలోకి తీసుకున్నాడు కమల్.
"నా కర్దమై౦ది ముందుగా చెబుతాను. మీ కర్దమైంది తర్వాత చెప్పండి. నా ఊహాకందినంతవరకూ ......" కాస్త ఆగి మళ్ళీ మొదలు పెట్టాడు విజయ్ ."ఇక్కడివరకూ బాణం గుర్తులు పెడుతూ నిశ్చల వచ్చింది బహుశా దాక్కుని మన్ని ఏడిపించటానికి కావచ్చు లేక అందరికన్నా ముందు తాను ఏదైనా బయటకు మార్గం కనిపెట్టిమనల్ని ఆనందసముద్రంలో ముంచుదామనైనా కావచ్చు. ఈ ఆధారాలనుబట్టి అనుకుంటున్నాను. ఇక్కడ రెండు అస్థిపంజరాలున్నాయి. అకస్మాత్తుగా ఎదురైనా వీటిని చూసి మూర్చపోయి వుంటుంది. ఆ సందర్భం లోని చేతిలోకి కిందపడ్డాయి...... ఆపై .... ఆపై ...." అంటూ తీక్షణంగా వాటిని చూస్తూ ఆగిపోయాడు.
ఆపై జరిగింది ఎవరికీ తెలియదు . ఎందుకంటే నీవు చెప్పిన ప్రకారం నిశ్చల తెలివితప్పి పడిపోయిందనే అనుకుందాం. తెలివి వచ్చింతర్వాత టార్చ్ లైటు పుచ్చుకుని తిరిగి వచ్చేదేకదా! నిశ్చల మరీ పిరికిదే౦కాదు కనుక ......!" అపైనేం జరిగిందో కృతి ఊహకు అందక ఆగిపోయింది.
"స్పృహా తప్పిపోయినప్పుడు ఎవరైనా ఎత్తి కెళ్ళారేమో! అదీ గాక ఈ అస్థిపంజరం తామషాగా వున్నాయేమిటి?" సుబ్బారావు అన్నాడు.
"అవును విచిత్రంగానే వున్నాయి . ఈ అస్థిపంజిరాలు తాలూకు మనుషులు బతికివుంటే ఎత్తు నాలుగు అడుగల లోపు. తల చాలా పెద్దదిగాను . ముందుపళ్ళు పోడుగ్గాను వుండి వుండాలి అదోరకం జాతి మనుషులై వుంటారు. ఆ అస్థిపంజిరం తీరు చూశావా? గోడకి జార్లబడి కాళ్ళు జాపుకుని వుంది. మరో అస్టిపంజరం బోర్లా పడుకుని వుంది. దేన్నీబట్టి మీకేం తోస్తున్నది?" విజయ్ అడిగాడు.
"వీళ్ళు చనిపోయి నెలలు కాదుగాని, సంవత్సరం పైనే అయివుంటుంది వీలిక్కడికి ఎలా వచ్చారోగాని వచ్చిపడ్డారు. వీరి తాలుకా సామాన్లు ఏమీలేవు. విచిత్రంగా చేసిన ఈ ఆయుధంవుంది. వచ్చి ఇక్కడ ఇరుక్కు పోయారు. బయపడే మార్గమే వుంటే ఇలా చచ్చేవారు, కాదు. దారి తెలియక ఆకలిదప్పులతో అలమటించి అలమటించి మరణించివుంటారు"
కృతి మాటాలకి అడ్డు తగిలాడు సుబ్బారావు.
"అలా ఎందుకనుకోవాలి? ఎవరైనా వీళ్ళని చంపి ఇక్కడ పడేశారేమో!"
"అర్ధంలేని అనుమానం నీది. చంపపారేస్తే ఆయుధం ఎందుకు పారేసి వెళతారు! పైగా వీటితీరు చూశావా! ఒకటి గోడకి జార్లగిలపడినట్లు వుంది. నిరాశ నీరశంతో చచ్చినట్లు మొఖం పక్కకి తిరిగివుంది. రెండోది ఓపిక నశించి తూలీ బోర్లాపడి ఇంక లేవలేక కృంగికృశించి అలానే మరణించటం జరిగివుంటుంది."
"కృతీ నీవు చెప్పేది సెంట్ మెంట్ సెంట్ కరెక్ట్ " విజయ్ అన్నాడు.
"మీ పరిశోధన తగలబడ. నిశ్చలకోసం అలోచించరేమర్రా" వీళ్ళ మాటలన్నీ విని అప్పుడు కమల్ పెదవి కదిపాడు.
"ఇక్కడ విషయం ఆలోచిస్తే నిశ్చలని తేలిగ్గా వేటక వచ్చనే కదరా. ఊహాకందే ఆధారంకూడా దొరకలేదు. బాణం గుర్తులు పెట్టుకుంటూ ముందుకు సాగుదాం. మనం దారి తప్పకుండా ఉండటానికి విజయ్ అన్నాడు"
మనం వెళుతున్నది ముందుకో, వెనక్కో, పక్కకో ఎవరికీ తెలుసురా విజయ్! మనం కూడా వీల్లలా దిక్కుమాలిన చావు చావాలేమోరా " సుబ్బారావు భయపడుతూ అన్నాడు.
"అలా రాశి వుంటే అలాగే చద్దాం. కోటిమార్గాలున్న కొండబిలం యిది. దారి ఈ చచ్చినవాళ్ళకే తెలియలేదు. మనకి కొద్దో గొప్పో ఆహారం వుంది. నీరు వుంది. బుర్రలో గుజ్జువుంది. వేలుతురుకి లైటు వుంది. గుర్తుకి చాక్ పీసు వుంది. ఇంకా ఇంకా బతికి బయట పడే ఆదునిక పరిజ్ఞానం వుంది. ఇన్ని వుండి మన గీత సరీగలేకపోతె ఇంతే సంగతులు . కానుక ఆ విషయం వదిలేద్దాము. మనం పోయే దారి ముందుకో వెనక్కో అనవసరం , ఓపికున్నంతవరకూ సాగిపోదాం" అంటూ మరో మాటకాస్కారం లేకుండా విజయ్ మరో గుహాలోకి దారితీశారు.
విజయ్ చెప్పిందే బాగుండటంతో ఎవరూ పెదవి కదపలేదు.
బనంగుర్తులు వేసుకుంటూ సాగిపోతున్నారు.
నిశ్చల ఏమయింది?
ఇది శేషప్రశ్నగానే మిగిలింది వాళ్ళకి .
రెండు చాక్ పీసులు ఖర్చు అయ్యాయి.
ఏ గుహాలోనూ ఏ భీకరదృశ్యాలు వారికి కానరాలేదు.
టైము పది అయింది.
చీకటి తరిగిపోతున్నది అర్దమైంది వారికి.
ఓసారి అయితే ఓ గుహలోంచి మరో గుహలోకి వచ్చేసరికి వాళ్ళ కళ్ళు పత్తికయాల్లా విచ్చుకున్నాయి.
అక్కడ బాణం గుర్తువుంది.
ఆ బాణం గుర్తు వాళ్ళు. వేసిందే. గుహలోంచి గుహలోకి వస్తూ రౌండ్ తిరిగి వుంటారు. వచ్చిన గుహలోకే వచ్చారు. అది గుర్తించి జాగ్రత్తగా అంచనా వేసుకుని వేరే మార్గం పట్టారు.
అంతవరకూ వెలుతురు ఎక్కువయింది.
టార్చిలైటు ఎక్కువుగా వుపయోగించే అవసరం లేక పోయింది.
మధ్యాహ్నం పన్నెండు.
వంటిగంట.
రెండు.
ఎవరూ వెంట ఏమీ తెచ్చుకోలేదు దాహంతో నాలుక అర్చుకుపోతున్నది . పేగులు ఆకలంటూ గోల చేస్తున్నాయి. కాళ్ళు పీక్కుపోతున్నాయి. నిశ్చల కనబడదేమో అన్న నిరాశ ఇంకా ఎంత దూరం అనే నిస్పృహా . తిరిగినందుకు విస్సత్తువ . అందరి ముఖాలు పీక్కుపోయాయి. లేని ఓపిక కొని తెచ్చుకుని నడుస్తున్నారు.
దరిదాపుల్లో చిన్న ఆశాకిరణంకూడా కానరాలేదు.
తామో పెద్ద తప్పు చేస్తున్నామని బొత్తిగా గ్రహించలేదు వాళ్ళు.
మొదట విజిల్ వూదారు . క్రమేనా విషయం వదిలేశారు.
అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు.
ప్రతి గుహలో బాణం గుర్తులు పెట్టేటప్పుడు ఒక్కసారంటే అక్కసారి విజిల్ ఊదివుంటే ......
నిశ్చలని చూసే యోగం వీళ్ళకి లేదు. అందుకే వాళ్ళెవరికీ ఈ ఆలోచన రాలేదు.
గుహలో వెలుతురు తగ్గటం మొదలుపెట్టింది.
టైము మూడున్నర దాటింది.
సుబ్బారావు కళ్ళు ఈడుస్తూ నడుస్తున్నాడు.
విజయ్ టైము చూసి ఆగాడు.
"కమల్! ఇంక మనం వెనక్కీ వెళదాం!"
"ఊహూ నేనురాను. నా నిశ్చల కనబడిందాకా నేను వెనక్కీ తిరిగేలేదు. మీరంతా వెళ్ళండి" కమల్ ధృడనిశ్చయంతో అన్నాడు.