Previous Page Next Page 
అసిధార పేజి 21

   

    కమల్ లైటు వెలుగులో చుట్టూ చూస్తూ ఏదిరా?" అడిగాడు.

    "మళ్ళి పిచ్చిముఖాలు అని పిలవటానికి దాక్కుంది" కృతి అంది.

    "దాక్కుందనే అనుకుంటున్నాము. మేములేచి పావుగంట అయింది" విజయ్ వెంటనే అన్నాడు.

    "నా ముందే తెలుసులేవోయ్" కమల్ అనంగానే "నీకెలా తెలుసు కమల్?" అడిగింది కృతి.

    "మగాడు ఆడదాన్ని ఎదిపిమ్చాతంలో గోప్పముంది! ఆడది మగాడిని ఏడిపించటంలో ఎంత థ్రిల్లింగ్ వుంటుందో స్వయంగా నేనే రుచి చూపిస్తూ కమల్! అని రాత్రే నిశ్చల అంది. ఆంజనేయుడి ముండా కుప్పిగంతులు?"

    "అవునూ రాత్రి ఈ మాటలు నీతో అనే అవసరం ఏమొచ్చింది?" వెంటనే ప్రశ్నించాడు విజయ్.

    కమల మాట్లాడలేదు.

    కృతి నవ్వుకుంది.

    "ప్రతిమాతకీ ఓ అవసరం వుంటుందిరా! అదేం పిచ్చి ప్రశ్న?" సుబ్బారావు అన్నాడు.

    "ఉంటుందని నా డిక్షనరీలో నలభైనాలుగో పేజీలో అచ్చులో వుంది. ఇంటికెళ్ళింతరువాత చూపిస్తా"

    "ఇదీ ఇంటి కెళ్ళిం తరువాత తెలుసుకుందువుగానిలే"

    సుబ్బారావు అనడంతో "రక్షించావురా సుబ్బూ!" అనుకున్నాడు కమల్.

    ఇంక ఆ విషయం అంతటితో ఆగిపోయింది.

    ముఖం కడుక్కొచ్చి బ్లాక్ టీ తాగటానికి బ్యాటరీస్టవ్ ముందు చేరారంతా.

    "నిశ్చల మనల్ని ఏడిపిస్తున్న ననే అనుకుందాం . ఎంత ఏడిపిస్తే మాత్రం మరీ గంటకాలం తీసుకుంటుందంటావురా కమల్!" సుబ్బారావు అనుమానం వెళ్ళగక్కాడు.

    "నిశ్చల సంగతి నీకు తెలియదులే" తేలిగ్గా కూటిపారేశాడు కమల్
   
    "పెద్దలు కీడించి మేలెంచమన్నారు బ్రదర్ . చివరిసారి డ్యూటీలో వుంది నిశ్చల ఏ జంతువో గబుక్కున నిశ్చలమీదపడి ఎత్తి కెళ్ళిందేమేరా! నాకనుమానం వస్తున్నది"

    "నీకనుమానం రాంది ఎప్పుడురా సుబ్బూ!"

    కమల్ అనంగానే ఇంక సుబ్బారావు మాట్లాడలేదు.

    వేడిగా బ్లాక్ టీ అందించింది కృతి.

    టీ తాగటం కానిచ్చి తదుపరి కార్యక్రమం గురించి చర్చలోకి దిగారు. తలా ఓ మార్గం పట్టుకుని వెళదామానుకున్నారు. మళ్ళీ అలా చేయటం మంచిదికాదేమో ఆ వెళ్ళేదేదో ఏకంగా ఒకేసారి ఒకేవేపు అందరం కలసి వెళ్ళటమే మంచిది. ఈ గుహల్లో ఏ ప్రమాదంలేదని అనుకుంటున్నాము అంతేకదా! ఏ నిముషాన ఏం జరుగుతుందో ఏ మూలనుంచి ఏ మొచ్చి  మన్ని మృత్యువు దగ్గరకు లాక్కేళ్ళుతుందో ఎవరికి తెలుసు! నీళ్ళల్లో పాదం పెట్టినవాళ్ళం నిలువునా కిందకొచ్చి పడ్డాం కనుక _

    ముందే౦ చేయాలి అనుకుంటూ పదిరకాలుగా చర్చించుకున్నారు.

    "ఓ మైగాడ్ . ఏడున్నర అయింది ఇంతసేపు ఉహో ..... నిశ్చల దాక్కోలేదు" ముందుగా టైము చూసుకున్న విజయ్ అన్నాడు. 

    నిశ్చల గురించి అరగంట క్రితమే అందరికీ అనుమానం అంకుశంలా పొడుస్తున్నది. అయినా చర్చలోకి దిగి కాలం గమనించలేదు.

    "అవును నిశ్చల దాక్కొని వుండడు" వెంటనే కృతి అంది.

    "మరి ఏమయి వుంటుంది?" సుబ్బారావు అడిగాడు.

    ఏమీ ఆనంది కమల్ మాత్రమే అప్పటికే అతని ముఖం నల్లబడింది ఓపక్క వీళ్ళంతా కాదంటున్నా మొండిగా నిశ్చల దాగుడు మూతలాడుతున్నదని వాదించి వీళ్ళ నోరు మూయించాడు.

    అతను బాధపడుతున్నాడని గ్రహించిన విజయ్ సానునయంగా కమల్ బుజంమీద చేయివేసి "డోంట్ వర్రీ కమల్! మనం వెంటనే రంగంలోకి వురుకుందా౦. నిశ్చల కేమీకాదు. ముందు నీవు నిర్భయంగా వుండు" అన్నాడు.

    "నేను పూల్నిరా విజయ్! నా అంత ఇడియట్ మరొకడు వుండడు. ముందీవిషయం చాలా తేలిగ్గా తీసుకున్నాను. తర్వాతయినా టైము చూసుకోవాలా అక్కరలేదా! నిశ్చలరా. నా నిశ్చల. నన్ను నమ్మి నాకోసం తల్లిని తండ్రిని ఆఖరికి పరువు ప్రతిష్టలను తనప్రాణాన్నితృణప్రాయంగా ఎంచి వచ్చేసిందిరా! నా నిశ్చల కేదైనా అయితే నే భరించలేనురా విజయ్!"

    "ఏమిట్రా ఈ అర్ధంలేని వాగుడు! ఇంతకుముందున్న ధైర్యం ఏమయింది నిశ్చలకేంకాదు . అన్నింటికీ తొందర నీకూ వుంది. ఈ విషయంలో ఇద్దరూ యిద్దరే"నెమ్మదిగా మందలింపు ధోరణిలో అన్నాడు విజయ్.

    "నిశ్చలకి ప్రమాదం జరిగివుంటుంది!" ఈ విషయంలో తిరుగులేదన్నట్లు ఏ మాత్రం అనుమానం చూపకుండా  అనేశాడు సుబ్బారావు.

    "అలా అనే అనుకుందాం. నిశ్చల మేలుకుని వుంది. మనం నిద్రపోతున్నాం. గుహలో చీకటి ఓ వేళ ఏ ప్రమాదమైన అకస్మాత్తుగా వచ్చి మీదపడ్డా నిశ్చల కేకలు పెట్టటానికి ఆస్కారం వుంది. నిశ్చల కేకల పేట్టి మనల్ని లేపలేదంటే కారణం చాలా జటిల మైనదే. ఇంకో విషయం నిశ్చల విజిల్ వూడవచ్చు కదా? అలాంటి పని చెయ్యలేదు. చేసివుంటే మనం వినడం జరిగేది. మన వూహకందనిదేదో నిశ్చల కయింది. వెంటనే మనం వెతకడానికి బయల్దేరాలి " కృతి అంది.

    "ఎటని వెళతాం?" సుబ్బారావు అడిగాడు.

    "ముక్కుకు సూటిగా సరేనా? ఊ ..... ఇంక బయల్దేరండి"

    విజయ్ అనంగానే అంతా లేచారు.

    లైటు వేస్తూ అర్పుతూ పరిశీలించి మరో గుహలో కాలుపెడుతున్నారు.

    కృతి విజయ్. సుబ్బారావు మాట్లాడుకుంటున్నారు. కమల్ వాళ్ళతోపాటు నడుస్తున్నాడు అంతే పెదవి కదపలేదు.
   
    అందరూ గుహలు దాటుకుంటూ ముందుకు వెళుతున్నారు.

    ఉన్నట్టుండి పెద్దగా అరిచింది కృతి.

    "ఏమైంది కృతీ!" విజయ్ గాభరాగా అడిగాడు.

    "అటుచూడు విజయ్! కృతి లైట్ ఫోకస్ లో  చూపిస్తూ అంది.

    జయ్ తో పాటు కమల్ సుబ్బరావు కూడా చూశారు. కృతి ఏదో అనేలోప కమల్ పరుగు తీశాడు అటు.

    ఓ రాతి మీద నిశ్చల చాక్ పీసుతో వేసిన బాణం గుర్తు ఉంది.అప్పటికే వాళ్ళు అయిదారు గుహాలు దాటారు. అయినా ఏ గుహాలోనూ బాణంగుర్తు కనిపించలేదు. కారణం చిన్నదే. టార్చిలైటు వుపయోగించటానికి కూడా వాళ్ళు పొదుపు పాటించటంవల్ల గుహలో లైటు ఒకసారి వేసి అర్పటంవల్ల నిశ్చల పెట్టిన బాణం గుర్తు కనిపించలేదు. ఈ గుహా నుంచి మరో గుహలోకి వెళ్ళేటప్పుడు చేతులూరుకోక అన్నట్లుగా ప్రవర్తిస్తూ కృతి లైటు స్విచ్ నొక్కింది. ఆ ఫోకస్ సరీగా నిశ్చల వేసిన బాణం గుర్తు మీద పడింది.

    "అవును ఇదీ నిశ్చలవేసిన బాణం గుర్తే . బాణం బొమ్మని ఇలా ఒంపుతిప్పి వేయటం నా నిచ్చూకే అలవాటు" బాణాన్ని కాదు ఎదురుగా నిశ్చలే ఉన్నట్లు భ్రమిస్తూ పట్టరాని సంతోషంతో అన్నాడు కమల్.

    విజయ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కమల్ భుజంతట్టాడు.

                                          15

    కృతి కాసేపు ఆలోచించి "మనం ఆగుదాం" అంది.

    "నాదో అనుమానం?" అంటూ నసిగాడు సుబ్బారావు.

    "ఇంక ఎందుకు ఆలశ్యం బాణం గుర్తులున్నాయేమో చూస్తూ ముందుకెళదాం" కమల్ తొందరపడిపోతూ అన్నాడు.

    "చూడు కమల్ నీ వక్కనిమిషం మనసు కంట్రోల్ చేసుకో. నీ అనుమానం తర్వాత కక్కదువుగాని ఊ..... నీ ఆలోచన చెప్పు కృతీ"

    "బాణం గుర్తు వేసే నెమ్మది నిశ్చలకి వుందంటే నిశ్చలని ఎవరూ ఎత్తుకెళ్ళలేదని అర్దమవుతున్నది. మరో విషయం గమనించారా? బాణం గుర్తు కంగారుగా గీసినట్లు లేదు. తాపీగా అందంగా గీసినట్లు తెలిసిపోతున్నది అంతవరకూ బాగానే వుంది నిశ్చల దాక్కోలేదు. నడిచి వెళ్ళింది. ఎక్కడికి ఎందాకా? ఎందుకు? ఇదే నా కర్ధంకానిది" కృతి బాణంగుర్తునే చూస్తూ అంది.

    "అమయ్య నిశ్చల ఏ ప్రమాదంలోనూ చిక్కుకోలేదు" కమల్ సంతృప్తిగా అన్నాడు.

    నిశ్చల అక్కడ ఘోర ప్రమడంకి అడుగు దూరంలో వుంది.

    ఈ విషయం వీళ్ళు నిశ్చల ఏ ప్రమాదంలో చిక్కుకోలేదని తృప్తి పడుతున్నారు.

    "బాణం గుర్తులు చూసుకుంటూ ముందుకు వెళదాం" కృతి అంది.

    "వెంటనే మనం చేయవలసింది అదే" విజయ్ దారితీస్తూ అన్నాడు.

 Previous Page Next Page