టార్చ్ లైట్ ఫోకస్ వేస్తూ లోపల అడుగు పెట్టిన నిశ్చల గోడకి బాణం గుర్తు పెడదామని వెనక్కీ తిరుగుతూ పక్కకి ఫోకస్ వేసింది.
అక్కడే కనిపించింది ఓ భయంకర దృశ్యం .
కెవ్వున కేక వేయబోయి అతి కష్టంమీద ఆపుకుంటూ వెనక్కీ తిరిగింది. నిశ్చల చేయపడి విరుచుకు మీద పడ్డా దాన్ని చూడంగానే నిశ్చల చేతిలోని కర్ర , చాక్ పీస్ టార్చ్ లైటు అనీ కిందపడిపోయినయ్ ఈ తపా నిశ్చల నిర్భయంగా నిలదొక్కుకోలేకపోయింది. తూలీ పడి గబుక్కున లేచింది. కెవ్వుకెవ్వున అరుస్తూ వెనకకు తిరిగి తానొచ్చిన గుహలోకి దూకినట్లు వేగంగా వచ్చింది.
ఇప్పుడు నిశ్చల అరుస్తున్నది వున్మాదంపట్టినదానిలాగా . అంతేగాదు ఓ గుహలోంచి మరో గుహలోకి సంధించివదిలిన బాణంలా దూసుకు వెళ్ళిపోతున్నది అలా నాలుగు గుహలు దాటిందేమో అయిదో గుహలో గోడ అడ్డు రావటంతో ముఖం గుద్దుకుని బోర్లాపడి పోయింది. వెంటనే నిశ్చల లేవలేకపోయింది. భయం ఆయాసం అన్నీ ఆవరించగా అలాగే నేల కతుక్కుని వుండిపోయింది.
ఇప్పుడు నిశ్చల చేతిలో టార్చ్ లైట్ లేదు. చాక్ పీస్ లేదు. కర్ర అనబడే చిన్న ఆయుధం కూడా లేదు. గుహలన్నీ చీకటీ గుయ్యారాల్లా వుండి కళ్ళు తెరిచినా మూసినా ఒకటేలాగున్నాయి.
కొద్దిసేపటికి తెప్పరిల్ల గలిగింది నిశ్చల. తానెంత తప్పుచేసిందో దాని ఫలితం ఎంత దారుణానికి తీస్తుందో గ్రహించ గలిగింది. "కమల్ ! కమల్!" అంటూ గట్టిగా కేకలు పెట్టింది. పేరు పేరునా అందరినీ పిలుస్తూ చాలాసేపు అరిచింది అరిచినట్లే వుండిపోయింది.
నోరిప్లయ్ నిశ్చల అరుపులకి రెస్పాన్స్ కనిపించలేదు అణువణువునా నీరసం ఆవరించగా లేచినుంచున్నది కాస్తా మళ్ళీ కింద కూలపడింది.
ఏదో ఆలోచన రాగా జేబులో వున్న ఈలని తీసుకుంది మెరుస్తున్న కళ్ళతో. వేంటనే గుహలన్నీ దద్దరిల్లెటట్లు ఈలని అదేపనిగా వూదించి. తిరిగి భయంకరంగా ప్రతిద్వని వచ్చింది.
అప్పుడే ఓ విషయం గుర్తుకురాగా మరోసారి భయంతో కంపిస్తూ ఈలవూదటం ఆపేసింది.
ఈ గుహల్లో ఓ గుహలో నరమాంస భక్షులున్నారు. వాళ్ళ వల్ల మనుషులు ఆస్తిపంజరాల్లా మారి ..... ఆపై ఆలోచించకలేక కళ్ళ బడ్డ భీకరదృశ్యాన్ని మనసులోంచి తొలగించటానికి విశ్వప్రయత్నం చేస్తూ తలవిదిలించుకుంది.
కమల్ వాళ్ళకి తానె గుహలో చిక్కుకు పోయిందో తెలియదు. తనేక్కడుందో తనకే తెలియదు గుర్తు పెట్టటానికి చేతిలో ఏమీలేదు. పోనీ తాను పెట్టిన గుర్తులు వెతుక్కుంటూ వెళ్ళాలంటే టార్చ్ లైటు చెయ్యి జారి పోయింది. ఎప్పుడో మధ్యాహ్నంగాని వెలుతురూరాదు. ఈలోపల అక్కడ కమల్ వాళ్ళు లేస్తారు తను కనపడక కేకలు పెడుతూ తలో గుహలో దూరుతారేమో?
నరమాంస భక్షులున్నట్లు తెలియదు వాళ్ళకి. తనవాళ్ళని చూస్తె నారామాంసభక్షులువూరుకోరు అక్కడ కొందరి మనుషులని ఫీక్కుతిని అస్థిపంజరాలు అనగా వుత్త బోన్స్ మిగిల్చి వదిలారు. రామాయాణంలో వున్న కొండబిలం యిదికాదుకదా? మాయావి అనే రాక్షసుడిని చంపటానికి వాలి ఓకోండ బిలంలో ప్రవేశించాడుట. ఆ కొండ బిలంలో వాలి ప్రవేశించాక ఏడాది గాలించవలసి వచ్చిందిట మాయావి కోసం.
కొలంబియాలో మాయావికోసం. వాలి ఏడాది గాలించాడంటే ఆ బిలం ఎంత దూరం వుంది . ఆ బిలానికి ఎన్ని దారులు వుండి వుంటాయి పురాణాల్లో చెప్పిన ఆ కొండ ఇదేనే ....... మో.......!"
ఏదో చప్పుడు కాగా నిశ్చల ఆలోచనతోపాటు తానూ స్తంభించి పోయింది.
నరమాంస భక్షుకుడు ఇటు వచ్చాడేమో!
తన్ని కూడా పీక్కుతిని అస్థిపంజరంలా చేసి వదిలేయటం ఖాయం.
అసలు తాను చప్పుడు విందా! భ్రమకి లోనయిందా!
కాళ్ళకిఏమీ కానరాక పోయినా నలువైపులా గుచ్చి గుచ్చి చూసింది.
చీకటికి అలవాటుపడ్డ కళ్ళకి కూడా కనపడనంత చీకటి ఆ గుహను ఆవరించి వుంది.
"తనకి తొందరపాటు ఎక్కువని. అన్నివేళలా అది మంచిది కాదని, కొన్ని విషయాలలో నిధానమే ప్రధానం అని" తన్నినువ్వు తూనే మందలించేవాడు తల్లీతండ్రి.
అమ్మనాన్నకి దూరమై ప్రేమించపడ్డ కమల్ కి దూరం అయి తాను ఇక్కడ దిక్కుమాలిన చావు చావబితున్నది ఈ స్థితికి కారణం ముందు చూపు లేకుండా తొందర పాటుతో .......
ఆపై నిశ్చల ఆలోచనలు ముందుకు సాగలేదు. మోకాళ్ళ చుట్టూ రెండుచేతులూ బంధంవేసి మోకాళ్ళ మధ్య తల యిరికించుకుని వెక్కి వెక్కి ఏడ్వటం మొదలు పెట్టింది.
14
ముందుగా నిద్రలేచింది కృతి. ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చుని టైము చూసుకుంది.
"ఉదయం ఆరూ ఇరవైరెండు నిమిషాలు.
"బాగానే నిద్రపోయాను" అనుకుంటూ టార్చ్ లైటు వెలిగించి చూసింది.
అందరూ నిద్రపోతున్నారు. ముఖాన వెలుగు పడటంతో విజయ్ మాత్రం కదిలాడు.
"ఒకమనిషి తమలో తక్కువయ్యారు. ఎవరు? ఆ చివరి డ్యూటీ నిశ్చలది. ఇక్కడవున్న నిశ్చల ఎక్కడవుంది?" ఏదో ఆలోచనురాగా కృతి నవ్వుకుంది.
ఆరున్నర కావస్తోంది వీళ్ళని లేపితే! పాపం మాంచి నిద్రలో వున్నారు. నిద్రలేచి మటుకు చేసేదేముంది గనుక! నిశ్చల టక్కరి పిల్ల అవసరం నిమిత్తం అవతలికెళ్ళిందా లేక తమని గాభరాపెట్టటానికి దాక్కుందా! దీని అల్లరి ఎవరికీ తెలియదు గనుక! దీనిరిక్కతిన్నగా కుదర్చాలంటే.......
కృతి ముఖం మీద టార్చ్ లైటు ఫోకస్ పడింది.
"ఎంత సేపయింది కృతీ లేచి" అంటూ విజయ్ లైటు ఆర్పేసి కృతి దగ్గరకొచ్చాడు.
"జస్ట్. ఫైవ్ మినిట్స్ అనుకో."
"ఓ.కే అనుకున్నాలే నిశ్చల ఏది?"
"నీకూ అనుమానంవచ్చిందా! అవసర నిమిత్తం ఏమర్జంటుగా అవతలికెళ్ళిందా లేక దాక్కుందా అని అలోచిస్తున్నాను. నిశ్చల మనస్తత్వాన్ని అంచనావేసి కరెక్ట్ గా చెప్పు విజయ్"
"ప్రశ్న తిన్నగా లేదు. సమాధానం కరెక్ట్ గా చెప్పలిట! ఈ విజయ్ ఇలాంటి చచ్చుపుచ్చుప్రశ్నలకి సమాధానం యివ్వడు. ఉదయం ఆరున్నర టైములో అత్యవసర పనులు రావచ్చు. అల్లరి పిల్ల కాబట్టి దిబూచులాట మార్నింగ్ వాక్ లాగా మార్నింగ్ గేం మొదలు పెట్టిందేమో" అని తర్వాత స్వరం తగ్గించి "కృతీ!" అంటూ భుజం చుట్టూ చేయివేసి దగ్గరకు లాక్కుంటూ మృదువుగా పిలిచాడు విజయ్!
విదిలించుకుని దూరంగాజరుగుతూ "విజయ్! నీకేం చెప్పాను" అంది కృతి.
"ఆ _ మహా చెప్పవులే! జర్నీలో దూరంగా వుండాలన్నావు వివాహం అయిందాకా సత్యం మెతుకులే నీకు గతి అన్నావు అలాగేవున్న కదా! ఓన్లీ ఆన్ కిస్. దానికే మైలపడిపోతామా? నీ ప్రెండ్ నిశ్చలని చూసి నీవు చాలా నేర్చుకోవాలోయ్!"
"వన్ తో మొదలైంది వన్ తో ఆగదువిజయ్!" అని కృతి మున్నకుండి పోయింది.
"ఓ.కే. ఓ.కే మడి కట్టుకునే వుంటాను "
"మడా! ఇప్పుడేంమడేబామ్మా! ఇంకా తెల్లారినట్లే లేదు" మడిఅన్న రెండక్షరాలే సుబ్బారావు నిద్ర లేస్తుమ్డగా వినిపించడంతో తాను ఇంట్లోవున్న నానుకుని అన్నాడు.
"సుబ్బులేచాడు" కృతి నెమ్మదిగా అంది.
"అవును లేచాడు"విజయ్ అంతకన్నా నెమ్మదిగా అని స్వరం మార్చి "బుజ్జులూ! లేచి తొందరగా దంత దావాన కానియ్యి" అన్నాడు.
"సుబ్బారావు పేరు వాళ్ళా తాతగారిది అందుకుని వాళ్ళ బామ్మ ఎప్పుడూ ముద్దుగా "బుజ్జులూ!" అనే పిలిచేది.
ఆ చీకటిలో బామ్మేపిలిచింది అనుకున్నాడు సుబ్బారావు! గట్టిగా ఆవులించి కళ్ళునులుముకుంటూ "నీ కంటే నిద్ర పట్టదే బామ్మా! నేనింకా పిల్లాడి వేకదా! తెల్లవారుఝామునలేస్తూ నా నిద్ర చెడగోడుతూ అయిదు కాకుండానే సుప్రబాతం అందు కుంటావాయె. అటు అదేముడిని నిద్రపోనీయవు నాకోవిషయం అర్డంకాలేబామ్మా! అసలు ....."
కృతి నవ్వాపుకోలేక పక్కున నవ్వింది.
ఈ సుబ్రభాత సమయంలో నీ నవ్వు శుభ సూచికం కృతీ ఒరేయ్ సుబ్బయ్ ధాయ్! మనంవుంది ఇంట్లోకాదమ్మా గుడిలో లేదు లేదు గుహలో!" అంటూ లైటు వెలిగించి కూర్చున్నాడు కమల్. తర్వాత టైము చూసుకున్నాడు.
సుబ్బారావుకి నిద్రమత్తు ఎగిరిపోయింది. "హరినీ. ఎవరురా బామ్మ అవుతారం ఎత్తింది?" అన్నాడు.
"నేనురా సుబ్బూ! మాట మార్చానుగాని మల్లుపంచే కట్టలేదు రోయ్ అపార్దం చేసుకుంటావని ముందె చెపుతున్నాను"