Previous Page Next Page 
అసిధార పేజి 19

    ఆ నిర్ణయమే నిశ్చలకి ప్రమాదం తెచ్చి పెట్టింది.

    కాపలా కాస్తున్న సుబ్బారావుకి భయంవేసింది. అకస్మాత్తుగా ఏదో ఓ పక్కనుంచి ఏదైనా క్రూరజంతువు వచ్చిందంటే ఎం చేయాలి.? ఆ ..... నేనేం చేస్తాను విజయ్ నిగాని, కమల్ గాని లేపుతాను అదేదో వాళ్ళే చూసుకుంటారు.

    ఆ నిర్ణయానికి రాంగానే కాస్త నిశ్చంత పడింది సుబ్బారావు మనసు. అసలు కాపలా అంటే వెయ్యి కళ్ళతోపరిసరాలు గమనిస్తూ ఏ చిన్న చప్పుడైనా ఆలకిస్తూ ఏకాగ్రతతో చేసేపని సుబ్బారావు  వుండటానికైతే మేలుకునే వున్నాడు. మనసు యిక్కడలేదు. తీరుబడిగా ఆలోచిస్తున్నాడు.

    ...... నేనూ యిహానుంచి భయపడకూడదు. ధైర్యం తెచ్చుకోవాలి చెయ్యి బెణికితే విరిగినదేమో అని హడలిచచ్చాను ఈ తఫాకాలిరిగినా సరే భయపడకూడదు. ఇప్పుడు బామ్మ ఏం చేస్తున్నాడో. పాపం బామ్మకి నేనంటే ప్రాణం వంటరిగా ...... ఉహూ ...... బామ్మ వంటరిగా వుండదు. సీతారాంగారేళ్ళి బామ్మని తీసుకొచ్చి వుంటారు. బామ్మ వెళుతుంది. వేళ్ళకేంజేస్తుంది. తను క్షేమంగా తిరిగిరావాలంటే రాసిన లేటరు బామ్మ మంచం పక్కనే వున్న మరచెంబుమీద పేట్టి వచ్చాడు కదా, ఒట్టుకు భయపడైనా బామ్మ వాళ్ళింటికి వెళ్ళి వుంటుంది.

    "విజయ్ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళంతా మంచి వాళ్ళే బామ్మకి వాళ్ళంటే యిష్టమే . విజయ్ తను కమల ఒకే ప్రాణంగా చిన్నప్పటి నుంచీ వున్నారు నవ్వుతూ పూల్ గీల్ అనుకోటం. మరీ శృతి మించితే కాస్త చిరాకు పటడం తప్ప కోపమంటూ తమ మధ్య వచ్చింది ఎప్పుడూ లేదు .........

    సుబ్బారావు తాపీగా కూర్చుని అంతకన్నా తాపీగా ఆలోచిస్తున్నాడు.

    వెనుకనుంచి బలంగా ఓ చెయ్యి సుబ్బారావు మేడమీద పడింది.

    అక్కడవుండే అన్ని గుహలూ ప్రతిధ్వనించేలా పెద్ద భయంకరమైన అరుపు .....

    సుబ్బారావు నోట్లోంచి అరుపు వెలువడే లోపల రెండో చెయ్యి సుబ్బారావు మూసేసింది.

    సుబ్బారావు గిలగిలాడాడు.

    "అరవకురా సుబ్బూ వాళ్ళంతా లేస్తారు నేనే విజయ్ ని " అంటూ సుబ్బారావు చెవిదగ్గర చెప్పి "ఒరేయ్! నేను లేవటం నీవు గమనించకపోవటంతో నెమ్మదిగా నడిచి నీ వెనక్కీ వచ్చాను తెలిసే నోరు మూశాను. బాగా భయపడ్డావా?" సుబ్బారావు పక్క కొచ్చి కూర్చుంటూ అడిగాడు.

    " నీ జోక్ తగలడ ఇదేమ పనిరా? నాగుండె .... అమ్మా .... అబ్బ .... గట్టిగాబట్టి ఆగకుండా వేగంగా కొట్టుకుంటూ వుండిపోయింది. నీ దెబ్బకి ఆగిపోయిండే అనుకో నేను హరీ అనేవాడిని. అప్పుడేం చేసేవాడివిరా?" గుండెమీద చేత్తో నొక్కుకుంటూ అడిగాడు సుబ్బారావు.

    "వెరీ సింపుల్ మూతిమీద ఫేడేల్ మని ఒక్కటిచ్చుకునేవాడిని. దాంతో నీవు ఆ ...... అని నోరు తెరిచేవాడివి నీ నోట్లోంచి చేయి పోనిచ్చి గుండెకాయని లటుక్కున పట్టేసి నాలుగువూవులు వూపేసి ఆడించేవాడిని మైడియర్ సుబ్బూ! నువ్వుత్త పిరికివాడివి గుండె ఆగిపోయేంత పిరికివాడివి కాదు, నీ చర్య నాకు నచ్చక చిన్న శిక్షవేశాను అంతే"

    "నా చర్య నచ్చలేదా! నేనేం చేశాను?"

    "చాలా పెద్ద పొరపాటు చేశావు. బుర్ర పెట్టుకు ఆలోచించు"

    అంత ఓపిక ఇప్పుడులేడుకాని అదేదో నీవే చెప్పరా విజయ్!"

    "నిన్ను కాపాలకి పేట్టి మేమంతా ఆదమరచి నిర్భయంగా నిద్రపోతున్నాము నీవెం చేయాలి వెయ్యి కళ్ళతో పరిసరాలు గమనిస్తూ చిన్న చప్పుడైతే చటుక్కున టార్చ్ లైట్ వేసి చూడాలి ప్రమాదకరమైన జంతువు చడీచప్పుడు లేకుండా రావచ్చు. అప్పుడు నీ పని ఏమిటి? ముందు పెద్దగా అరిచి టార్చ్ ఫోకస్ ఆపకుండా దాని ముఖం మీద వేసివుండాలి వసరమయితే దాన్ని ఎదుర్కోవాలి నీ కేకతో మేమంతా లేస్తాము అంతేనా!"

    "అంతే"

    "నీవు నన్ను గమనించలేదు. ఓ.కే. దాన్నలా వదిలెయ్యి. టైము చూసుకున్నవా?" లేదు. రెండుగంటలమీద మరో పావుగంట  అయింది అంటే అర్ధం నీకు టైముకూడా చూసుకోకుండా పరిసరాలు గమనించకుండా అలా కూర్చుంది కమ్మగా ఆలోచిస్తున్నావ్  ఓ పక్క ప్రామడం మ్ముంచుకోస్తూ వుందనుకో అలాంటప్పుడు నీవలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇప్పుడు నె వచ్చినట్లే ఏదో నెమ్మదిగా నీ వెనుకనే చేరి అమాంతం ......

    "చాలుబాబోయ్ అర్దమైంది నా తప్పు తెలిసివచ్చిందిరా! ఇంకెప్పుడూ ఇలాంటిపని పొరపాటుకి శిక్షగా నేనే నీపని పట్టాను. సరేనా! ఇంకెప్పుడూ పొరపాట్లు చెయ్యకు. నీ సంగతి నాకుబాగా తెలుసు కాబట్టి నైట్ డ్యూటీలో ఫస్టు పిప్టు నీ కిచ్చాను. ఇప్పుడు డ్యూటీ నాడి ఇంక వెళ్ళి కమ్మటి కళలుకంటూ ఈ రాత్రంతా హాయిగా పడుకో! గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ " అన్నాడు విజయ్ సుబ్బారావు భుజంమీద ప్రేమగా తట్టి.

    "విజయ్ , నిన్ను చూసి నేను చాలా నేర్చుకోవలిరా" అంటూ లేచేళ్ళి పడుకున్నాడు.

    సుబ్బారావుకి వెంటనే నిద్ర పట్టింది.      
   
    విజయ్ చల్లని ముఖం కడుకున్నాడు. ఆ తర్వాత అటూ యిటూ నెమ్మదిగా తిరుగుతూ వుండిపోయాడు.

    అందరూ ఆదమరచి నిద్ర పోతున్నారు.

                                          13

    ఆ రాత్రి గడిచి తెల్లవారుతుండగా నిశ్చలకి డ్యూటీపడింది.

    కమల్ డ్యూటీపడ్డ టైము నాలుగున్నరకి. రాత్రంతా హాయిగా నిద్రపోయి తెల్లవారు ఝామున ఏమంట కష్టంకాదు. కమల్ తర్వాత డ్యూటీ తనది కావటంతో ప్రాణం తేలిగ్గా వుంది.

    నిశ్చల పెదవులమీద వుండివుండి చిరునవ్వు వెలిగి మాయం అవుతున్నది. మునిపంటితో కిందపెదవినొక్కుకుని సుదీర్ఘంగా ఆలోచించింది.

    రాత్రంతా చలిగానే వుంది. తెల్లవారుఝామున అరిమ్టగా చలిఎక్కువయింది అందరూ నైట్ సూట్ లో వుండి నిద్రపోతున్నారు. నైట్ సూటుగనుక వుంటే వేరే పక్క అక్కరలేదు. కింద పడుకున్నప్పుడు ఏ విషజీవి శరీరానికి హాని చెయ్యలేదు. అది ధరిస్తే చలిలో వెచ్చగా వుంటుంది. ముఖం తప్పించి మొత్తం శరీరానికి పనికివస్తుంది. ముందు కాళ్ళుదూర్చటం. ఆపై చేతులు దూర్చి కిందినుంచి మేడదాకా జిప్పులాగితే శరీరం మొత్తానికి రక్షణ కవచంలా సూటులో వుండి పోతాడు మనిషి. ఇది పరాయి దేశంవాడు కనిపెట్టిన సాధనం నైట్ గౌను అన్నట్లు నైట్ సూటు యిది. మాయటమంటూ వుండదు కాబట్టి వుతికేపనిలేదు.

    నైట్ సూటులో ఉన్నా కొద్దిగా ముడుచుకునే పడుకున్నారు అంతా.

    నిశ్చల ఓ నిశ్చయానికి కొచ్చింది. ఓ నిర్ణయానికంటూ వస్తే ఆగే అలవాటు నిశ్చలకి లేదు అందరివేపూ ఓ నారి చూసి తృప్తిగా తల పకించింది. ఎడం చేతిలోకి టార్చ్ లైటులు మార్చుకుంది కుడి చేతిలోకి కర్రని తీసుకుంది. వేగంగా అడుగులు వేస్తూ పాక్క గుహాలోకి దారితీసింది.

    నిశ్చల ఓ గుహలోంచి మరో గుహలోకి ముందుకు వెళ్ళి పోతున్నది. తన డ్యూటీ టైము రెండు గంటలు ఇప్పటికే పావుగంట వేస్ట్ అయింది. గంట ముప్పావు కాలాన్ని సగంగా విభజించి తను వెళ్ళినంత దూరం ముందుకు వెళ్ళీ తిరిగి తనవాళ్ళ దగ్గరకు వచ్చేయాలి వాళ్ళందరికన్నా ముందు తాను బైటకెళ్ళే మార్గం కనిపెట్టాలి. వాళ్ళు లేచే లోపల తాను మార్గం కనిపెడితే!

    నిశ్చలకి ఆ వూహే చాలా ఆనందంగా వుంది. అలా ధైర్యంగా వంటరిగా రావటం భలే త్రిల్లింగ్ గా వుంది వంటరిగా బైలుదేరినా తగు జాగ్రత్తలోనే వుంది. చాక్ పీసుతో బాణం గుర్తులు పెడుతూ వేగంగా ముందుకు సాగుతున్నది. తాను ముందుకే వెళుతున్నానని అనుకుంటున్నది

    నిశ్చలకి తెలియదు తాను వెళ్ళేది ముందుకు కాదని ఓ పక్కకని. అక్కడే తాను ఓ ప్రమాదానికి లోనుకాబోతున్న దనీను!

    నిర్భయంగా నడుస్తూ బాణం గుర్తులు పెడుతూ లైటు వెలిగిస్తూ అర్పుతూగుహలోంచి  మరో గుహలోకి వెళుతున్న నిశ్చల మధ్య మధ్య టైము చూసుకుంటూనే వుంది.

    మరలిరావటానికి టైము మరో అయిదు నిముషాలు మాత్రమే వుంది అయిదు నిముషాలలో మూడుగుహలు చూసి తిరిగివెళ్ళి పోవాలి నిశ్చల బాణంగుర్తులు పేట్టి మరో గుహలోకి ప్రవేశించింది.

 Previous Page Next Page