Previous Page Next Page 
అసిధార పేజి 18

    గుహలో నెమ్మదిగా చీకటి ప్రవేశిస్తున్నది .

    "ఎవరికీ తోచినమార్గం వాళ్ళు చెప్పండి" బాగున్నాదేదో చూసి అందరం అదే మార్గం అనుసరిద్దాం." విజయ్ అన్నాడు.

    ఇక్కడ ఏ ప్రమాదంలేదని అనుకుంటున్నాం. చెప్పలేం ప్రమాద మన్నది చెప్పిరాదు. కనుక రాత్రికి వంతులవారీగా మేల్కొని కాపలా కాద్దాం ఎనిమిదిగంటలు నిద్రపోయినా పదిగంటలు నిద్రపోయినా ఒక మనిషి రెండు గంటలు కాపలాగా మేల్కోవాలి . రెండుగంటలుకాంగానే మరొకరిని లేపి తాను నిద్రపోవాలి" కమల అన్నాడు.

    ఈ సిఇచన అందరికి నచ్చింది.

    "గుడ్ అయిడియా " అన్నాడు విజయ్.

                                                                          12

    ఆ రాత్రి పడుకున్న తర్వాత అయిడియా అంటూ కాదుగాని నోటికొచ్చిన మాట అని వూరుకున్నాడు సుబ్బారావు .

    "ఇక్కడో తాడు కట్టి దాన్ని పట్టుకుని అలా ముందుకీ పోదాంరా! అలా ఎంతదూరమైనా వెళ్ళవచ్చు కదా! తాడు ఆఖరయ్యే లోపల దారిదొరికిందిరా సరేసరి లేకపోతె వెళ్ళిన దారినే తిరిగి వద్దాం.

    నోటికొచ్చిందేదో సుబ్బారావువన్నాడు. అది చాలా మంచి అయిడియా అని అతినేరగడు. సుబ్బారావు బుర్ర ఒక్కోసారి అద్భుతంగా పనిచేస్తుంది. కాని ఆ విషయం సుబ్బారవుకే తెలియదు.

    "నీ ఆలోచన చాలా బాగుందిరా సుబ్బూ! నెయ్యి బాగా తింటే మేధస్సు   పెరుగుతుందంటారు. మీ బామ్మ నిన్ను రోజూ నేతిలో ముంచి తేల్చేదికదా. అందుకే నీ మట్టి బుర్రలో తళుక్కుమని నూటికో కోటికో ఓ మెరుపు మెరుస్తున్నది"

    "సుబ్బు  మంచిబాలుడు వూరికే ఎక్కిరించకు కమల్!" విజయ్ అన్నాడు.

    "సుబ్బు ఆలోచన ప్రకారమే చోద్దాం. మన దగ్గరవున్న తళ్ళనన్నింటిని కలిపి ముడేసినా అయిదుగుహలు దాటం. పోనీవీళ్ళిద్దరూ ముచ్చటపడి తెచ్చుకున్న నాలుగు చీరలూ కలిసి కట్టినా దాని బారు మరి నాలుగు గుహలు దాటేను అసలు మొత్తం ఎన్ని గుహలున్నయో ఏమిటో?" అంటూ విజయ్ తలపట్టుకు కూర్చున్నాడు.

    "వహ్హయ్" అంటూ పెద్దగా అరిచి సంతోషంగా ఈలవేశాడు కమల్
   
    "వున్నట్లుండి నీకేమోచ్చిందిరా తెగులు?"

    "తెగులు కాదురా విజయ్! గుడ్ అయిడియా, అదేమిటని అడుగు చేబుతాను"

    "అడిగానులేరా చెప్ప!" విజయ్ చిరాకు నణుచుకుంటూ అన్నాడు.

    "మనం తెచ్చిన వాటిల్లో చాక్ పీసులున్నాయి కదా?"

    "వున్నాయి అయితే?"

    "అవేందుకు తెచ్చామో కాస్త ఆలోచించు"

    వాళ్ళకి మొదటినుంఛీ అలవాటే విషయం త్రిప్పి మాట్లాడుకోటం. మాటల్లో క్విజ్ పోటీలు నిర్వహించటం. మరీ సరదా పుడితే కా భాషలాంటి భాషలో కోడ్ కలిపి అవతలివాళ్ళకి గందర గోళంలా వీళ్ళకి తెల్సిపోయేలా వాగటం ఇలాంటివి చాలానే వచ్చు.

    విజయ్ చాక్ పీసుల గురించి ఆలోచించాడు.

    వాళ్ళు చాలా ముందుచూపుతో చాక్ పీసులు ఎరుపు రంగు డ్రాయింగు పెన్సిళ్ళు తెచ్చుకున్నారు. పొరపాటున ఈ ప్రయాణంలో వారు వకరుకొకరు దూరం అయితే తనువునికిని తెలుపుతూ చాక్ పీసుతోకనపడ్డదానిమీద బాణం మార్కు వేసుకుంటూ వెళ్ళాలి ఆ గుర్తు చూసి రెండోవాళ్ళు వాళ్ళవెనకనే రావచ్చు. డేంజర్ ప్లేస్ అయితే ఎరుపురంగు పెన్సిల్ తో త్రిశూలం గుర్తు వేయాలి.

    "వ హ్హ హ్హ య్!" అందరూ వులిక్కిపడేలా విజయ్ తన అనందం వ్యక్తకచేస్తూ అరిచాడు.

    "వచ్చేసిందా అయిడియా!" కమల్ అడిగాడు.

    "అబ్బాయిగారికి ముఖం చూస్తుంటే తెలియటంలా ఆముదం దీపంలా వెలిగిపోతున్నది" కృతి అంది.

    "దగ్గరగా కూర్చున్న మా ముఖాలే సరీగా కనిపించటంలేదు నా ముఖం వెలిగి పోతున్నది ఎలా చెప్పాగలిగావ్ అమ్మడూ?" విజయ్ అడిగాడు.

    "నా కోడ్ మీ కర్ధం కాలేదు. మీ ముఖాన్ని మెర్క్యూరీ ల్యాంఫ్ తో పోల్చాలేదసార్! అందుకే ఆముదం దీపంతో పోల్చాను"

    "యూ ..... యూ ......" ఇంకేమనాలో తెలియక విజయ్ ఆగిపోయాడు.

    కిలకిల నవ్వింది కృతి.

    "మా చెడ్డ వుషారులో వున్నారు. నవ్వకేబాబూ. వుడుక్కుంటారు" నిశ్చల అంది.

    "వాళ్ళతో మనకెందుకుగాని నీవు చెప్పరా విజయ్!"

    'ఈ రాత్రికి లాభంలేదు. తెల్లారి మొదలు పెడదాం. చాక్ పీసుతో బాణం గుర్తులేనికుంటూముందుకి పోదాం వోపుకున్నంతవరకూ అలా వెళదాం దారిదొరుకుతుందనే ఆశపడదాం. ఇదేనా నీ ఆలోచన కమల్!"

    5య్యా ! సరీగా ఆలోచించావు!" కమల్ మెచ్చుకున్నాడు.

    ఉన్నట్లుండి సుబ్బరావన్నాడు "నాకో అనుమానం వచ్చిందిరా!"

    "ఇంక ఆలశ్యందేనికి కక్కు"

    "మీతాతగారు ఈదోవనే వచ్చారానుకుందా౦ మళ్ళీ ఎలా తిరిగి వెళ్ళారంటావ్? ఆకాలంలో అయన వంటరిగా ప్రయాణం చేశారు, వాటర్ ప్రూఫ్ వాచీ టైము ఎలా అంచనా వేశారంటావ్? రోజులు నెలలూ ఎలా చెప్పగలిగారంటావ్? ఇంకా .......

    "నాయినా సుబ్బూ! నీకొచ్చింది ఒక అనుమానం కాదు వంద . ఆలోచిస్తే సమాధానం దొరక వచ్చు. తాతగారు తానెలా ప్రయాణించింది కుదరకమళ్ళీ వెనక్కీ తిరిగి వెళ్ళటం తన ప్రయాణ వివరాలు చాలానే వరసక్రమంగా రాసిపెట్టారు. మధ్యలో నాపాలిట శత్రువులా ఎలుకమ్మగారు సగం కాగితాలు స్వాహా చేయటంతో మార్గం తప్పి పోయింది. నావూహా ప్రకారం అయితే మా తాతగారు ముందు మనం వచ్చినట్లే వచ్చి ఆ మార్గం లోంచి మరో మార్గం పట్టుకుని ముందుకు సాగి వుంటారు కాని .......

    మనం దారితప్పాం
   
    చివరిమాట కాస్త గట్టిగా చెప్పాడు విజయ్.

    "దారి తప్పమా? ఓరి దేముడోయ్ యిప్పుడేలాగురా?" సుబ్బారావు భయంతో చిన్నకేక పెట్టాడు.

    "దారి తప్పానని అనుకుంటున్నానురా పూల్! దారి తప్పానో లేదో నాకు మాత్రం తెలుసా ! మనం ఒక మార్గంగుండా జారి ఇక్కడ పడితే తాతగారు మరో మార్గం పట్టుకుని ఇక్కడి కొచ్చారేమో మనకి తెలియదు కదా! మొత్తం __ లు. వున్నా _ ఈ విధంగా అయితే వెళ్ళవచ్చు అన్నమాట చదివాంచూడు. దానిని ఇలా పూరించుదా౦ మొత్తం ఇన్ని గుహాలు వున్నాయి __ ఈ విధంగా అయితే వెళ్ళవచ్చు అనుకున్నాం గుర్తుందా?"

    "వుందుందిరోయ్! అయితే ఈ గుహలు అవే అంటావా?"

    " ఓ విధంగా కావచ్చు. మరో విధంగా అయితే కాకపోవచ్చు. ఆ మాట అనవసరం మన మార్గం మనం చూసుకోడమే. ఇంకేదయినా అనుమానం వుంటే కక్కరా సుబ్బూ!"

    "నీ మాటలతో నీరసం ముంచుకు వచ్చేసింది కక్కే ఓపిక లేదురా విజయ్!" అంటూ నిరశాగా వెనక్కీ జార్లగిలపడ్డాడు సుబ్బారావు.

    వాళ్ళందరికీ ఒకే ఆశ వెలుతురంటూ వస్తున్నది కాబట్టి దారంటూ వుంటుంది. ఎటొచ్చి బాధ ఏమిటంటే సరి అయిన దారి తొందరగా పట్టుకోగాలమా లేదా అన్నదే.

    రాత్రి పడుకోబోతూ మరోసారి డైరీలో ఆ పూట విశేషాలు రాశాడు విజయ్.

    వాళ్ళందరికీ రాత్రి పగలు తెల్సుకోవడానికి ఆధారం వాళ్ళు ధరించిన రిష్టు వాచీలు అందరి వాచీలు వాటర్ ప్రూఫ్ వి . డేట్. వీక్ మంత్ వాచీలో మారిపోతుంటుంది. అందువల్ల రోజులు తెలిసే ఆధారం వుంది ఆ విషయంలో భయంలేదు. ఎటొచ్చీ తిండి విషయం అది ఎంతని మోసుకురాగలుగుతారు! ఆహారం విషయంలో బరువుని మించే తెచ్చుకున్నారు.

    చెట్టూచేమలూ వుంటే ఆకూ అలములు తిని బతకొచ్చు ఇక్కడ వుంది రాళ్ళూ రప్పలు. తాగటానికి నీళ్ళు తప్ప మరేం లేదు ఆ నీళ్ళూ లేకపోయినట్లయితే హరీ అనటానికి ఎనోరోజులు పట్టదు.

    ఈ గుహలు ఎన్ని వున్నాయి?

    నీటిలోంచి బైటపడగలమా?

    బైటపడితే బైట ప్రపంచంలో ఏముంటుంది?

    ఎప్పటికీ విముక్తి లభించకపోతే ?

    దిక్కు మాలిన మరణం తప్పదా?

    వచ్చి ..... వచ్చి ..... ఇంతదూరమొచ్చి చావటానికా?

    అయినా రేపనేరోజుకటివుంది. రంగంలోకి దిగబోతూ ఈపిరికి ఆలోచనలు దేనికి? ఎవరికీ వారు ఆలోచిస్తూ నిద్రపోయారు ముందు రెండుగంటలు కాపలాగా సుబ్బరావున్నాడు . ఈ విషయంలో సుబ్బ రావు ముందుండటమే మంచిది. సుబ్బారావు నిద్ర అపుకోలేడు. పైగా నిద్రపోతే ఓ పట్టాన లేవడు సుబ్బారావు రాత్రంతా విశ్రాంతి తీసుకోవాలంటే ముందు మేల్కొవటమే మంచిది.

    ప్రతివారూ రెండేసి గంటలు మేల్కొని కాపాలా కాయటం ప్రకారం ముందు వంతు సువ్బ్బరావుదయితే చివరి రెండు గంటల కాపలా నిశ్చలది.

 Previous Page Next Page