Previous Page Next Page 
మయసభ పేజి 18

 

     యోగేంద్రసిన్హా మొఖం చిన్నబుచ్చుకున్నాడు.

    "మనమూ ఇంటిని కూల గొట్టిస్తాం. బాగానే వుంటుంది. తన అల్లుడిదే తప్పు గనుక వెంకట నారాయణ నోరేత్తుతాడు......" నందకిషోర్ మాటలకి యేగేంద్రాసిన్హా ఆశ్చర్యపోయాడు.

    "ఎలా సార్ ....? పాజిబిలిటీ .....?"

    "అది తప్పని తెలుసు. నా అల్లుడు మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించాడు. నిజమే..... అది మున్సిపాలిటీ వారికి ఎప్పుడు తెలిసింది ....? ఆరునెలల క్రితం మరప్పటి నుంచి ఆ శాఖ ఏం చేస్తోంది? నిద్రపోతుందా.....? ఎందుకు ఏక్షన్ తీసుకోలేదు ....? అంటే ప్రభుత్వం పనిచేయటం లేదనేగా ? అయినా ఇప్పుడు హఠాత్తుగా నా అల్లుడు తప్పు చేసడాని ఎందుకు  ముందు కొచ్చినట్లు.

    నేను నా పేపర్ లో ముఖ్యమంత్రి అవినీతి గురించి రాశానని పగ పట్టారన్నమాట... ఇందులో ముఖ్యమంత్రి ప్రమేయం లేదని ఎవరయినా అనగలరా ?' ఉన్న నిజాన్ని బయట పెడితే నన్నేమీ చేయలేక నా బంధువుల మీదా కక్ష సాధింపు చర్యలు చెప్పట్టారన్నమాట .....' అని వ్రాసే ప్రమాదం లేదా? ఉందికదా...? మరి ....?!"

    నందకిషోర్ వేపు విస్మయంగా చూశాడు. తన తొందరపాతుకి సిగ్గుపడ్డాడు యేగేంద్రాసిన్హా.

    "మరేం చేయమంటారు ...?" నెమ్మదిగా అడిగాడు సిన్హా.

    ఆ రవీంద్ర అవినీతికి పాల్పడాలి" గంభీరంగా అన్నాడు నందకిషోర్.

    అయన మాటలకు విస్తుపోయాడు సిన్హా.

    ముఖ్యమంత్రి స్ట్రాటజీ ఏమిటో అర్ధంగాక పిచ్చిచూపులు చూశాడు.

    "ఆ ఆఫీసర్ చర్య తీసుకుంటానని ఎడిటర్ అల్లుడి ఇంటికి వెళ్ళాలి. చట్టాన్ని తెలిసి అతిక్రమించే వాడికి ఆ చట్టానికి ప్రతినిధులు కళ్ళేర్రజేస్తే ఎంతోకొంత ముట్టజెప్పాలని కూడా ముందే తెలిసి వుంటుంది.

    సో ... ఈ అధికారి కళ్ళేర్రజేసి కాసు కావాలని పరోక్షంగా తెలియజెప్పాలి. అతను తన లక్షల ఖరీదు చేసే ఇంటిని రక్షించుకునేందుకు జేబులో చెయ్యిపేట్టి బయటకు తీస్తాడు . సరిగ్గా ఆ టైముకి ఏంటీకరప్షన్ వాళ్ళు ఆ ప్రాంతంలో ప్రత్యక్షమవ్వాలి. ఆ ఇద్దర్నీ అరెస్ట్ చెయాలి. అల్లరి చేయాలి మరుసటి రోజు ఉదయమే ప్రెస్ కన్ఫారెన్స్ పెట్టాలి.

    శుబోధయం పేపర్ అంటే పాడనీ ముగాతా పేపర్స్ వాళ్ళను బుజ్జాగిమ్చాలి, వారి బోజ్జల్ని నింపాలి. రేచ్చాగోట్టాలి __ అప్పుడు కొన్ని అబద్దాలు చెప్పాలి __ ప్రభత్వొద్యోగులయిన మేము మా డ్యూటీ చేయడానికి వెళ్తే శుబోధయం. పేపర్
మాదే...... దాని యజమాని , ఎడిటర్ నాకు మ్మగారు __ నా జోలికొస్తే మీ టాస్ లేపెస్తాను అని వెంకటనారాయణ అల్లుడు దుర్భాషలాడాలని నమ్మబలకాలి. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పనక్ఖర్లేదుగదా?"    నవ్వుతూ అన్న ముఖ్యమంత్రి నందకిషోర్ ని చూసి సిన్హా వులుక్కిపడ్డాడు.

    "రాజకీయాలంటే అంతేమరి.... మన చేతికే కాదు . మన మనుష్యులుగా ముద్రపడిన వారి చేతులకు కూడా మట్టి అంటుకోగూడదు.... చిన్న పిల్లల ఉక్రోషం __ రౌడీల మూర్ఖత్వం __ అసూయ , ద్వేషం బయటకు కనబడకూడదు.... తొందరపడి భౌతికపరమైన చర్య తీసుకోగూడదు తెలివిగా శత్రువు ఆయువుపట్టు మీద కొట్టాలి దెబ్బ, పైకి. చెప్పకోలేక , కుక్కలేక,మ్రింగలేక గిలగిల లాడాలి.

    బైదిబై రిపోర్టర్ రామరాజు. శుబోధయం అసోసియేట్ ఎడిటర్ వ్యవహారం కూడా చూడాలి...." అన్నాడు నందకిషోర్ పెద్ద ఎత్తుకు సమాయత్తమవుతూ.

    అదే టైమ్ లో గ్రీన్ ఫీల్డ్స్ పిబిఎక్స్ రూమ్ లో వున్న గోపీనాధం నిర్విరామంగా వస్తున్న పోన్ కాల్స్ ని రిసీవ్ చేసుకుంటూ కేంద్రంలో, రాష్ట్రంలో జరుగునున్న మార్పుల్ని , శత్రువుల ఎత్తుగడల్ని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు నందకిషోర్ కి తెలియపరుస్తున్నాడు.

    అలా తెలిసిన వాటిలో ముఖ్యమైనది శంభుప్రసాద్ కోట్లాది ధనరాసులతో డిల్లీలో మకాం చేయటం.

    నందకిషోర్ కోసం మాణిక్యం మీదనుంచి శంభుప్రసాద్ మీదకు మరలింది.

                               *    *    *    *   

    "నాకు ఉద్యోగాన్ని అయాన ఇప్పించలేరు...." రిషి మేడికర్ క్యాంటిన్ లో అవంతికి ఎదురుగా కూర్చుంటూ అన్నాడు.

    అవంతి ఆశ్చర్యంపోయింది.

    "అవును... నేను అల్ రెడీ ఎస్.ఐ. సెలెక్షన్ లో ఎన్నికయి ట్రైనింగ్ కూడా తీసుకున్నాను.... క్రైమ్స్ ఇన్ స్పెక్టర్ గా పోస్టింగ్ వచ్చింది. నాలుగు రోజుల్లో జాబ్ లో చేరతాననగా ఇన్ స్ట్రక్షన్ కి, నాకూ గొడవ వచ్చింది. పోలీస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ మెస్ కంట్రాక్టర్ తో మా ఇన్ స్పెక్టర్ కుమ్మక్కులు విధులు మ్రింగేసి, మాకు నాసిరకంపుడ్ పెట్టించేవాడు. దాన్ని నేను ఆధారాలతో పట్టుకోవడంతో , నా మీద ఫైరయి నా సర్వీస్ రికార్డ్ లో బ్యాచ్ గా రాసాడు. దాంతోనన్ను జాబ్ లోకి తీసుకోలేదు.

    ఇది గత చరిత్ర... నీకు తెలీని   చరిత్ర... ఇప్పుడు చెప్పు.... ఆ చూడప్పగారు నాకు పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం ఇప్పించగలరా?" రిషి టీని చప్పరిస్తూ తాఫీగా అంటుంటే __ అప్పటి వరకూ ఆ సంగతి తెలీని అవంతి విస్తుపోయింది.

    "ఇంత జరిగిందా....? నాకు మాట మాత్రంగానయినా చెప్పలేదు? అయినా నువ్వు చేసింది తప్పేం కాదు. ఈ విషయం డి. ఐ. జి చూడప్ప గారికి తెలియజేస్తే నీకు తిరిగి జాబ్ యిప్పించగలరు.... నాకా నమ్మకం వుంది...."

    "దిల్ సినిమాలో కొత్త సాంగ్ పెట్టారు తెలుసా....?" రిషి సీరియస్ గా అన్నాడు.

    "రిషీ.... " అవంతి కళ్ళేర్రజేస్తూ అంది.

    "రియల్లీ ..... అనురాధా పౌడ్వాల్, యుదిత్ నారాయాణ ఎంత ఉద్వేగంగా పాడరానుకున్నావ్....? ప్రేమ పట్ల విముఖత చూసేవారు సయితం గొంతులోతు ప్రేమలో కూరుకుపోవటం ఖాయం...." రాబోతున్న నవ్వును బలవంతంగా పెదాల మాటున దాచుకుంటూ మరింత సీరియస్ గా అభినయిస్తూ అన్నాడు రిషి.

    "నిన్నూ...." పై పంటితో క్రిందపెదవిని కొరుకుతూ గుడ్లురిమింది అవంతి.

    "నిజంగా నిజం..... ఆ పాట ఎంత బావుందో.... ఆ పాటని రికార్డు చేసే ద్రుశ్యాలంత ఉత్తేజంగా వున్నాయ్. వీడియో కేసేట్స్ లో చూపిస్తున్నారులే. పభ్లిసిటీ కోసం అది చూడాల్సిందే .... యూ నో..... గాయకురాళ్ళ౦తా అందంగా వుండరు సాధారణంగా . కాని అనురాధా పౌడ్వల్ చాలా అందంగా వుంటుంది. ఆమె నవ్వుతూ పాడుతుంటే వుంటుందీ....."

    అవంతి రిషి మాటలు పూర్తీకాకుండానే లేచి నించుంది.

    "అదా నీ కోపం.... నీ అంత అందంగా ఉండదులే.... పి సుశీల, జానికి, జిక్కి, లతామంగేష్కర్ , ఆషాభోంప్లే కంటే అందంగా వుంటుంది. నీ కంటే కాదులే __"

    రిషి నెత్తి మీద ఒక టేద్దామనిలేచిన అవంతి అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తిని చూసి సిగ్గుపడిపోతూ ఆగిపోయింది.

    "ఏమ్మా! బావున్నావా.....?" చూడప్ప వారి ప్రక్కనే కూర్చుంటూ అడిగాడు.

    "గుడ్ మార్నింగ్ అంకుల్.... ఇప్పుడే మీ గురించి రిషికి చెబుతున్నాను...." అంది అవంతి రిషి మీద పెల్లుబికిన అసహానాన్ని, ఉక్రోషాన్ని అణుచుకుంటూ.

    "నువ్వేమో నా గురించి చెబుతుంటే రిషి నీకంటే అనూరాధా పౌడ్వల్ అందంగా వుంటుందని ఎడిపిస్తున్నాడు, అవునా?"

    అయన తామ మధ్య సంబాషణ విన్నందుకు చిన్నపిల్లలా సిగ్గుపడి పోయారు.

    రిషికి ఆయనే డి.ఐ.జి. చూడప్పని అర్దమయిపోయింది.

    "నాకంతా అర్దమయిపోయిందమ్మా .... ఏం బాబూ .. నీ తప్పు లేనప్పుడు నువ్వెందుకు శిక్ష అనుభవించాలి __? మేడే బ్యాచ్ __?" చూడప్ప రిషికేసి చూస్తూ అడిగాడు.

    "1988 బ్యాచ్ ... బట్ ..... " రిషి సందేహిస్తూనే అన్నాడు.

    "నీకు క్రైమ్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ గా జాబ్ చేయటానికి అభ్యంతరం లేదుగా?" చూడప్ప తిరిగి ప్రశ్నించాడు.

    "లేదు సార్" రిషి అవంతి కేసి చూస్తూ అన్నాడు.

    "1988 భ్యాచ్ ఇన్ స్పెక్టర్ ఎవరో నాకు తెలుసు. అతని ప్రవర్తనపై అల రెడీ ఒక ఫైల్ పుటప్ అయి వుంది రేపు నేను హైదరాబాద్ వెళ్ళగానే ఆ ఫైల్ తెప్పించి, అన్ని పనులు రెండు రోజుల్లో జరిపించేస్తాను. ఏ క్షణానైనా జాబ్ లో చేరేందుకు సిద్దంగా వుండాలి __" అని అవంతి కేసి తిరిగి "ఆర్యూ హేపీ ?" అని ప్రశ్నించాడు చూడప్ప.

    "థాంక్యూ అంకుల్ ... జాబ్ హైదరాబాద్ లోనేనా ...?" ఒకింత అయిష్టతను వ్యక్తపరుస్తూ అంది.

    "అవునమ్మా ... ఇది రిషి భవిష్యత్ కి చాలా మంచిది. సాధారణంగా స్టేట్ కాపిటల్ లో ముందు పనిచేస్తే ప్రోసీజర్స్ , పైలింగ్ సిస్టమ్...... ఐ. సి. సి. ని. బాగా స్టడీ చేయవచ్చు. బైదిబై ప్రస్తుతం నేను క్రయిం బ్రాంచ్ డి.ఐ.జి.గానే పని చేస్తున్నాను. ణా క్రింద రిషిని అప్పాయింట్ చేయించుకుంటాను. జాబ్ లో వుందే మతలబులు __ రాజకీయాలు __ ప్రత్యర్ధులు వేసే ఎత్తులు గురించి నాకు వీలయినప్పుడల్లా తెలియజేస్తుంటాను. ఏం నీ కేమన్నా అభ్యంతరమా?"

    "లేదు.  కానీ ... బట్....."

    "నా కర్దమైందమ్మా...... నువ్వు మద్రాసు వదిలి హైద్రారబాద్ రావాల్సి వుంటుంది అంతేనా....?"

    అవునన్నట్టుగా తలూపింది అవంతి.

    "కాబోయే భార్యాభర్తలు ... ఒక చోట వుంటేనె బావుంటుంది. పెళ్ళయ్యాక కూడా ఇబ్బంది లేకుండా వుంటుంది. నీకేం తల్లి..... ప్రువెన్ డాక్టర్ వి. హైద్రబాదులోను అపోల్, మెడ్విన్, మేడినోవా, సి.డి. ఆర్. లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ వున్నాయి. ఎందులోనయినా నీకు జాబ్ వస్తుంది కాదంటావా?"

    "అవుననుకో౦డంకుల్ .... బట్ ...."

 Previous Page Next Page