Previous Page Next Page 
మయసభ పేజి 19

     "అవంతి హైద్రాబాద్ అంటే అయిష్టం అంకుల్ " రిషి అన్నాడు ఆమె తరుపున .

    అదేమన్నట్టు చూసాడు చూడప్ప.

    ఆమె కొద్ది క్షణాలు మౌనంగా వుండిపోయింది. రిషికి కూడా అవంతికి హైదరాబాద్ పేరెత్తగానే ఆమె మూడాఫ్ అవటం గమనించి ఆ విషయం గురించిన వివరాల్లోకి ఎప్పుడూ వెళ్ళలేదు రిషి. ఆమె ఒక నిర్ణయానికి వేచ్చెందుకు తీవ్రంగా యోచిస్తుందని అర్ధంచేసుకున్న చూడప్ప మౌనంగా వున్నాడు.

    జాబ్ లేదనే నిస్పృహలో వున్నాడు రిషి.

    ఇప్పుడు వస్తున్న జాబ్ ని తనకు హైద్రబాదు మీదున్న అయిష్టంతో జాబ్ వద్దని అంటే ఎందుకనేది ఈ ఇద్దరికీ చెప్పవలసి వుంటుంది. అల చెప్పటం తనకిష్టం లేదు. తానెవరయింది తను గుర్తు చేసుకునేందుకే తనకు ఇష్టంలేదు అలాంటప్పుడు వారికేలా చెప్పగలుగుతుంది ...?

    మీకు ఆజ్ఞలు జారీచేసే ముఖ్యమంత్రి తన తండ్రే అని డి.ఐ.జి. చూడప్పకి ఎలా చెప్పగలుగుతుంది.....? చెప్పి ఆయనలో సవాలక్ష సండేహల్ని, అనుమానాల్ని ఆసక్తిని రేపినట్లవుతుంది...."

    తనేవరయింది రిషికి తెలిస్తే తనెలా రియాక్ట్ అవుతాడో తెలీదు.......

    యాదృచ్చకం ఇంత బలీయంగానూ, అనూహ్యమైన మలుపుకు కరణమౌతుందా ....? ఇప్పటికే తను హైద్రాబాదు వదిలి బొంబాయి వెళ్ళింది. అక్కడ ఊపిరి ఆడని జన జీవన స్రవంతిని జీర్ణించుకోలేక మద్రాస్ వచ్చేసింది తిరిగి హైద్రాబాద్ అంటే.... భూమి గుండ్రంగా వుందని రుజువు చేసినట్లా ... తను గుండ్రంగా తిరుగుతున్నట్లా....?

    చూడప్ప జాబ్ ఇప్పించినా......

    రిషి ఆ జాబ్ లో చేరాలన్నా __

    తుడి నిర్ణయం తీసుకోవాల్సింది అవంతి మాత్రమే.

    ఆ విషయం ఆ యిద్దరికీ తెలుసు. అందుకే నిర్ణయం తీసుకొనేందుకు ఆమెకు కొంత టైమ్ యివ్వటం సముచితమనే ఉద్దేశంతో ఆ ఇద్దరూ మౌనంగా వుండిపోయారు.

    ఆమె తీవ్రంగా ఆలోచిస్తుంది.

                              *    *    *    *   

    ఏ వ్యక్తి జీవితమయినా , జీవన పంధా అయినా, ఒకే ఒక్క సంఘటన మూలంగా ... ఎక్కడో ఓ మూల దాగిన అనామకుల నిర్ణయం పైన కూడా అనూహ్యమైన మలుపు తిరుగుతుంది.

    నద్దాంహుస్సేన్ తో చర్చలు జరపాలని జార్జ్ బుష్ నిర్ణయించారని వైట్ హౌస్ నుంచి చిన్న వార్త గుప్పుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇంధనం ధరల్లో గొప్ప మార్పు వస్తుంది.

    కేంద్ర ఆర్ధికమంత్రి ఉబుసు పోక ఫలానా వస్తువుల్ని దిగుమతుల జాబితాల్లోంచి తీసేయాలనుకుంటున్నాం అని సరదగా ఒక సాధారణ వ్యక్తితో అంతే చాలు __ దేశ వ్యాప్తంగా పారిశ్రామిక రంగం పరుగులేత్తుతుంది.

    ప్రచార సాధనాలు ఎంతగా విస్తరించుకోపోతే ఒక్కోసారి అంతప్రమాదంకూడా సంభవిస్తుంది.

    అవంతి తన వృత్తిపరమయిన బాధ్యతతో ఒక పాపకు ఆపరేషన్ చేసింది. అది విజవంతమయింది. ఆ పాప తాత అనుకోకుండా ఒక డి.ఐ.జి. పొజిషన్ లో వున్న పెద్ద పోలీసాఫీసర్ , అయన స్పందించారు. అవంతి పట్ల కృతజ్ఞత పెంచుకున్నారు. అంతటితో ఆగక ఆమెను కలసికృతఙ్ఞతలు చెప్పి ఒక కోరిక కోరుకొమన్నాడు.

    అవసరంలో వున్న అవంతి రిశికి ఉద్యోగం ఇప్పించమంది.
   
    అయన సరే అన్నారు   
   
    అనుకోకుండా రిషి ట్రైనింగ్ పూర్తీ చేసినా వేరే కారణం మీద జాబ్ లో చేరలేకపోయాడు.

    ప్రామిస్ చేసిన అధికారి పనిచేసే డిపార్ట్ మెంట్ , రిషి ట్రైనింగ్ అయిన డిపార్ట్ మెంట్ ఒక్కటే తను జాబ్ తిరిగి ఇప్పిస్తానన్నాడా అధికారి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయిన నందకిషోర్ అనూహ్యమయిన పరిస్థితులో ముఖ్యమంత్రి అయ్యాడు. పదవీ వ్యామోహంతో చేయకూడని పనులు చేస్తున్నాడు. అవి నచ్చని అవంతి తండ్రికి దూరమై బొంబాయి చేరుకుంది. అక్కడ వుండలేక మద్రాసు వచ్చింది.

    తన మనుమరాలి ట్రీట్ మెంట్ కి చూడప్ప మద్రాసు వచ్చాడు.

    అక్కడ అందరూ కలిసారు.

    రిషి జాబ్ కోసం పాత్రలన్నీ తిరిగి హైదరాబాద్ చేరుకోబోతున్నాయి.

    నందకిషోర్ తన పదవిని దక్కించుకోవటం కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి వేయని ఎత్తు వేయబోతున్నాడు. నీతి, నిజాయితీలంటే ప్రాణమిచ్చే రిషి ముఖ్యమంత్రి వేయబోతున్న ఎత్తులోకి ఎంటర్ కాబోవటం కూడా కేవలం యాదృచ్చికమే.

                                                                           *    *    *    *   

    "రంగం సిద్దమయింది ... ఎందుకో తెలుసా....? ముఖ్యమంత్రి పదవినుంచి నన్ను తప్పించేందుకు" నందకిషోర్ గంభీరంగా అన్నాడు.

    అవునవును __ నాకూ ఇన్ ఫర్మేషన్ వచ్చింది. ఇదంతా నా పొరపాటే..... తలకుమాసిన ఇండియన్ టైమ్స్ రెసిడెంట్ ఎడిటర్  కి మన పని అప్పగించాను. అతనేమో రోజ్ గార్డెన్స్ లో అ రాత్రి పది గంటలకు రామదాసు ఏం చెప్పినా అది పత్రికల్లో రాకూడని ఆదేశించాడే తప్ప, ఏం చెప్పడమన్నది పట్టించుకోలేదు. ఆ రాత్రి రామదాసు రోజ్ గార్డెన్ లో మీ గురించి మంచిగానే చెప్పాడట. మంచిగా చెప్పినట్లు మనకు తెలిసిపోయి వుంటే మాణిక్యం రామదాసు ద్వారా పెద్ద ఎత్తు వేయబోతున్నట్లు పసిగట్టే వాడ్ని ...." మైఖల్ రాజు ఫీలయ్యాడు.

    "నీకు  తెలుసా ... శంభుప్రసాద్ డిల్లీకి వెళ్ళాడట డబ్బు సంచులతో __ అతని కొడుకులు వాళ్ళ మేనమామ సుకీర్తి సహకారంతో మాణిక్యానికి అన్నిరకాల మద్దతు ఇస్తున్నారట ...." పళ్ళు పటపట కొరుకుతూ అన్నాడు నందకిషోర్.

    మైఖల్ రాజు కొద్దిగా ఖంగుతిన్నాడు, తెర వెనుక ఎత్తులు వేగం పుంజుకున్నందుకు .

    "ఇప్పుడెలా బయటపడటం ..." అంటున్నట్లుగానే అన్నా ఆ మాటలు నందకిషోర్ వినిపించాయి.

    కొద్ది నిమిషాల మౌనం తరువాత నెమ్మదిగా అన్నాడు నందకిషోర్ .

    "ఒక్క దెబ్బకే నాకు పదవి దక్కాలి __ శంభుప్రసాద్ , అతన్ని సపోర్టు చేసే పి.ఎమ్,. అసమ్మతివర్గం  షాక్ తినాలి...."

    "ఎలా? " మైఖల్ రాజు ఠక్కునఅడిగాడు.

    "నిన్ను అసానేసిట్ చేయటం ద్వారా ..... " నందకిషోర్ ఎంతో సంయమనంతో , బెస వాయిస్ తో గంభీరంగా అంటుండగానే మైఖల్ రాజు పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు.

    ముఖ్యమంత్రి నందకిషోర్ అన్న దేమిటో కొద్ది క్షణాలా వరకు మైఖల్ రాజుకి అర్ధంకాలేదు. నందకిషోర్ వేసే ఎత్తుగడలూ, విసిరే పాచికలు అంత తేలిగ్గా  ఎవరికీ అర్డంకావు.

    అర్ధం చేసుకొనేందుకు మెదడుకి పదును పెడుతూ నిశ్శబ్దాన్ని ఆశ్రయించాడు మైఖల్ రాజు.

    నందకిషోర్ రాష్ట్ర రాజకీయ సంక్షోభానికి పెద్ద గోతిని త్రవ్వే ప్రయత్నంలో వుండగా కాలం గడిచిపోతోంది.

                                  *    *    *    *   

    మరుసటిరోజు కొన్ని పేపర్స్ లో వెంకటనారాయణ అల్లుడు మున్సిపల్ శాఖ స్థలాన్ని ఆక్రమించుకున్నట్లు దాని గురించి చర్య తీసుకొనేందుకు వెళ్ళిన మున్సిపల్ ఎన్ పోర్స్ మెంట్ అధికారికి లంచం ఇవ్వజూపినట్లు , బెదిరించినట్టు భయ పెట్టినట్టు వార్తా వచ్చింది.

    ఏంటీ కరప్షన్ డిపార్ట్ మెంట్ అధికారులు వెంకటనారాయణ అల్లుడ్ని, మున్సిపల్ అధికారిని అరెస్ట్ చేయించి రిమాండ్ కి పంపించినట్టు, బెయిల్ మీద వాళ్ళు బయటకు వచ్చినట్టు సవివరంగా వచ్చింది న్యూస్ స్టోరీ.

    ఎందరికో నీతులు చెప్పే పత్రికధిపతుల బంధువులు ఇలాంటి పనులు చేయవచ్చా ....? అంటూ కొందరు ప్రజా ప్రతినిధులు నందకిషోర్ ఎత్తుగడలోని భాగంగా రేచ్చిపోయారు.                                                            అవన్నీ  చూసిన వెంకటనారాయణ సిగ్గుతో చితికిపోయాడు. తనలో తానె కుళ్ళిపోయాడు __ అది ముఖ్యమంత్రి నందకిషోర్ పన్నిన వల అని కూడా వెంకటనారాయణ కి తెలుసు కాని చేయగలిగినది అప్పటికే చేయి దాటిపోయింది. నందకిషోర్ రక్తం బొట్టు రాలకుండా పీకకోసేయగల సమర్డుడిని , సాంఘీకంగా , రాజకీయంగా ఒక స్థాయికి ఎదగని వ్యక్తులతో నందకిషోర్ సర్దుకుపోయి పనులు జరిపించుకోవటం అయన కుయుక్తులను కుత్పిటానికి అడ్డం పడతాయని కూడా వెంకటనారాయణకు తెలుసు.

    ఒక మామూలు మున్సిపల్ అధికారి నందకిషోర్ మోహార్భానీ కోసం తను సయితం లాకఫ్ లో కి వెళ్ళాడని __ అతను బయటకు రాగానే ప్రమోషన్ అతని ముంగిట ఎదురు చూస్తుందని కూడా తెలుసు.

    అంత మాత్రమె చేత ఫంకయ్యే పిరికివాడు కాదు వెంకటనారాయణ . నీతి, నీజాయితీ, నైతిక విలువలే తన పెట్టుబడిగా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ, స్వయంకృషితో మాసపత్రిక స్థాయినుంచి, లారేస్తూ సర్కులేటేడ్  దినపత్రిక స్థాయికి ఎదిగి, ఒకేసారి ఐదు నగరాలనుండి పేపర్ ని వెలువరిస్తున్న వెంకటనారాయణ ఎవరో, ఒకరు, ఒక్కసారితో పెకిలించగల బలహీనమైన పునాదులమీద నిలిచిలేడు.

    తన పేపర్ లో వచ్చే చిన్న వార్తయినా అందులో నూటికి నూరుశతం నిజం లేదని తెలిస్తే ఎవర్నీ క్షమించడు. తననే తను క్షమించుకో లేడు. అలాంటి వెంకటనారాయణ తన ఆఫీస్ లో కూర్చుని తీవ్రంగా యోచిస్తున్నాడు.

    అల్లుడ్ని అనలేదు __ అలా అని సమర్ధించుకోనూలేడు. ఆలోచనల్లోంచి  ఒకింత సేపటికి తేరుకుని రిపోర్టర్ రామరాజుకి కబురు పంపాడు. మరోనిమిషానికి రామరాజు ఆయనకి ఎదురుగా కూర్చున్నాడు.

    "తనకు అవసరమనుకుంటే , తనకు ఉపయోగపడతారనుకుంటే ఎంతటి ప్రజల శత్రువునైనా తన దోవలోకి తెచ్చుకోగలడు తప్పదనుకుంటే ప్రాణ స్నేహితుడ్ననయినా వెన్నుపోతూ పొడవటానికి వేనుదీయని స్పెసిమన్ నందకిషోర్ . ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న తన కన్నకూతురు అవంతి దూరమైపోయినా మానసికంగా చెక్కు చెదరని కఠినాత్ముడు . అయినప్పటికీ ఈసారి చాలా పెద్ద ఉపద్రవాన్నే తెచ్చి పెట్టాం మనం. అంత తేలిగ్గా తను పదవిలోమ్చి దిగాడు. మనల్ని వదలడు. ఇకపై కొంచెం జాగ్రత్తగా మసులుకో.

 Previous Page Next Page