మాణిక్యం తమ పార్టీ పరువు నందకిషోర్ మూలంగా గంగాపాలై పోతోందని తెగ వర్రీ అయిపోయాడు ప్రెస్ రిపోర్టర్స్ ముందు.
నందకిషోర్ వ్యతిరేఖ వర్గంలో వున్న ఎమ్. ఎల్. ఏ లు, ఎమ్ . పీ లు , కేంద్ర మంత్రులు నందకిషోర్ తన పదవికి రాజీనామాచేసి పార్టీ ప్రతిష్టను కాపాడాలని గొంతు చించుకున్నారు. వారికి తెలుసు __ తమ పార్టీకి అసలు ప్రతిష్టన్దేలేదని, అదెప్పుడో పోయిందని.
నందకిషోర్ మంత్రివర్గంలో ని సభ్యులకు తమ నాయుకుడు అని నీటికి పాల్పడ్డాడని తెలిసినా, అదేంలేదు __ నందకిషోర్ అమాయకులు __ మంచివారు __ నిస్వార్డపరులని __ అవినీతి అంటే తెలీనివారని __ అనుక్షణం ప్రజాసంక్షేమానికే పాటుపడేవారని తమ పదవులు నిలబెట్టుకోవడం కోసం పత్రికల ముందు ఆత్మవంచన చేసుకున్నారు.
ఇద్దరు మంత్రులు మరో అడుగు ముందుకేసి __ రామదాసు ఎన్ని తినలేదు __ గత ప్రభుత్వం ఎంత మిమ్గలేదు అని ఆవేశపడ్డారు. ఒకరు అని నీటికి పాల్పడ్డారని అభియోగం వచ్చినప్పుడు, అది నిజమా కాదా అన్నది ముందు తేలాలి. అంతేగాని ..... ఆ అభియోగం మోపినవాడు ఎన్ని తినలేదు,... గాట ప్రభుత్వం ఎన్ని తినలేదని ప్రత్యరోపణలు చేస్తే వీరి అభియోగాలు మాఫీ అయిపోతాయా? వీళ్ళు నిజాయితీ పరులపుతారా? ఇండియన్ పోలిటిక్స్ లో వున్న అతి హీనమయిన పంధా ఇది.
నీ కంటే పెద్ద చవటాయను నేను.....
నా కంటే పెద్ద దొంగా వాడు అని తిట్టుకొనే నేటి రాజకీయ నాయకులకు సిగ్గు, లజ్జా వున్నట్ట్లా ....? లేనట్లా....?
నందకిషోర్ ప్రాపకం కొం, పదవుల కోసం, కొందరు ఎం. ఎల్. ఏ. లు. సిగ్గూ , ఎగ్గూ లేకుండా నందకిషోర్ బుద్ధుడని సర్టిఫికేట్ ఇచ్చేసారు. ఏది వాగినా వేసే పత్రికలున్నాయిగా....? అన్నీ మరుసటిరోజు పత్రీకల్లో వచ్చేసాయి.
సమాలోచనలు ... ఎత్తులు ... పైఎత్తులు ... పథకాలు.... పట్టువిడుపులు .... పందాలు ... పదవికోసం పెంపర్లాటలు ... పాపిష్ట పనులు .... లంచాలు .. అవినీతి ... బ్లాక్ మనీ.... వెన్నుపోట్లు ఒకటేమిటి ....? సభ్యసమాజంలో జరగకూడని పనులన్నీ జరిగిపోతున్నాయి.
ప్రభుత్వ యంత్రంగం కునుకు తీయటం మొదలయింది. పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఆ రెపటి రాజు ఎవరో తెలీదు.... రాష్ట్రా పదవీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో ఎవరూ ఊహించలేక పోతున్నారు అలాంటప్పుడు మెకానిజం రెస్ట్ తీసుకుంటే తప్పేముంది ....?
* * * *
"శుబోధయాన్ని మనమేం చేయలేమా....?" నందకిషోర్ అగ్రహవేశలతో ఊగిపోతున్నాడు.
"కష్టం సార్.... ఆ పత్రిక యజమాని, ఎడిటర్ అయిన వెంకట నారాయణ చాలా ధైర్యస్తుడు . సునమేం చేసిన వేమతెన్ ప్రభుత్వం తన మీద కక్ష కట్టినట్లు తన పేపర్ లో , ప్రంట్ పేజీలో వ్రాసి పడేస్తాడు. దాన్ని చూసి ప్రతిపక్షాలు , మిగతా పత్రికలూ రెచ్చిపోతాయి ...."
యోగేంద్రసిన్హా వినయంగా అన్నాడు.
సీనియారిటీ ప్రకారమైతే యోగేంద్రసిన్హా చీఫ్ సెక్రటరీ అయ్యేందుకు చాన్స్ స్ లేవు. ఏ ముఖ్యమంత్రయినా తను తానా అంటే తందానా అనే చీఫ్ సెక్రటరీనే కోరుకుంటారు. ఒక్కోసారి తన కోసం, తన వాళ్ళకోసం రూల్స్ కి అతీతంగా కొన్ని పనులు జరిపించుకోవాల్సి వస్తంది. అలాంటప్పుడు సిన్సియర్ స్రీక్ట్ , ఐ ఏ. ఎస్. ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ పోస్ట్ లో ఉంటే ముఖ్యమంత్రి ఆటలు సాగవు. అందుకే నందకిషోర్ తనకి లొంగి వుండే యోగేంద్రసిన్హా ని ఆ పోస్ట్ లోకి సీనియారిటీ ని కాలదన్ని మరీ రప్పించుకున్నాడు.
అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పోస్టు లోకి , స్టేట్ కేపిటల్ పోలీస్ కమిషనర్ పోస్టు, జాయింట్ కమిషనర్ పోస్టు లోకి కూడా తనకు కావాల్సిన వాళ్ళనే రప్పించుకున్నారు. నందకిషోర్.
"ఎలక్ట్రసిటీ , వాటర్, డ్రైనేజ్ , సేల్స్ టాక్స్ , స్టేట్ ఎక్స్ఛేంజ్ లా అండ్ ఆర్డర్, లండ్ సీలింగ్ , మున్సిపల్ పరిధి లాంటి వ్యవహారాల్లో శుబోధయం యాజమాన్యం ఏ తప్పూ చేయలేదా?" ఏదో ఒక తప్పు చేసి ఉండాలన్న కసి, ద్వేషం నందకిషోర్ మాటల్లో తొంగిచూసింది.
కొద్దిక్షణాలు ఆలోచిస్తూండిపోయిన యోగేంద్రసిన్హా వెంటనే పోన్ ని దగ్గరకు లాక్కున్నాడు. నందకిషోర్ కి ఆమాంతం మాణిక్యాన్ని నమిలి మ్రింగేయాలన్నంత కోపంగా వుంది.
పొలిటికల్ డ్రామా స్టేజీ మీద కొచ్చాక తొందరపటు చర్యలు అంత మంచిది కాదు. ఏదైనా కీలెరిగి వాతపెట్టాలి.
తన అవినీతిని బయటకు తీసింది మాణిక్యం బృందం అతనికి సపోర్ట్ శంభుప్రసాదు ....ఆ పైన పదవులురాని ఎమ్. ఎల్ . ఏ. లు.... అరగంట క్రితం తనకు వచ్చిన పోన్ ద్వారా శంభుప్రసాద్డబ్బు సంచులతో డిల్లీలో దిగిపోయినట్లు తెలిసింది.
ప్రైమ్ మినిష్టర్ తన పార్టీ ముఖ్యమంత్రులకన్నా, శంభుప్రసాద్ లాంటి పారిశ్రామిక వేత్తలకే ప్రాముఖ్యమిస్తారు. ఎలక్షన్స్ ఖర్చుకిగాను కోట్లకు కోట్లు పార్టీకి ఫండ్ ఇచ్చే పారిశ్రామిక వేత్తలంటే అటు అధిష్టాన వర్గానికి కూడా ప్రేమే.
రాజకీయ డ్రామాలు ఊపిరిపోసుకునే కుయుక్తుల గ్రీన్ రూమ్ లో సీనియర్ మేకఫ్ మెన్ నందకిషోర్ .
అందుకే రాష్ట్రమంతటా , కేంద్రంలోనూ , నందకిషోర్ వేయబోయే ఎత్తు గురించే ఊహాగానాలు చేస్తున్నారు.
అణుయుద్ధం మరో అరక్షణంలో తనకు నాలుగు అడుగుల దూరం లోనే జరగబోతొందని తెలిసిన క్షణంలో కూడా నందకిషోర్ వేయబోయే ఎత్తు గురించే ఊహాగానాలు చేస్తున్నారు.
అణుయుద్దం మరో అరక్షణంలో తనకు నాలుగు అడుగుల దూరంలోనే జరగబోతుందని తెలిసిన క్షణంలో కూడా నందకిషోర్ సంయమనాన్ని కోల్పోయాడు. ఎలాంటి విపత్తు తనకు సంభంవించినా దాని గురించి అందోళన చెందకుండా , దాని నుంచి తప్పించుకుంటూ ఎవ్వరూ వూహించని ఎత్తు వేయగల మానసిక సామార్ద్యముంది నందకిషోర్ కి.
కొందరు తమాషాకి నందకిషోర్ బ్రెయిన్ మ్యూజియంలో భద్రపరచాలని అంటే... మరికొ౦దరు అతని కన్ని తెలివి తేటలు, జిత్తులు ఎలా వచ్చాయనే దాన్ని నిర్దారించుకొనేందుకు అతని బ్రెయిన్ ని జెనిటిక్స్ లాబ్ కి పంపించాలని అంటూంటారు.
శుబోధయం యాజమాన్యం చట్టపరంగా ఏమైనా తప్పులు చేసిందో లేదో తల్సికునెందుకు అవసరమైన చోట్లకు ఫోన్ చేస్తున్న యోగేంద్ర సున్హా నందకిషోర్ వేయబోయే ఎత్తు గురించి ఓ ప్రక్క అలోచిస్తూనే వున్నాడు.
నందకిషోర్ మానసిక పరిణితిపై, తెలివితేటలపై , జ్ఞాపకశక్తిపై , అందరికీ ఆరాధానా భావమే.
అతని శత్రువులు అతనికంటే గౌరవంతో కూడిన భయం అద్మీరేషణ్ తో కూడిన అసూయ.
అతని ఆలోచనా సరళిని , విశ్లేషణని అర్ధం చ్సుకుని , అందుకు అనుగుణంగా ప్రవర్తించాలనుకునే అధికారులకు, మిత్రులకు కూడా చాలా సార్లు తికమక తప్పుదు.
అతని మేథ ఒక పజిల్ .....
అతని ప్రవర్తన ఇన్ స్క్రూటబుల్.....
ఎవరికీ, ఎప్పటికీ అర్దంకాని బ్రీలియంట్ డాజలింగ్ ....
ప్రైమ్ మినిష్టర్, అధిష్టానవర్గం కూడా నందకిషోర్ తెలివితేటలకు అబ్బురపడటం సర్వసాధారణం.
కర్పషన్ ది ఏముంది ....? ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఎంతోకొంత.... ఎప్పుడో ఒకసారి తినని రాజకీయ నాయుకులు మహావుంటే ఒక ఐదు శాతముంటారు __ కానీ నందకిషోర్ తెలివితేటలే మింగుడు పడటం లేదు అని అతనికన్న సీనియర్ నాయుకులు ఎన్నోసార్లు అనుకుంటు౦టారు. మధనపడుతుంటారు.
అలాంటి నందకిషోర్ ఇప్పుడు చురుగ్గా, వేగంగా యోచిస్తున్నారు
అంతలో యోగేంద్రసిన్హా చిన్న ఆధారాన్ని పట్టుకోగాలిగాడు "శుబొధయం ఎడిటర్ వెంకట నారాయణ పెద్ద కూతురు ఇల్లు మునిస్పాల్ పరుధుల్ని అతిక్రమించినట్లు రుజువైందట. అయితే పేపర్ వాళ్ళాతో ఎందుకు? ఏ చర్య తీసుకున్నా రోడ్డ్లు బాగాలేదు, డ్రయినెజ్ పాడయిందిమున్సిపాలిటీ అధికారులు నిద్రపోతున్నరంటూ పేపర్ తో వేసే ప్రమాదముందని ఏ చర్య తీసుకోలేదట సార్ ....!" యోగేంద్రసిన్హా ఉత్సాహంగా అన్నాడు.
"శేబాష్.... మారుతున్న జీవన వ్యయాన్ని, అవసరాల్ని, సమస్యల్ని విశ్లేషించి చట్టాలు చేస్తే చట్ట పరుధుల్నీ అతిక్రమించని వారు దేశ జనాభాలో కనీసం పదిశాతమయినా వుండేవారేమో.....
చట్టాల్ని గౌరవించవలసిన ప్రజలకు సమస్యల వలయాల్లో, బాధల పరిశ్యంగలో మ్రగ్గిపోతుంటే , అ చట్టాల్ని తయారుచేసే మేధావులు సెంట్రల్ ఏసీ రూమ్ లో , క్ఝారీదయినా క్లబ్బుల్లో , విలాసవంతమైన హొటల్స్ లో వాస్తవాలకు నగ్నసత్యాలకు అతీతంగా సుఖిస్తున్నారు. ప్రజలకోసం చట్టాలు... చట్టాలకోసం ప్రజలు కాదనే వాస్తవాన్ని మన మేధావులు గుర్తిమ్చానంతవరకు ప్రతి ఒక్కరూ తెలిసో, తెలియకో, తెలిసినా గత్యంతరం లేకో, తప్పని తెలిస్నా తప్పుకో, ఎప్పుడో ... ఎక్కడో ఒక నూలుమందమున్నా చట్టాన్ని అతిక్రమిస్తారు. ఇంకొంతమంది ఇద్దకం వల్లో, బలుపు ఎక్కువయ్యో , మిటిమీరిన శ్రద్దవల్లో , అశ్రద్ధవల్లో అమాయకత్వం వల్లో అతిక్రమిస్తారు. అవి చిన్న తప్పులు కావచ్చు... వాటిని చూసి చూడనట్లు పోవచ్చు.... క్షమించ తగ్గవే క్జవచ్చు. కానీ మనలాంటి వాళ్ళకు అవసరం అనుకున్నప్పుడు అవి ఉపయోగపడతాయి. ఆ ఏరియా ఏన్ ఫోర్స్ మెంట్ మిన్సిపాల్ ఆఫీసర్ ఎవరు ....?" నందకిషోర్ తాఫీగా ప్రశ్నించాడు.
"రవీంద్ర ... పి. రవీంద్రట సార్ ...."
"ఆహా..." సాలోచనగా అన్నాడు నందకిషోర్
"ఏక్షన్ తీసుకొమంటారా ...? తెల్లవారెసరికి ఆ బిల్డింగ్ నామరూపల్లెంకుండా చేసేయమంటారా ....? ఆరు నెలల క్రితమే నోటీసులు...... హెచ్చరికలు అయిపోయారట . ఇప్పుడు ఏ చర్య తీసుకున్న చట్టపరం గానే వుంటుంది. ఆ వెంకట నారాయణ ఏమీ చేయడు. తన అల్లుడివే తప్పని __ మనమేం చేయించినా నోరెత్తలేడు...." యోగేంద్రసిన్హా ఉత్సాహపడిపోయాడు.
"అదే ... దాన్నే బుర్రలో గుజ్జు లేదనేది....."