Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 18

    యార్డీషీ సాఫ్  తో  స్నానం చేసింది.
    అది ఆమె గార్లప్రెండ్ పంపింది. పెట్టె అడుగున పడివున్న దాన్ని తీసి తొలిసారిగా వాడింది. ఖరేదైన పౌడరు అద్దుకుంది. ఆపైన స్ప్రే చేసుకుంది. ఖరీదైన చీరకట్టుకుంది.
    ఇవన్నీ ఆమె ప్రెండ్ చందన పంపిన కానుకలు. తను ఆమె పెళ్ళికి వెళ్ళలేకపోయింది. దానికి కోపం వచ్చింది. అయినా భర్త స్టేట్స్ నుంచి వస్తూ తెచ్చిన ఆ వస్తువులు సుజాటికి పంపింది. కోపంగా వుత్తరం రాసింది.
    "నువ్వు ఒట్టి మొద్దువి __
    నీకు ఫ్యాషన్స్ తెలియవు. అలంకరణ తెలియదు.
    ఇవి ఉపయోగం వుంటుందని తెలుసా నీకు! ఎప్పుడైనా స్పెషల్ ఎకేష్ణాస్ లో యివి గిరాస్తే వాడెయ్. అప్పుడైనా నేను గుర్తువస్తావా మొద్దూ !" అంటూ రాసింది.
    ఇప్పుడు అ విషయం గుర్తుకి రాగానే నవ్వొచ్చింది సుజాతకి
    తను చందనని మరచి పోగాలదా?
    మరున్నది మనిషికి వరమైతే అవచ్చు కానీ యిది వరం కాదు. శాపం. చందనని మరచి పోతుందా?
    ఒక మృదుసమీరం వీచినట్ట్లుంది చందన గుర్తుకి రాగానే.
    పూలజల్లు విరిసినట్ట్లుగా అయింది.
    ఇప్పుడు చందన ఏం చేస్తోంటో౦దో!
    భర్తతో షికారుకి వెళ్ళి వుంటుందా?
    హాయిగా రెస్టు తీసుకుంటూ వుంటుందా?
    ఏమో!
    ఆ ఎమిరికన్ లైఫ్ గురించి తనకి తెలియదు.
    ఆలోచనలని పారద్రోలింది సుజాత.
    ఆలోచనలతోనే మేకఫ్ ముగిసింది.
    వాచీ చూసుకుంది! ఆరు! మైగాడ్ అనుకుంది.
    చప్పున తలుపులు వేసి బయటకి వచ్చింది.
    చుట్టూ ప్రక్కల వాళ్ళంతా విచిత్రంగా కళ్ళు విప్పార్చుకుని చూశారు. నడుస్తోన్న పరిమళం లాగా, కడులుతొన్న సౌందర్యంలాగా వుంది ఆమె.
    ఆ అందానికి ఆ లంకరణకి ఆ హొయలకి పరిమళం అబ్బినట్టుగా వుంది. ఆమె వాడిన ఇంటిమేట్ అవీ బంగారుకి తావిని తెచ్చిపెట్టినట్టుగా వున్నాయి.
    కౌంపౌండ్  గేటు దాటగానే రిక్షా ఎక్కేసింది.
    తన వెనుక అమ్మల్కక్కలుఎన్నెన్ని విధాలుగా ఎన్నెన్ని అనుకుంటారో ఆమెకి తెలుసు. అయితేనేం ఆమె వాటిని లెక్కించదలచుకోలేదు.
    తన జీవితం తనది. తన ప్రేమ తనది. తనని తన వాడిన సుధాకర్ ప్రేమతో ఆదరిస్తేచాలు!
    రిక్షా గతుకుల రోడ్డుపై నట్టుతూ వెళుతోంది. అయితేనేం సుజాత దాన్ని పట్టించుకోలేదు. ఆమె తను ఆ సాయంత్రం అతనిలో ఎంత మధురంగా గడపబోతోందో ఆ విషయం పైన్నే మనస్సుని కేంద్రీకరించింది.
    హొటల్ ముందు రిక్షా ఆగింది.
    రిక్షా దిగింది సుజాత. డబ్బు ఇచ్చేసి అటుచూసింది.
    హొటల్ ముందు కరాపుకుని, దాన్ని అనుకుని ఎటో చూస్తున్నాడు సుధాకర్!
    గంభేరంగా హుందాగా త్రీం గా వున్నడతాను స్నాఫ్ కలర్ సూత లో హీరోలా వున్నాదనుకుంది ఆమె. అలా అందంగా, హుందాగా నుంచున్న అతన్ని చూసి అతని దగ్గరకి వెళ్ళి అతన్ని పలకరించాలంటే ఎదో తెలీని భయం ఆవరించింది. ఆమెని. చప్పున ఒక విషయం పాటు తిరిగిపోదామన్న ఊహా బ్విధ్యుల్లతల మెరిసింది.
    ఆమె మనస్సుకి అతను తను అంతకు పూర్వం ఎరిగిన వ్యక్తిలా కనిపించలేదు. తనతోపాటే తనూ ఆఫీసులో లాగా కూడా అనిపించలేదు.
    ఎవరో మారోపోయిన మనిషిలా అనిపించాడు. ఎరుగుని వ్యక్తిలా కనిపించాడు. ఎదిగిన మనిషిలా కనిపించాడు.
    హిమాలయాల ఔన్నత్యం, సాగరగాంభీర్యం, ఆకాశ వైశాల్యం కనిపించాయి.అతనిలో
    అంతటి వ్యక్తితో యీ ఏకాంత సాయంతనం దగపాలంటే, అతని యీ సాయం అసయమం తనది అనుకుంటే...ఆమెకి గుండె గొంతులోకి వచ్చినట్లయింది.
    ఆ ఊహలన్నీ క్షణమాత్రం ... అంతే ....
    తనూ, తన సౌందర్యం కూడా వేలలేనివే అనిపించింది. ఆమెకి ఆ భావన ర్యాన్నిచ్చింది.
    కలహలంలా రాయంచలా నడిచింది. ఆమె అందేలో మృదుపద రవళిని సృష్టించాయి. సమ్మోహనకరమైన వలపు సంగీతాన్ని ఆమె పదాలు, లయని, తాళాన్ని అర్పించాయి.
    ఆ చిరునవ్వుకీ అతనిటు చూశాడు. ధ్యానభ౦గం కలిగిన ప్రేమికుడిలా చూశాడు. "ఒహో " అన్న పదం అప్రయత్నంగా ఆరాధనా పూర్వకముగా వెలువడింది.
    "నేను ... నేను.
    ఆమె తడబాటుని చూసి నవ్వేడతను.
    "యు.... ఆర్ బ్యూటిపుల్!" అన్నాడు.
    అతని కళ్ళలోనిప్రశంసని, ఆ రాధానని చదవగల్లిండామే. "థాంక్యూ!" అంది చిరునవ్వుతో.
    అ రెండుక్షరాలూ మాధుర్యాన్ని మేదిపిన మంత్రంలా ద్వనించాయి.
    "యు ఆర్ మార్వలెస్..... ప్రత్యెక సృష్టినీది...."
    చప్పున కనులు వలచింది సుజాత.
    "లోపలి వెళదామా!"
    "వెళదాం" గజ్జల చిరుసవ్వడిలా ద్వనించాయని.
    లోపలికి దారి తీశాడతను.
                                                        *    *    *    
    దూరదూరంగా బల్లలు .
    ఒకో బల్ల దగ్గర జంటలు, జంటలుగా.... మందంగా వెలుగు తోన్న దీపాలు, భార్యా భర్తలకి లేదా ప్రేయసీ ప్రియులకి వాళ్లకి మాత్రమే కనిపించే౦త మందమైన వెలుగు.
    "కూర్చో!"
    అతని ప్రక్కన్నే కూర్చోవటానికి క్షణం పాటు జంకింది. తరతరాలుగా వస్తోన్న ఆర్య సంస్కృతికి, అధునాతన నాగారరికత వంటబట్టించుకున్న యీ సంస్కృతికి క్షమాపాటు పోరాటం జరిగింది.       

 Previous Page Next Page