"కూర్చోవోయ్ !" ఆమె చేతిని అందుకున్నాడు చొరవగా.
బిడియంతోటే కూర్చుంది.
"ఏం కావాలి?"
అతని కంఠంలో ద్వనించిన ఆ చిలిపి తనానికి నవ్వోచ్చింది. కానీ నవ్వుని ఆపుకుని అతనివైపు చురుగ్గా చూసింది. అతనికి ఆ చూపులు కరుగ్గా అనిపించాయి.
"టిఫిన్ ఏంతీసుకుంటున్నావ్ ?" మళ్ళీ అడిగేడు.
"మీ ఇష్టం!" పక్కా గృహినిలా సమాధానం యిచ్చింది.
"అచ్చం తెలుగమ్మాయిలా వున్నావు!"
ఏమితన్నట్టుగా చూసింది.
"ఆ కట్టు __ ఆ బొట్టు __ ఆ జడ __ ఆ నడక __ ఆ అందం __ ఆ చందం __ ఆ మాట ఒద్దిక __ కొత్తగా పెళ్ళయి __ తొలిసారి భర్తతో పాటుగా నలుగుర్లో అడుగుపెట్టిన అమ్మాయిలా వున్నావు __"
ఆమె పెదాలపై చిరుదరహాసం వెలిగింది.
బేరర్ వచ్చాడు.
రెండు రకాల స్వీట్స్, సమోసాలు, కట్ లేట్ ఆర్డరిచ్చాడు.
బేరర్ వెళ్ళిపోగానే "హెవీవుడ్" అంది సుజాత.
"ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం చెయ్యాలా?"
ఆమె పెదాలు ఆ చివరి నుంచి యీ చివరి దాకా కదిలాయి.
"సారీ ఊం కబుర్లు చెప్పు __"
"నువ్వే చెప్పాలి. సినిమాల్లో కధల్లో యిలా ప్రేయసీ ప్రియులు ..." చప్పున మౌనం వహించింది. ఆపుకోలేని సిగ్గు ఆవరించినట్లయింది.
"గుడ్. ఇప్పటి కొప్పుకున్నారన్నమాట అమ్మాయిగారు.... మనం ప్రేయసీ ప్రియులమని ... ఫర్లేదు.... భగవంతుడి కి థాంక్స్ చెప్పొచ్చు ...."
"ఏయ్..... ఏమిటా కొంటి మాటలు...."
"లేకపోతె. ఎప్పుడూ మనిషిని ఆమడ దూరంలో నిలిసేట్టుగానా చూడటం. కాస్త చనువు యివ్వాకూడదూ."
సుజాత సమాధానం యివ్వలేదు.
"సుజీ..."
"ఊం"
"ఇంత అందమైన సాయంకాలం ఎన్నడూ ఎరగను.
ఈ మధురానుభూతిని నాకు ప్రసాదించినందుకు నీకెలా కృతఙ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు__"
అంతలో స్వీట్స్ వచ్చాయి.
బేరర్ వెళ్ళిపోగానే అతనో ముక్క తుంచి ఆమె నోటికి అందివ్వబోయాడు.
"ఏయ్! ఏమిటా అల్లరి?" ఎవరైనా చూస్తారు."
"సుజీ! నేనో మాట చెప్పనా! ఇలాంటి హొటళ్ళకి వచ్చే వాళ్ళందరూ తమనీ తమ ఫ్రెండ్స్ ప్రేయసిని చూసుకునేందుకు , దగ్గర దగ్గరగా కూచుని మాటాడుకునేందుకూ వస్తారే తప్ప __ మరో బల్ల వద్ద ఏం జరుగుతుంది __ ఎవరోచ్చారు __ ఏం మాటాడకుంటారు అన్న ధ్యానవుండదు__"
నిశితంగా చూసింది ఆమె.
తబ్బిబ్బయ్యాడతను.
చప్పున తుంచిన ఆ స్వీట్ ముక్కని ఆమె పెదాలకీ అందించాడు. సుతారంగా అందుకుందామే.
ఒక నిముషం గడచిపోయింది.
"ఛీ!పో. నీ కేం తెలియదు. ఒట్టి మొద్దువి...."
"ఏం?"
"నాకూ ఓ ముక్క తుంచి పెట్టరాదూ!"
అలా అలా గడచి పోయింది గంట!
ఆ గంటసేపూ ఆటను గంధర్వలోకంలో , అమెవ్ స్వర్గ సీమలో విహరించినట్లుగా అనుభూతి చెందారు.
కూల్ డ్రింక్స్ తీసుకున్నాక తడి తడిగా మెరుస్తోన్న ఆమె పెదాలని చూసి ఆటను తమకం ఆపుకోలేకపోయాడు
ఆమె పెదాలపై సుతారంగా ముద్దు, పెట్టుకుని, నడుంచుట్టూ చేతులు వేసి, అ చేతులు బిగించాడు.
అతని వెచ్చటి తీపి ముద్దు ఊపిరి, స్పర్శ ఆమె పాదాలని తొందరించాయి. ఆమె నిగ్రహించుకోలేక పోయింది. అందుకే చప్పున ముహం తిప్పుకుంది.
"సుజీ!"
ప్రేమగీతం, ప్రేమవేదం పలికినట్లుగా పిలిచాడు.
ఆ పిలుపు ఆమెకి రవ్వల రవళి, మువ్వల మురళిలాగా అనిపించింది.
మంచు మొగ్గ, విరిసి, వనపువ్వు కురిసినట్టుగా అని అనిపించింది.
మానసవీణ మృదుమధురంగా పలికే హృదయగానం రసొల్లాసంగా విన్నట్లుగా అనిపించింది.
కానే ఆమె మనస్సుని కట్టివేసుకుంది.
"లేద్దామా!" మెల్లిగా అడిగింది.
"ఏం?" అతని గొంతులో ఎంతో అసంతృప్తి! ఎంతో మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటున్న బాధ.
"మనం తొందర పడకూడదు సుధా! ముందు ముందు ఎంతో సుందరమైన భవిష్యత్తు వుంది. తీయని మాయని గుర్తుగా మిగిలిపోవలసిన అనుభవం చెదుతిన్నట్టుగా కాకూడదు __" అరమోడ్పుకనులలో అంది సుజాత.
అతని ఆవేశానికి పగ్గాలు, వేసినట్టు, తొందరపాతుకి సంకెళ్ళు వేసినట్టు అయింది. ఆటను సుతారంగా ఆమెకనులపై తీపి ముద్రవేసి" "పద" అన్నాడు నవ్వుతూ.
ఆ గొంతులో కోపంలేదు.తాపంలేదు.
అతనా క్షణంలో ఆమె బెస్ట్ ప్రెండులా వున్నాడు.
ఆమె దారి తీసింది.
అతనానునసరించాడు.
కరెక్కుతోన్న ఇద్దరినీ గమనించాడు నాగరాజు.
తనలో తనే ఎదో అలోచించుకుంటునట్లుగా తల ఆడించాడు.
అందులో ఎందరి జీవితాలు ముడిపడ్డాయో _ ఎన్ని ఆలోచనలు ముడిపడుతున్నాయో ఎవరికీ తెలుసు.
నాగారాజుకి సుధాకర్ ని చూడగానే కోపం వచ్చింది. కలసినట్టుగా లోపలి వెళ్ళి పార్టీ ముగించుకుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ వస్తోన్న ఆ ఇద్దర్నీ చూడగానే ఆగ్రహం వచ్చింది.
అందుకే తల ఆడించాడు. బుసకొట్టబోయేలా కానీపించడతను.