"సుజీ__" అతని గొంతు గరగర లాడింది.
"ఊం"
"ఎవరో వస్తున్నారిటు __ త్వరగా ఓ మాట చెప్పనా?"
"ఊం"
"రేపు ప్రత్యేకంగా స్వప్నంలో స్వప్నలో నీకు డిన్నర్ యిస్తాను__"
"ఊం"
"ఊం థాంక్యూ_"
"తప్పక రావాలి తెలుసా?"
"ఊం"
"సీజీ! ఊ తప్ప యింకో మాట రాదా_"
"మనసు పరవసిస్తే మాటలు రావు_"
"అలాగా!" నవ్వేడతను. సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె నవ్వింది...."ఎందుకో అంత పరవశం?" అని అడిగేడు.
సుజాత ఎవరో జవాబు చెప్పటానికి పెదాలు కదిల్చింది.
అంతలో ఎవరో బిజినెస్ మనిషి __ సుధాకర్ తండ్రిగారికి చాలా ఆప్తుడు "నమస్కారం" అంతు వచ్చాడక్కడికి.
సుజాత తప్పుకుంది. అతనికి మాత్రమే వినిపించేంత మెల్లగా "రేపు చెబుతా" నంటూ వెళ్ళిపోయింది. ఆ వ్యాపారస్తుడు వచ్చేలోగా.
ఆమాట అతని హృదయాన్ని మీటి నట్లయింది
"థాంక్స్!" అన్నాడు యింకా మెల్లిగా .
తర్వాత ఆ వచ్చిన వ్యక్తితో మాటాడుతూ వుండిపోయాడు.
ఆ రాత్రంతా సుజాతికి నిద్రసరిగా పట్టనే లేదు.
ఎప్పుడో పొర్లి పొర్లి నిద్రలోకి జారిపోయింది. నిద్ర నిండా కలలే! ఆ కలల నిండా సుధాకరే! వెన్నెల లాటి చిరునవ్వులు కురిపిస్తో అమృతంవంటి మాటలు వర్షిస్తూ అంతా సుధామయం చేశాడు.
ఆమె హృదయమంతా అమృతంతో నిండిపోయినట్లుగా వుంది.
12
ఆ మరురోజు అంతా ఆఫీసులో ఆనందంగానే గడిచిపోయింది ఆమెకి. నిన్నటి దాకా మనస్సులో వున్న ఒక విధమైన చికాకు, ఆలోచన అన్నీ చేత్తో తీసేసినట్లుగా మాయమైపోయాయి. ఆమెకి చాలా విచిత్రం అనిపించింది.
ఒక మాట __ఒక చూపు యింత మార్పుని తెస్తాయా అనుకుంది.
ఇప్పుడు అతని కళ్ళలోకి సూటిగా చూడాలంటే సిగ్గుగావుంది.
పదే పదే అతను ముద్దాడిన "చోటు" కళ్ళముందు కనిపిస్తోంది.
ఆ చేతిపై భాగం అమృతీకరణ మైనట్టుగా అనుభూతి కలుగుతోంది.
తీయ తీయని తలపుల మధ్య కాలం గడచిపోయింది.
సాయంకాలం అయింది.
ఉదయం పది గంటల నుంచీ సాయంకాలం అయిదు దాకా రోజు బందీలా కనిపించే ఆఫీసు యీ రోజు అలా అనిపించలేదు.
అయిదు కొట్టగానే సీట్లోంచి లేచింది.
మనస్సులో ఏదో బెరుకు __ ఏదో ఉద్వేగం __ ఏదో ఆరాటం.
ఆమె బయటకి రాగానే అతనూ ఆమె వెంటేవచ్చాడు.
అప్పటికీ యిప్పటికీ ఎంతో తేడా అనిపించింది. అతనాఫీసరు. టని అదే సెక్షన్ లో ఓ మామూలు క్లర్క్!
అంతేనా ?
అతనెంతో ఐశ్వర్యవంతుడు. కోటేశ్వరుని ఏకైక పుత్రుడు. ఆయనతో పోల్చదగిన వ్యక్తులు జిల్లా స్థాయిలోనే కొద్దిగా వుంటారు ఆర్ధికంగా రాజకీయంగా అయన ఎంతో ఉన్నతుడు. జిల్లాలోని ఇద్దరు ఎం.పిలు, నలుగురు ఎమ్మెల్యేలు అయన పక్షం . రాష్ట్రంలో , కేంద్రంలో అయన ఏ పని తలచుకున్నా సులువుగా అయిపోతుంది.
అతన్నీ, అతని కుటుంబాన్నీ, అతని స్థాయినీ పోల్చుకుంటే తనకి ఆ యింటి గుమ్మం ఎక్కేస్థాయి కూడా లేదు. తను ఓ మామూలు మధ్యతరగతి మనిషి కుమార్తె __ అదీ కాకుండా తను __తను. తన పుట్టుక.....
"త్వరగా రావాలి సుజీ!" అన్నాడతను ఆఫీసుమెట్లు దిగుతో.
"అలాగే!"
"అరున్నరకల్లా వెయిట్ చేస్తోవుంటాను_"
"అలాగే _ తప్పక వస్తాను __"
"ఒక్కడినే వస్తాను __ నువ్వూ ఒక్కత్తివే రావాలి __"
ఆ మాటలకి నవ్వింది సుజాత. "ఒక్కత్తినే వచ్చినా వచ్చినా వచ్చాక ఇద్దరం అవుతాం కదా!"
అతనూ నవ్వేడు. "ఇద్దరం ఒకటయ్యే దేప్పుడో__"
చప్పున తల వంచుకుంది. సిగ్గు తెరలు తెరలుగా ముంచుకొచ్చింది. అంతలో బస్టాపు వచ్చేసింది.
అవ్యధిగా బస్ వచ్చేసింది.
కళ్ళతోటే అతనికి టాటా చెప్పి బస్సు ఎక్కేసింది సుజాత.
అతనూ సమాధానంగా నవ్వేసి తన స్టాపువైపు కదిలేదు.
బస్సు కడలి కనుమరుగై పోయేవరకూ అతన్నే చూస్తోంది సుజాత.
బస్సు స్టాపులో డిగి గబగబా తన యింటివైపు నడించింది. గేట్లోనే వున్న జానికమ్మగారిని పలుకరించింది.
"మళ్ళి నిద్రపోతోంది.__" అందామె.
"పడుకొనివ్వండి. సాయంకాలం నీళ్ళు పోసి పాళీ పట్టేరేమోకదూ! ఇప్పుడు పడుకుంటే రాత్రి గోల చెయ్యదూ__"
"ఉహూం మళ్ళీ పాలు పడితే __ ఎనిమిదికో తొమ్మిదికో నిద్రపోతుంది. దాంతో ఇంట్లోఅందరికీ కలక్షేపమే! ఎక్కడ నిద్రపోనిస్తున్నారు. అందరి చేతుల్లో నలిగిపోతుంది.__"
నవ్వేసింది సుజాత __ ఆడపిల్ల మల్లెలాటి జీవితం ఎలాగూ యిటర్ల చేతుల్లో నలిగిపోయేదే ననిపించిందామెకి.
తలుపు తీసుకుని లోపలి వెళ్ళింది.