వీళ్ళక ప్రజలు ... వీళ్ళకు సంక్షేమ కార్యాక్రమాలు ... వీళ్ళకు బుద్దుంటే మాలాంటి వాళ్ళను గెలిపిస్తారా?
పార్టీలు ఫిరాయిస్తుంటే ఏం చేస్తుంటారు?
ప్రభుత్వాన్ని కూలుస్తుంటే ఏం చేస్తున్నారు?
కుల మతాల్ని రెచ్చగోడుతుంటే ఏం చేయగలుగుతున్నారు.?
మంచిపనులు చేయకపోతే ఏం చేయగలరు ? నియోజక వర్గాల్లో తిరగకపోతే ఏం ఊడబీకుతున్నారు?
కోట్లుకు కోట్లు తింటుంటే అడ్డుకోగలుగుతున్నారా? యధారాజా తధాప్రజా కాదు __
యధాప్రజా తథారాజా __
వాళ్ళను ఎదురు తిరగమను __ గెలిపించిన అభ్యర్ధుల తాట వలనమను __ అవినీతి అధికారుల్ని వేటాడమను. నిజంగా ప్రజల కోసం శ్రమించే వార్నే గెలిపించమను. తమ సమస్యల్ని గాలికోదిలేసి ఏ విగ్రహాన్ని తయారు చేయించాలి? ఎక్కడ ప్రతిష్టించాలాని కాలాన్ని వృధాచేసే వారిని నిలదీయమును , చేతకాదు. మరెందుకురా వాళ్ళ గురించి బాధ పడటం? వల్ల గురించి, వల్ల సమస్యల గురించి వారే బాధపడటం లేదు. శ్రద్ద తీసుకోవటం లేదు. మరెవరికి పడుతుంది....?
తమిళనాడు అన్నావు __
అక్కడ చిన్న వీధిలో రోడ్డు పాడయితే ఆ వేదిలోని ఆడవాళ్ళంతా మున్సిపల్ అధికారుల్ని . కౌన్సలర్స్ ని, ఎమ్. ఎల్. ఏ. నిలదీస్తారు చీపిరికట్టలతో సన్మానం చేస్తారు మరిక్కడ? ... ఆ మనకెందుకులే అనే నిరాసక్తత.
రోడ్డ్లు వేయించిన , కలవులు త్రవ్వించినా అది మా డబ్బు కాదు. ప్రజలదే కాని మాదే అన్నట్లుగా కబుర్లు చెబుతాం. మా అసమర్దతని కప్పిపుచ్చుకోవటానికి పాత ప్రభుత్వాల్ని తిడతాం. కేంద్రం మీద వేస్తాం. వేరే గొడవలు లేవదీసి దృష్టిని మళ్ళిస్తాము. నిజమే __ మరి ప్రజలెందుకు ఊరుకుంటున్నారు? ఏం వాళ్ళకు పౌరషం లేదా? ఆత్మస్త్థెర్యం లేదా? సిగ్గులేదా? లేదనేగా.... గాలి వెధవలు రాజకీయాల్లోకి వస్తారు ఎందుకు? పదవుల్లోకి వచ్చి పైకెళదామని.
సినిమా వాళ్ళు రాజకీయాలని భుజానికెత్తుకుంటారు. ఎందుకు ? ఇన్ కమ్ టాక్స్ తప్పించుకోవటానికి .
రౌడీ వెధవలు రాజకీయాల్లోకి వస్తారు . ఎందుకు ? కేసులు ఎత్తి వేయించుకొని పెద్దమనుష్యులుగా చెలామణి అవుదామని ?
పారిశ్రామిక వేత్తలు రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారు. ఎందుకు? లైసెన్స్ లు కొట్టేద్దామని , సబ్బిడీలు మ్రింగేద్దామని , వ్యాపారాల్ని పెంచుకుందామని.
మరి ఇవి ప్రజలకు తెలియవా? తెలిసినప్పుడు ఎందుకు ఓట్లేస్తూన్నారు.?
ఎందుకు గెలిపిస్తున్నారు?
ఎందుకు ఊరుకుంటున్నారు?
వాళ్ళు ఊరుకుంటున్నారు. గనుకే మేము మా వ్యవహారాల్ని చక్కబెట్టుకుంటున్నాం.
ఇక ఈ సమస్యని ఎలా ఎదుర్కోంటానో కూడా చూడు అధిష్టాన వర్గమే నన్ను బ్రతిమలాడి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగమని చెప్పేలా చేస్తాను " అంటూ ఆవేశంగా ప్రక్క గదిలోకి వెళ్ళిపోయాడు నందకిషోర్.
అతనంత పచ్చిగా తన వాదన వినిపిస్తే ఏమని దానికి సమాధానం చెప్పగలడు? అతడు మాట్లాడిన దాంట్లో నిజం లేదని ఎలా అనగలడు? గోపీనాధం వెర్రిచూపులు చూస్తూ అక్కడే కూలబడిపోయాడు.
* * * *
అధిష్టాన వర్గం చర్చలు వేడెక్కిపోయాయి. అత్యవసరంగా ముఖ్యమంత్రి పదవినుంచి నందకిషోర్ ని తప్పించెందుకు గ్రౌండ్ ప్రిపర్ కాసాగింది.
* * * *
మైఖల్ రాజు మతిస్థిమితం తప్పినావాడిలా తయరయ్యాడు.
మాణిక్యం ఎత్తుగడ స్థాయిని అంచనా వేయలేక పోయినందుకు తనను తానె నిందించుకున్నాడు.
హడావుడిగా గ్రీన్ ఫీల్డ్ కేసి బయలుదేరాడు.
* * * *
శంభుప్రసాదు పారిశ్రామిక సామ్రాజ్యపు ప్రధాన కార్యాలయంలో సందడి ఎక్కువయింది. సంతోషం వెల్లివిరిసింది. ఉత్సాహం ఉరకలు వేసింది. రాష్ట్రంలోనూ తమ మనిషే ముఖ్యమంత్రి అయితే తమ సామ్రాజ్యపు పొలిమేరలు పెరిగిపోతాయని ఆనందిస్తున్నారు.
శంభుప్రసాదు కి ఎదురుగా అతని కొడుకులు మురారీప్రసాదు __ అనూ ప్రసాదు కూర్చున్నారు. ఎప్పుడూ ఉదయం పదిగంటలకు గాని ఆఫీస్ కురాని తండ్రీ కొడుకులు, ఆ రోజు శుభోదయం పేపర్ చూస్తూనే బయలుదేరి 8-30 కె ఆఫీస్ కి వచ్చేశారు.
పెద్ద పెద్ద పదవుల్లో వున్న వ్యక్తులు స్థానభ్రంశం చెందే సమయం ఆసన్నమయినప్పుడు నల్లడబ్బున్న బడా బాబులు ఆఫీసులు, ఇన్ స్పెట్టెలు విశ్రాంతి తీసుకోవు. పచ్చనోట్ల పరపరాలు, కాసుల గలగలలు ప్రాణం పోసుకుంటాయి.
]
అసంతృప్తి వర్గం నాయుకుడ్ని వీళ్ళు దువ్వుతారు. ఆ నాయుకుడు వీళ్ళ డబ్బుతో అభ్యర్ధుల్నీ దువ్వుతాడు. ఫలితం.... పదవిలో వున్న వ్యక్తీ బయటకు, పదవిని ఆశించిన వ్యక్తీ సీట్లోకి __ జిందాబాద్ బ్రష్టుపట్టిన భారతదేశపు రాజకీయాలు ... లాంగ్ లీవ్ రాజకీయ కుక్కమూతి పిందెలు .....
"మాణిక్యం ఎంతడిగినా మనం పంపాలి. పదవీ రాజకీయాలు ఈ వారంలో చిత్ర విచిత్రమయిన మలుపులు తిరగనున్నాయి. డబ్బుని స్టార్ హొటల్స్ లో రూమ్స్ ని సిద్దం చేయండి...." శంభుప్రసాదు కొదుకుల్ని అజ్ఞాపించాడు.
"అలాగే డాడ్ .... బట్ నందకిషోర్ జీది శకుని అంశ. అంత తేలికగా పదవిని త్యజించడు......" పెద్దకొడుకు మురారీ ప్రసాదు అన్నాడు చిన్నగా.
"వదలక ఏం జేస్తాడు? అతని చేతిలో ఏం వుంది ? అంతా అధిష్టాన వర్గంచేతుల్లోనే ఉంది. నందకిషోర్ ని పదవిలోంఛి పీకేయబడటం ఖాయం మనం మన మనిషి మాణిక్యం పదవిలోకి వచ్చేల చూసుకుంటే చాలు. అధిష్టానవర్గంలో, సి.ఎమ్. పవర్ లాబీలో నాన్నగారి మాటకు తిరుగులేదు. ఈ సారి అన్నీ మనకు అనుకూలంగానే జరుగుతాయి. డోంట్ వర్రీ మైడియర్ బ్రదర్ ...." చిన్నకొడుకు అనూప్రసాద్ తన సహజ ధోరణీలో అన్నాడు.
నందకిషోర్ తన పదవికోసం ఏ ఎత్తు ఈసారి వేయగడని శంభుప్రసాదు ఆలోచిస్తున్నాడు.
"ఇప్పటికి ఎన్నోసార్లు నందకిషోర్ పదవి గండాన్ని ఎదుర్కోవటం తన పదవిని నిలబెట్టుకోవడం జరిగింది. ప్రతిసారి ... ఈ సారి నందకిషోర్ సీట్లోంచి దిగిపోవటం ఖాయం అనుకోవటం __ ఆఖరి నిముషంలో పరిస్థితులు అతన్మికే అనుకూలంగా మారిపోవటం జరుగుతోంది.
ఈసారి మాత్రం నందకిషోర్ కి అన్ని వేపులనుంచి వ్యతిరేక పరిస్థితి ఎదురు కాబోతోంది.
అధిష్టాన వర్గం ఒకవేపు __ పార్టీ ప్రెసిడెంట్ ఒకవేపు __ ప్రైమ్ మినీష్టర్ ఒకవేపు రాష్ట్రశాఖ మరోవేపు __ రాష్ట్రంనుంచి ఎన్నికయిన ఎమ్. పీ. లు. వేరేవేపు __ కేంద్రమంత్రులు ఇలా చాలామంది అతని ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపట్ల వ్యతిరేకతతో వున్నారు.
ప్రస్తుత పరిస్థితులు ఆధారంగా మాత్రం నందకిషోర్ దిగాక తప్పదు. అయితే రాబోయే వారం రోజులలో పరిస్థితులు ఎలా మారిపోతాయో చెప్పలేం. ఏది ఏమయినా మన ప్రయత్నంలో మనముండాలి. కేంద్రం ఎస్ అన్నా, రాష్ట్రంములో ఎన్నిటికో మనకు అడ్డు తగులుతున్నాడు నందకిషోర్ . మన కరెంట్ బిల్లు రెండుకోట్ల అరవైలక్షలని ఏదో ఒక కారణంపై మాఫీ చేయమని కేంద్రంలోని పార్టీ పెద్దలు చెప్పినా వినలేదు. తనక్కవలసిన వారి బిల్లుల్ని మాత్రం మాఫీ చేసాడు/. అర్భన్ లాండ్ సీలింగ్ వ్యవహారాల్ని మనకు అనుకూలంగా సెటిల్ చేయటం లేదు.
సేల్స్ టాక్స్ స్టేట్ ఎక్సైజ్ అధికారుల్ని మనమీదకు పంపించి కేసులు పెట్టిస్తున్నాడు. ఇతని హెరాస్ మెంట్ ని అడ్డుకోకపోతే నష్టపోవటం ఖాయం. సాయంత్రం నేను డిల్లీ వెళతాను. ఆ ఏర్పాట్లు చూడండి మీరు మానిక్యానికి అందుబాటులో వుండండి. నందకిషోర్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు ఒక్కో ఎమ్. ఎల్. ఏ. ఐదారు లక్షలదాకా అశించవచ్చు. డబ్బును సిద్దం చేయండి. ఈ వారం రోజులు అప్రమత్తంగా వుండండి. ఈ సారి మనమీద నందకిషోర్ కన్నేయకపోవచ్చు. మీ మెనమామ సుకీర్తిని దగ్గర పెట్టుకోండి ముగ్గురూ కలిసే ఏ అడుగయినా వేయండి.
నేను ఎప్పటికప్పుడు డిల్లీనుంచి పోన్ చేస్తుంటాను ఎలక్షన్స్ అయి సంవత్సరంన్నరయింది. మాణిక్యం ముఖ్యమంత్రి అయితే మూడున్నర యేండ్లు పదవిలో వుంటాడు. మన పనులు పూర్తీకవాతానికి ఈ సమయం చాలు బీ కేర్ పుల్ ...." అని తన కొడుకులకు చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పి ఒక కేంద్ర మంత్రికి ఫోన్ చేసాడు శంభుప్రసాదు.
* * * * *
ప్రతిపక్షలా దృష్టిలోను, ప్రజల దృష్టిలోనూ రామదాసు పావులా ర్టీ బాగా పెరిగిపోయింది.
సాక్ష్యాదారాలతో అవినీతి ముఖ్యమంత్రిని పేపర్ కి ఎక్కించి, ఎండ గట్టినందుకు ప్రతివారు రామదాసుని పొగడుతున్నారు.
రాష్ట్రమంతా.... సంచలనం..... చర్చలు .... విమర్సలు .... శాపనార్ధాలు......
నందకిషోర్ గెలిచినా నియోజకవర్గంలో మరీ వడిగా వుంది వాతావరణం.
ఏం జరగునున్న ఉత్కంఠ అందరిలోనూ వూపిరి పోసుకుని ఉరకలు వేస్తోంది.
* * * *