Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 16

    "అది సరేలే! ఆ గుడ్ న్యూస్ ఏమిటో చెప్పుకో__"
    "నాకు తెలీదబ్బా!"
    "అలోచించు_"
    "మీ నాన్నగారికి మంచి లాభాలు వచ్చాయి!"
    "ఉహూం "
    "ఏదయినా లాటరీ వచ్చిందా?"
    "మీ ఆడాళ్ళ కెప్పుడూ డబ్బు అశే!"
    "పెళ్ళి కబుర్లు చెప్పారా మీ నాన్న!"
    "ఈ ప్రశ్న ముందే వేసి వుండవలసింది! అయినా మీ ఆడవాళ్ళకి పెళ్ళి డబ్బు తప్ప మరో విషయం స్పురించదా!"
    నవ్వింది సుజాత.
    "ఒట్టి మట్టి బుర్ర __లు "
    "సింగల్ అయితే ఫర్లేదు. ప్లూరల్ అయితే డామేజ్ వేస్తారు __"
    "మన ఆఫీసుకి సంబంధించిందే __ క్లూ యిచ్చా కనుక్కో __"
    "పార్టీ ఇస్తున్నారా?"
    "బుర్ర దార్లో పడుతోంది, ఎందుకో కనుక్కో"
    క్షణం ఆలోచించింది సుజాత. "ప్రమోషన్_"
    "గుడ్ _ అబ్బ _ యిప్పటికి పేలింది ఆలోచన__"
    "అబ్బే! ఏం లేదు __ నాకు ముందుగానే తెలుసు __ ఊరకే నాటించాను" అంది నవ్వుతూ.
    "ముడే తెలుసా?"
    "అం ఆఫీసరుగారు చెప్పారు ."
    అతని ముఖంలో ఉత్సాహం కరిగిపోయింది. "అబ్బే ! వూరకే అన్నాను __ తమాషాకిలే! హార్టీ కంగ్రాట్స్ అయితే ఇకనుంచీ తమరు అఫీసరన్నమాట __ అధికారాలు చేలాయిస్తారా?"
    "ఆ సెక్షన్ ఆఫీసరంటే ఏంటను కున్నావ్?"
    "సేక్షనాఫీసరనె__
    "సంతోషి౦చాలే!" అన్నాడతను.
    అంతలో సెక్షను లోని వాళ్ళోక్కరోక్కరే వచ్చి అభినందించారక్కడే
    రామలింగయ్యగారు వచ్చారు నశ్యం పీల్చుకుంటూ .
    "బాబూ!"    
    "సర్!"
    "ఇక నుంచీ నువ్వు ఛోటా అఫీసరువి __"
    "ఏదో మీ దయ __" వినయంగా అన్నాడు.
    ఆ వినయం తెచ్చి పెట్టుకున్నట్లుగా లేదు. నిజంగానే రామలింగయ్య గారంటే అభిమానం ప్రదర్శించనట్టుగా వుంది.
    "ఊం మీ నాన్నగారి పేరు నిలపెట్టావు. ఇంకా యింకా ప్రమోషన్స్ కొట్టేసి త్వరలో ఆఫీసరువై పోవాలోయ్ నువ్వు. ఎంతయినా మీరు అదృష్టవంతులు. మూలగా క్లరికల్ లైనులో పడకుండా ఆఫీసర్స్ లైనులో పడిపోయారు. చూస్తూ వుండగానే మీరు ఆఫీసరై పోతారు. మేం యిలాగే గో హేడ్ క్లర్ల్ గా మిగిలిపోతాం__"
    "ఎందుకు సర్! మీరు ఆఫీసరుగా అవుతారు_"
    "అం దేవుడు దయతలిస్తే ఆఫీసరుగా రిటైరవుతాను_"
    "దేవుడి దేముంది సర్ __"
    "నీకు తెలియదులేవోయ్ __ దైవం మానుషణ రూపేణ అన్నారు. మీ నాన్నగారి లాటి వాళ్ళు తలుచుకుంటే ప్రమోషన్స్ వస్తాయి __"
    నవ్వేడతను.
    అంతలో ఆఫీసరు మళ్ళీ పిలిపించాడతన్ని.
    "పార్టీ ఏర్పాటు చేయాలోయ్!" అన్నారు నవ్వుతూ.
    "యస్ సర్ !" అని పర్సు రెండో౦దలు ఏటండర్ చేతికి యిచ్చాడు.
    మరో గంటకంతా మాగ్నెట్ పార్టీ ఎర్పాటైంది.
    ఒక బిజినెస్ మాగ్నెట్ కొడుకు పార్టీ యిస్తే ఎంత గ్రాండ్ గా వుండాలో అంత గొప్పగా వుంది. ఆ పార్టీ. రెండేసి స్వీట్లో __ కారా __ కూల్ డ్రింక్స్ __ కిళ్ళీ __ సిగరేట్స్.....
    అందరూ ఎవరికీ తగ్గట్టుగా వాళ్ళు చేరి కబుర్లు చెప్పు కుంటున్నారు.
    తనకంటూ ఓ ప్రత్యేకత వున్నట్లుగా సుధాకర్ ఓ వారగా నుంచుని ఏదో అలోచిస్తోన్నాడు.
    ఆ నుంచోవటంలోనూ హుందాతనం, ప్రిస్టేజి, స్టేటస్ చూపుతున్నట్ట్లుగా వుంది.
    అటు ఇటూ చూసింది సుజాత.
    ఎవరంతకి వాళ్ళు కబుర్లలో వున్నారు.
    ఎవరి దృష్టీ తనపై పడకుండా చూసుకుని అతని దగ్గరకి వెళ్ళింది సుజాత.
    ఏదో ఆలోచనలోవున్న అతను ఆమె రాకని గుర్తించలేదు.
    గ్రీకు శిల్పంలాగా నిలబడ్డాడతను.
    "హృదయ పూర్వకమైన అభినందనలు స్వికరించండి!"
    ఇంటి నుంచి ప్రత్యేక్మగా సెంట్ లో తడిపి తెచ్చుకున్న గులాభీపువ్వు యివ్వబోయింది.ఆమె.
    గంభీరంగా అలోచనలో మునిగిపోయిన సుధాకర్ ఉలిక్కిపడ్డాడు.
    చప్పున యిటు చూశాడు.
    సుజాత! ఆమె చేతిలో గులాభీ!
    ఆమెని అంత సన్నిహితంగా _ సమీపంగా చూసేసరికి గుండెల్లో ఏదో తెలియని భావం కదలాడింది.
    తృప్తిగా ఆమె చేతిలోని గులాభీపూవు అందుకున్నాడు అటు యిటు చూశాడు. తమని ఎవరూ గమనించటం లేదు. చప్పున ఆ చేతిని అలాగే పెదాలకి అన్చుకుని చిన్న ముద్దిడుకున్నాడు.
    అవ్యవదిగా జరిగిపోయిన ఆసంఘటనికి సిగ్గుతో చేయి లాక్కుంది. సుజాత. ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. గుండె దడదడ లాడింది.
    "తప్పు చేశానా? తొందర పడ్డానా?"
    ఉహూం అదేదో సినిమాలో అన్నట్టు చేసిన దాన్లో తప్పులేదు. చోటులోనే తప్పు అంతే!" అంది నవ్వుతూ. అతని ఆ చిన్ని చావురావని ఆమె హృదయపూర్వకంగా స్వీకరించింది.
    "ఒహొ! అపూర్వం__"
    "థాంక్స్!" అన్నట్టుగా   నవ్వింది. ఆ చిరునవ్వు ఆమె పెదాలపై గులాభీపై చిరుగాలి కదలాడినట్టుగా అనిపించింది. అతనివైపు అభినంద పూర్వకంగా చూసింది. ఆ చూపులో అభిమానం అరధనూ కూడా కనిపించాయి.
    ఆ చూపులో వేయి రాగాలు, లక్ష ప్రేమలు, కోటిహృదయ వీణలు, శతకోటి అరధనలూ పలికాయి._    

 Previous Page Next Page