Previous Page Next Page 
మయసభ పేజి 15

  

   "కాదు __ మన గత చరిత్రని కూడా తిరగదోడారు. సమయం వచ్చినప్పుడు ఊరుకుంటారా? గత ప్రభుత్వం అవినితీపరులిగా ముద్రవేసి ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు, చేయవలసిన మంచి పనుల్ని , ప్రజా సంక్షేమాన్ని గాలికోదేలేసి , గత ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని కూడా మట్టి గొట్టుకుపోయేలా చేస్తున్నానని, తుగ్లక్ లా ప్రవర్తింస్తున్నావని వ్రాసారు నీ కానాడే చెప్పాను __ ప్రతిదాన్ని తిరగదోడవద్దని. వినలేదు ఒకరు గ్రామపంచాయితీలు, మరొకరు మండలాలు , ఇంకొకరు తాలుకాలు, వేరొకరు ఇంకొటి...... ఏమిటిదంతా? ప్రజలు అంత వెర్రిబాగులవాళ్ళలా కనిపిస్తున్నారా? ఒక్క రోడ్డు బాగాలేదు రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఎక్కడా జరుగుతున్నట్లు కనబడటం లేదు. ప్రభుత్వం నిద్రపోతోందా? పని చేస్తోందా? ఒక్క బారీ పరిశ్రమకి కేంద్రం నుంచి అంగీకారం తెచ్చుకోలేదు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించలేదు. నీ దగ్గరున్న మంత్రులంతా ఊరక గత ప్రభుత్వం గురించి అరవటమే తప్ప మరేం చేయలేకపోతున్నారు. ఇంకా ఎన్నాళ్ళు పాత ప్రభుత్వం గురించి విమర్శిస్తారు? ఎలక్షన్స్ అయి అధికారంలోకి వచ్చిన ఆరునెలల వరకు ఫర్వాలేదు సంతత్సరాలు  గడిచిపోతున్నా మీరేం చేస్తున్నారో చెప్పకుండా, గత ప్రభుత్వం ఏం తప్పులు చేసిందో చెబుతూ పొతే అసహ్యంగా వుండడు? ఇలా రాసుకుపోయారా పత్రికలో నేనానాడే చెప్పాను __ కనీసం రోడ్లన్నా వేయించుకుని . నీ సొమ్మా? నా సొమ్మా? వేయించటానికి  ఏమిటి అడ్డు .....?

    ఛీ.... ఛీ..... వెధవ రాజకీయాలు .... నువ్వంటే నాకు మిత్రుడిగా అభిమానముంది. ఇష్టముంది. కాని ప్రజల్లో ఒకడిగా మాత్రం మీలాంటి వాళ్ళను ఊరితీస్తే తప్ప ప్రజలకు జరగదని అనిపిస్తోంది అరె.....రోజుకు ఒక్క ... గంట.... ఒక్క గంటంటే గంట ప్రజల బాగోగులకు కేటాయించక్ఖర్లేదా? నెలకొక్క మంచి పనయినా చేనక్ఖర్లేదా ?

    మిమ్మల్ని అని ఏం ప్రయోజనం? మిమ్మల్ని గెలిపించిన మందభాగుల్ని, మూర్ఖుల్ని కొరడాబెట్టి కొడితేగాని బుద్ధి రాదు.

    ఇప్పుడెలా బయటపడతావు ? అమెరికా వెళ్ళి ఆరు నెలలు హాస్పిటల్ లో పడుకుని , నీకంటిన అరవై ఆరు జబ్బుల్ని బాగు చేయించుకోని వచ్చావ్. దానికెంత ఖర్చు అయిందో తెలుసా? కోటి అరవై లక్షలు . ఆ డబ్బు ఎవరిదో తెలుసా ? నీ తాతదో, నా తాతదో కాదు ప్రజలది. కనీసం ఆ కృతజ్ఞతతోకన్నా నాలుగు మంచి పనులు చేసుండవలసింది..... ఇప్పుడకొనేం ప్రయోజనం ? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడెలా బయట పడాలో ఆలోచించు ఎలాగోలా బయటపడి నువ్వే ముఖ్యమంత్రిగా నిలబడితే బాగుండు, ఎందుకంటే ఆ మాణిక్యం మరీ వెధవ . రాష్ట్రాన్ని గంటలో అమ్మేసి అమెరికా వెళ్ళిపోగల సమర్ధుడు ... అయినా ఎలా నువ్వు బయటపడటం ....?" తన తప్పుల్ని నిర్మొహమాటంగా ఎత్తి చూపుతూ __ తన క్షేమన్ని కూడా కాక్షించే గోపీనాథాన్ని నందకిషోర్ ఏమీ అనడు. అతనకంతే నందకిషోర్ గతాని ఆపేక్ష

    బయట పడాలి పడతాను హారిహారాదులే అడ్డు వచ్చినా నన్నేవరూ నా పదవిలోంచి తప్పించలేదు ...." నందకిషోర్ ఎటో చూస్తూ అన్నాడు గంభీరంగా.

    గోపీనాధం నందకిషోర్ మాటల్లో తొంగిచూసిన అత్మస్థాయిర్యానికి విస్తుపోయాడు. అయన ధైర్యమేమిటో  అర్ధంకాక వేరేక్కి పోయారు.

    నందకిషోర్ మౌనంగా తలవంచుకుని పచార్లు చేస్తున్నాడు.

    రాష్ట్ర రాజకీయ వ్యవస్థని , పవర్ లాబీని ఒక్క కుదుపు కుదపగల అతి ప్రమాదకరమైన పథకమొకటి ముఖ్యమంత్రి నందకిషోర్ మోగుడులో రూపుదిద్దుకోసాగింది.

    "ఒరేయ్ నందా!" గోపీనాధం ఉచ్చారణలో మృదుత్వం తొందరచూసింది.

    కొద్ది క్షణాలకి నందకిషోర్ తలెత్తి ఏమిటన్నట్టు కనుబొమ్మల్ని ఎగురవేసాడు.

    "ఎత్తులు వేయటంమానేసి . పదవిని ఒడులుకుని ఓ కన్నతల్లి కడుపు కోటను అపలేవా? అవంతి తల్లిని వెనక్కీ రప్పించలేవా? నాకెందుకో సర్వాదికారాల్ని  తన గుప్పెట్లో పెట్టుకునే ఈ గ్రీన్ ఫీల్డ్స్ భవనం దెయ్యాల వనంలా తోస్తోంది. ఎడారిలో , కరుడుగట్టిన విలువల మధ్య జీవిస్తున్నట్లనిపిస్తోంది. ఒక్క విషయం మర్చి పోకు __ అవంతి తల్లి పుట్టాకే నీకు మహర్దశ పట్టుకుంది. మన జీవితాల్లోకి తొంగి చూస్తున్న పెద్ద వెలితి అదే......" బాధగా అన్నాడు గోపీనాధం.

    తన కూతురు మీద గోపీనథానుకున్న  ప్రేమాభిమానాల్ని అర్ధంచేసుకున్నాడు. నందకిషోర్ . నిజానికి అవంతిని ఈ ప్రపంచంలో తను ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించి వుండకపోవచ్చు. కాని తన పదవిని , పదవిలో వుండటం కోసం తను వేసే ఎత్తుల్ని అసహ్యించుకుంటోంది పదవిని, పదవిలో వుండటం కోసం తను వేసే అత్తుల్ని అసహ్యహించుకుంటోంది. పదవిఎంత గొప్పదో తను ఎలా చెప్పగలడు? దాని మూలంగా ఒనగూడే లాభాలని ఎలా విడమర్చగలడు? తన కనుసన్నలలో మెదిలే అధికారులు , సిబ్బంది, తన ప్రాపకం కోసం ఆరాటపడే ప్రజా ప్రతినిథుల్ని వడలుకొని బ్రతకటం ఒక నరకం అని ఎలా చెప్పగలడు?

    "అవంతి తల్లంటే నాకు ప్రాణం. అది నీకు తెలుసు. ఇమ్ట్లావుమ్హి బయటకు అడుగా వేయాలంటే అవంతి ఎదురురావాలి. లేదంటే ఆ రోజు బయటకు వెళ్ళటం కూడా మానేసిన రోజులున్నాయి. ఏదడిగితే అది క్షణాలలో అవంతి తల్లి ఒడిలో వాలేది. నీకు తెలుసా? బంధువులు, మిత్రులు అసూస్ మాత్రం నీ కొడుకు కాదా? అవంతినే ముద్దు చేస్తున్నావని సరదాగా అనేవారు. ముందు పుట్టింది అనూస్ అయినా అవంతికే అన్ని అచ్చట్లు, ముచ్చట్లు జరిగాయి. అలా అని అనూస్ మీద చిన్నచూపు లేదు. తను ఆడపిల్లని, తను రేండో స్థాయికి చెందుతానని, మగవాడికన్నా స్త్రీ ఒక మెట్టు క్రిందుటుంది అనే నూన్యతా భావం తనలో వేళ్ళూనగూడదనే అవంతి తల్లికి అంత ప్రాముఖ్యత ఇచ్చాను.

    నా మూడ్స్ ను బట్టి అనూస్ నడుచుకుంటే, అవంతి మూడ్స్ ని బట్టి నేను నడుచుకోనేవాడ్ని . నేను రాజకీయాల్లోకి వస్తానని, వచ్చినా ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతానని ఎవరైనా ఊహించారా? కనీసం మనమైనా ఊహించామా?

    సరిగ్గా పది సంవత్సరాల క్రితం నేను కేవలం ఒక చిన్న పారిశ్రామికవేత్తని. ఒక ప్రాంతానికి మాత్రమే తెల్సినవాడ్ని. మన పార్టీ అభ్యర్ధి ఎలక్షన్స్ ముందు అనుకోకుండా చనిపోవటం __ మరో అభ్యర్ధిని వెతికి పట్టుకునే టైమ్ లేకపోవటం __  ఆ ప్రాంతంలో నాలుగు మంచి పనులు చేసివున్న నేను పార్టీ దృష్టిలోకి రావటం, ఎలక్షన్స్ లో నిలనబడిమనటం __ నేను ఒప్పుకొకపోవటం __ పార్టీ నన్ను బలవంతంగా ఒప్పించటం. ఎలక్షన్స్ లో నిలబడటం బంఫర్ మేజార్టీలో గెలవటం, ముఖ్యమంత్రి ని ఎవరిని చేయాలనే విషయం దగ్గర అధిష్టానం వర్గం, ఒక అభ్యర్ధి పేరుని __ రాష్ట్రా శాఖ మరో అభ్యర్ధి పేరు ప్రతిపాదించటంలో ప్రతిష్టంభన ఏర్పడటం __ అది అటూ ఇటూ కాక __ రాజకీయాలకు కొత్తయిన అభ్యర్ధిని ముఖ్యమంత్రిని చేయాలనుకోవటం __ అనుకోకుండా  నా పెరుని కొందరు ముందుకు తేవటం __ ఏ వివాదం అంటని నన్ను వివాస్పదుడు కాడని ముఖ్యమంత్రి ని చేయటం జరిగింది. ఇందులో నా ప్రేమేయం వుందా? మరో అరగంటలో ప్రమాణస్వీకారమనగా నేను బసచేసిన హొటల్ గాడికి కారు రావటం __ గవర్నర్ బంగ్లాకి తీసుకెళ్ళటం, సడన్ గా ముఖ్యమంత్రి పదవిని ఆలంకరించే వ్యక్తి చేయవలసిన ప్రమాణ స్వీకార పత్రాన్ని ఇవ్వటం, నేను ప్రామాణ స్వీకారం చేయటం __ ముఖ్యమంత్రిని  కావటం జరిగింది.

    అది నేను కోరుకున్నదా?

    కోరుకున్నా జరుగుతుందా?

    మరి __ ఒకసారి పదవిలోకి వచ్చాక, పదవిని రుచి చూసాక ఎవరైనా ఈ ప్రపంచంలో అంత తేలిగ్గా పదవిని ఒదులుకోరు. అలాగే నేనూ ఒదులుకోలేదు. ఒదులుకోలేను. ఒదులుగూడదంటే మంత్రాలు తంత్రాలు నడపాలి. నడుపుతున్నాను.

    నేటి భారతదేశపు రాజకీయాలంటే గొంగట్లో భోంచేయటమే. అప్పుడిక ఎంట్రుకలు ఏరటం అవివేకం కాదా?

    మీరు నడిపే రాజకీయాల్లో నీటి, నిజాయితీ లేదు __ న్యాయం లేదని అవంతి నన్ను, నా పదవిని ఏవగించుకుంది.

    అసలు నేటి రాజకీయాల్లో నీటి వుంటుందా? నిజాయితీ వుంటుందా ? న్యాయం వుంటుందా? అవి వుంటే రాజకీయాలేలా అవుతాయి ? అవి వుంటే రాజకీయ నాయకులు పదవుల్లోకి రాగలరా?

    ప్రజలు గొర్రెలు ... గొర్రెలకు  బుర్రలుండవు. నేను అన్నీ మంచి పనులే చేస్తాను. పైసా సంపాదించుకొను నెక్ట్స్ టైమ్ నన్ను గెలిపిస్తారా ? గ్యారంటీ వుందా? అభ్యర్ధుల నీతీ నిజాయితిల్నీ చూసి ఓటు వేస్తున్నారా ప్రజలు ? అలా అయితే ఎంతోమంది మంచి వ్యక్తులు ఎందుకు ఎలక్షన్స్ లో ఓడిపోతున్నారు? వెండితెర మీద నిలువెత్తు కనిపించి, సినీ పరిశ్రమలోనే తను పూర్తీ కాలాన్ని వినియోగించుకుంటూ , నటిస్తూ , సినిమాలు నిర్మిస్తూ, డిస్టిబ్యూట్ చేస్తూ అక్కడే తమ కాలాన్ని గడిపేసే నటులు ఎలక్షన్స్ లో నిలబడగానే లక్షల ఓట్లు మెజారిటితో ఎలా గెలిపిస్తున్నారు? వాళ్ళసలు నియోజక వర్గాలకు వస్తారా? ప్రజల మధ్య తిరుగుతారా? ప్రజా సమస్యల్ని పట్టించుకుంటారా? అసలు ఆ సెంబ్లీలకు, పార్ల మెంట్ కి వెళతారా? అక్కడ ప్రజల సమస్యల్ని లేవనెత్తుతారా లేదు. మరెందుకు గెలిపిస్తున్నారు? పిచ్చా? పిచ్చే ... సినిమా పిచ్చే...? మరలాంటి పిచ్చి వాళ్ళకు మంచి చేయాలా?

    ఆసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు ఎందుకు జరుగుతాయి? గెలిచినా అభ్యర్ధులు సభల్లో కూర్చుని తమ నియోజక వర్గాలకు మంచి పనులు జరిగేలా చూడటానికి __ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి . మరి చట్ట సభలెందుకు ఖాళీగా వుంటున్నాయి? అటెండెన్స్ ఎందుకు పూర్ గా ఉంటో౦ది? ఎక్కడ తిరుగుతున్నారు గెలిచినా అభ్యర్ధులు? ఇంగితంలేని ప్రజలు.... గెలిపించిన అభ్యర్ధుల్ని నిలదీయలేని మందభాగ్యులు ... వీళ్ళకోసం కష్టపడాలా?

 Previous Page Next Page